WA Notify గోప్యతా విధానం

ఈ గోప్యతా పాలసీ వాషింగ్టన్ రాష్ట్రం కోసం చేసిన అధికారిక ఎక్స్పోజర్ నోటిఫికేషన్ టెక్నాలజీ అయిన WA Notifyకు (డబ్ల్యుఎ నోటిఫై) వర్తిస్తుంది. వాషింగ్టన్ రాష్ట్రం Department of Health (DOH, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) పర్యవేక్షణ కింద, దాని ఆమోదంతో WA Notify రూపొందించబడింది.

మేము ఏ సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకుంటాము?

WA Notifyలో దిగువన పేర్కొన్న సంఘటనల గురించి గోప్యంగా సమాచారాన్ని సేకరించవచ్చు:

  • WA Notify డౌన్లోడ్ చేయడం లేదా ఎనేబుల్ చేయడం.
  • ఎక్స్పోజర్ నోటిఫికేషన్ అందుకోవడం.
  • ధృవీకరణ కోడ్ లేదా ధృవీకరణ లింక్ని సబ్మిట్ చేయడం.
  • ఇతరులకు నోటిఫై చేయడానికి ఎంచుకున్న పాజిటివ్ యూజర్ల కోసం యాదృచ్ఛిక కోడ్లను అప్లోడ్ చేయడం.
  • యాప్ విషయంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడం (యాప్ పనితీరు, గణాంకాలతో పాటు డయాగ్నాస్టిక్ డాటా).

WA Notify ఏవిధంగా ఉపయోగించబడుతుందో అర్థం చేసుకోవడానికి DOH పై సంఘటన సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ డేటాను DOHతో, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతో లేదా అధీకృత వైద్య అధికారులతో పంచుకోవచ్చు. గణాంక లేదా శాస్త్రీయ పరిశోధన అధ్యయనం కోసం దానిని ఒక సంగ్రహ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. ఈ సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్ సమాచారం ఉండదు లేదా దీనితో ఎవరైనా WA Notify యూజర్ని గుర్తించడం వీలుకాదు.

Google మరియు Apple ఉద్దేశానికి అనుగుణంగా యూజర్ గోప్యత సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా WA Notify రూపొందించబడింది. WA Notify దిగువన ప్రస్తావించిన డేటా ఎలిమెంట్లను తయారు చేస్తుంది, దీనిలో ఈ పరికరాన్ని ఉపయోగించే వ్యక్తిని గుర్తించే ఎలాంటి డేటా ఉండదు:

గుర్తుతెలియని సంకేతాలు

  • WA Notify యూజర్లు ఒకరినొకరు దగ్గరగా ఉన్నప్పుడు వారి స్మార్ట్ఫోన్ల మధ్య బ్లూటూత్ ద్వారా యాదృచ్ఛిక కోడ్లు పంచుకోబడతాయి.
  • గుర్తుతెలియని సంకేతాలు WA Notify ద్వారాగాక, మీ స్మార్ట్ఫోన్ ద్వారానే ఉత్పన్నమై, అందులోనే నిల్వ చేసి ఉంటాయి.
  • COVID-19 ఎక్స్పోజర్లకు గురైన అవకాశం ఉందో లేదో తనిఖీ చేసేలా WA Notify, అలాగే మీ స్మార్ట్‌ఫోన్ని అనుమతించడానికి మాత్రమే గుర్తుతెలియని కోడ్‌లు వాడటం జరుగుతుంది.
  • గుర్తుతెలియని కోడ్‌లను గరిష్టంగా 14 రోజుల పాటు నిల్వ చేస్తారు.

ధృవీకరణ కోడ్​లు మరియు లింక్​లు

  • COVID-19కి ఎక్స్‌పోజ్‌ అయివుండవచ్చని WA Notify యూజర్లకు త్వరగా, గోప్యంగా తెలియజేయడం కోసం, DOHకి నివేదించబడిన ఒక పాజిటివ్ COVID-19 పరీక్షా ఫలితంతో సంబంధమున్న అన్ని ఫోన్ నంబర్‌లకు ధృవీకరణ లింక్‌తో పాటు నోటిఫికేషన్ మరియు/లేదా టెక్స్ట్ మెసేజ్‌ను DOH పంపుతుంది.
    • నోటిఫికేషన్ మీద తడితే లేదా మీ ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేస్తే మీ యాదృచ్ఛిక కోడ్​లు పంచుకునేందుకు అనుమతి దొరుకుతుంది. ఎక్స్‌పోజ్ అయివుండవచ్చని మీకు దగ్గరగా ఉన్న ఇతర WA Notify యూజర్లను ఆ కోడ్‌లు గోప్యంగా హెచ్చరిస్తాయి.
    • WA Notify ఎవరు ఉపయోగిస్తున్నారనేది మాకు తెలియదు కనుక COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలిన ప్రతీ ఒక్కరికి ధృవీకరణ లింక్​తోపాటు ఒక టెక్ట్స్ సందేశాన్ని DOH పంపుతుంది. ఒకవేళ మీరు WA Notify ఉపయోగించడం లేనట్లయితే, మీరు మీ ఫోనులో WA Notify చేర్చవచ్చు లేదా టెక్ట్స్​ని విస్మరించవచ్చు.
    • ఇతర WA Notify యూజర్​​లను గోప్యంగా హెచ్చరించేలా మీరు నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయాలో వద్దో లేదా ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయాలో వద్దో నిర్ణయించుకోవచ్చు.
  • మీకు COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలితే, మీ స్థానిక ప్రజారోగ్య అధికారుల్లో ఒకరు మిమ్మల్ని సంప్రదించి, మీరు WA Notify ఉపయోగిస్తున్నారా అని అడుగుతారు. మీరు ఉపయోగిస్తున్నా మీకు ధృవీకరణ టెక్స్ట్ సందేశం అందకపోతే, మీరు WA Notify లో నమోదుచేయడానికి వారు ధృవీకరణ కోడ్ లేదా లింక్​ని అందిస్తారు.

