కంటెంట్ చివరిగా అప్‌డేట్ చేసినది, డిసెంబర్ 9, 2022మీరు అర్హులు కాగానే ఎప్పటికప్పుడు బూస్టర్ డోసులు తీసుకోవడమే COVID-19 కారణంగా వచ్చే తీవ్రమైన అనారోగ్యం, మరణం నుండి రక్షణ పొందడానికి శ్రేష్ఠమైన విధానం.
Centers for Disease Control and Prevention (CDC) బూస్టర్ డోసు విషయంలో కొత్తగా ఇచ్చిన సిఫార్సులు ఇలా ఉన్నాయి:
- మొదట్లో వచ్చిన మోనోవాలెంట్ Moderna COVID-19 వ్యాక్సిన్ తీసుకున్న 6 నెలల-5 ఏళ్ల పిల్లలు ఇప్పుడు వారి ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకున్న 2 నెలల తర్వాత కొత్త బైవాలెంట్ బూస్టర్ తీసుకోవడానికి అర్హులు.
- 6 నెలలు-4 ఏళ్ల పిల్లల కోసం Pfizer COVID-19 వ్యాక్సిన్‌లో ఇప్పుడు 2 మోనోవాలెంట్ Pfizer డోసులు, ఒక బైవాలెంట్ Pfizer డోసు ఉంటాయి.
- ఇప్పటికింకా 3-డోసుల Pfizer ప్రైమరీ సిరీస్ మొదలుపెట్టని లేదా వారి ప్రైమరీ సిరీస్‌లో 3వ డోసు తీసుకోని 6 నెలలు-4 ఏళ్ల పిల్లలకు ఇప్పుడు కొత్త Pfizer సిరీస్ ఇస్తారు
- ఇప్పటికే 3-డోసుల Pfizer ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకున్న 6 నెలలు-4 ఏళ్ల పిల్లలకు ప్రస్తుతం అదనపు డోసులు లేదా బూస్టర్‌లు తీసుకునే అర్హత లేదు
- Novavax COVID-19 బూస్టర్లు పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకోవాలంటే వారు ప్రైమరీ వ్యాక్సిన్ సిరీస్ పూర్తి చేసుకొని ఉండాలే తప్ప, అంతకుముందు COVID-19 బూస్టర్ డోసు తీసుకొని ఉండకూడదు—మరియు వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి.
మీరు పొందినట్లయితే... | ఎవరు బూస్టర్ వేయించుకోవాలి | ఏ బూస్టర్ వేయించుకోవాలి | బూస్టర్ ఎప్పుడు వేయించుకోవాలి |
---|---|---|---|
Pfizer-BioNTech | 5 సంవత్సరాలు మరియు ఆపైబడిన వ్యక్తులు |
Pfizer తీసుకున్న 5 ఏళ్ల వయసు పిల్లలు కొత్త Pfizer బైవాలెంట్ బూస్టర్ డోసునే వేయించుకోవాలి. 6 ఏళ్లు ఆపైబడినవాళ్లు వారి ప్రైమరీ సిరీస్‌తో సంబంధం లేకుండా కొత్త బైవాలెంట్ Pfizer లేదా Moderna బూస్టర్ వేయించుకోవాలి. |
ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 2 నెలల తర్వాత లేదా బూస్టర్ డోసుకు ముందు |
18 ఏళ్లు ఆపైబడినవాళ్లు Novavax బూస్టర్ డోసును కూడా ఎంచుకోవచ్చు. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. | Novavax: ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 6 నెలల తర్వాత | ||
Moderna | 6 மாதங்கள் மற்றும் அதற்கு மேற்பட்ட நபர்கள் |
6 నెలలు-4 ఏళ్ల పిల్లలు వారి ప్రైమరీ సిరీస్‌లో వేయించుకున్న బ్రాండ్‌కు చెందిన కొత్త బైవాలెంట్ డోసునే వేయించుకోవాలి. 5 ఏళ్లు ఆపైబడినవాళ్లు వారి ప్రైమరీ సిరీస్‌తో సంబంధం లేకుండా కొత్త బైవాలెంట్ Pfizer లేదా Moderna బూస్టర్ వేయించుకోవాలి. |
ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 2 నెలల తర్వాత లేదా బూస్టర్ డోసుకు ముందు |
18 ఏళ్లు ఆపైబడినవాళ్లు Novavax బూస్టర్ డోసును కూడా ఎంచుకోవచ్చు. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. | Novavax: ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 6 నెలల తర్వాత | ||
Novavax | 12 సంవత్సరాలు మరియు ఆపైబడిన వ్యక్తులు | 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు వారి ప్రైమరీ సిరీస్‌తో సంబంధం లేకుండా కొత్త బైవాలెంట్ Pfizer లేదా Moderna బూస్టర్ వేయించుకోవాలి. | ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 2 నెలల తర్వాత లేదా బూస్టర్ డోసుకు ముందు |
