WA Notify టెక్ట్స్లు

Washington state Department of Health (DOH, వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) నుండి మీకు టెక్స్ట్ లేదా ఫోన్ నోటిఫికేషన్ వచ్చిందా?

ఫోను ద్వారా మీకు రెండు రకాల టెక్స్ట్ మెసేజ్‌లు/నోటిఫికేషన్​లు రావచ్చు.

COVID-19 పాజిటివ్ పరీక్షా ఫలితానికి సంబంధించిన నోటిఫికేషన్

DOHకి నివేదించబడిన ఒక పాజిటివ్ COVID-19 పరీక్షా ఫలితంతో సంబంధమున్న అన్ని ఫోన్ నంబర్‌లకు ధృవీకరణ లింక్‌తో పాటు నోటిఫికేషన్ మరియు/లేదా టెక్స్ట్ మెసేజ్‌ను DOH పంపుతుంది. COVID-19కి ఎక్స్‌పోజ్‌ అయివుంటారని ఇతర WA Notify యూజర్‌లకు గోప్యంగా ఎలా తెలియజేయాలనే సమాచారం ఈ నోటిఫికేషన్‌లో ఉంటుంది.

మీరు WA Notify యూజర్ అయితే, ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం గురించి ఇతర యూజర్​లకు గోప్యంగా అప్రమత్తం చేయడానికి, మీరు నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది లేదా టెక్స్ట్‌ సందేశంలోని లింక్ మీద క్లిక్ చేసి, WA Notifyలో ఇవ్వబడిన నిర్దేశాలను అనుసరిస్తే సరిపోతుంది.

మీరు ఒక WA Notify యూజర్ కాకపోతే, టెక్స్ట్‌ని పట్టించుకోనవసరం లేదు. మీరు WA Notifyను మీ ఫోన్‌లో ఎలా జతచేయవచ్చు లాంటి సమాచారంతోపాటు మరికొంత సమాచారం తెలుసుకోవాలనుకుంటే, WANotify.org ని సందర్శించండి.

సెల్ఫ్-టెస్ట్ ఉపయోగించే WA Notify యూజర్లు (దీనినే ఇంటి-వద్ద పరీక్షలు అని కూడా పిలుస్తారు) ఎవరైనా COVID-19 పరీక్షలో పాజిటివ్‌ అని తేలితే వారు వెరిఫికేషన్ కోడ్ కోసం అభ్యర్థించవచ్చు, అలా వారు COVID-19కి ఎక్స్‌పోజ్‌ అయివుండవచ్చని ఇతర WA Notify యూజర్లకు గోప్యంగా తెలియజేయగలుగుతారు. “సెల్ఫ్-టెస్ట్‌లో మీరు COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” విభాగంలోని WANotify.org ని సందర్శించండి.

COVID-19 ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం ఉన్నట్లు తెలియజేసే నోటిఫికేషన్

ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం ఉన్న WA Notify యూజర్​లు ఎక్స్‌పోజర్‌ నోటిఫికేషన్​ అందుకుంటారు.

టెక్ట్స్​లు మరియు నోటిఫికేషన్​లు ఎలా కనిపిస్తాయి?

పాజిటివ్ కొవిడ్-19 టెస్ట్ నోటిఫికేషన్

టెక్ట్స్ మరియు నోటిఫికేషన్ ఇమేజ్

pop up notification screenshot

 

నోటిఫికేషన్ మరియు టెక్ట్స్ కంటెంట్

మీ COVID -19 నిర్ధారణను షేర్ చేయండి

మీరు కోవిడ్-19 కు ఎక్స్​పోజ్ అయివుండవచ్చని అజ్ఞాతంగా ఇతరులకు తెలియజేయడానికి ఇక్కడ తట్టండి. మీ కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడానికి సహాయపడటానికి దిగువ దశలను అనుసరించండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం జరగదు.

