నాకు దగ్గరల్లో ఉండే టెస్టింగ్ లొకేషన్ కనుగొనండి (ఇంగ్లిష్లో)
ఇంటి వద్ద పొందిన పాజిటివ్ టెస్ట్ ఫలితాలను తేలికగా నివేదించడం
ఓవర్-ద- కౌంటర్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేసిన వ్యక్తి, పాజిటివ్ రిజల్ట్‌ని పొందితే, వారు టెస్ట్ రిజల్ట్‌ని పొందిన వెంటనే సాధ్యమైనంత త్వరగా స్టేట్ కొవిడ్-19 హాట్‌లైన్, 1-800-525-0127కు కాల్ చేసి, తరువాత #ని ప్రెస్ చేయాలి. హాట్‌లైన్ సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మంగళవారం నుంచి ఆదివారం (మరియు సెలవుదినాల్లో) వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు లభ్యమవుతుంది. భాషా సాయం లభ్యమవుతుంది.
టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి
టెస్టింగ్ ప్రాణాలను కాపాడుతుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సకాలంలో క్వారంటైన్లోనికి వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవడానికి టెస్టింగ్ వ్యక్తులను అనుమతిస్తుంది; రోగలక్షణాలు లేకుండా ఉండే వ్యాధి సోకిన వ్యక్తులు వైరస్‌ని వ్యాప్తి చెందించవచ్చు. వ్యాప్తికి ప్రజారోగ్య అధికారులు ప్రతిస్పందించడానికి మరియు వైరస్ యొక్క కొత్త వేరియెంట్లను ట్రాక్ చేయడానికి కూడా టెస్టింగ్ సాయపడుతుంది. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించడంలో సాయపడటానికి టెస్టింగ్ ఒక ముఖ్యమైన అంగం.
కొవిడ్-19 కొరకు టెస్ట్ చేయించుకోవడం మరియు WA Notify(డబ్ల్యుఎ నోటిఫై) ద్వారా ట్రాక్ చేయడం ద్వారా డిసెంబర్ 2020 నుంచి మార్చి 2021 వరకు సుమారు 6,000 కేసుల వరకు నిరోధించినట్లుగా University of Washington మరియు Department of Health (DOH, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్)పరిశోధనల్లో తేలింది.
ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి
మీకు అస్వస్థతగా ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోండి కొవిడ్-19కు విస్త్రృత శ్రేణి లక్షణాలు ఉంటాయి (ఇంగ్లిష్లో), అందువల్ల మీకు బాగున్నట్లుగా అనిపించకపోతే, సాధ్యమైనంత త్వరగా టెస్ట్ చేయించుకోవడం మంచిది.
కొవిడ్-19కు పాజిటివ్‌గా టెస్ట్ చేసిన ఎవరితోనైనా మీరు ఎక్స్ప్లోజ్ అయినప్పుడు టెస్ట్ చేయించుకోండి. మీకు రోగలక్షణాలు కనిపించినట్లయితే వెంటనే టెస్ట్ చేయించుకోండి. మీకు రోగలక్షణాలు కనిపించకపోతే, ఎక్స్ప్లోజ్ అయిన తరువాత ఐదురోజులు వేచి ఉండండి, తరువాత టెస్ట్ చేయించుకోండి.
వాషింగ్టన్‌లోని వ్యాపారాలు మరియు ఈవెంట్ ప్రదేశాల్లో ఎస్టాబ్లిష్మెంట్ లేదా ఈవెంట్లోనికి ప్రవేశించడానికి ముందు టెస్టింగ్ మరియు/లేదా వ్యాక్సినేషన్ ఆవశ్యకతలు ఉండవచ్చు. మీరు సందర్శించడానికి ముందే వారికి కాల్ చేయండి లేదా వారి వెబ్‌సైట్ చెక్ చేయండి.
మీరు ప్రయాణించడానికి ముందు/లేదా తరువాత టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) తాజా ప్రయాణ మార్గదర్శకాన్ని తనిఖీ చేయండి (ఇంగ్లిష్లో)
మీరు ఒక వ్యక్తుల సమూహాన్ని కలవడానికి వెళుతున్నట్లయితే, మరిముఖ్యంగా, తీవ్రమైన వ్యాధి ప్రమాదం ఉండే లేదా వారి కొవిడ్-19 వ్యాక్సిన్ల విషయంలో అప్డేట్గా లేనివారిని కలవడానికి వెళ్లినప్పుడు. (ఇంగ్లిష్లో)
ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి
డబ్ల్యుఎ స్టేట్ డి Department of Health వెబ్‌సైట్ ప్రతి కౌంటీలో లభ్యమయ్యే టెస్టింగ్ సైట్‌ల డైరెక్టరీ ని వాటి పనిగంటలు మరియు ఆవశ్యకతలతో నిర్వహిస్తుంది. టెస్టింగ్ సైట్లపై అదనపు సమాచారం కొరకు, 2-1-1కు కాల్ చేయండి. సౌకర్యవంతంగా, ఇంటి వద్ద టెస్ట్ చేసుకోవడానికి ఆర్డర్ చేయడానికి చిట్టీ లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే టెస్ట్ కిట్లు కూడా ఫార్మసీల్లో లభ్యమవుతాయి.
