కొవిడ్-19 వ్యాక్సిన్

Food and Drug Administration (FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) వారి నియంత్రణా చర్యను పాటిస్తూ, Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) వారు ఈ సిఫారసు చేశారు. 6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసిన లేదా కొత్త 2023-2024 mRNA COVID-19 వ్యాక్సిన్లను తీసుకోవాలి. ఇవి ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ XBB.1.5ను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. బైవాలెంట్ COVID-19 వ్యాక్సిన్లను ఇకపై యునైటెడ్ స్టేట్స్‌లో ఇవ్వడానికి అనుమతిలేదు లేదా అవి అందుబాటులో ఉండవు. కొత్త COVID-19 వ్యాక్సిన్ సిఫార్సులు ఇలా ఉన్నాయి:

  • ఇప్పటికింకా వ్యాక్సిన్ వేయించుకోని 6 నెలలు – 4 ఏళ్ల వయసు పిల్లలకు అప్‌డేట్ చేయబడిన mRNA Pfizer 3 డోసులు లేదా అప్డేట్ చేయబడిన mRNA Moderna 2 డోసులు వేయించాలని సిఫార్సు చేస్తున్నారు.
  • గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న 6 నెలలు – 4 ఏళ్ల పిల్లలకు అప్‌డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ 1 లేదా 2 డోసులు వేయించాలని సిఫార్సు చేస్తున్నారు (ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలి, ఎన్ని డోసులు వేయించుకోవాలనేది గతంలో తీసుకున్న COVID-19 వ్యాక్సిన్ మీద ఆధారపడి ఉంటుంది).
  • గతంలో వేయించుకున్న వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా, 5 ఏళ్లు ఆపైబడిన ఎవరైనా COVID-19 వ్యాక్సిన్ చివరి డోసు వేయించుకున్న కనీసం 2 నెలల తర్వాత, అప్‌డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ 1 డోసు వేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.
  • గతంలో COVID-19 వ్యాక్సిన్ వేయించుకున్న 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు (మరియు ఇటీవల అప్‌డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ ఇప్పటివరకు వేయించుకోని వారు) చివరిసారిగా COVID-19 వ్యాక్సిన్ డోసు తీసుకున్న కనీసం 2 నెలలు తర్వాత 2023-2024 Novavax COVID-19 వ్యాక్సిన్ 1 డోసును అనుబంధంగా వేయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.
  • వ్యాక్సిన్ వేయించుకోని 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు 2023-2024 Novavax COVID-19 వ్యాక్సిన్ 2 డోసులను 3 వారాల విరామంతో అనుబంధంగా వేయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.

నేను కొవిడ్-19 వ్యాక్సిన్ పొందడానికి ఏమి తెలుసుకోవాలి?

నేను వ్యాక్సిన్ ఎలా పొందగలను?

అపాయింట్​మెంట్ కొనుగొనడానికి మరియు షెడ్యూల్ చేయడానికి వ్యాక్సిన్ లొకేటర్​ని సందర్శించండి.

మీకు దగ్గరల్లోని వ్యాక్సిన్ లొకేషన్​ల కొరకు మీ జిప్ కోడ్​ని 438-829 (GET VAX)కు కూడా టెక్ట్స్ చేయవచ్చు.

COVID-19 వ్యాక్సిన్‌లను డబ్బుపెట్టి కొనాలా?

COVID-19 మహమ్మారి సమయంలో, US ఫెడరల్ ప్రభుత్వం అన్ని రకాల COVID-19 వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసి, వాటిని కావాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించింది. ప్రస్తుతం, COVID-19 ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ముగిసిపోయింది కాబట్టి, ఇతర వ్యాక్సిన్‌ల విషయంలో అనుసరిస్తున్న విధానాన్నే COVID-19 వ్యాక్సిన్‌ల విషయంలోనూ అనుసరించే ఆలోచనలో ఉన్నారు. అంటే, వయోజనుల కోసం ఆ వ్యాక్సిన్లను క్లినిక్‌లు మరియు ఆసుపత్రులు నేరుగా కొనుగోలు చేస్తాయి. COVID-19 వ్యాక్సిన్‌లు ఇప్పటికీ అందుబాటులోనే ఉంటాయి. కొంతమంది వయోజనులైతే వాటిని డబ్బుపెట్టి కానాల్సి రావచ్చు.

ఇతర వ్యాక్సిన్లలాగే, COVID-19 వ్యాక్సిన్లు కూడా చాలావరకు ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ద్వారా కవర్ చేయబడతాయి. పిల్లల కోసం వ్యాక్సిన్లు (ఇంగ్లీషులో మాత్రమే) కార్యక్రమం ద్వారా, వాషింగ్టన్ రాష్ట్రంలోని పిల్లలందరికీ వారి 19వ పుట్టినరోజు వరకు COVID-19 వ్యాక్సిన్లను ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. వయోజనులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లేదా వారి ప్లాన్‌లో వ్యాక్సిన్‌కు కవరేజీ లేకపోతే, వ్యాక్సిన్లు వేయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించడానికి సహాయపడే కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు గురించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి, HHS.gov (ఇంగ్లీషు మాత్రమే) చూడండి.

ఫెడరల్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వ్యాక్సిన్‌లు సరఫరాలో ఉన్నంత కాలం, COVID-19 వ్యాక్సిన్‌లు అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.

Bridge Access Program అంటే ఏమిటి?

Bridge Access Program (బ్రిడ్జ్ యాక్సెస్ ప్రోగ్రామ్) అనేది ఆరోగ్య బీమా లేని 19 ఏళ్లు ఆపైబడినవారికి మరియు COVID-19 ఖర్చులను కవర్ చేయని ఇన్సూరెన్స్ కలిగిన వయోజనులకు అప్‌డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్లను ఎలాంటి ఖర్చు లేకుండా డిసెంబర్ 2024 వరకు ఉచితంగా అందిస్తుంది.  ఈ కార్యక్రమంలో భాగం వహిస్తున్న ఫార్మసీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, www.Vaccines.gov (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)ని సందర్శించండి.

Bridge Access Program అంటే ఏమిటి? లేదా నాకు ఇన్సూరెన్స్ లేకపోయినప్పటికీ, నాకు COVID-19 వ్యాక్సిన్ దొరుకుతుందా?

