తరచుగా అడిగే ప్రశ్నలు | కొవిడ్-19 కొరకు టెస్టింగ్

టెస్టింగ్ కిట్లను పొందడం

నేను కొవిడ్-19 టెస్ట్ని ఎక్కడ పొందవచ్చు?

దయచేసి దిగువ ఆప్షన్​లను ప్రయత్నించండి:

మీకు దగ్గరల్లో టెస్టింగ్ సైట్​కనుగొనడానికి సాయం అవసరం అయితే, మీ లోకల్ హెల్త్ డిపార్ట్​మెంట్ లేదా డిస్ట్రిక్ట్ ని సంప్రదించండి(ఇంగ్లిష్​లో) మీరు 1-800-525-0127కు కూడా కాల్ చేసి, #ని ప్రెస్ చేయండి. మీరు సమాధానం ఇచ్చేటప్పుడు, ఇంటర్​ప్రెటీటింగ్ సర్వీస్​లను యాక్సెస్ చేసుకోవడానికి మీ భాషను పేర్కొనండి.

నాకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు/నా భాషలో వెబ్సైట్ లభ్యం కావడం లేదు WAలో నేను ఉచిత కిట్కు ఎలా ఆర్డర్ చేయగలను?

దయచేసి 1-800-525-0127కు కాల్ చేసి, తరువాత #ని ప్రెస్ చేయండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది. మీ తరఫున కాల్ సెంటర్ WA మరియు ఫెడరల్ ఆన్​లైన్ పోర్టల్స్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

నా Say Yes! COVID Test ఆన్లైన్ పోర్టల్ గురించి నేను ఏమి తెలుసుకోవాల్సి ఉంది?

ఈ కార్యక్రమం స్టేట్ ఆఫ్ వాషింగ్టన్, National Institutes of Health (నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్), మరియు Centers for Disease Control and Prevention(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సహకార చర్య. సప్లైలో లభ్యమయ్యేటప్పుడు, వాషింగ్టన్​లోని ప్రజలు రెండు ర్యాపిడ్ కొవిడ్-19 టెస్ట్ కిట్​లకు ఆర్డర్ చేయవచ్చు, ఇవి నేరుగా Amazon ద్వారా వారి ఇంటికి డెలివరీ అవుతాయి.

ప్రతి ఇల్లు/నివాసిత చిరునామాకు నెలకు కేవలం రెండు ఆర్డర్​లు చేయవచ్చు, ప్రతి ఆర్డర్​లో 5 ర్యాపిడ్ టెస్ట్​లు వస్తాయి. అన్ని ఆర్డర్​లను ఉచితంగా షిప్పింగ్ చేస్తారు.

టెస్ట్​కు సంబంధించి లేదా దానిని ఎలా చేయాలనే దానికి గురించిన ప్రశ్నల కొరకు, Say Yes! COVID Test(సే ఎస్! కొవిడ్ టెస్ట్) డిజిటల్ అసిస్టెంట్​ ని సందర్శించండి లేదా 1-833-784-2588కు కాల్ చేయండి.

DOH నుంచి Say Yes! COVID Test మరియు ఫెడరల్ టెస్టింగ్ కిట్లు రెండింటిని మీరు ఆర్డర్ చేయవచ్చా?

అవును, మీరు వాషింగ్టన్ రాష్ట్రంలో నివసిస్తుంటే, మీరు ర్యాపిడ్ కొవిడ్-19 టెస్ట్ కిట్​లు పొందడానికి Say Yes! COVID Test వెబ్​సైట్ మరియు ఫెడరల్ వెబ్​సైట్ వద్ద ఆర్డర్ చేయవచ్చు.

నాకు ఏవైనా ప్రశ్నలు నేను ఏమి చేయాలి?

మీకు DOH Say Yes! COVID Test program (డిపార్ట్ ఆఫ్ హెల్త్ సే యస్!కొవిడ్ టెస్ట్ ప్రోగ్రామ్) గురించి మరిన్ని ప్రశ్నలు ఉన్నట్లయితే, తరచుగా అడిగే ప్రశ్నలు పేజీ ని సందర్శించండి లేదా 1-800-525-0127 వద్ద DOH కొవిడ్-19 హాట్​లైన్​కు కాల్ చేయండి (భాషా అసిస్టెంట్ లభ్యమవుతుంది). ఫెడరల్ టెస్టింగ్ ప్రోగ్రామ్ గురించి ప్రశ్నలు ఉంటే, వారి తరచుగా అడిగే ప్రశ్నలు పేజీ ని సందర్శించండి.

నా ఉచిత టెస్ట్లను నేను ఎప్పుడు అందుకుంటాను?

ఏదైనా ప్రోగ్రామ్ (Say YES! COVID Test (సే యస్ కొవిడ్ టెస్ట్) లేదా Federal Program(ఫెడరల్ ప్రోగ్రామ్)ల్లో ఒకదాని ద్వారా అభ్యర్ధిస్తే, సాధారణంగా ఆర్డర్ చేసిన 1-2 వారాల్లోపు అవి షిప్పింగ్ చేయబడతాయి.

