మీరు కొవిడ్-19 వ్యాక్సిన్‌పై నమ్మకాన్ని ఉంచవచ్చు!
అమెరికాలోని చాలామంది వ్యక్తులు కొవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకోవాలని యోచిస్తున్నారు, అయితే కొంతమంది వ్యాక్సిన్లు వేయించుకోవడానికి ముందు సమాచారాన్ని కోరుకోవచ్చు. ఇది అత్యంత సాధారణమైన విషయం. మన జీవితాన్ని ప్రభావితం చేసే ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మనం నమ్మకంగా ఉండాలని కోరుకుంటాం.
నమ్మకంగా ఉండేందుకు, నమ్మకమైన వనరుల నుంచి మనకు సమాచారం అవసరం.. కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన అపోహలు, వాస్తవాల మధ్య తేడాను గుర్తించడంలో మీ స్నేహితులు, కుటుంబసభ్యులకు సాయపడండి.
వ్యాక్సిన్ వేయించుకోవాలనే నమ్మకం కలిగేందుకు, మీరు ప్రజలకు సాయపడవచ్చు. మీరు దీనిని ఇలా చేయవచ్చు:
- కొంత సమయాన్ని వెచ్చించి మీ స్నేహితుడు లేదా కుటుంబసభ్యుల ఆందోళనలను వినండి. వ్యాక్సిన్ల గురించి ఎలా సంభాషించాలనే దానిపై చిట్కాల కొరకు ఈ వ్యాక్సిన్ల గురించి మాట్లాడేందుకు గైడ్ (ఇంగ్లిష్ మాత్రమే) తనిఖీ చేయండి.
- వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం. మీకు సమాధానం తెలియనట్లయితే, వారు తమ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడవచ్చని మీరు సూచించవచ్చు.
- మీరు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు, మీరు ఎందుకు వేయించుకున్నారనే కారణాలను పంచుకోండి. మీ వ్యక్తిగత కథ మీ కుటుంబం మరియు సమాజంపై శక్తివంతంగా ప్రభావం చూపించవచ్చు.
మీరు ఏమి చెబుతున్నారు, ఏమి చేస్తున్నారనే దాని ద్వారా మీ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేసే సామర్థ్యం మీకు ఉంది. స్నేహితులు మరియు కుటుంబంతో కొవిడ్-19 వ్యాక్సిన్ల గురించి ఎలా మాట్లాడాలి (ఇంగ్లిష్ మాత్రమే) అనేదానిపై ఈ చిట్కాలను వీక్షించండి.
దిగువ వ్యాక్సిన్ వాస్తవాలను చెక్ చేసి, మీకు తెలిసిన వారితో దానితో పంచుకోండి. మేం వీటిని పాపులర్ టాపిక్ ప్రాంతాలుగా వర్గీకరించాం.
భద్రత & సమర్థత
నేను కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం లేదా వేయించుకోకపోవడం ఎందుకు ముఖ్యమైనది?
కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం పూర్తిగా మీ ఎంపిక, అయితే ఈ మహమ్మారిని అంతమొందించడానికి సాధ్యమైనంత వరకు ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోవాలి. సమాజంలో చాలామంది-వ్యాక్సినేషన్ లేదా ఇటీవల సంక్రామ్యత ద్వారా రోగనిరోధక శక్తిని పొందితే కొవిడ్-19 వ్యాక్సిన్ వ్యాప్తి చెందడం కష్టం అవుతుంది. మన వ్యాక్సినేషన్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మన సంక్రామ్యత రేటు అంత తక్కువగా ఉంటుంది.
వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు వైరస్ ఇంకా సోకవచ్చు, అది ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కొంతమంది వ్యక్తులు వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్‌ని పొందలేరు, ఇది వారి కొవిడ్-19కు మరింత దుర్భలమైనవారిగా చేస్తుంది మీరు వ్యాక్సిన్ వేయించుకోనట్లయితే, కొవిడ్-19 వేరియెంట్ (ఇంగ్లిష్ మాత్రమే ) వల్ల ఆసుపత్రిలో చేరడం మరియు మరణించే ప్రమాదం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది (ఇంగ్లిష్ మాత్రమే). వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మిమ్మల్ని మాత్రమే కాకుండా, మీ కుటుంబం, పొరుగువారు, మరియు సమాజాన్ని కూడా సంరక్షిస్తారు.