CDC ద్వారా, COVID-19 వ్యాక్సిన్లు మరియు చికిత్సలు అందించే Bridge Access Program గురించి Health and Human Services (HHS) గత వారం ప్రకటించింది. బీమా సౌకర్యం లేని లక్షలాది అమెరికన్లకు COVID-19 వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులో ఉంచడానికి Bridge Access Programను ప్రారంభించారు. 25-30 మిలియన్ల వయోజనులకు ఈ కార్యక్రమం ఉచిత కవరేజీ అందిస్తుంది. వ్యాక్సిన్ల పంపిణీ అనేది ఇప్పుడు వాణిజ్య మార్కెట్‌కి మారిపోయిన నేపథ్యంలో, ఈ కార్యక్రమమే లేకపోతే COVID-19 వ్యాక్సిన్లు వాళ్లకు ఉచితంగా అందేది కాదు.

ప్రస్తుతం ఏ కొవిడ్-19 వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి?

U.S. Food and Drug Administration (FDA, పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా అత్యవసర ఉపయోగం లేదా పూర్తిగా మూడు వ్యాక్సిన్​లు ఆమోదించబడ్డాయి. ఈ వ్యాక్సిన్​లు ప్రస్తుతం Washington స్టేట్​లో అందించబడుతున్నాయి. CDC మీ కోసం సిఫార్సు చేసిన అత్యంత తాజా డోసును మీరు వేయించుకొనివుంటే, COVID-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి మీరు అప్ టు డేట్ ((ఇంగ్లీషు మరియు స్పానిష్ మాత్రమే) గా ఉన్నట్లు పరిగణిస్తారు.

Pfizer-BioNTech కొవిడ్-19 వ్యాక్సిన్ (Comirnaty):

6 నెలల నుండి 4 ఏళ్లవారికి ఇచ్చే Pfizer-BioNTech COVID-19 వ్యాక్సిన్ అనేది 3-డోసుల సిరీస్‌గా అందుబాటులో ఉంది. ఇందులో మొదటి 2 డోసులను 21 రోజుల విరామంతో ఇస్తారు. 2వ డోసు ఇచ్చిన కనీసం 8 వారాల తర్వాత 3వ డోసు ఇస్తారు.

5 ఏళ్లు ఆపైబడినవాళ్లకు ఇచ్చే Pfizer-BioNTech COVID-19 వ్యాక్సిన్‌ను ఒక అప్‌డేట్ చేయబడిన 2023-2024 డోసుగా ఇస్తారు.

Moderna కొవిడ్-19 వ్యాక్సిన్ (Spikevax):

6 నెలల-4 ఏళ్ల వారికి ఇచ్చే Moderna COVID-19 వ్యాక్సిన్‌ను 2-డోసుల సిరీస్‌గా ఇస్తారు, ఒక నెల విరామంతో ఇస్తారు.

5 ఏళ్లు ఆపైబడినవాళ్లకు ఇచ్చే Moderna COVID-19 వ్యాక్సిన్‌ను ఒక అప్‌డేట్ చేయబడిన 2023-2024 డోసుగా ఇస్తారు.

Novavax కోవిడ్-19 వ్యాక్సిన్:

గతంలో COVID-19 వ్యాక్సిన్ వేయించుకున్న 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు (మరియు ఇటీవల అప్‌డేట్ చేయబడిన mRNA COVID-19 వ్యాక్సిన్ ఇప్పటివరకు వేయించుకోని వారు) చివరిసారిగా COVID-19 వ్యాక్సిన్ డోసు తీసుకున్న కనీసం 2 నెలలు తర్వాత 2023-2024 Novavax COVID-19 వ్యాక్సిన్ 1 డోసును అనుబంధంగా వేయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.

వ్యాక్సిన్ వేయించుకోని 12 ఏళ్లు ఆపైబడినవాళ్లు 2023-2024 Novavax COVID-19 వ్యాక్సిన్ 2 డోసులను 3 వారాల విరామంతో అనుబంధంగా వేయించుకోవడం గురించి ఆలోచించవచ్చు.

నేను గర్భవతిని, పాలిస్తున్నాను లేదా గర్భవతి కావాలని ప్లాన్ చేసినట్లయితే, కోవిడ్-19 వ్యాక్సిన్ ని పొందవచ్చా?

అవును, గర్భధారణ సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్​లు సురక్షితమైనవని డేటా చూపుతోంది. Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) (ఇంగ్లిష్ మాత్రమే), American College of Obstetricians and Gynecologists (ACOG- అమెరిక్ కాలేజీఆఫ్ అబ్​స్ట్రెటీషియన్​లు మరియు గైనకాలజిస్ట్​లు), మరియు Society for Maternal-Fetal Medicine (SMFM- సొసైటీ ఫర్ మెటర్నల్-ఫీటల్ మెడిసిన్) (ఇంగ్లిష్ మాత్రమే)లు గర్భవతులైన, పిల్లలకు పాలిచ్చే లేదా గర్భం ధరించాలని భావించే మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్​ని సిఫారసు చేస్తున్నారు. మీకు వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే, గర్భధారణ మరియు పాలివ్వడం ద్వారా మీ బిడ్డ కొవిడ్-19కు విరుద్ధంగా యాంటీబాడీలు కూడా పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోని గర్భవతులైన మహిళలకు నెలలు నిండకముందే బిడ్డ పుట్టడం లేదా మృతశిశువులు పుట్టడం వంటి తీవ్రమైన సంక్లిష్టతల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదనంగా, గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్-19 వచ్చిన మహిళలకు అడ్వాన్స్​డ్ లైఫ్ సపోర్ట్ మరియు బ్రీతింగ్ ట్యూబ్ అవసరం అయ్యే అవకాశం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి మరిన్ని వనరుల కొరకు, దయచేసి వన్ వ్యాక్స్, టూ లైవ్స్ వెబ్​సైట్​లో తాజా సమాచారాన్ని చూడండి.

    నేను రొటీన్ వ్యాక్సినేషన్లు పొందేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ని పొందవచ్చా?

    అవును. Advisory Committee on Immunization Practices (ACIP- ఇమ్యూనైజేషన్ విధానాలపై సలహా మండలి) మే 12, 2021 నాడు తన సిఫారసులను మార్చింది. మీరు ఇప్పుడు మీ ఇతర వ్యాక్సిన్​లను పొందే అదే సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్​ని పొందవచ్చు.