18 ఏళ్లు ఆపైబడినవాళ్లు Novavax బూస్టర్ డోసును కూడా ఎంచుకోవచ్చు. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. | Novavax: ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 6 నెలల తర్వాత | ||
Johnson & Johnson* | 18 సంవత్సరాలు మరియు ఆపైబడిన వ్యక్తులు | 18 ఏళ్లు ఆపైబడినవాళ్లు అప్‌డేట్ చేయబడిన బైవాలెంట్ Pfizer లేదా Moderna బూస్టర్ డోసు తీసుకోవాలి. | ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 2 నెలల తర్వాత లేదా బూస్టర్ డోసుకు ముందు |
18 ఏళ్లు ఆపైబడినవాళ్లు Novavax బూస్టర్ డోసును కూడా ఎంచుకోవచ్చు. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. | Novavax: ప్రైమరీ సీరిస్ పూర్తి చేసుకున్న కనీసం 6 నెలల తర్వాత |
*mRNA వ్యాక్సిన్లు సిఫారసు చేయబడతాయి, కానీ ఇతర వ్యాక్సిన్లు పొందలేకపోయినా లేదా ఇష్టపడకపోయినా Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా లభ్యమవుతుంది.
రోగనిరోధక శక్తి లేనివారికి అవసరమయ్యే డోసులు
మీకు రోగనిరోధక శక్తి ఓ మోస్తరుగా, లేదా చాలా తక్కువగా ఉంటే మార్గదర్శకాలు భిన్నంగా ఉంటాయి
మీకు వస్తే… | నేను అదనపు డోసు తీసుకోవాలా? | నేను బూస్టర్ తీసుకోవచ్చా? |
---|---|---|
Pfizer: 5 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు | అవును, 5 ఏళ్ల పై వయసులో ఉండి, రోగనిరోధక శక్తిని ఓ మోస్తరుగా లేదా చాలా తక్కువగా ఉన్నవాళ్ళు 2వ షాట్ తీసుకున్న 28 రోజుల తర్వాత మరొక డోస్ తప్పక తీసుకోవాలి. |
అవును, 5+ ఉత్తీర్ణులైన వారు తాజాగా ఉండటానికి చివరి డోస్ తీసుకున్న 2 నెలల తర్వాత కొత్త బైవాలెంట్ mRNA బూస్టర్‌ని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. Pfizer తీసుకున్న 5 ఏళ్ల వయసు పిల్లలు కొత్త Pfizer బైవాలెంట్ బూస్టర్ డోసునే వేయించుకోవాలి. 18 ఏళ్లు ఆపైబడినవాళ్లు ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకున్న 6 నెలల తర్వాత Novavax బూస్టర్ డోసును ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. |
Pfizer: 6 నెలల నుండి 4 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు మూడు డోసులు ఇవ్వబడతాయి. మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత 2వ డోసు వేసుకోవాలి మరియు రెండవ డోసు వేయించుకున్న 8 వారాల తర్వాత మూడవ డోసు వేసుకోవాలి. | లేదు, రోగనిరోధక శక్తి ఒక మోస్తరుగా లేదా తీవ్ర స్థాయిలో తక్కువగా ఉన్న 6 నెలల నుండి 4 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు ఇప్పుడు అదనపు ప్రాథమిక డోసు ఇవ్వకూడదు. | లేదు, ఇప్పటికే Pfizer ప్రైమరీ సిరీస్‌ను పూర్తి చేసిన 6 నెలల నుండి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ సమయంలో mRNA బూస్టర్ మోతాదు సిఫార్సు చేయబడదు. |
Moderna: 6 నెలలు , ఆపై వయస్సు ఉన్న వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు | అవును, 6 నెలలు పైబడి, రోగనిరోధక శక్తి ఓ మోస్తరుగా తక్కువగా లేదా చాలా తక్కువగా ఉన్నవాళ్ళు 2వ షాట్ తీసుకున్నాక 28 రోజుల తర్వాత తప్పనిసరిగా మరొక డోస్ తీసుకోవాలి. |