ఖర్చు
ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్లు ఇప్పుడు కుటుంబాలకు ప్రతినెలా ఎనిమిది టెస్ట్‌లకు వరకు రీఎంబర్స్ చేస్తారు. ఇన్స్యూరెన్స్ రీఎంబర్స్మెంట్ గురించి మరింత తెలుసుకోండి (ఇంగ్లిష్లో).
కౌంటీ లేదా స్టేట్-సపోర్టెడ్ టెస్ట్ సైట్‌ల వద్ద చేసే టెస్ట్‌ల కొరకు ఎలాంటి ఖర్చు అవ్వదు. చాలా టెస్ట్‌లు, మరిముఖ్యంగా రోగలక్షణాలు అనుభూతి చెందే వ్యక్తులు, ఇన్స్యూరెన్స్‌కు బిల్లు చేయవచ్చు లేదా Department of Health ద్వారా సబ్సిడీని పొందవచ్చు.
మీరు స్థానిక లేదా ఆన్లైన్ రిటైలర్లు మరియు పార్మసీల దగ్గర నుంచి కూడా ఎట్-హోమ్ టెస్ట్‌ని కొనుగోలు చేయవచ్చు. ఎలాంటి ఇన్స్యూరెన్స్ లేదా ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు.
టెస్ట్‌ల్లో రకాలు
ప్రస్తుతం రాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లు, మాలిక్యులర్ టెస్టులు (ల్యాబ్ ఆధారిత మరియు పాయింట్ ఆఫ్ కేర్), కొన్ని హోమ్ సెల్ఫ్ టెస్ట్‌లతో సహా టెస్టులు లభ్యమవుతున్నాయి. ఏదైనా నిర్ధిష్ట టెస్ట్ సప్లై, డిమాండ్ మరియు తయారీదారుడి సామర్ధ్యానికి అనుగుణంగా మారుతుంది.
ఎట్-హోమ్ టెస్ట్‌ని ఎలా చేయాలి
అత్యంత ఖచ్చితమైన ఫలితాల కొరకు ర్యాపిడ్ ఎట్-హోమ్ టెస్ట్‌ల కిట్ లోపల ఉండే సూచనలను పాటించడం ఎంతో ముఖ్యం. అనేక బ్రాండ్లు వీడియో సూచనలను కూడా అందిస్తాయి. అత్యుత్తమ విధానాల కొరకు, ఎట్-హోమ్ టెస్టింగ్ కొరకు CDC చిట్కాలు గమనించండి (ఇంగ్లిష్లో).
ర్యాపిడ్ టెస్ట్‌లతో ఫాల్స్ నెగిటివ్‌లు రావొచ్చు. కొన్ని టెస్టింగ్ కిట్ల్లో రెండు టెస్ట్‌లు చేర్చవచ్చు (టెస్ట్ చేసేటప్పుడు బాక్స్‌పై ఉండే సూచనలను మీరు విధిగా పాటించాలి)
టెస్టింగ్ ఎలా పనిచేస్తుందనే దానిపై మరింత సమాచారం కొరకు, టెస్టింగ్‌కు తరచుగా అడిగే ప్రశ్నలను సందర్శించండి.
టెస్టింగ్ ఏవిధంగా పనిచేస్తుంది
చాలావరకు టెస్టింగ్‌ని నాసల్ స్వాబ్ ఉపయోగించి చేస్తారు. కొన్ని టెస్ట్‌లు ఉమ్మిని సేకరించడం ద్వారా చేస్తారు. మరిన్ని వివరాలను టెస్టింగ్‌పై తరచుగా అడిగే ప్రశ్నలు పేజీ లో తెలుసుకోవచ్చు.
ఎప్పుడు క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌లో ఉండాలి
మీరు టెస్ట్ చేయించుకోవడానికి ముందు మరియు మీ ఫలితాలు అందుకున్న తరువాత మీరు క్వారంటైన్ లేదా ఐసోలేషన్‌లో ఉండాల్సి రావొచ్చు. ఇది మీ వ్యాక్సినేషన్ స్థితి మరియు మీరు ప్రదర్శిస్తున్న రోగలక్షణాలపై ఆధారపడి ఉంటుంది. తాజా CDC మార్గదర్శకం సందర్భాల వారిగా దీనిని విభజించింది (ఇంగ్లిష్లో). రోగలక్షణాలున్న మరియు/లేదా కొవిడ్-19కు ఎక్స్ప్లోజ్ అయిన వ్యక్తుల కొరకు మీరు మా గైడ్ కూడా అనుసరించవచ్చు
ఫాలోప్
మీకు రోగలక్షణాలు ఉన్నట్లయితే, సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండండి. మీరు కొవిడ్-19కు పాజిటివ్‌గా టెస్ట్ చేయబడినట్లయితే, మిమ్మల్ని మరియు ఇతరులను సురక్షితంగా ఉంచడానికి సాయపడేందుకు మీరు తీసుకోగల చర్యలు ఉన్నాయి. తదుపరి సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు: మీరు పాజిటివ్‌గా టెస్ట్ చేయబడితే ఏమి చేయాలి