    మీరు మీ బిడ్డ కొరకు అవసరమైన స్కూలు వ్యాక్సినేషన్​లు (ఇంగ్లిష్ మాత్రమే) లేదా ఇతర సిఫారసు చేయబడ్డ వ్యాక్సిన్​లు కొవిడ్-19 వ్యాక్సినేషన్ నుంచి విడిగా షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్​మెంట్ మీ బిడ్డకు సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్​లను వేయించడానికి మరో అవకాశం.

    వ్యాక్సినేషన్ రికార్డ్ కార్డు అంటే ఏమిటి?

    మీరు కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న తరువాత మీరు పేపర్ వ్యాక్సినేషన్ కార్డు​ని పొందుతారు. మీరు ఏ రకం వ్యాక్సిన్ వేయించుకున్నారు (Comirnaty/Pfizer-BioNTech, Spikevax/Moderna, లేదా Johnson & Johnson) మరియు దానిని పొందిన తేదీని తెలియజేస్తుంది.

    మీరు అదనపు డోసు తీసుకుంటే, మీరు మీ అపాయింట్‌మెంట్ కోసం మీ వ్యాక్సిన్ రికార్డ్ కార్డు కూడా తీసుకెళ్లాలి. మీ డోసును మీ వ్యాక్సిన్ ప్రొవైడర్ నమోదు చేస్తారు.

    మీ వ్యాక్సిన్ కార్డ్​తో వ్యవహరించేటప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాలసిన కొన్ని ఉపయోగకరమైన సూచనలను ఇక్కడ ఇచ్చాము:

    • మోతాదుల మధ్య తరువాత మీ వ్యాక్సినేషన్ కార్డును ఉంచుకోండి
    • దాని డిజిటల్ కాపీని అందుబాటులో ఉంచుకోవడం కోసం మీ కార్డ్ ముందు, వెనుక భాగాల ఫోటోలను తీసుకుని ఉంచుకోండి.
    • తరువాత సులువుగా దానిని తిరిగి కనుగొనడానికి వీలుగా మీకు మీరే దానిని ఇమెయిల్ చేసుకోవడం, ఆల్బమ్​ను సృష్టించడం లేదా ఫోటోకు ట్యాగ్​ను జోడించడం లాంటి వాటిని పరిశీలించండి.
    • మీరు మీతోపాటూ దానిని తీసుకెళ్లాలనుకుంటే దాని ఫోటోకాపీని తీసుకువెళ్లండి.

    మీరు మీ వ్యాక్సినేషన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీ కొవిడ్-19 వ్యాక్సినేషన్ రికార్డ్​ని చూడటానికి, MyIR (My Immunization Registry)(నా ఇమ్యూనైజేషన్ రిజిస్ట్రీ)కు లాగిన్ అవ్వండి (ఇంగ్లిష్ మాత్రమే), తరువాత సమాచారాన్ని స్క్రీన్​షాట్ లేదా ఫోటో తీసుకోండి. మీకు అకౌంట్ లేనట్లయితే, మీరు ఏ సమయంలోనైనా MyIR కొరకు సైన్ అప్ చేయవచ్చు.

    MyIR ద్వారా తక్షణం రికార్డుల వెరిఫికేషన్ జరగకపోవచ్చని, యాక్సెస్ ప్రస్తుతం ఇంగ్లిష్ భాషకు మాత్రమే పరిమితం చేసిన విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. Department of Health COVID-19 (డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్ కొవిడ్-19) హాట్​లైన్ 833-VAX-HELP కు కాల్ చేయడం ద్వారా MyIRmobile లేదా వ్యాక్సినేషన్ రికార్డ్ ప్రశ్నలకు సాయం అందించడానికి లైవ్ టెలిఫోన్ సాయం లభ్యమవుతుంది లేదా waiisrecords@doh.wa.gov ద్వారా కూడా సంప్రదించవచ్చు.

    భద్రత మరియు సమర్ధత

    నేను కొవిడ్-19 వ్యాక్సిన్ని ఎందుకు వేయించుకోవాలి?

    కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం పూర్తిగా మీ ఎంపిక, అయితే ఈ మహమ్మారిని అంతమొందించడానికి సాధ్యమైనంత వరకు ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోవాలి. సమాజంలో చాలామంది-వ్యాక్సినేషన్ లేదా ఇటీవల సంక్రామ్యత ద్వారా రోగనిరోధక శక్తిని పొందితే కొవిడ్-19 వ్యాక్సిన్ వ్యాప్తి చెందడం కష్టం అవుతుంది. మన వ్యాక్సినేషన్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మన సంక్రామ్యత రేటు అంత తక్కువగా ఉంటుంది.

    కోవిడ్-19 వ్యాక్సిన్లు మిమ్మల్ని అనేక విధాలుగా రక్షించగలుగుతాయి:

    • మీకు కోవిడ్-19 వచ్చినా దాని వలన తీవ్రంగా జబ్బుపడే అవకాశాన్ని బాగా తగ్గిస్తాయి
    • పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీరు ఆసుపత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి మరియు కొవిడ్-19 నుంచి మరణించే మీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
    • వ్యాక్సినేషన్​లు సమాజంలో సంరక్షించే వ్యక్తుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందడాన్ని క్లిష్టతరం చేస్తుంది.
    • వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చేయడంలో వ్యాక్సిన్​కున్న సామర్థ్యం గురించి నిపుణులు తమ అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.

    మీరు పూర్తిగా వ్యాక్సిన్ను వేయించుకున్న తరువాత, సైతం మీకు కోవిడ్-19 సోకడం సాధ్యమే.

    వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు వైరస్ ఇంకా సోకవచ్చు, అది ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కొంతమంది వ్యక్తులు వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్​ని పొందలేరు, ఇది వారి కొవిడ్-19కు మరింత దుర్భలమైనవారిగా చేస్తుంది మీరు వ్యాక్సిన్ వేయించుకోనట్లయితే, కొవిడ్-19 వేరియెంట్ (ఇంగ్లిష్ మాత్రమే) వల్ల ఆసుపత్రిలో చేరడం లేదా మరణించేందుకు అధిక ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు మరియు మీ కుటుంబం, పొరుగువారు మరియు కమ్యూనిటీని సంరక్షించడానికి సాయపడుతుంది.

    వ్యాధి ఉన్న చాలామంది బ్రతుకుతుంటే నేను కొవిడ్-19 వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి?