టెక్ట్స్ మరియు నోటిఫికేషన్ ఇమేజ్

text message screenshot

 

నోటిఫికేషన్ మరియు టెక్ట్స్ కంటెంట్

Message from (Mensaje del) WA Dept. of Health:

This number was given for a recent COVID-19 test. If this phone uses WANotify AND belongs to the person tested, please click the link within 24 hours. Follow the steps to anonymously alert others who may have been exposed.

https://us-wa.en.expressly/v?c=8w5io5c38ipo24fc

Se dio este numéro para una prueba reciente de COVID-19. Si este teléfono usa WANotify Y es de quien se hizo la prueba, haga clic en el enlace en las próximas 24 horas. Siga los pasos para alertar anónimamente a quienes tal vez hayan sido expuestos.

NOT the person tested? Need more information? Visit wanotify.org/text

¿NO es quien se hizo la prueba? ¿Desea más información? Visite notificawa.org/texto

టెక్ట్స్ మరియు నోటిఫికేషన్ ఇమేజ్

text message screenshot

 

నోటిఫికేషన్ మరియు టెక్ట్స్ కంటెంట్

Message from WA Dept. of Health:

If this phone uses WANotify AND belongs to the person tested, please click the link within 24 hours. Follow the steps to anonymously alert others who may have been exposed.

https://us-wa.en.expressly/v?c=5b56h13n80q9onll

NOT the person tested? Need more information? Visit wanotify.org/text.

టెక్ట్స్ మరియు నోటిఫికేషన్ ఇమేజ్

text message screenshot

 

నోటిఫికేషన్ మరియు టెక్ట్స్ కంటెంట్

Mensaje del Departamento de Salud del Estado de Washington:

Si este teléfono usa WANotify Y es de quien se hizo la prueba, haga clic en el enlace en las próximas 24 horas. Siga los pasos alertar anónimamente a quienes tal vez hayan sido expuestos.

https://us-wa.en.expressly/v?c=dvo8iije3v33saoj

¿NO es quien se hizo la prueba? ¿Desea más información? Visite notificawa.org/texto.

పాజిటివ్ కొవిడ్-19 ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్

టెక్ట్స్ మరియు నోటిఫికేషన్ ఇమేజ్

exposure notification screenshot

నోటిఫికేషన్ మరియు టెక్ట్స్ కంటెంట్

మీరు కోవిడ్-19కు ఎక్స్​పోజ్ అయి ఉండవచ్చు

మీరు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలినవారు ఒకరికి దగ్గరగా ఉన్నారు. తర్వాత మీరు ఏమి చేస్తారనేది ముఖ్యమైనది, మీకు సహాయం చేయడానికి మేము ఉన్నాం. మరింత తెలుసుకోవడానికి ట్యాప్ చేయండి.

నాకు టెక్స్ట్ లేదా నోటిఫికేషన్ వస్తే నేను ఏమి చేయాలి?

WA Notify యూజర్‌లు టెక్స్ట్‌లోని లింక్‌ను క్లిక్ చేయాలి లేదా నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయాలి మరియు వారి ఫలితాలను యాప్‌లో అజ్ఞాతంగా నిర్ధారించడానికి అన్ని దశలను అనుసరించాలి. మీతో ఇటీవల సన్నిహితంగా ఉన్నవారు COVID-19కి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఉందని ఇతర WA Notify యూజర్‌లను ఇది అనామకంగా హెచ్చరిస్తుంది. WA Notify వినియోగదారులు వారి ఫలితాలను అనామకంగా నిర్ధారించడానికి అనుమతించడమనేది COVID-19 మరింత వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. కేస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ సమయంలోనూ పబ్లిక్ హెల్త్ మిమ్మల్ని చేరుకోవచ్చు మరియు ధృవీకరణ లింక్ లేదా కోడ్‌ను అందించవచ్చు.