చాలామంది ప్రాణాలతో సజీవంగా ఉంటే, నేను కొవిడ్-19 వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి?
కొవిడ్-19 వచ్చిన చాలామందికి కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. అయితే, వైరస్ అత్యంత అనూహ్యమైనది, కొన్ని కొవిడ్-19 వేరియెంట్లు మీకు నిజంగా అనారోగ్యానికి గురిచేసే అవకాశం ఎక్కువగా ఉందని మాకు తెలుసు. కొంతమంది వ్యక్తులు, ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు లేని యువత సైతం కొవిడ్-19 వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురికావొచ్చు లేదా మరణించవచ్చు. "కోవిడ్ లాంగ్-హాలర్స్" అని పిలిచే ఇతరులు నెలల తరబడి కొనసాగే లక్షణాలను కలిగి ఉండవచ్చు, ఇది వారి జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఇది కొత్త వైరస్ కనుక కొవిడ్-19 వల్ల కలిగే అన్ని దీర్ఘకాలిక ప్రభావాలు గురించి మనకు ఇంకా తెలియదు. వ్యాక్సిన్ వేయించుకోవడం వైరస్‌కు విరుద్ధంగా మన అత్యుత్తమ రక్షణ.
వాస్తవానికి వ్యాక్సిన్లు సురక్షితం లేదా సమర్ధవంతమైనవా?
అవును, కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి, సమర్థవంతమైనవి. శాస్త్రవేత్తలు వైద్య అధ్యయనాల్లో వేలాదిమంది పాల్గొనేవారిపై వ్యాక్సిన్లను పరీక్షించారు. వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతిని పొందడానికి భద్రత, సమర్థత, మరియు తయారీ నాణ్యత కొరకు U.S. Food and Drug Administration's (యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్- FDA) ప్రమాణాలను కలిగి ఉన్నాయి. అవి అన్నీ కొవిడ్-19తో జబ్బు పడకుండా వ్యక్తులను కాపాడేందుకు అత్యుత్తమైనవిగా కనుగొనబడ్డాయి. అప్పటి నుంచి, ఈ వ్యాక్సిన్లను లక్షలాది మంది ప్రజలకు సురక్షితంగా ఇచ్చారు
కొవిడ్-19 వ్యాక్సిన్లు ఎలా తయారు చేస్తారనే దాని గురించి మరింత తెలుసుకునేందుకు ఈ వీడియోలు చూడండి:
వ్యాక్సిన్ నా బిడ్డకు సురక్షితమైనదా?
అవును Pfizer వ్యాక్సిన్ వేలాదిమంది యువతపై పరీక్షించారు, అది సురక్షితమైనదిగా కనపడింది. ఇది చాలా సమర్ధవంతమైనది కూడా – వ్యాక్సిన్ వేయించుకున్న యువ కార్యకర్తలు ఎవరికీ కొవిడ్-19 సోకలేదు. Centers for Disease Control and Prevention (సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-CDC) కొవిడ్-19 వ్యాక్సిన్లను 6 నెలలు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతిఒక్కరికి (ఇంగ్లిష్ మాత్రమే) సిఫారసు చేస్తోంది.
వ్యాక్సిన్లు సురక్షితమైనవి అని నేను ఎలా విశ్వసించగలను?
కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి అని ధృవీకరించడానికి, వ్యాక్సిన్ భద్రతను మానిటర్ చేసే దేశ సామర్థ్యాన్ని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) విస్తరించింది మరియు బలోపేతం చేసింది. దీని ఫలితంగా, వ్యాక్సిన్ భద్రతా నిపుణులు కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో చూడని సమస్యలను మానిటర్ చేసి, గుర్తించగలరు.
కొవిడ్-19 వ్యాక్సిన్ నుంచి నాకు కొవిడ్-19 వస్తుందా?