    కొవిడ్-19 నుంచి మరణం మాత్రమే ప్రమాదంకాదు. కొవిడ్-19 వచ్చిన చాలామందికి కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. అయితే, వైరస్ అత్యంత అనూహ్యమైనది, కొన్ని కొవిడ్-19 వేరియెంట్​లు (ఇంగ్లిష్ మాత్రమే) మీకు నిజంగా అనారోగ్యానికి గురిచేసే అవకాశం ఎక్కువగా ఉందని మాకు తెలుసు. కొంతమంది వ్యక్తులు, ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు లేని యువత సైతం కొవిడ్-19 వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురికావొచ్చు లేదా మరణించవచ్చు. "కోవిడ్ లాంగ్-హాలర్స్" అని పిలిచే ఇతరులు నెలల తరబడి కొనసాగే లక్షణాలను కలిగి ఉండవచ్చు, ఇది వారి జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఇది కొత్త వైరస్ కనుక కొవిడ్-19 వల్ల కలిగే అన్ని దీర్ఘకాలిక ప్రభావాలు గురించి మనకు ఇంకా తెలియదు. వ్యాక్సిన్ వేయించుకోవడం వైరస్​కు విరుద్ధంగా మన అత్యుత్తమ రక్షణ. మీరు యువకులు మరియు ఆరోగ్యవంతులైనప్పటికీ, మీరు కొవిడ్-19 వ్యాక్సిన్​ని పొందాలి.

    కొవిడ్-19 వేరియెంట్ అంటే ఏమిటి?

    వైరస్​లు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందేటప్పుడు పరివర్తన చెందుతాయి(మార్పు). 'వేరియంట్' వైరస్ పరివర్తన చెందిన స్ట్రెయిన్. కొన్ని వేరియెంట్​లు కాలక్రమేణా అదృశ్యమవుతాయి, కొన్ని కమ్యూనిటీలలో వ్యాప్తి చెందుతూనే ఉంటాయి.

    ఆందోళన కలిగించే వైరస్ వేరియెంట్​లను Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) గుర్తిస్తుంది. ప్రస్తుతం, అనేక వేరియెంట్​లను ఆందోళనకరంగా ఉన్నాయి, ఎందుకంటే అవి మరింత వేగంగా మరియు తేలికగా వ్యాప్తి చెందుతూ, మరిన్ని కొవిడ్-19 సంక్రామ్యతలను కలిగిస్తున్నాయి.

    వ్యాక్సిన్లు సురక్షితమైనవి అని మనకు ఎలా తెలుస్తుంది?

    సిఫారసు చేసిన అన్ని మోతాదులను పొందడం ముఖ్యం, తద్వారా వేరియెంట్​ల నుంచి మీరు గరిష్ట సంరక్షణను పొందుతారు. కొవిడ్-19 వ్యాక్సిన్​లు సురక్షితమైనవి అని ధృవీకరించడానికి, వ్యాక్సిన్ భద్రతను మానిటర్ చేసే దేశ సామర్థ్యాన్ని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) విస్తరించింది మరియు బలోపేతం చేసింది. దీని ఫలితంగా, వ్యాక్సిన్ భద్రతా నిపుణులు కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో చూడని సమస్యలను మానిటర్ చేసి, గుర్తించగలరు.

    FDA ఒక వ్యాక్సిన్కు ఆమోదం తెలిపినట్లయితే దాని అర్ధం ఏమిటి?

    పూర్తి ఆమోదం కొరకు, FDA అత్యవసర ఉపయోగానికి అధికారం కొరకు ఎక్కువ కాలం పాటు డేటాను సమీక్షిస్తుంది. ఒక వ్యాక్సిన్​కు పూర్తి ఆమోదాన్ని ఇవ్వడానికి, డేటా అధిక స్థాయి భద్రత, సమర్థత మరియు వ్యాక్సిన్ తయారీలో నాణ్యతా నియంత్రణ యొక్క అత్యధిక స్థాయిలను ప్రదర్శించాలి.

    - అత్యవసర ఉపయోగ ఆథరైజేషన్ (EUA) పూర్తి లైసెన్స్ పొందడానికి ముందు ఒక ప్రొడక్ట్​ని అత్యవసర పరిస్థితిగా ప్రకటించినప్పుడు అందుబాటులోనికి తీసుకొని రావడానికి FDA అనుమతిస్తుంది. డేటా యొక్క దీర్ఘకాలిక విశ్లేషణకు ముందే ప్రజలు ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్​లను పొందేలా చూడటమే EUA ఉద్దేశ్యం. అయితే EUA ఇంకా చాలా తక్కువ సమయంలో—క్లినికల్ డేటాను చాలా క్షుణ్నంగా సమీక్షించాల్సి ఉంటుంది. FDA మంజూరు చేయబడ్డ ఏదైనా EUA తదుపరి Western States Pact (వెస్ట్రన్ స్టేట్స్ ప్యాక్ట్) (ఇంగ్లిష్ మాత్రమే)లో భాగంగా, సైంటిఫిక్ రివ్యూ వర్క్ గ్రూపు ద్వారా నిశితంగా మరియు కీలకంగా పరీక్షించబడుతుంది.

    Western States Pact అంటే ఏమిటి?

    పని చేస్తున్న ఈ గుంపువాళ్లు వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి మరికొంతమంది నిపుణుల అభిప్రాయాన్ని అందించారు. ఆ ప్యానెల్​లో అన్ని సభ్య రాష్ట్రాలు నియమించిన నిపుణులు, మరియు ఇమ్యూనైజేషన్ మరియు ప్రజారోగ్యంలో నైపుణ్యం ఉన్నట్లు దేశవ్యాప్తంగా గుర్తించబడిన శాస్త్రవేత్తలు ఉన్నారు. COVID-19ను ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సమయంలో, పశ్చిమ రాష్ట్రాలతో సన్నిహిత సమన్వయంతో మరియు సహకారంతో పనిచేయడం కోసం, ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 4 వ్యాక్సిన్‌లకు సంబంధించిన సమాఖ్య సమీక్షలతో పాటు బహిరంగంగా అందుబాటులో ఉన్న మొత్తం డేటాను ఈ ప్యానెల్ సమీక్షించింది. మహమ్మారి విషయంలో మనం కోలుకునే ఒక కొత్త దశలోకి వెళ్తున్న నేపథ్యంలో, Western States Pact (పాశ్చాత్య రాష్ట్రాల ఒప్పందం) రద్దు చేయబడింది మరియు పశ్చిమ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించిన అనుమతులన్నీ ఇప్పటి నుండి Food and Drug Administration (FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) నుండి వస్తాయి, వ్యాక్సిన్ సిఫార్సులు Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) నుండి వస్తాయి.

