
6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్‌కు చెందిన కనీసం ఒక డోసు తీసుకోవాలని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిపార్సు చేస్తుంది.
Food and Drug Administration (FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) వారి నియంత్రణా చర్యను పాటిస్తూ, Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వారు ఈ సిఫారసు చేశారు. 6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసిన లేదా కొత్త 2023-2024 mRNA COVID-19 వ్యాక్సిన్లను తీసుకోవాలి. ఇవి ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ XBB.1.5ను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. బైవాలెంట్ COVID-19 వ్యాక్సిన్లను ఇకపై యునైటెడ్ స్టేట్స్లో ఇవ్వడానికి అనుమతిలేదు లేదా అవి అందుబాటులో ఉండవు. కొత్త COVID-19 వ్యాక్సిన్ సిఫార్సులు ఇలా ఉన్నాయి:
- ఇప్పటికింకా వ్యాక్సిన్ వేయించుకోని 6 నెలలు – 4 ఏళ్ల వయసు పిల్లలకు అప్డేట్ చేయబడిన mRNA Pfizer 3 డోసులు లేదా అప్డేట్ చేయబడిన mRNA Moderna 2 డోసులు వేయించాలని సిఫార్సు చేస్తున్నారు.
- గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న 6 నెలలు – 4 ఏళ్ల పిల్లలకు అప్డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ 1 లేదా 2 డోసులు వేయించాలని సిఫార్సు చేస్తున్నారు (ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి, ఎన్ని డోసులు వేయించుకోవాలనేది గతంలో తీసుకున్న COVID-19 వ్యాక్సిన్ మీద ఆధారపడి ఉంటుంది).
- గతంలో వేయించుకున్న వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా, 5 ఏళ్లు ఆపైబడిన ఎవరైనా COVID-19 వ్యాక్సిన్ చివరి డోసు వేయించుకున్న కనీసం 2 నెలల తర్వాత, అప్డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ 1 డోసు వేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
- గతంలో COVID-19 వ్యాక్సిన్ వేయించుకున్న 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు (మరియు ఇటీవల అప్డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ ఇప్పటివరకు వేయించుకోని వారు) చివరిసారిగా COVID-19 వ్యాక్సిన్ డోసు తీసుకున్న కనీసం 2 నెలలు తర్వాత 2023-2024 Novavax COVID-19 వ్యాక్సిన్ 1 డోసును అనుబంధంగా వేయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.
- వ్యాక్సిన్ వేయించుకోని 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు 2023-2024 Novavax COVID-19 వ్యాక్సిన్ 2 డోసులను 3 వారాల విరామంతో అనుబంధంగా వేయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.
పిల్లలకు వ్యాక్సిన్లను అందించే క్లినిక్‌లను చూపించడానికి బిల్ట్ ఇన్ ఫిల్టర్లు ఉపయోగించి కనుగొనడానికి మరియు షెడ్యూల్ చేయడానికి వ్యాక్సిన్ లొకేటర్ ని సందర్శించండి.
సాయం కావాలా? 1-833-VAX-HELP (833-829-4357)కు కాల్ చేసి, తరువాత # ప్రెస్ చేయండి. భాషా సాయం లభ్యమవుతుంది. మీకు దగ్గరల్లో వ్యాక్సిన్ లొకేటర్ల కొరకు మీరు మీ జిప్ కోడ్‌ని 438-829 (GET VAX) లేదా 822-862 (VACUNA)కు టెక్ట్స్ చేయవచ్చు.
వ్యాక్సిన్ భద్రత & సమర్ధత
కొవిడ్-19కు విరుద్ధంగా మీ బిడ్డకు వ్యాక్సిన్ వేయించడం వల్ల:
- వారికి కొవిడ్-19 సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి సాయపడుతుంది
- వారికి కొవిడ్-19 సంక్రమించినప్పటికీ, వారు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది
- వారు ఆసుపత్రిలో చేరే అవకాశాన్ని మరియు కొవిడ్-19 వల్ల వారు మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది
- కొవిడ్-19 నుంచి రక్షణ పొందిన వ్యక్తులను అధిక సంఖ్యలో కమ్యూనిటీకీ జోడించడం వల్ల- వ్యాధి వ్యాప్తి చెందడాన్ని కష్టతరం చేస్తుంది.

తల్లిదండ్రులు మరియు సంరక్షకుల కొరకు తరచుగా అడిగే ప్రశ్నలు
- నా బిడ్డకు కొవిడ్-19 వస్తుందనే దాని గురించి నేను ఎందుకు ఆందోళన చెందాలి?