అవును, 6 నెలలు ఆపైబడినవాళ్లు అప్-టూ-డేట్‌గా ఉండడం కోసం, చివరి డోసు తీసుకున్న 2 నెలల తర్వాత, కొత్త బైవాలెంట్ mRNA బూస్టర్ తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. 6 నెలలు-4 ఏళ్ల పిల్లలు వారి ప్రైమరీ సిరీస్‌లో వేయించుకున్న బ్రాండ్‌కు చెందిన కొత్త బైవాలెంట్ డోసునే వేయించుకోవాలి. 5 ఏళ్లు ఆపైబడినవాళ్లు వారి ప్రైమరీ సిరీస్‌తో సంబంధం లేకుండా కొత్త బైవాలెంట్ Pfizer లేదా Moderna బూస్టర్ వేయించుకోవాలి. 18 ఏళ్లు ఆపైబడినవాళ్లు ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకున్న 6 నెలల తర్వాత Novavax బూస్టర్ డోసును ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. |
Johnson & Johnson ఒక డోస్, 18 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న వాళ్ళకి అనుమతించబడింది* | అవును, 18 ఏళ్ల పైబడి, రోగనిరోధక శక్తి ఓ మోస్తరుగా తక్కువగా లేదా చాలా తక్కువగా ఉన్నవాళ్ళు J&J వారి 1వ డోసు తర్వాత 28 రోజులు దాటాక అదనపు mRNA వ్యాక్సిన్ తీసుకోవాలి. |
అవును, 18 ఏళ్లు, ఆపై వయసువాళ్లు అప్ టు డేట్‌గా ఉండడం కోసం, చివరి డోసు తీసుకున్న 2 నెలల తర్వాత, అప్‌డేట్ చేయబడిన బైవాలెంట్ mRNA బూస్టర్ తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేయడమైనది. 18 ఏళ్లు ఆపైబడినవాళ్లు ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకున్న 6 నెలల తర్వాత Novavax బూస్టర్ డోసును ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. |
Novavax: 12 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు | లేదు, మితంగా లేదా తీవ్రంగా రోగనిరోధక శక్తి తక్కువగావాళ్లు ఈ సమయంలో అదనపు ప్రాథమిక మోతాదును తీసుకోరాదు. |
అవును, 12 సంవత్సరాలు దాటిన వారు తాజాగా ఉండేందుకు చివరి డోస్ తీసుకున్న 2 నెలల తర్వాత కొత్త బైవాలెంట్ mRNA బూస్టర్‌ని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. 18 ఏళ్లు ఆపైబడినవాళ్లు ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకున్న 6 నెలల తర్వాత Novavax బూస్టర్ డోసును ఎంచుకునే అవకాశం కూడా ఉంది. అయితే, వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి. |
*mRNA వ్యాక్సిన్లు సిఫారసు చేయబడతాయి, కానీ ఇతర వ్యాక్సిన్లు పొందలేకపోయినా లేదా ఇష్టపడకపోయినా Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా లభ్యమవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
- నేను నా బూస్టర్ డోస్ కొరకు అదే వ్యాక్సిన్ బ్రాండ్‌ని పొందాలా?
-
6 నెలలు-4 ఏళ్ల పిల్లలు వారి ప్రైమరీ సిరీస్‌లో వేయించుకున్న బ్రాండ్‌కు చెందిన కొత్త బైవాలెంట్ డోసునే వేయించుకోవాలి. Pfizer తీసుకున్న 5 ఏళ్ల వయసు పిల్లలు కొత్త Pfizer బైవాలెంట్ బూస్టర్ డోసునే వేయించుకోవాలి. Moderna తీసుకున్న 5 ఏళ్ల వయసు పిల్లలు కొత్త Moderna లేదా Pfizer బైవాలెంట్ బూస్టర్ వేయించుకోవచ్చు. 6 ఏళ్లు ఆపైబడినవాళ్లు వారి ప్రైమరీ సిరీస్‌తో సంబంధం లేకుండా కొత్త బైవాలెంట్ Pfizer లేదా Moderna బూస్టర్ వేయించుకోవాలి. Novavax COVID-19 బూస్టర్లు పెద్దవారికి అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకోవాలంటే వారు ప్రైమరీ వ్యాక్సిన్ సిరీస్ పూర్తి చేసుకొని ఉండాలే తప్ప, అంతకుముందు COVID-19 బూస్టర్ డోసు తీసుకొని ఉండకూడదు—మరియు వారు కొత్త mRNA బూస్టర్ డోసు తీసుకోలేనివాళ్లు లేదా తీసుకోకుండా ఉండేవాళ్లుగా ఉండాలి.