సిఫారసు చేసిన అన్ని టెస్టింగ్ ఆప్షన్లను ఉపయోగించిన తరువాత, నేను ఇంకా ఎలాంటి టెస్ట్ని కనుగొనలేకపోయాను. నాకు కొవిడ్-19 ఉన్నట్లుగా నేను భావిస్తే ఏమి చేయాలి?

కొవిడ్-19 టెస్ట్ లొకేట్ చేయడంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నందుకు క్షమించండి, దేశవాప్తంగా సప్లైలు ఇప్పుడు పరిమితంగా ఉన్నట్లుగా మాకు తెలుసు.

మీకు కొవిడ్-19 రోగలక్షణాలు ఉన్నా లేదా కొవిడ్-19కు ఎక్స్​ప్లోజ్ అయినా మరియు మీకు సోకినట్లుగా ఆందోళన చెందుతున్నట్లయితే, మేం దిగువ పేర్కొన్నవాటిని సిఫారసు చేస్తాం:

నా ఇంటిలో నలుగురు కంటే ఎక్కువమంది వ్యక్తులున్నారు. నేను కుటుంబంలోని అందరు సభ్యుల కొరకు టెస్ట్లను ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు?
  • మీరు వాషింగ్టన్  Say Yes! COVID Test ద్వారా ప్రతినెలా రెండు టెస్టింగ్ కిట్ (5 టెస్ట్​ల వరకు సహా)లను యాక్సెస్ చేసుకోవచ్చు.
  • మీరు COVIDtests.gov వద్ద ఫెడరల్ ప్రోగ్రామ్ నుంచి అదనంగా రెండు టెస్టింగ్ కిట్‌లను (4 టెస్ట్​లతో సహా) యాక్సెస్ చేసుకోవచ్చు.
  • మీరు స్థానిక లేదా ఆన్​లైన్ రిటైలర్​లు మరియు ఫార్మసీల వద్ద అదనంగా ఇంటి వద్ద టెస్ట్ చేసుకునే కిట్​లను కొనుగోలు చేయవచ్చు.
  • మీకు దగ్గరల్లో ఉన్న ప్రదేశంలో మీరు PCR టెస్ట్ చేయించుకోవచ్చు. ఇక్కడ ఒకదానిని కనుగొనండి.
నేను నా టెస్ట్ కిట్ని ఎలా ఉపయోగించాలి?

అత్యంత ఖచ్చితమైన ఫలితాల కొరకు ఇంటి వద్ద టెస్ట్ చేసుకునే ర్యాపిడ్ కిట్ల లోపల ఉండే సూచనలను అనుసరించడం చాలా ముఖ్యం. ఏవైనా నిర్ధిష్ట ప్రశ్నల కొరకు టెస్ట్ తయారీదారుడిని (వారి సమాచారం బాక్సు మీద ఉంటుంది) సంప్రదించండి

ర్యాపిడ్ టెస్ట్లతో పాల్స్ నెగిటివ్లు రావొచ్చు కొన్ని టెస్టింగ్ కిట్ల్లో రెండు టెస్ట్లు ఉండవచ్చు (ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలనే దానిపై మీరు బాక్సు మీద ఉండే సూచనలను పాటించాలి).

సాధారణ టెస్టింగ్

ఎవరు టెస్ట్ చేయించుకోవాలి

మీకు అస్వస్థతగా ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోండి. కొవిడ్-19కు విస్త్రృత శ్రేణి లక్షణాలు ఉంటాయి, అందువల్ల, మీకు అస్వస్థతగా ఉంటే, సాధ్యమైనంత త్వరగా టెస్ట్ చేయించుకోవడం మంచిది.

కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా టెస్ట్ చేయబడ్డ ఎవరికైనా మీరు ఎక్స్​ప్లోజ్ అయినట్లయితే టెస్ట్ చేయించుకోండి. మీకు రోగలక్షణాలు కనిపిస్తే, వెంటనే టెస్ట్ చేయించుకోండి. మీకు రోగలక్షణాలు కనిపించకపోతే, ఎక్స్​ప్లోజ్ అయిన తరువాత ఐదురోజులు వేచి ఉండి, ఆ తరువాత టెస్ట్ చేయించుకోండి.

వాషింగ్టన్​లోని వ్యాపారాలు మరియు ఈవెంట్ ప్రదేశాల్లో ఎస్టాబ్లిష్​మెంట్ లేదా ఈవెంట్​లోనికి ప్రవేశించడానికి ముందు టెస్టింగ్ మరియు/లేదా వ్యాక్సినేషన్ ఆవశ్యకతలు ఉండవచ్చు. మీరు సందర్శించడానికి ముందే వారికి కాల్ చేయండి లేదా వారి వెబ్​సైట్ చెక్ చేయండి.

మీరు ప్రయాణించడానికి ముందు/లేదా తరువాత టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజా ప్రయాణ మార్గదర్శకాన్ని తనిఖీ చేయండి

మీరు ఒక వ్యక్తుల సమూహాన్ని కలవడానికి వెళుతున్నట్లయితే, మరిముఖ్యంగా, తీవ్రమైన వ్యాధి ప్రమాదం ఉండే లేదా వారి కొవిడ్-19 వ్యాక్సిన్​ల విషయంలో అప్​డేట్​గా లేనివారిని⁠కలవడానికి వెళ్లినప్పుడు.