-
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, అమెరికాలో 15 మిలియన్లకు పైగా పిల్లలకు కొవిడ్-19 వచ్చింది. కొత్తగా వచ్చిన COVID-19 వేరియెంట్లు కారణంగానే, ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, చాలామంది హాస్పిటల్లో చేరుతున్నారు.
పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో కొవిడ్-19 చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, పిల్లలు ఇంకా బాగా అస్వస్థతకు గురికావొచ్చు, రోగనిరోధక శక్తి లేని లేదా మరోవిధంగా దుర్భలమైన పరిస్థితుల్లో ఉన్న స్నేహితులు మరియు కుటుంబానికి వ్యాప్తి చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్లో నివేదించబడిన చిన్నపిల్లల COVID-19 మరణాల్లో, దాగివున్న అనారోగ్య సమస్యలేమీ సగం కేసుల్లో కనిపించలేదు.
కొవిడ్-19 సంక్రమించిన పిల్లల్లో ‘‘లాంగ్ కొవిడ్-19'' అభివృద్ధి చెందవచ్చు లేదా బ్రెయిన్ ఫాగ్, అలసట, తలనొప్పి, మగత మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం వంటి నిరంతర లక్షణాలు ఉంటాయి. వ్యాక్సిన్ పిల్లలను ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంచడానికి అత్యుత్తమ మార్గం.
కొవిడ్-19 సోకిన పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) (ఇంగ్లిష్ మాత్రమే) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. MIS-C గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు లేదా జీర్ణాశయాంతర అవయవాలతో సహా వివిధ శరీర భాగాలు వాపుకు దారితీసే పరిస్థితి. MIS-C దేని వల్ల కలుగుతుందనేది ఇంకా తెలియనప్పటికీ, MIS-Cతో ఉన్న చాలామంది పిల్లలకు కొవిడ్-19 ఉంది, లేదా కొవిడ్-19 ఉన్నవారికి దగ్గరల్లో ఉన్నారు. MIS-C తీవ్రమైన, ఇంకా ప్రాణాంతకం కావొచ్చు, కానీ ఈ పరిస్థితితో రోగనిర్ధారణ చేయబడ్డ చాలామంది పిల్లలు వైద్య సంరక్షణతో మెరుగైంది.
- వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమైనవని మరియు అవి ప్రభావవంతమైనవని మనకు ఎలా తెలుస్తుంది?
-
కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని ధృవీకరించడం కోసం, వ్యాక్సిన్ భద్రతను పర్యవేక్షించే దేశ సామర్థ్యాన్ని CDC (Centers for Disease Control and Prevention, రోగ నిరోధక నివారణా కేంద్రాలు) విస్తరించింది మరియు బలోపేతం చేసింది. దీని ఫలితంగా, కొవిడ్-19 వ్యాక్సిన్ పనీతీరును పరీక్షించిన సమయంలో కనిపించని సమస్యలను వ్యాక్సిన్ భద్రతా నిపుణులు పరిశీలించగలరు మరియు గుర్తించగలరు.
- K-12 స్కూలు ఎంట్రీ కొరకు వ్యాక్సిన్ అవసరమా?
-
K-12 స్కూల్స్‌లో Revised Code of Washington (RCW, సవరించిన వాషింగ్టన్ కోడ్) 28A.210.140 , పిల్లల కొరకు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతలను రూపొందించడానికి Department of Health (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) కాకుండా, Washington State Board of Health (వాషింగ్టన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్) బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం కొవిడ్-19 కొరకు స్కూలు లేదా చైల్డ్‌కేర్‌కు ఎలాంటి ఆవశ్యకత లేదు.
- నేను వ్యాక్సిన్ కొరకు చెల్లించాలా?
-
లేదు, 18 ఏళ్లు మరియు అంతకంటే తక్కువ వయస్సు పిల్లలందరికీ Childhood Vaccine Program (చైల్డ్‌వుడ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్) ద్వారా, COVID-19 వ్యాక్సిన్లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
- పిల్లల్లో కొవిడ్-19 వ్యాక్సిన్ సాధారణ దుష్ప్రభావాలు ఏమిటి?
-
వ్యాక్సిన్ దుష్ప్రభావాల కంటే కొవిడ్-19 సోకిన పిల్లలకు ఉండే ఆరోగ్య ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇతర చాలా వ్యాక్సిన్లవలే, చేతి నొప్పి, అలసట, తలనొప్పి, మరియు కండరాలు నొప్పి వంటివి అత్యంత సాధారణ దుష్ప్రభావాలు ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటాయి.