- బూస్టర్ డోస్లు ఎందుకు ముఖ్యమైనవి?
-
తీవ్రమైన కొవిడ్-19 కొరకు అధిక రిస్క్ ఉండే వ్యక్తుల కొరకు తీవ్రమైన వ్యాధికి విరుద్ధంగా నిరంతర రక్షణ అందించడానికి బూస్టర్ డోస్లు సాయపడతాయి. తీవ్రంగా కొవిడ్-19 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గతంలో బూస్టర్ డోసులు సిఫార్సు చేయబడ్డాయి, కానీ COVID-19 అనారోగ్యం నుండి రక్షణ పెంచడంలో సాయపడడం కోసం 6 నెలల మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన అందరికీ దానిని ఇవ్వాలనే సిఫార్సు చేయడమైనది.
అమెరికాలో మరిన్ని సంక్రామ్యక వేరియెంట్లు వ్యాప్తిచెందడం, కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఇది ప్రత్యేకంగా ఎంతో ముఖ్యమైనది.
అమెరికాలో ఆధికారం ఇచ్చిన లేదా ఆమోదించిన కొవిడ్-19 వ్యాక్సిన్లు తీవ్రమైన వ్యాధి ప్రమాదం, ఆసుపత్రిలో చేరడం, కొవిడ్-19 వల్ల మరణించే ప్రమాదాన్ని తగ్గించడంలో, ఇంకా వేరియెంట్లకు విరుద్ధంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇంకా, ప్రస్తుత వ్యాక్సిన్లకు కొంతకాలం గడిచిన తరువాత రక్షణ తగ్గిపోవచ్చు. బూస్టర్ డోస్లు కొవిడ్-19కు విరుద్ధంగా వ్యాక్సిన్ ప్రేరిత సంరక్షణను పెంచుతాయి, రోగనిరోధక శక్తి ఎక్కువకాలం ఉండేందుకు సాయపడుతుంది.
- మీరింకా ప్రజలకు ప్రాథమిక శ్రేణిలోని వ్యాక్సిన్‌లనే వేస్తున్నారా?
-
అవును. అర్హులైన వారందరూ కూడా ప్రైమరీ సీరిస్ (1 Johnson & Johnson కొవిడ్ వ్యాక్సిన్ 1 మోతాదు లేదా Pfizer లేదా Moderna) యొక్క 2 మోతాదు పొందడం ఇప్పటికీ ప్రథమ ప్రాధాన్యత ఉంది. వ్యాక్సిన్ వేయించుకున్న వయోజనులతో పోలిస్తే వ్యాక్సిన్ వేయించుకోని కౌమారుల్లో ఆసుపత్రిలో చేరే రేటు 10 నుంచి 22 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకోని వారితో పోలిస్తే, వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కొవిడ్ 19 నుంచి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుంది. వ్యాక్సినేషన్లు వ్యక్తులు అస్వస్థతకు గురికాకుండా నిరోధించడానికి మరియు కొవిడ్-19 నుంచి అస్వస్థతకు గురైన వారిలో 50% మంది వరకు నివేదించిన దీర్ఘకాలిక లక్షణాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి కూడా సహాయపడతాయి.
- మనకు బూస్టర్ షాట్లు అవసరం అయితే, వ్యాక్సిన్లు పనిచేయడం లేదని అర్ధమా?
-
లేదు, ప్రస్తుతం అమెరికాలో మనకు లభ్యమవుతున్న కొవిడ్-19 వ్యాక్సిన్లు తీవ్రమైన అస్వస్థత, ఆసుపత్రిలో చేరడం, మరణం, ఇంకా వేరియెంట్లకు విరుద్ధంగా బాగా సంరక్షించగలవు. అయితే, మరిముఖ్యంగా అధిక రిస్క్ ఉండే ప్రజానీకంలో తేలికపాటి నుంచి ఒక మాదిరి కొవిడ్-19 అస్వస్థతకు విరుద్ధంగా రక్షణ తగ్గినట్లుగా ప్రజారోగ్య నిపుణులు గమనించారు.