దయచేసి దిగువ సందర్భాల్లో మీ ప్రైమరీ కేర్ డాక్టర్ లేదా టెస్టింగ్ ప్రొవైడర్​ని సంప్రదించండి:

  • మీరు టెక్ట్స్ మరియు/లేదా నోటిఫికేషన్​ని అందుకున్నారు, కానీ మీ అధికారిక టెస్ట్ ఫలితాలను పొందలేదు, లేదా
  • మీ టెస్ట్ ఫలితాల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే

సాధారణ ప్రశ్నలు

నేను ఎవరు అని WA Notify కి తెలియకపోయినట్లయితే, నేను టెక్ట్స్ మరియు/లేదా నోటిఫికేషన్​ని ఎలా పొందుతాను?

టెక్ట్స్​లు మరియు నోటిఫికేషన్​లు WA Notify ద్వారా కాకుండా DOH ద్వారా పంపబడతాయి. WA Notify ని ఎవరు ఉపయోగిస్తారనేది మాకు తెలియదు కనుక, కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా టెస్ట్ చేయబడ్డ ప్రతి ఒక్కరికి DOH టెక్ట్స్ మరియు/లేదా నోటిఫికేషన్​ని పంపుతుంది. ఒకవేళ మీరు WA Notify ఉపయోగించనట్లయితే, మీరు టెక్ట్స్ మరియు నోటిఫికేషన్​ని విస్మరించవచ్చు.

టెక్స్ట్ లేదా నోటిఫికేషన్ ఎవరికి పంపాలో DOHకి ఎలా తెలుసు?

చట్టం ప్రకారం, ఇన్ఫెక్షన్ కలిగించే అనేక వ్యాధులకు సంబంధించిన పాజిటివ్ పరీక్షా ఫలితాలను సంప్రదింపు సమాచారంతో సహా రాష్ట్రానికి నివేదించబడాలి. వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి కేస్ ఇన్వెస్టిగేషన్‌లు మరియు కాంటాక్ట్ ట్రేసింగ్ (ఇంగ్లీష్‌లో మాత్రమే) చేయడానికి DOH ఈ సమాచారం ఉపయోగిస్తుంది. టెస్ట్‌లో పాజిటివ్​గా తేలిన ప్రతి ఒక్కరికీ తెలియజేయడమనేది WA Notify యూజర్​లు వేగంగా వ్యవహరించడానికి మరియు ఎక్స్​పోజ్ అయ్యే సంభావ్యత కలిగిన ఇతరులను అనామధేయంగా అప్రమత్తం చేయడానికి అనుమతిస్తుంది.

నేను WA Notify ఉపయోగించడం లేదు. మీరు నాకు టెక్ట్స్ ఎందుకు పంపారు?

ఇటీవల కొవిడ్-19 పాజిటివ్​గా టెస్ట్ చేయబడ్డ వ్యక్తుల ద్వారా ఉపయోగించే ఫోన్ నెంబరులకు DOH టెక్ట్స్ సందేశం పంపుతుంది మరియు/లేదా నోటిఫికేషన్​ని పాప్-అప్ చేస్తుంది.

DOH కి ఎవరికి టెస్ట్ పాజిటివ్​గా వచ్చిందనేది మాత్రమే తెలుసుకుంటుంది WA Notify ని ఎవరు ఉపయోగిస్తారనేది మాకు తెలియదు. ప్రతి ఒక్కరికి టెక్ట్స్ పంపడం ద్వారా, మేం ఎక్స్​ప్లోజ్ కాగల సంభావ్యత ఉండే ఇతరులకు అనామధేయంగా వేగంగా అలర్ట్ చేయడానికి మరియు వారి ప్రాణాలను కాపాడటానికి మేం WA Notify కు సాయం చేస్తాం.

మీరు WA Notify ఉపయోగించనట్లయితే, ఎలాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ నెంబరుని ఎలా జోడించాలనే దానితో సహా, WA Notify గురించి మరింత తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, సందర్శించండి WANotify.org

ఏ ఫోన్ నెంబర్ నుంచి టెక్ట్స్ వస్తుంది?

DOH పంపే నెంబరు 1-844-986-3040.