వైద్య అధ్యయనాల్లో (ఇంగ్లిష్ మాత్రమే) ఎక్కువ మంది పిల్లలు మొదటి మోతాదు తరువాత కంటే రెండో మోతాదు తరువాతే దుష్ప్రభావాలను నివేదించారు. దుష్ప్రభావాలు తీవ్రతలో తేలిక నుంచి ఒక మాదిరిగా ఉంటాయి, వ్యాక్సినేషన్ తరువాత రెండురోజుల్లోపు చోటు చేసుకుంటాయి, మరియు చాలావరకు ఒకట్రెండు రోజుల్లో అదృశ్యమవుతాయి.
- MRNA వ్యాక్సిన్‌లో ఎలాంటి పదార్ధాలుంటాయి?
-
MRNA లోని పదార్ధాలు వ్యాక్సిన్ కొరకు విలక్షణమైనవి. వ్యాక్సిన్‌లో mRNA యొక్క క్రియాత్మక పదార్ధంతోపాటుగా, క్రియాత్మక పదార్ధాన్ని సంరక్షించేందుకు, శరీరంలో మరింత మెరుగ్గా పనిచేసేందుకు సాయపడేందుకు, మరియు నిల్వ చేసేటప్పుడు మరియు రవాణా చేసే సమయంలో వ్యాక్సిన్ని సంరక్షించడానికి కొవ్వులు, లవణాలు, మరియు చక్కెరలు వంటి ఇతర పదార్ధాలున్నాయి.
MRNA వ్యాక్సిన్‌లో మానవకణాలు (పిండ కణాలతో సహా), కొవిడ్-19 వైరస్, ల్యాటెక్స్, ప్రిజర్వేటివ్‌లు, లేదా పంది ఉత్పత్తులు లేదా జెలిటిన్తో సహా జంతువుల ఉప ఉత్పన్నకాలు లేవు . వ్యాక్సిన్లు అండాల్లో పెరగవు మరియు అండ ఉత్పత్తులు లేవు
పదార్ధాల గురించి మరింత సమాచారం కొరకు Children's Hospital of Philadelphia (చిల్డ్రన్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా) నుంచి ఈ Q&A వెబ్‌పేజీ; (ఇంగ్లిష్ మాత్రమే) ను చూడండి.
- నా బిడ్డ ఏ బ్రాండ్ వ్యాక్సిన్ని పొందవచ్చు?
-
ప్రస్తుతానికి, 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వడానికి Pfizer-BioNTech (Pfizer) వ్యాక్సిన్, Moderna COVID-19 వ్యాక్సిన్ బ్రాంఢ్లకు అనుమతి ఉంది. 12 ఏళ్లు ఆపై వయసువాళ్ల కోసం Emergency Use Authorization (EUA, అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడినది) కింద Novavax వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 6 నెలలు-4 ఏళ్ల పిల్లలకు తప్పనిసరిగా ఒకే తయారీదారుని నుండే అన్ని వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలి. 5 ఏళ్లు ఆపైబడిన పిల్లలందరూ వారు గతంలో స్వీకరించిన డోసులతో సంబంధం లేకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ తయారీదారుని వ్యాక్సిన్‌నైనా లేదా ఏ బ్రాండ్నైనా తీసుకోవచ్చు.
- నా చిన్నారి తన ఒరిజినల్ సిరీస్ తర్వాత, అప్డేట్ చేసిన డోసు తీసుకోవాలా?
-
6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్‌కు చెందిన కనీసం ఒక డోసు తీసుకోవాలని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిపార్సు చేస్తుంది. గతంలో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారందరూ వారి చివరి డోసు తీసుకున్న కనీసం రెండు నెలల తర్వాతే అప్డేట్ చేయబడిన వ్యాక్సిన్‌ను తీసుకోవాలి. 6 నెలల నుండి 4 ఏళ్ల వయస్సు పిల్లలకు వారు గతంలో తీసుకున్న డోసుల సంఖ్యను బట్టి, బహుళ డోసులు ఇవ్వాల్సి రావచ్చు.
- నా బిడ్డకు ఎన్ని మోతాదులు అవసరం?