    Western States Scientific Safety Review Workgroup (వెస్ట్రన్ సైంటిఫిక్ సేఫ్టీ రివ్యూ వర్క్​గ్రూప్) కనుగొన్న విషయాలను చదవండి:

    వాషింగ్టన్లో మనం కోవిడ్-19 వ్యాక్సిన్ను ఎప్పుడు పొందుతాం?

    వ్యాక్సిన్​లో మీ శరీరంలో ఎలా పనిచేస్తాయనే దానిపై (ఇంగ్లిష్) ఈ వీడియోని చూడండి.

    mRNA వ్యాక్సిన్​లు (Pfizer మరియు Moderna కొవిడ్-19 వ్యాక్సిన్​లు)

    అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్​లను మెసెంజర్ RNA (mRNA) వ్యాక్సిన్​లు అని అంటారు.

    mRNA వ్యాక్సిన్​లు నిరపాయకరమైన కరోనావైరస్ ప్రోటీన్ తునకను ఎలా తయారు చేయాలో మీ కణాలకు నేర్పుతాయి. మీ రోగ నిరోధక వ్యవస్థ ఈ ప్రొటీన్ మీ శరీరానికి సంబంధించినది కాదని గుర్తిస్తుంది, దీంతో మీ శరీరం యాంటీబాడీలను తయారుచేయడం ప్రారంభిస్తుంది. ఈ యాంటీబాడీలు భవిష్యత్తులో మీకు కోవిడ్-19 సోకినట్లయితే దానితో ఎలా పోరాడాలో గుర్తుంచుకుంటాయి. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు, మీరు కోవిడ్-19 వలన జబ్బుపడకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ఒకసారి అది తన పనిని పూర్తి చేసిన తరువాత, mRNA త్వరగా విచ్ఛిన్నమవుతుంది, కొన్నిరోజుల తరువాత శరీరం దానిని బయటకు పంపుతుంది.

    ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్లు (Novavax COVID-19 వ్యాక్సిన్)

    Food and Drug Administration (FDA, ఆహార, ఔషధ నిర్వహణ) అధికార ఆమోదం ఇచ్చిన COVID -19 వ్యాక్సిన్లలో ఒకటి ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్. ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్లలో COVID-19కు కారణమయ్యే వైరస్ (ప్రోటీన్లు) భాగాలతోపాటు (లైవ్ వైరస్ ఉపయోగించకుండా తయారు చేయబడతాయి) శరీరంలో వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేసేలా సహాయపడడానికి కొన్ని పదార్థాలు కలుపుతారు. ఒక్కసారి స్పైక్ ప్రోటీన్‌కు ఎలా ప్రతిస్పందించాలో మీ రోగనిరోధక వ్యవస్థ తెలుసుకున్నాక, అది వాస్తవ వైరస్‌కు త్వరగా ప్రతిస్పందించి COVID-19 నుండి మిమ్మల్ని రక్షించగలుగుతుంది. సబ్‌యూనిట్ వ్యాక్సిన్ల వల్ల COVID-19కు కారణమయ్యే వైరస్‌వల్ల వచ్చే అంటువ్యాధి రాదు మరియు అది మన DNA మీద పనిచేయదు.

    అందుబాటులో ఉన్న వైరల్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్ 2 మోతాదుల వ్యాక్సిన్. సాధారణంగా 2వ మోతాదు తీసుకున్న తర్వాత దాదాపు 2 వారాల్లో వ్యాక్సిన్ వల్ల వచ్చే పూర్తి రక్షణ లభిస్తుంది.

    వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కొన్ని సందర్భాలలో కొద్దిగా జ్వరం లేదా జలుబు వంటి లక్షణాలు కనిపించవచ్చు, అయితే ఇవి హానికరమైవవి కావు.

    మరింత సమాచారం కొరకు. ఈ వనరులను చూడండి: కొవిడ్-19 వ్యాక్సిన్​ల స్నాప్​షాట్ మరియు కొవిడ్-19 వ్యాక్సిన్​లు: తెలుసుకోవలసినది ఏమిటి.

    సంఘంలో తగినంత మంది ప్రజలు కరోనా వైరస్తో పోరాడగలిగినప్పుడు, అది ఎక్కడికీ వెళ్ళలేదు. దీని అర్థం మనం వ్యాప్తిని త్వరగా ఆపి, ఈ మహమ్మారిని అంతం చేయడానికి కొంచెం దగ్గరగా ఉండగలము.

    కొవిడ్-19 వ్యాక్సిన్లను ఎలా తయారు చేస్తారు?

    ఈ చిన్నవీడియో కొవిడ్ వ్యాక్సిన్​లు ఎలా తయారు చేయబడతాయనే దానిని (ఇంగ్లిష్) వివరిస్తుంది.

    mRNA వ్యాక్సిన్ అంటే ఏమిటి?

    మెసెంజర్ RNA, లేదా mRNA వ్యాక్సిన్ అనేది ఒక కొత్తరకం వ్యాక్సిన్. mRNA వ్యాక్సిన్​లు ‘‘స్పైక్ ప్రోటీన్'' యొక్క హానికరం కాని బాగాన్ని ఎలా తయారు చేయాలని మీ కణాలను బోధిస్తాయి. స్పైక్ ప్రోటీన్​నే కరోనావైరస్ యొక్క ఉపరితలంపై మీరు చూస్తారు. ప్రోటీన్ అక్కడకు సంబంధించినది కాదు అని మీ రోగనిరోధక వ్యవస్త చూస్తుంది మరియు మీ శరీరం రోగనిరోధక ప్రతిస్పందన నిర్మించడాన్ని ప్రారంభించి, యాంటీబాడీస్​ని తయారు చేస్తుంది. ఇది మనకు కొవిడ్-19 సంక్రామ్యత ‘‘సహజం''గా వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో అలానే ఉంటుంది. ఒకసారి అది తన పనిని పూర్తి చేసిన తరువాత, mRNA త్వరగా విచ్ఛిన్నమవుతుంది, కొన్నిరోజుల తరువాత శరీరం దానిని బయటకు పంపుతుంది.