లేదు, వ్యాక్సిన్ నుంచి మీకు కొవిడ్-19 రాదు. కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో కొవిడ్-19ని కలిగించే వైరస్ లేదు.
నాకు ఇప్పటికే కొవిడ్-19 ఉన్నట్లయితే నేను వ్యాక్సిన్ పొందాలా?
అవును, మీకు ఇప్పటికే కొవిడ్-19 ఉన్నట్లయితే మీరు ఇంకా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మీకు కొవిడ్-19 సోకిన 90 రోజుల్లో తిరిగి రావడం అసాధారణమని డేటా చూపిస్తుంది. అంటే కొంతకాలంపాటు మీకు కొవిడ్-19 నుంచి కొంత సంరక్షణ ఉండవచ్చు అని దాని అర్థం (సహజ రోగనిరోధక శక్తి అంటారు). అయితే, సహజ రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందనేది మనకు తెలియదు. మీరు ఇంకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే దాని (ఇంగ్లిష్ మాత్రమే) గురించి మరింత తెలుసుకోండి.
వ్యాక్సిన్ తీసుకోవడానికీ రోగనిరోధక శక్తికి మధ్య తేడా ఏమిటి?
సహజ రోగనిరోధక శక్తి అనేది మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా కొంతవరకు రోగనిరోధక శక్తిని ఇస్తుంది. కానీ వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు మొదటిసారి ఇన్ఫెక్షన్ సోకితే వాళ్లకు తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, మరణం లాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నొక్కిచెప్పడం చాలా అవసరం. కొంతమందిలో COVID-19 సోకిన తర్వాత యాంటీబాడీస్ ఉత్పత్తి అయితే, మరికొంతమందిలో ఉత్పత్తి కాకపోవచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కొంత వ్యాధి నిరోధకశక్తి వచ్చేవాళ్లలో ఆ రక్షణ ఎంత బలంగా ఉంటుందో, అది ఎంతకాలం ఉంటుందో లేదా అది ఏ వేరియెంట్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుందో చెప్పడం అసలు సాధ్యంకాదు.
మళ్లీ ఇన్ఫెక్షన్ సోకకుండా లేదా COVID-19 వల్ల తీవ్రమైన అనారోగ్యం రాకుండా ఉండేందుకు సహజ రోగనిరోధక శక్తి మీద మనం ఆధారపడలేము కాబట్టి, ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడమే రక్షణ పొందడానికి శ్రేష్టమైన విధానంగా మరియు SARS-COV-2 అంటువ్యాధులు, సంబంధిత రోగాలు, వ్యాధి వ్యాప్తి చెందడం లాంటి వాటిని నిరోధించడానికి ప్రాథమిక వ్యూహంగా ఇప్పటికీ ఉంది.
పునరుత్పత్తి ఆరోగ్యం
నేను కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకుంటే పిల్లలను కనవచ్చా?
అవును పునరుత్పత్తి ఆరోగ్యం మరియు వ్యాక్సిన్‌కు సంబంధించిన మీ ఆందోళనలు పూర్తిగా అర్థం చేసుకోదగినవి. ఇక్కడ మనకు తెలిసినది: వ్యాక్సిన్లు ఇన్ఫెర్టిలిటీ లేదా నపుంసకత్వానికి కారణమవుతాయని శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యాక్సిన్ మీ శరీరంలోనికి ప్రవేశించిన తరువాత, ఇది కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రతిరోధకాలను సృష్టించేందుకు మీ రోగనిరోధక వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ ప్రక్రియ మీ పునరుత్పత్తి అవయవాలకు ఎలాంటి అంతరాయాన్ని కలిగించదు.
భవిష్యత్తులో గర్భం ధరించాలని అనుకునే లేదా ప్రస్తుతం గర్భవతి అయినా లేదా తల్లిపాలు ఇస్తున్నా ఎవరికైనా American College of Obstetricians and Gynecologists (ప్రసూతి మరియు గైనకాలజిస్ట్‌ల అమెరికన్ కాలేజీ-ACOG) కొవిడ్-19 వ్యాక్సిన్‌ని సిఫారసు చేస్తోంది. కొవిడ్-19కు విరుద్ధంగా వ్యాక్సిన్ వేయించుకున్న చాలామంది వ్యక్తులు అప్పటి నుంచి గర్భవతి అయ్యారు లేదా బిడ్డకు జన్మనిచ్చారు.
గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి మరిన్ని వనరుల కొరకు, దయచేసి వన్ వ్యాక్స్, టూ లైవ్స్ వెబ్సైట్లో తాజా సమాచారాన్ని చూడండి.
గర్భవతులైన మహిళల కొరకు వ్యాక్సిన్ సురక్షితమైనదా?
అవును, మీరు గర్భవతి అయితే మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు, గర్భవతులైన మహిళలకు American College of Obstetricians and Gynecologists (ACOG) (ఇంగ్లిష్ మాత్రమే) వ్యాక్సిన్‌ని సిఫారసు చేస్తోంది. కొవిడ్-19 గర్భధారణ, మీ బిడ్డ అభివృద్ధి, జననం లేదా సంతానోత్పత్తివంటి వంటి ఎలాంటి సమస్యలను కలిగిస్తుందనే దానికి రుజువులు లేవు.
గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి మరిన్ని వనరుల కొరకు, దయచేసి వన్ వ్యాక్స్, టూ లైవ్స్ వెబ్సైట్లో తాజా సమాచారాన్ని చూడండి.
తల్లిపాలు ఇచ్చే మహిళలకు వ్యాక్సిన్ సురక్షితమైనదా?
అవును, మీరు బిడ్డకు పాలిస్తుంటే, మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటే బిడ్డకు పాలివ్వడాన్ని ఆపాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, తల్లిపాలు ద్వారా మీ బిడ్డకు మీ శరీరం యాంటీబాడీస్ పంపడానికి వ్యాక్సిన్ సాయపడవచ్చని ప్రారంభ నివేదికలు సూచిస్తున్నాయి. మరింత అధ్యయనం చేయాల్సి ఉంది, అయితే దీన్ని ధృవీకరిస్తే, మీ బిడ్డను కొవిడ్-19 నుంచి సంరక్షించడానికి ఇది సాయపడుతుంది.
కొవిడ్-19 వ్యాక్సిన్ తల్లి మరియు వారి నవజాతశిశువులను (ఇంగ్లిష్ మాత్రమే) ఏవిధంగా సంరక్షిస్తుందనే దాని గురించి మరింత చదవండి.
వ్యాక్సిన్ నా రుతుచక్రాన్ని మారుస్తుందా?
వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత వారి రుతుచక్రాలు మారినట్లుగా కొంతమంది వ్యక్తులు నివేదించారు, అయితే, ఇవి దీర్ఘకాలిక ప్రభావాలు అని సూచించడానికి ప్రస్తుతం ఎలాంటి డేటా లభ్యం కావడం లేదు. ఒత్తిడి వంటి విభిన్న విషయాల వల్ల రుతుచక్రాలు మారవచ్చు.
పదార్థాలు
వ్యాక్సిన్‌లో ఎటువంటి పదార్దాలుంటాయి?
ఆన్లైన్ లేదా సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు మరియు జాబితా చేసిన అసత్య పదార్థాలను మీరు చూడవచ్చు. ఇవి సాధారణంగా అపోహలు. కొవిడ్-19 వ్యాక్సిన్ల్లోని పదార్ధాలు (ఇంగ్లిష్ మాత్రమే) వ్యాక్సిన్‌లకు అత్యంత సాధారణమైనవి. వాటిలో mRNA లేదా మాడిఫైడ్ అడెనోవైరస్ క్రియాశీల పదార్థంతోపాటుగా క్రియాత్మక పదార్ధాన్ని సంరక్షించే కొవ్వు, లవణాలు మరియు చక్కెరలు వంటి ఇతర పదార్థాలు ఉంటాయి, శరీరంలో మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి, నిల్వ చేయడం మరియు రవాణా సమయంలో వ్యాక్సిన్‌ని సంరక్షిస్తుంది.