-
- 6 నెలలు- 4 ఏళ్ల వయస్సు పిల్లలకు 3 డోసుల Pfizer సిరీస్ లేదా 2 డోసుల Moderna సిరీస్ ఇవ్వాలి
- 5 ఏళ్లు ఆపైబడిన పిల్లలకు Pfizer లేదా Moderna వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇవ్వాలి
మోస్తరుగా లేదా తీవ్రమైన స్థాయిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 6 నెలలు అంతకంటే ఎక్కువ వయసు పిల్లలకు 3-డోసుల సిరీస్ తప్పకుండా ఇవ్వాలి, వారికి చివరి డోసు ఇచ్చిన కనీసం 2 నెలల తర్వాత, అదనపు డోసులు ఇవ్వవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు సంబంధించిన Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మార్గదర్శకాలు (ఇంగ్లీషు మరియు స్పానిష్ మాత్రమే) దయచేసి చూడండి.
- వ్యాక్సిన్ గురించి నాకు ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే నేను ఎవరితో మాట్లాడాలి?
-
మీ బిడ్డ పీడియాట్రీషియన్లేదా ఇతర నమ్మకమైన వైద్య ప్రొవైడర్లేదా కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌తో మాట్లాడండి, లేదా www.CovidVaccineWA.org వద్ద సమాచారాన్ని చదవండి.
- వ్యాక్సిన్ పొందడానికి నా బిడ్డను ఎక్కడకు తీసుకెళ్లగలను?
-
18 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న పిల్లలకు సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్‌లను వాషింగ్టన్ స్టేట్ ఉచితంగా అందిస్తుంది. మీ బిడ్డ శిశు వైద్యుడు లేదా రెగ్యులర్ క్లినిక్ వద్ద కొవిడ్-19 వ్యాక్సిన్ ఉన్నదా అని అడగండి.
ఇప్పటికే హెల్త్ కేర్ ప్రొవైడర్ లేని కుటుంబాలు హెల్త్ కేర్ ప్రొవైడర్, క్లినిక్, లేదా ఇతర ఆరోగ్య వనరులను కనుగొనడానికి 1-800-322-2588 వద్ద Help Me Grow WA హాట్‌లైన్‌కు కాల్ చేయవచ్చు లేదా ParentHelp123.org కు వెళ్లవచ్చు. ఈ సర్వీస్ ఉచితం మరియు భాషా సాయం లభ్యమవుతుంది.
మీరు VaccineLocator.doh.wa.gov ని సందర్శించి, మీకు దగ్గరల్లో ఉన్న పీడ్రియాటిక్ వ్యాక్సిన్ ప్రదేశాల జాబితా చూడటానికి ఫిల్టర్ని ఉపయోగించవచ్చు.Childhood Vaccine Program (చైల్డ్ హుడ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్) మరియు Adult Vaccine Program (అడల్ట్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్) ద్వారా, బహిరంగంగా సరఫరా చేయబడిన వ్యాక్సిన్లు అందిన ప్రొవైడర్లను గుర్తించడం కోసం మీరు ప్రొవైడర్ మ్యాప్ కూడా ఉపయోగించవచ్చు. సరఫరా అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి అలాగే ఆచరణ సంబంధిత విధానాల గురించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుగా ప్రొవైడర్‌ను సంప్రదించండి.
- నా బిడ్డ ప్లూ వంటి ఇతర వ్యాక్సిన్లను పొందేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
-
అవును. మీ బిడ్డ ఇతర వ్యాక్సిన్లను పొందే అదే సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్ని కూడా పొందవచ్చు.
మీరు మీ బిడ్డ కొరకు అవసరమైన స్కూలు వ్యాక్సినేషన్లు (ఇంగ్లిష్ మాత్రమే) లేదా ఇతర సిఫారసు చేసిన వ్యాక్సిన్లు కొవిడ్-19 వ్యాక్సినేషన్ నుంచి విడిగా షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ మీ బిడ్డకు సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్లను వేయించడానికి మరో అవకాశం.
- చైల్డ్ లేదా డే క్యాంప్లకు హాజరు కావడానికి నా బిడ్డకు కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరమా?
-
స్కూలు మరియు చైల్డ్ కేర్ కొరకు ఎలాంటి వ్యాక్సిన్లు అవసరం అనేది Washington State Board of Health (ఇంగ్లిష్ మాత్రమే) నిర్ధారిస్తుంది. ప్రస్తుతానికి ఏ స్కూలు లేదా చైల్డ్ కేర్ కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ ఆవశ్యకత లేదు.
డే క్యాంప్‌ల కొరకు, వారి ఆవశ్యకతలు ఏమిటి అని తెలుసుకోవడానికి క్యాంప్ నిర్వహించే సంస్థను సంప్రదించండి.