నాకు టెస్ట్ పాజిటివ్ అయితే ఏమి జరుగుతుంది?

ఇతరుల నుంచి దూరంగా ఉండటానికి Centers for Disease Control (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఇంటి వద్ద ఐసోలేషన్ కొరకు DOH మార్గదర్శకాలను చూడండి. క్లోజ్ కాంటాక్ట్​లందరూ క్వారంటైన్​లో ఉండాలి.

ఇంటి వద్ద కొవిడ్-19 టెస్ట్ ఫలితం పాజిటివ్ అయితే నివేదించడానికి మరియు సంరక్షణ సర్వీస్​లను యాక్సెస్ చేసుకోవడానికి, దయచేసి వాషింగ్టన్ స్టేట్ కొవిడ్ హాట్​లైన్ 1-800-525-0127కు కాల్ చేయండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది.

మీరు ఇప్పటికే WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) డౌన్​లోడ్ చేసుకున్నా లేదా మీ స్మార్ట్​ఫోన్​పైన ప్రారంభించినట్లయితే, పాజిటివ్ టెస్ట్ ఫలితాన్ని నివేదించడానికి కూడా మీరు ఈ టూల్​ని ఉపయోగించవచ్చు.

తదుపరి సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు: మీరు పాజిటివ్​గా టెస్ట్ చేయబడితే ఏమి చేయాలి.

ఎక్స్ప్లోజ్ అయిన తరువాత, ఒక వ్యక్తికి ఎప్పుడు టెస్ట్ పాజిటివ్ అవుతుంది?

ఒక వ్యక్తి కొవిడ్-19 సంక్రామిగా ఉన్నట్లయితే, ఎక్స్ప్లోజ్ తరువాత ఐదురోజులపాటు వైరస్ ఉన్నట్లుగా PCR టెస్ట్ చూపించకపోవచ్చు. అందువల్ల, మీరు టెస్ట్ చేయించుకుంటే, టెస్ట్ దానిని చూపించకపోవచ్చు. పాజిటివ్ టెస్ట్ ఫలితాలు పొందడానికి సమయం కీలకమైనది. మీరు కొవిడ్-19కు ఎక్స్ప్లోజ్ అయినప్పటికీ, అస్వస్థతకు గురికానట్లయితే, చివరి సంభావ్య ఎక్స్ప్లోజర్ తరువాత కనీసం 5 రోజులకు టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. రోగలక్షణాలు ఉన్న వ్యక్తులకు యాంటీజెన్ టెస్ట్లు సాధారణంగా అత్యంత ఖచ్చితమైనది, కానీ కొన్నిసార్లు రోగలక్షణాలు లేని వ్యక్తుల కొరకు ఉపయోగించవచ్చు.

ఫలితాలు రావడానికి ఎంత సమయం పడుతుంది?

ఇది టెస్ట్ రకం, టెస్టింగ్ కొరకు శాంపుల్ ఎక్కడకు పంపారనే దానిపై ఆధారపడి ఉంటుంది. యాంటీజెన్ టెస్ట్ల ఫలితాలు అత్యంత వేగంగా 10 నిమిషాల్లోనే రావొచ్చు. PCR టెస్ట్లకు, అనేక రోజులు పడుతుంది.

ఏ టెస్ట్ చేయించుకోవడం మంచిది?

మీకు ముందుగా లభ్యమయ్యేదే అత్యుత్తమ టెస్ట్. అంటే, మీ  ఇంటి వద్దనే చేసుకునే హోమ్ టెస్ట్ ఉన్నట్లయితే, దానితో చేసుకోండి. టెస్టింగ్ సైటు కొరకు అపాయింట్మెంట్ లభ్యమవుతున్నట్లుగా మీరు చూస్తే, అక్కడ చేయించుకోండి. ఒక ప్రత్యేక సందర్భానికి నిర్ధిష్ట పరీక్ష అవసరమైనప్పుడు మినహాయింపుగా పేర్కొనవచ్చు (ఉదాహరణకు ప్రయాణం).

నేను టెస్ట్లను స్టాక్ చేసుకోవాలా?

చేతిలో కొన్ని టెస్ట్లు ఉండటం మంచిది. లభ్యం అయ్యేటప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్ల ద్వారా వాటిని ఆర్డర్ చేయండి. మీరు షాపింగ్కు వెళ్లినప్పుడు, టెస్ట్ కిట్లు లభ్యమైతే, కొన్ని కొనుగోలు చేయండి. మంచి పౌరుడిగా ఉండటానికి, మీ అత్యుత్తమ నిర్ణయాన్ని ఉపయోగించండి. కొన్ని టెస్ట్లను నిలుపుదల చేయడం వల్ల అవసరమైన ఇతరులకు యాక్సెస్ బ్లాక్ అవుతుంది మరియు మీరు వాటిని ఉపయోగించడానికి ముందు టెస్ట్ల గడువు తేదీ ముగిసే ప్రమాదం ఉంది.