Novavax COVID-19 వ్యాక్సిన్ అనేది ప్రోటీన్ సబ్‌యూనిట్-ఆధారిత వ్యాక్సిన్, శరీరంలో వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పనిచేసేలా దీనిలో ఒక పదార్థంతోపాటు కొవ్వులు, చక్కెరలు కలుపుతారు. ఈ వ్యాక్సిన్ mRNAను ఉపయోగించదు.
పదార్ధాల పూర్తి జాబితాను Pfizer, (ఇంగ్లిష్ మాత్రమే) Moderna, (ఇంగ్లిష్ మాత్రమే), Novavax, (ఇంగ్లిష్ మాత్రమే) మరియు Johnson & Johnson (ఇంగ్లిష్ మాత్రమే) ఫ్యాక్ట్ షీట్ల్లో చూడవచ్చు.
Johnson & Johnson వ్యాక్సిన్‌లో పిండకణాలు ఉన్నాయా?
Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్‌ని ఇతర అనేక వ్యాక్సిన్ల్లానే అదే టెక్నాలజీ ఉపయోగించి సృష్టించారు. దీనిలో పిండాల భాగాలు లేదా పిండకణాలు లేవు. వ్యాక్సిన్‌లో ఒక భాగం 35 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్టివ్ అబార్షన్ల నుంచి వాస్తవంగా వచ్చిన ప్రయోగశాలలో వృద్ధి చేసిన కణాల కాపీల నుంచి తయారు చేస్తారు. అప్పటి నుంచి, ఈ వ్యాక్సిన్ల సెల్ లైన్లు ప్రయోగశాలలో నిర్వహిస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు తయారు చేయడానికి తదుపరి పిండకణాలు వనరులను ఏమాత్రం ఉపయోగించరు. కొంతమంది వ్యక్తులకు ఇది కొత్త సమాచారం కావొచ్చు. అయితే, చికెన్‌పాక్స్ (అమ్మవారు), రుబెల్లా మరియు హెపటైటిస్ A వ్యాక్సిన్లను ఇదేవిధంగా తయారు చేస్తారు.
వ్యాక్సిన్ల్లో మైక్రోచిప్‌లు ఉంటాయా?
లేదు, వ్యాక్సిన్ల్లో మైక్రోచిప్ లేదా ట్రాకింగ్ పరికరం ఉండవు. వీటిలోకేవలం ఒక క్రియాశీల పదార్ధం మాత్రమే ఉంటుంది, ఇది కొవిడ్-19పై పోరాడటానికి యాంటీబాడీస్, కొవ్వులు, లవణాలు మరియు చక్కెరలను సృష్టించేందుకు సాయపడుతుంది.
కొవిడ్-19 వ్యాక్సిన్ నన్ను అయస్కాంతంగా మారుస్తుందా?
లేదు, కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు అయస్కాంతంగా మారరు. వ్యాక్సిన్ల్లో విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని తయారు చేసే పదార్థాలు లేవు వీటిలో ఎలాంటి లోహాలు లేవు. మీరు పదార్ధాల పూర్తి జాబితాను Pfizer, (ఇంగ్లిష్ మాత్రమే) Moderna, (ఇంగ్లిష్ మాత్రమే) మరియు Johnson & Johnson (ఇంగ్లిష్ మాత్రమే) ఫ్యాక్ట్ షీట్ల్లో చూడవచ్చు. మరింత సమాచారం కొరకు
ఇతర ఆరోగ్య సమస్యలు
వ్యాక్సిన్ వల్ల నాకు బ్లడ్ క్లాట్( రక్తం గడ్డకట్టడం) అవుతుందా?
రక్తం గడ్డకట్టే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. వ్యాక్సినేషన్ వేయించుకొని, రక్తం గడ్డకట్టని మిలియన్‌ల కొలదీ వ్యక్తులతో పోలిస్తే Johnson & Johnson వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత రక్తం గడ్డ కట్టే వ్యక్తుల సంఖ్య చాలా తక్కువ. పోలిక కొరకు, ప్రతిరోజూ మిలియన్‌ల కొలదీ మహిళలు తీసుకునే గర్భనిరోధకాల కంటే ప్రమాదం తక్కువ. కుటుంబ నియంత్రణ మరియు Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్ మరియు మరిన్నింటి గురించి మీ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనండి (ఇంగ్లిష్ మాత్రమే).