    మనం గతంలో ఇతర రకాలైన వైద్య మరియు పశు సంరక్షణ కొరకు mRNAని మనం ఉపయోగించినప్పటికీ, ఈ విధానాన్ని ఉపయోగించి వ్యాక్సిన్​లను సృష్టించడం అనేది సైన్స్​లో భారీ ముందడుగు మరియు భవిష్యత్తు వ్యాక్సిన్​లను మరింత సులభంగా సృష్టించడానికి దోహదపడవచ్చు.

    mRNA వ్యాక్సిన్​లు ఎలా పనిచేస్తాయనే దాని గురించి CDC వెబ్​సైట్​లో (ఇంగ్లిష్) మీరు మరింత చదవవచ్చు.

    ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్ అంటే ఏమిటి?

    Food and Drug Administration (FDA, ఆహార, ఔషధ నిర్వహణ) అధికార ఆమోదం ఇచ్చిన COVID -19 వ్యాక్సిన్లలో ఒకటి ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్. ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్లలో COVID-19కు కారణమయ్యే వైరస్ (ప్రోటీన్లు) భాగాలతోపాటు (లైవ్ వైరస్ ఉపయోగించకుండా తయారు చేయబడతాయి) శరీరంలో వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేసేలా సహాయపడడానికి కొన్ని పదార్థాలు కలుపుతారు. ఒక్కసారి స్పైక్ ప్రోటీన్‌కు ఎలా ప్రతిస్పందించాలో మీ రోగనిరోధక వ్యవస్థ తెలుసుకున్నాక, అది వాస్తవ వైరస్‌కు త్వరగా ప్రతిస్పందించి COVID-19 నుండి మిమ్మల్ని రక్షించగలుగుతుంది. సబ్‌యూనిట్ వ్యాక్సిన్ల వల్ల COVID-19కు కారణమయ్యే వైరస్‌వల్ల వచ్చే అంటువ్యాధి రాదు మరియు అది మన DNA మీద పనిచేయదు.

    "సహాయక ఔషధము" అంటే ఏమిటి?

    Novavaxలోని సహాయక ఔషధాన్ని (అడ్జువెంట్) శరీర రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్లో కలుపుతారు.

    వ్యాక్సిన్లో ఎటువంటి పదార్దాలుంటాయి?

    కొవిడ్-19 వ్యాక్సిన్​ల్లోని పదార్ధాలు వ్యాక్సిన్​ల కొరకు అత్యంత సాధారణమైనవి. వాటిలో mRNA లేదా మాడిఫైడ్ అడెనోవైరస్ క్రియాశీల పదార్థంతోపాటుగా క్రియాత్మక పదార్ధాన్ని సంరక్షించే కొవ్వు, లవణాలు మరియు చక్కెరలు వంటి ఇతర పదార్థాలు ఉంటాయి, శరీరంలో మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి, నిల్వ చేయడం మరియు రవాణా సమయంలో వ్యాక్సిన్​ని సంరక్షిస్తుంది.

    Novavax COVID-19 వ్యాక్సిన్ అనేది ప్రోటీన్ సబ్‌యూనిట్-ఆధారిత వ్యాక్సిన్, శరీరంలో వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పనిచేసేలా దీనిలో ఒక పదార్థంతోపాటు కొవ్వులు, చక్కెరలు కలుపుతారు. ఈ వ్యాక్సిన్ mRNAను ఉపయోగించదు.

    Pfizer, Moderna, Novavax మరియు Johnson and Johnson వ్యాక్సిన్​ల్లో మానవకణాలు (పిండ కణాలతో సహా), కొవిడ్-19 వైరస్, లేటెక్స్, ప్రిజర్వేటివ్​లు, లేదా పంది ఉత్పత్తులు లేదా జెలిటిన్​తో సహా ఏవైనా జంతు ఉప ఉత్పత్తులు లేవు. వ్యాక్సిన్​లు గుడ్లలో పెంచలేదు మరియు ఏవైనా గుడ్ల ఉత్పత్తులు లేవు.

    పదార్ధాల గురించి మరింత సమాచారం కొరకు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా నుంచి ఈ Q&A; వెబ్​పేజీనిని చూడండి (ఇంగ్లిష్). మీరు పదార్ధాల పూర్తి జాబితాను Pfizer, (ఇంగ్లిష్ మాత్రమే) Moderna, (ఇంగ్లిష్ మాత్రమే) Novavax మరియు Johnson & Johnson (ఇంగ్లిష్ మాత్రమే) ఫ్యాక్ట్ షీట్​ల్లో చూడవచ్చు.

    కొవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుందా?

    వ్యాక్సిన్​లు ఇన్​ఫెర్టిలిటీ లేదా నపుంసకత్వానికి కారణమవుతాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యాక్సిన్ మీ శరీరంలోనికి ప్రవేశించిన తరువాత, ఇది కరోనా వైరస్​తో పోరాడేందుకు ప్రతిరోధకాలను సృష్టించేందుకు మీ రోగనిరోధక వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ ప్రక్రియ మీ పునరుత్పత్తి అవయవాలకు ఎలాంటి అంతరాయాన్ని కలిగించదు.

    Centers for Disease Control and Prevention (CDC) (ఇంగ్లిష్ మాత్రమే), American College of Obstetricians and Gynecologists (ACOG), (ఇంగ్లిష్), మరియు Society for Maternal-Fetal Medicine (SMFM) (ఇంగ్లిష్)లు గర్భవతులైన, పిల్లలకు పాలిచ్చే లేదా గర్భం ధరించాలని భావించే మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్​ని సిఫారసు చేస్తున్నారు. కొవిడ్-19కు విరుద్ధంగా వ్యాక్సిన్ వేయించుకున్న చాలామంది వ్యక్తులు అప్పటి నుంచి గర్భవతి అయ్యారు లేదా బిడ్డకు జన్మనిచ్చారు.

    కొవిడ్-19 వ్యాక్సిన్​లతో సహా ఏ వ్యాక్సిన్​లు కూడా పురుష సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తాయనే దానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ (అంటే., Pfizer-BioNTech లేదా Moderna) పొందిన 45 మంది ఆరోగ్యవంతులైన పురుషుల్లో ఇటీవల జరిపిన చిన్న గ్రూపు అధ్యయనం వ్యాక్సినేషన్​కు ముందు మరియు తరువాత పరిమాణం మరియు చలనం వంటి వీర్య లక్షణాల కొరకు పరిశీలించింది. వ్యాక్సినేషన్ తరువాత ఈ స్పెర్మ్ లక్షణాల్లో గణనీయమైన మార్పులను పరిశోధకులు కనుగొనలేదు.