ఉపయోగపు లాగ్​లు

  • దాదాపుగా ఏ యాప్​లేదా ఇంటర్నెట్ సేవ అయినా చేసే విధంగానే, WA Notify కూడా మీరు ఆ సేవను ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్​గా లాగ్​లను ఉత్పత్తి చేస్తుంది. ఈ లాగ్​లలో మీ స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన కొంత సమాచారం ఉంటుంది. మేము ఈ సమాచారాన్ని WA Notify కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తాము.
  • ఈ లాగ్​ల్లో యాదృచ్ఛిక కోడ్​లు లేదా ధృవీకరణ లింక్​లు లేదా కోడ్​లు చేర్చబడవు మరియు మీకు లేదా మీ స్మార్ట్ ఫోన్​కు కోడ్ యొక్క ఏ రకాన్ని తిరిగి జతచేయడానికి ఉపయోగించలేం.
  • ఈ లాగ్​లు ఉత్పన్నమైన 14 రోజుల తరువాత వాటికవే తొలగిపోతాయి.

డేటా విశ్లేషణ

  • ఎక్స్​ట్రా ఎనలిటిక్స్​ని ప్రారంభించడానికి మీరు ఎంచుకున్నట్లయితే, యాప్​ని మెరుగుపరచడానికి సాయపడేందుకు DOH తో పరిమితంగా సమగ్రమైన డేటా పంచుకోబడుతుంది.
  • ఈ డేటాలో ఈ యాప్​ను ఎలా ఉపయోగించడం జరిగిందనే దానికి సంబంధించిన గణాంకాలు ఉంటాయి. మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగపడగల సమాచారం ఏదీ ఇందులో ఉండదు.
  • యాప్​లోని ఎనలిటిక్స్ షేరింగ్​ను నిలిపి వేయడం ద్వారా మీరు ఈ డేటాను షేర్ చేయకూడదని ఎంచుకోవచ్చు.
  • డిజైన్ రీత్యానే, WA Notify మీ స్మార్ట్ఫోన్ నుండి లొకేషన్ డేటాను సేకరించదు, గుర్తుతెలియని కోడ్‌లతో లేదా ధృవీకరణ కోడ్‌లతో మిమ్మల్ని లేదా మీ స్మార్ట్ఫోన్ను ముడిపెట్టే సమాచారాన్ని దేనినీ సేకరించదు లేదా షేర్ చేయదు.

డయాగ్నాస్టిక్ సమాచారం

  • మిగతా యాపుల్లాగే లేదా ఇంటర్నెట్ సేవల్లాగే, మీరు ఈ సేవను ఉపయోగిస్తున్నప్పుడు WA Notify యాంత్రికంగా డయాగ్నిస్టిక్ డాటాను తయారుచేస్తుంది.
  • ఇదే Apple/Google సాంకేతికతను ఉపయోగిస్తున్న మిగతా ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ యాపుల్లాగే Android WA Notify appను కూడా Google అభివృద్ధి చేసింది.
  • ఇదే Apple/Google సాంకేతికతను ఉపయోగిస్తున్న WA Notify మరియు ఇతర ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ యాప్‌లలో ఉన్న సమస్యలను గుర్తించడానికి Google ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
  • ఇలా గుర్తించడానికి ఉపయోగించే సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్‌కు సంబంధించిన సమాచారం ఉండదు, అలాగే దీనితో ఏ WA Notify వినియోగదారుణ్ణి గుర్తించడానికి వీలుకాదు.

మీరు ధృవీకరణ కోడ్ అభ్యర్ధించినప్పుడు ఏమి జరుగుతుంది?