మీ ప్రమాదం గురించి మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో మాట్లాడవచ్చు. Johnson & Johnson వ్యాక్సిన్ తరువాత రక్తం గడ్డకట్టినట్లుగా నివేదించిన చాలామంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వయోజన మహిళలు. మీరు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళ అయితే, మరణానికి దారితీయగల రక్తం గడ్డ కట్టడం యొక్క అధిక ప్రమాదం మీకు ఉంటుందని మీరు తెలుసుకోవాలి. రక్తం గడ్డ కట్టడం అనే ఆందోళనలు కేవలం Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్‌కి సంబంధించినవి, Pfizer లేదా Moderna వ్యాక్సిన్‌లకు సంబంధించినవి కాదు. ఒకవేళ మీరు Pfizer or Moderna వ్యాక్సిన్ తీసుకోవడం గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, దానికి బదులుగా Moderna లేదా Pfizer కొరకు మీ ప్రొవైడర్‌ని అడగండి.
నేను మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ గురించి ఆందోళన చెందాలా?
కొవిడ్-19 వ్యాక్సిన్ తరువాత మయోకార్డిటిస్ (హృదయ కండరాల వాపు) మరియు పెరికార్డిటిస్ (గుండె లైనింగ్ వాపు) కేసులు చాలా అరుదుగా ఉన్నాయి. వ్యాక్సినేషన్ తరువాత చాలా తక్కువ మంది మాత్రమే దీనిని అనుభవించవచ్చు. అలా అనుభవించిన వారిలో, చాలా కేసులు కౌమారులు మరియు యువతలో ఉన్నాయి, చాలా కేసుల్లో రోగలక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయి, మరియు ప్రజలు తామే స్వంతంగా లేదా చిన్నపాటి చికిత్స ద్వారా కోలుకుంటారు. మీకు కొవిడ్-19 వచ్చినట్లయితే మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ అత్యంత సాధారణం.
జులై 30, 2021నాటికి, Vaccine Adverse Event Reporting System (వ్యాక్సిన్ ప్రతికూల ఘటన నివేదించే వ్యవస్థ-VAERS), ద్వారా నివేదించబడ్డ 1500 కంటే తక్కువ కేసుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ యొక్క కనీసం ఒక మోతాదును వేయించుకున్న 177 మిలియన్లకు పైగా అమెరికన్ ప్రజానీకంలో కేవలం 699 ధృవీకరించబడ్డ కేసులున్నాయి. (ఇంగ్లిష్ మాత్రమే)
మీ ప్రమాదం గురించి మీరు మీ వైద్యుడితో మాట్లాడవచ్చు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఏవైనా లక్షణాలు ఉంటే, మీరు వాటిని VAERS కు నివేదించవచ్చు (ఇంగ్లిష్ మాత్రమే).
కొవిడ్-19 వ్యాక్సిన్ తరువాత మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ (ఇంగ్లిష్ మాత్రమే) గురించి మరింత తెలుసుకోండి.
నాకు అంతర్లీన ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లయితే. నేను వ్యాక్సిన్ వేయించుకోవచ్చా?
అంతర్లీన వైద్య లేదా ఆరోగ్య పరిస్థితి ఉన్న చాలామంది కొవిడ్-19 వ్యాక్సిన్లను వేయించుకోవచ్చు. మీ అలర్జీలు మరియు ఆరోగ్య పరిస్థితులు అన్నింటిని గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు తెలియజేయండి. వాస్తవానికి, అనేక అంతర్లీన పరిస్థితులు మిమ్మల్ని కొవిడ్-19 వ్యాధి సంక్లిష్టతల ప్రమాదం ఎక్కువ చేస్తాయి, కాబట్టి మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి వ్యాక్సిన్ మరింత ముఖ్యమైనది.
ఈ నిర్ధిష్ట గ్రూపులకు చెందిన వ్యక్తులు కొవిడ్-19 వ్యాక్సిన్ పొందవచ్చు:
- HIV మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వ్యక్తులు.