    ఆరోగ్యవంతులైన పురుషుల్లో స్వల్పకాలానికి వీర్య ఉత్పత్తి తగ్గడం అనేది జ్వరం వల్ల కలిగే అస్వస్థతకు సంబంధించినది. జ్వరం అనేది కొవిడ్-19 వ్యాక్సినేషన్ తాత్కాలిక దుష్ప్రభావం అయినప్పటికీ, కొవిడ్- వ్యాక్సినేషన్ తరువాత వచ్చే జ్వరం వల్ల వీర్య ఉత్పత్తి ప్రభావితం అవుతుందనే దానికి ప్రస్తుతం ఎలాంటి రుజువు లేదు.

    మరింత సమాచారం కొరకు, బిడ్డ కావాలని కోరుకునే వ్యక్తుల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్​లపై సమాచారాన్ని (ఇంగ్లిష్ మాత్రమే) చూడండి. వ్యాక్సిన్​ల గురించిన వాస్తవాల కొరకు మీరు CDC కొవిడ్-19 వ్యాక్సిన్​ల వెబ్​పేజీ (ఇంగ్లిష్ మాత్రమే)ని కూడా చూడవచ్చు.

    వ్యాక్సిన్ పొందిన తరువాత ఎటువంటి రకాలైన లక్షణాలు సాధారణం?

    ఇతర రొటీన్ వ్యాక్సిన్​ల వలేనే చేయి నొప్పి, అలసట, తలనొప్పి మరియు కండరాల నొప్పి వంటి అత్యంత సాధారణ దుష్ప్రభావాలు.

    ఈ లక్షణాలు వ్యాక్సిన్ పనిచేస్తుందనే దానికి సంకేతం. Pfizer మరియు Moderna అధ్యయనాల్లో, వ్యాక్సిన్ పొందిన రెండు రోజుల్లోఈ దుష్ప్రభావాలు చాలా తరచుగా సంభవించాయి, ఇవి సుమారు ఒక రోజు కొనసాగాయి. 

    ఈ మూడు వ్యాక్సిన్​ల కొరకు, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు యువత కంటే దుష్ప్రభావాలను నివేదించే అవకాశం తక్కువగా ఉంది.

    మీరు ఆన్​లైన్ లేదా సోషల్ మీడియాలో దుష్ప్రభావాలకు సంబంధించిన కొన్ని పుకార్లను చూడవచ్చు. ఏదైనా ఒక దుష్ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఒక క్లెయిం చూసినట్లయితే, ఆ క్లెయిం మూలాన్ని తప్పకుండా ధృవీకరించుకోండి.

    కొవిడ్-19 వ్యాక్సిన్ పొందిన తరువాత నేను అస్వస్థతకు గురైనట్లయితే ఏమి జరుగుతుంది?

    ఇతర రొటీన్ వ్యాక్సిన్​ల వలేనే, కొవిడ్-19 వ్యాక్సిన్​ల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత చేయి నొప్పి, జ్వరం, తలనొప్పి, లేదా అలసట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇవి వ్యాక్సిన్ పనిచేస్తున్నదని తెలిపే సూచనలు. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత సంభావ్య దుష్ప్రభావాల గురించి మరింత తెలుసుకోండి.

    మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత అస్వస్థతకు గురైనట్లయితే, మీరు ప్రతికూల ఘటనను Vaccine Adverse Event Reporting System (VAERS, వ్యాక్సిన్ ప్రతికూల ఘటన రిపోర్టింగ్ సిస్టమ్​) (ఇంగ్లిష్ మాత్రమే) కు నివేదించాలి. "ప్రతికూల ఘటన” అనేది వ్యాక్సినేషన్ తరువాత చోటు చేసుకునే ఏదైనా ఆరోగ్య సమస్య లేదా దుష్ప్రభావం. VAERS గురించి మరింత సమాచారం కొరకు, "VAERS అంటే ఏమిటి?" అనే దాని గురించి కింద చూడండి

    VAERS అంటే ఏమిటి?

    VAERS అనేది Centers for Disease Control and Prevention (CDC) మరియు Food and Drug Administration (FDA) ద్వారా నడిపించే ముందస్తు హెచ్చరిక సిస్టమ్. వ్యాక్సిన్​కు సంబంధించి కాగల సమస్యలను గుర్తించడంలో VAERS సాయపడగలవు.

    ఎవరైనా (హెల్త్ కేర్ ప్రొవైడర్, రోగి, సంరక్షకుడు) సంభావ్య ప్రతికూల ఘటనల గురించి VAERS (ఇంగ్లిష్ మాత్రమే) కు నివేదించవచ్చు.

    సిస్టమ్​కు పరిమితులున్నాయి. VAERS నివేదించడం అనేది ప్రతిచర్య లేదా ఫలితం వైరస్ వల్ల కలిగిందని అర్ధం కాదు. వ్యాక్సినేషన్ ముందుగా జరిగిందని మాత్రమే దీని అర్థం.

    సంభావ్య సమస్యను పరిశోధించడానికి ట్రెండ్​లు లేదా కారణాలను గమనించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడటానికే VAERS ఏర్పాటు చేయబడింది. ఇది వ్యాక్సినేషన్ ధృవీకరించిన ఫలితాల జాబితా కాదు.

    మీరు VAERSకు నివేదించినప్పుడు, సంభావ్య ఆరోగ్య ఆందోళనలను గుర్తించడానికి మరియు వ్యాక్సిన్​లు సురక్షితమైనవి అని ధృవీకరించడానికి CDC మరియు FDA లకు మీరు సాయం చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనట్లయితే, వారు చర్య తీసుకుంటారు మరియు సంభావ్య సమస్యల గురించి ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్​లు వారు సమాచారం అందిస్తారు.

    నాకు కోవిడ్-19 వచ్చి ఉంటే నేను కోవిడ్-19 వ్యాక్సిన్ను వేయించుకోవచ్చా?

    అవును, కోవిడ్-19 వ్యాధి సోకినవారు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవాలని Advisory Committee on Immunization Practices (ACIP, ఇమ్యునైజేషన్ పద్ధతుల సలహా కమిటీ) సూచిస్తున్నది.

    మీరు కోవిడ్-19 సోకిన 90 రోజుల్లోగా మళ్లీ తిరిగి సోకడం అసాధారణమని డేటా తెలుపుతున్నది, కాబట్టి మీకు కొంత రక్షణ ఉండవచ్చు (సహజ రోగనిరోధక శక్తి అని అంటారు). అయితే, సహజ రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు.