సొంతగా చేసుకునే పరీక్షలో COVID-19 పాజిటివ్ అనే ఫలితం వచ్చినవాళ్లు, బహుశా ఎక్స్‌పోజర్‌కు గురైవుండవచ్చని ఇతర WA Notify యూజర్లను గోప్యంగా హెచ్చరించడానికి WA Notifyలో ధృవీకరణ కోడ్ కోసం అభ్యర్ధించవచ్చు. ధృవీకరణ కోడ్ కావాలంటే, WA Notify యూజర్లు తమ పాజిటివ్ టెస్ట్ ఫలితం తేదీని మరియు వారి మొబైల్ నెంబరును విధిగా నమోదు చేయాలి. ఎక్స్‌పోజర్‌కు గురైవుండవచ్చని ఇతర WA Notify యూజర్లను గోప్యంగా అలర్ట్ చేసేలా ధృవీకరణ కోడ్ నమోదు చేయడానికి లేదా ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయడానికి, మొదట కోడ్ కోసం అభ్యర్థించడానికి ఉపయోగించిన పరికరాన్నే ఉపయోగించాలి.

ఒకే టెస్ట్ ఫలితానికి సంబంధించిన డూప్లికేట్ రిపోర్ట్లు నిరోధించడానికి వీలుగా, కోడ్ కోసం అభ్యర్ధించడానికి ఉపయోగించిన ఫోన్ నెంబరును గుప్తమైన రూపంలో తాత్కాలికంగా 30 రోజుల వరకు WA Notify నిల్వ చేస్తుంది. ఈ సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్ సమాచారం ఉండదు లేదా దానితో ఎవరైనా WA Notify యూజర్ని గుర్తించడం వీలుకాదు.

మేము మీ సమాచారాన్ని ఎప్పుడు షేర్ చేస్తాము?

మీరు ధృవీకరణ కోడ్ నమోదు చేయడం లేదా ధృవీకరణ లింక్ క్లిక్ చేయాలని ఎంచుకుంటే తప్ప, మేం మీ సమాచారాన్ని స్వచ్ఛందంగా సేకరించం లేదా మరెవరితోనైనా పంచుకోం. మీరు అలా చేస్తే, WA Notify మీ గుర్తుతెలియని సంకేతాలను మీ స్మార్ట్​ఫోన్​కు దగ్గరలో ఉన్న ఇతర స్మార్ట్​ఫోన్​లతో షేర్ చేసుకుంటుంది. మీ స్మార్ట్​ఫోన్​కు యాక్సెస్​లేని ఎవరి ద్వారానైనా ధృవీకరణ కోడ్ లేదా లింక్​ని తిరిగి మీకు లింక్ చేయలేరు. WA Notify లో ఏ సమాచారం సేకరించబడుతుంది మరియు ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఈ పేజీ పైన ఉన్న మేం ఏ సమాచారాన్ని సేకరిస్తాం మరియు ఉపయోగిస్తాం సెక్షన్ సమీక్షించండి.

మేము మీ సమాచారాన్ని ఎలా పరిరక్షిస్తాము?

Google మరియు Apple యొక్క ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్ ఫ్రేమ్​వర్క్ ఉపయోగించి WA Notify యాదృచ్ఛిక కోడ్​లను సంరక్షిస్తుంది, దీనిలో వాటిని ఎలా ఎన్​క్రిప్ట్ చేయాలి మరియు బదిలీ చేయాలనే దాని గురించి అత్యంత నిర్ధిష్టమైన ఆవశ్యకతలు చేర్చబడతాయి. WA Notify మీ గుర్తుతెలియని సంకేతాలను నిల్వ చేయదు లేదా ఉత్పత్తి చేయదు – ఆ పని మీ స్మార్ట్​ఫోన్ చేస్తుంది.

మీ సమాచారంపై హక్కులు మీవే

ధృవీకరణ కోడ్​లు మరియు అప్లికేషన్​లాగ్​లను మీ స్మార్ట్​ఫోన్​కు యాక్సెస్ చేయకుండా జతచేయలేం కాబట్టి, DOH ఏవిధంగానూ ఈ సమాచారాన్ని యాక్సెస్ చేసుకోలేదు. దీని కారణంగా, DOH మీరు ఈ సమాచారాన్ని అడిగితే మీకు ఇవ్వలేకపోచ్చు లేదా డిలీట్ చేయలేకపోవచ్చు. WA Notify ఉపయోగాన్నినియంత్రించే వారు మీరే. ఎక్స్​పోజర్ నోటిఫికేషన్​లను నిలిపివేయడానికి లేదా మీ స్మార్ట్​ఫోన్​లో నిల్వ చేసిన ఎక్స్​పోజర్ లాగ్​లను ఎప్పుడైనా తొలగించడానికి మీ స్మార్ట్​ఫోన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా, WA Notify ని మీరు ఎప్పుడైనా అన్​ఇన్​స్టాల్ చేయవచ్చు. మీరు అలా చేస్తే, నిల్వ చేసిన గుర్తుతెలియని సంకేతాలన్నీ తొలగిపోతాయి.