- ఆటోఇమ్యూన్ పరిస్థితులతో ఉన్న వ్యక్తులు.
- ఇంతకు ముందు Guillain-Barré syndrome (గ్విల్లాయిన్-బార్ సిండ్రోమ్-GBS) ఉన్న వ్యక్తులు.
- ఇంతకు ముందు బెల్స్ పాల్సీ ఉన్న వ్యక్తులు.
ఒకవేళ మీకు తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్యల చరిత్ర ఉన్నా లేదా వ్యాక్సిన్ పదార్ధానికి తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్య ఉండవచ్చు అని మీరు భావిస్తే, అలర్జీలతో ఉన్న వ్యక్తుల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ల (ఇంగ్లిష్ మాత్రమే) గురించి చదవండి. కొవిడ్-19 వ్యాక్సినేషన్ తరువాత అనాఫిలాక్సిస్ (ఇంగ్లిష్ మాత్రమే) అరుదైనది, అమెరికాలో వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి మిలియన్ మందిలో సుమారుగా 2 నుంచి 5 వ్యక్తులకు వచ్చింది.
పై గ్రూపుల్లో ఉన్న వ్యక్తులు కొవిడ్-19 వ్యాక్సిన్ పొందడం గురించి వివేచనతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి సాయపడాలనేదే ఈ సమాచార (ఇంగ్లిష్ మాత్రమే) లక్ష్యం.
వ్యాక్సిన్లు నా DNAని మారుస్తాయా?
లేదు, కొవిడ్-19 వ్యాక్సిన్లు మీ DNAని మార్చవు లేదా తారుమారు చేయవు. వ్యాక్సిన్లు కొవిడ్-19ని కలిగించే వైరస్‌కు విరుద్ధంగా రక్షణ కల్పించడాన్ని ప్రారంభించేందుకు మన కణాలకు ఆదేశాలను జారీచేస్తాయి. వ్యాక్సిన్ మన DNA ఉండే కణ భాగంలోనికి ప్రవేశించదు. దానికి బదులుగా, వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని రూపొందించడానికి మన శరీరం సహజ రక్షణలతో పనిచేస్తాయి. mRNA (ఇంగ్లిష్ మాత్రమే) మరియు వైరల్ వెక్టర్ (ఇంగ్లిష్ మాత్రమే) కొవిడ్-19 వ్యాక్సిన్ల గురించి మరింత తెలుసుకోండి.
వ్యాక్సిన్ ఏదైనా దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగిస్తుందా?
కొవిడ్-19, ఇతర వ్యాధులకు వ్యాక్సిన్లపై మనకు చాలా శాస్త్రీయమైన డేటా ఉంది. ఆ డేటా ఆధారంగా, ఈ వ్యాక్సిన్లు చాలా సురక్షితమైనవి అని నిపుణులు నమ్మకంగా ఉన్నారు. కొవిడ్-19కు సంబంధించి దాదాపుగా అన్ని ప్రతిచర్యలు అలసట లేదా చేయి నొప్పి వంటి తేలికపాటివి, ఇవి కేవలం కొన్నిరోజులు మాత్రమే ఉంటాయి. తీవ్రమైన లేదా దీర్ఘకాలిక ప్రతిచర్యలు చాలా అరుదు.
ఏవైనా దీర్ఘకాలిక దుష్ప్రభావాలు సాధారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఎనిమిది వారాల్లోపు చోటు చేసుకుంటాయి. అందువల్లనే వ్యాక్సిన్ తయారీదారులు అమెరికా Food and Drug Administration (పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్-FDA) నుంచి అత్యవసర ఉపయోగానికి అనుమతి కొరకు దరఖాస్తు చేయడానికి వైద్య అధ్యయనాలు ముగిసిన తరువాత కనీసం ఎనిమిది వారాలపాటు వేచి ఉండాలి. నిపుణులు భద్రతా ఆందోళనల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్లను మానిటర్ చేయడాన్ని కూడా కొనసాగిస్తారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేదా ప్రతిచర్యల ఏవైనా నివేదికలను FDA పరిశోధిస్తుంది.