రోగనిరోధక శక్తిని పెంచి మరియు ఒమిక్రాన్ వేరియంట్ నుండి మెరుగైన రక్షణ ఇవ్వడం కోసం కొత్త బూస్టర్లు రూపొందించారు. శ్రేష్ఠమైన రక్షణ పొందాలంటే, సిఫారసు చేసిన డోసులన్నీ వేసుకోవడం చాలా అవసరం.
- నేను బూస్టర్ మోతాదు వేయించుకోకపోయినా, నేను ఇంకా పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లుగా పరిగణిస్తారా?
-
CDC మీ కోసం సిఫారసు చేసిన COVID-19 వ్యాక్సిన్ ప్రైమరీ సిరీస్ పూర్తి చేసుకొని ఉంటే, అలాగే ఈమధ్య కొత్తగా వచ్చిన బూస్టర్ డోసు వేయించుకుని ఉంటే, COVID-19 వ్యాక్సిన్ల విషయంలో మీరు అప్ టూ డేట్గా ఉన్నట్లు పరిగణిస్తారు.
- నేను బూస్టర్ డోస్‌కు అర్హుడిని అని ఎలా చూపించాలి?
-
మీరు బూస్టర్ మోతాదుకు అర్హులు అని మీరే స్వయంగా నివేదించవచ్చు. మీరు హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి సిఫారసును చూపించాల్సిన అవసరం లేదు.
మీ బూస్టర్ అపాయింట్మెంట్ కొరకు దయచేసి మీ వ్యాక్సినేషన్ కార్డును తీసుకురండి తద్వారా మీరు రెండు డోస్‌ల Pfizer వ్యాక్సిన్ సీరిస్ తీసుకున్నట్లుగా ప్రొవైడర్ ధృవీకరించగలరు. మీకు మీ కార్డు లేనట్లయితే, ప్రొవైడర్ మీ రికార్డ్‌ని చూడవచ్చు.
- అదనపు వ్యాక్సిన్ మోతాదు మరియు బూస్టర్ వ్యాక్సిన్ మోతాదు మధ్య తేడా ఏమిటి?
-
- ప్రైమరీ వ్యాక్సిన్ సిరీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తగినంత రోగనిరోధక ప్రతిస్పందన ఏర్పడని కొంతమంది రోగులకు (పైన ఉన్న పట్టిక చూడండి) అదనపు డోసు సిఫార్సు చేస్తున్నారు.
- ప్రైమరీ వ్యాక్సిన్ సిరీస్ తరువాత వారి రోగనిరోధక శక్తి కాలక్రమేణా క్షీణించినప్పుడు రోగులకు బూస్టర్ మోతాదు ఇవ్వబడుతుంది.
- రోగనిరోధక శక్తి రాజీపడటం లేదా లేకపోవడం అంటే ఏమిటి?
-
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి 2 డోసుల mRNA COVID-19 వ్యాక్సిన్ లేదా 1 డోసు J&J వ్యాక్సిన్ పొందినవాళ్లు.
ఒకవేళ మీకు దిగువ పేర్కొన్న ఏవైనా వైద్య పరిస్థితులు ఒక మాదిరి నుంచి తీవ్రంగా రోగనిరోధక శక్తి తగ్గినట్లుగా పరిగణించినట్లయితే, కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు మోతాదు నుంచి ప్రయోజనం పొందవచ్చు. దీనిలో ఇటువంటి వ్యక్తులను చేర్చవచ్చు:
- రక్తం కణితులు లేదా క్యాన్సర్లకు చురుకైన క్యాన్సర్ చికిత్సను పొందుతున్నారు
- అవయవ మార్పిడి చేయించుకున్నారు మరియు రోగనిరోధక వ్యవస్థని అణిచివేయడానికి ఔషధాలు తీసుకుంటున్నారు
- గడిచిన 2 సంవత్సరాల్లోపు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు లేదా రోగనిరోధక వ్యవస్థని అణిచివేయడానికి ఔషధాలు తీసుకుంటున్నారు
- ఒక మాదిరి లేదా తీవ్రమైన ప్రాథమిక రోగనిరోధక శక్తి లోపం (డిజార్జ్ సిండ్రోమ్, విస్కోట్-ఆల్డ్రిచ్ సిండ్రోమ్ వంటివి) ఉండటం.
- పురోగతి చెందిన లేదా చికిత్స తీసుకొని HIV సంక్రామ్యత ఉండటం
- రోగనిరోధక శక్తి ప్రతిస్పందనను అణిచివేయగల అధిక మోతాదు కార్టికోస్టెరాయిడ్లు లేదా ఇతర ఔషధాలతో ప్రస్తుతం చికిత్స పొందడం.