నేను నోటిఫికేషన్ మరియు/లేదా టెక్ట్స్ అందుకున్నాను, అయితే పరీక్షించిన వ్యక్తి కుటుంబ లేదా ఇంటి సభ్యుడు. నేను ఏం చేయాలి?

టెస్టులో పాజిటివ్​గా తేలిన WA Notify యూజర్ ఎక్స్‌పోజ్ కాగల ఇతరులను అనామధేయంగా అప్రమత్తం చేసే దశలను అనుసరించాలి, కాబట్టి, మీకు ఉద్దేశించబడని ఏవైనా టెక్స్ట్‌లు లేదా నోటిఫికేషన్​లను మీరు విస్మరించాలి.

మీ కుటుంబ లేదా ఇంటి సభ్యుడు WA Notify యూజర్ అయితే, టెస్టుల్లో వారికి పాజిటివ్ అని తేలితే, వారి ఫలితాన్ని WA Notify‌లో ఇంకా నిర్ధారించాల్సి ఉంటే, WANotify.org లోని “సెల్ఫ్-టెస్ట్‌తో మీరు COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగంలోని దశలను వారు అనుసరించవచ్చు.

నేను ఎంత సమయంలోపు నోటిఫికేషన్​ని తట్టాలి లేదా ధృవీకరణ లింక్​ని యాక్టివేట్ చేయాలి?

నోటిఫికేషన్ లేదా టెక్స్ట్ మెసేజ్ అందుకున్న తరువాత, WA Notifyలోని ఇతరులకు తెలియజేసే దశలను అనుసరించడానికి మీకు 24 గంటలు సమయం ఉంటుంది. ఆ సమయం లోపల మీరు నోటిఫికేషన్‌ ట్యాప్ చేయలేకపోతే లేదా ధృవీకరణ లింక్‌ క్లిక్ చేయలేకపోతే, WANotify.orgలోని“సెల్ఫ్-టెస్ట్‌తో మీరు COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగంలోని దశలను అనుసరించడం ద్వారా WA Notifyలో మీరు ధృవీకరణ కోడ్‌ను అభ్యర్థించవచ్చు

WA Notify లో ధృవీకరణ కోడ్​ని యాక్టివేట్ చేయడానికి ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు టెక్ట్స్ లేదా నోటిఫికేషన్​ని ఉపయోగించవచ్చా?

లేదు. మీ కుటుంబ లేదా ఇంటి సభ్యుడు WA Notify యూజర్ అయితే, టెస్టుల్లో వారికి పాజిటివ్ అని తేలితే, వారి ఫలితాన్ని WA Notify‌లో ఇంకా నిర్ధారించాల్సి ఉంటే, WANotify.orgలోని“సెల్ఫ్-టెస్ట్‌తో మీరు COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగంలోని దశలను వారు అనుసరించవచ్చు

WA Notify లో నా ఎక్స్ప్లోజర్ తేదీని నేను ఎలా కనుగొనవచ్చు?

iPhone పైన:

  1. Settings (సెట్టింగ్లు) కు వెళ్ళండి
  2. Exposure Notifications(ఎక్స్ప్లోజర్ నోటిఫికేషన్లు) ఎంచుకోండి లేదా సెర్చ్ బార్లో Exposure Notifications అని నమోదు చేయండి
  3. “You may have been exposed to COVID-19 (మీరు COVID-19కి గురయ్యి ఉండవచ్చు)” క్రింద మీరు ఎక్స్‌పోజర్‌కి గురై ఉండగల అంచనా తేదీ చూపబడుతుంది

Androidపై:

  1. WA Notify యాప్ ఓపెన్ చేయండి
  2. “Possible exposure reported(నివేదించిన సంభావ్య ఎక్స్ప్లోజర్) ” కింద See Details(వివరాలను చూడండి) ఎంచుకోండి
  3. “Possible Exposure Date (సంభావ్య ఎక్స్‌పోజర్ తేదీ)” క్రింద మీరు ఎక్స్‌పోజ్ అయి ఉండగల అంచనా తేదీ చూపబడుతుంది