మన వద్ద ఉన్న వ్యాక్సిన్ల్లో చాలా వైరస్ వేరియెంట్లకు విరుద్ధంగా 90% సమర్ధవంతమైనవి, ఒక మాదిరి నుంచి తీవ్రంగా రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో ఎప్పుడూ బలమైన రోగనిరోధక శక్తిని ఏర్పరచవు అని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మూడో మోతాదు బూస్టర్‌గా పరిగణించబడదు, కానీ రెండు మోతాదుల సీరిస్తో తగినంత రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందని వారి కొరకు అదనపు మోతాదు.
- అంతర్లీనంగా ఉన్న వైద్య పరిస్థితులు అంటే ఏమిటి?
-
దిగువ జాబితా చేయబడ్డ పరిస్థితులతో ఉన్న ఏదైనా వయస్సు గ్రూపుకు చెందిన వ్యక్తులు (ఇంగ్లిష్ మాత్రమే) కొవిడ్-19 నుంచి తీవ్ర అస్వస్థతను పొందేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. తీవ్రమైన అస్వస్థత అంటే కొవిడ్-19తో వ్యక్తి బహుశా:
- ఆసుపత్రిలో చేరడం
- ఇంటెన్సివ్ కేర్ అవసరం
- వారు శ్వాసించడానికి సాయం చేయడానికి వెంటిలేటర్ అవసరం అవుతుంది
- మరణించడం
కొవిడ్-19 వ్యాక్సిన్లు (ప్రాథమిక మోతాదులు మరియు బూస్టర్లు) మరియు కొవిడ్-19 కొరకు ఇతర నివారణ చర్యలు ముఖ్యమైనవి, మరిముఖ్యంగా మీరు వృద్ధులు లేదా ఈ జాబితాలో ఉన్నవాటితో సహా బహుళ లేదా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే. ఈ జాబితాలో కొవిడ్-19 నుంచి తీవ్రమైన అస్వస్థత వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండే అన్ని సంభావ్య పరిస్థితులు చేర్చలేదు. మీ పరిస్థితి ఇక్కడ చేర్చనట్లయితే, మీ పరిస్థితిని ఎంత మెరుగ్గా నిర్వహించుకోవాలి మరియు మీ అంతట మీరు కొవిడ్-19 నుంచి సంరక్షించుకోవాలనే దాని గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి.
- క్యాన్సర్
- దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి
- దీర్ఘకాలిక కాలేయ వ్యాధి
- దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు
- డిమెంతియా లేదా ఇతర నాడీ సంబంధిత పరిస్థితులు
- డయాబెటిస్ (టైప్ 1 లేదా 2)
- డౌన్ సిండ్రోమ్
- గుండె పరిస్థితులు
- HIV సంక్రామ్యత
- రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పరిస్థితి (రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం)
- మానసిక ఆరోగ్య పరిస్థితులు
- బరువు ఎక్కువగా ఉండటం మరియు ఊబకాయం
- గర్భధారణ
- సికెల్ సెల్ వ్యాధి లేదా తలసేమియా
- పొగతాగడం, ప్రస్తుతం లేదా ఇంతకు ముందు
- అవయవాలు లేదా రక్త ప్రవాహ కణాల మార్పిడి
- స్ట్రోక్ లేదా సెరిబ్రోవాసుక్యులర్ వ్యాధి, ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది
- మాదక ద్రవ్యాల ఉపయోగ రుగ్మతలు
- క్షయ
- ఒక మాదిరిగా లేదా తీవ్రంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు ఈ మోతాదులు పొందడానికి డాక్టర్ నోట్/ప్రిస్క్రిప్షన్ లేదా ఇతర డాక్యుమెంటేషన్ అవసరం అవుతుందా?
-
లేదు, వ్యాక్సిన్లు అందించే ఎక్కడైనా వ్యక్తులు స్వీయ గుర్తింపు మరియు అన్ని మోతాదులను పొందవచ్చు. ఈ జనాభావారికి యాక్సెస్ చేసుకోవడానికి ఎలాంటి అదనపు అడ్డంకులు లేవని ధృవీకరించడానికి ఇది సాయపడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తుల కొరకు వారి నిర్ధిష్ట వైద్య పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, వారు అదనపు మోతాదును పొందడం సముచితమేనా అని వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో చర్చించవచ్చు.