    ప్రస్తుతం కొవిడ్-19 ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్ పొందడానికి వారు మెరుగ్గా భావించేంత వరకు మరియు వారి ఐసోలేషన్ పీరియడ్ ముగిసేంత వరకు వేచి ఉండాలి.

    ఇటీవల కోవిడ్-19కు ఎక్స్​పోజ్ అయిన వ్యక్తులను ఇతర వ్యక్తులకు దూరంగా సురక్షితంగా క్వారంటైన్​లో ఉంచగలిగితే, వారు తమ క్వారంటైన్ కాలం ముగిసే వరకు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వేచి ఉండాలి. వారి వలన ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటే, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి క్వారంటైన్ కాలంలోనే వారికి వ్యాక్సిన్​వేయవచ్చు.

    ఐసోలేషన్ మరియు క్వారంటైన్ మార్గదర్శకాల కొరకు దయచేసి మా కొవిడ్-19 కొరకు ఐసోలేషన్ మరియు క్వారంటైన్ పేజీని రిఫర్ చేయండి.

    గతంలో నాకు వ్యాక్పిన్కు అలర్జిక్ ప్రతిచర్య ఉన్నట్లయితే నేను కొవిడ్-19 వ్యాక్సిన్ని పొందగలనా?

    mRNA లేదా వైరల్ వెక్టార్ వ్యాక్సిన్, లేదా Pfizer-BioNTech/Comirnaty, (ఇంగ్లిష్ మాత్రమే) Moderna/Spikevax (ఇంగ్లిష్ మాత్రమే), Novavax కొవిడ్-19 వ్యాక్సిన్​ల్లో ఏదైనా పదార్ధానికి అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్యకు తెలిసిన చరిత్ర ఉన్న వ్యక్తులకు వ్యాక్సిన్​ని ఇవ్వరాదు.

    ఇతర వ్యాక్సిన్​లు లేదా ఇంజెక్ట్ చేయగల థెరపీలకు తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్య ఉండే వ్యక్తులు ఇంకా వ్యాక్సిన్​ని పొందగలుగుతారు. అయితే, ప్రొవైడర్​లు రిస్క్ మదింపు చేయాలి మరియు సంభావ్య ప్రమాదాల గురించి వారికి కౌన్సిల్ చేయాలి. ఒకవేళ ఒక రోగి వ్యాక్సిన్ పొందాలని నిర్ణయించుకున్నట్లయితే, ఏవైనా తక్షణ ప్రతిచర్యల కొరకు ప్రొవైడర్ వారిని 30 నిమిషాలపాటు గమనించాలి.

    అలర్జీ ప్రతిచర్యలను మానిటర్ చేయడానికి వ్యాక్సిన్ అందుకున్న రోగులందరినీ కనీసం 15 నిమిషాలపాటు ప్రొవైడర్​లు గమనించాలని Advisory Committee on Immunization Practices (ACIP) సిఫారసు చేస్తుంది. మరింత సమాచారం కొరకు ACIP యొక్క mRNA వ్యాక్సిన్​ల కొరకు మధ్యంతర క్లినికల్ పరిగణనలు (ఇంగ్లిష్) చూడండి.

    స్కూలు మరియు శిశు సంరక్షణ

    18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వ్యాక్సిన్ పొందగలరా?

    ప్రస్తుతానికి, 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వడానికి Pfizer-BioNTech (Pfizer) వ్యాక్సిన్, Moderna COVID-19 వ్యాక్సిన్ బ్రాంఢ్లకు అనుమతి ఉంది. 12 ఏళ్లు ఆపై వయసువాళ్ల కోసం Emergency Use Authorization (EUA, అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడినది) కింద Novavax వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

    17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, చట్టబద్ధంగా విముక్తి పొందనట్లయితే పేరెంట్ లేదా గార్డియన్ నుంచి సమ్మతి అవసరం కావొచ్చు (ఇంగ్లిష్ మాత్రమే). మరింత సమాచారం కొరకు Vaccinating Youth (యువతకు వ్యాక్సిన్ వేయడం) పై మా వెబ్​పేజీని సందర్శించండి.

    తల్లిదండ్రుల సమ్మతి లేదా చట్టపరంగా విముక్తి పొందినట్లుగా రుజువు చూపించడానికి వారి ఆవశ్యకతల గురించి వ్యాక్సిన్ క్లినిక్​ని చెక్ చేయండి.

    రాష్ట్రంలో K-12 స్కూలు ఎంట్రీ కొరకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ అవసరమా?

    K-12 స్కూల్స్‌లో Revised Code of Washington (RCW, సవరించిన వాషింగ్టన్ కోడ్) 28A.210.140, పిల్లల కొరకు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతలను రూపొందించడానికి Department of Health (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) కాకుండా, Washington State Board of Health (వాషింగ్టన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్) బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం కొవిడ్-19 కొరకు స్కూలు లేదా చైల్డ్‌కేర్‌కు ఎలాంటి ఆవశ్యకత లేదు.

    నా బిడ్డ తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ని పొందేటప్పుడు ఇతర ఇమ్యూనైజేషన్లను పొందవచ్చా?

    వ్యక్తులు ఇప్పుడు అదే రోజుతో సహా ఇతర వ్యాక్సిన్​లు వేయించుకున్న 14 రోజుల్లోగా కోవిడ్-19 వ్యాక్సిన్ పొందవచ్చు.

    కొవిడ్-19 మహమ్మారి సమయంలో 2023-2024 విద్యా సంవత్సరం కొరకు స్కూలు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతల్లో ఏదైనా సరళత్వం ఉన్నదా?

    స్కూలు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతల్లో ఏవైనా మార్పులు చేపట్టాలా అని స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం, స్కూలు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతలు అలానే ఉంటాయి. పిల్లలు వారు స్కూల్లో మొదటి రోజు హాజరు కావడానికి ముందు వ్యాక్సినేషన్ ఆవశ్యకతలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత జీవితం

    COVID-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి అప్ టు డేట్‌గా ఉన్నట్లు నన్ను ఎప్పుడు పరిగణిస్తారు?

    CDC మీ కోసం సిఫార్సు చేసిన అత్యంత తాజా డోసును మీరు వేయించుకొనివుంటే, COVID-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి మీరు అప్ టు డేట్ ((ఇంగ్లీషు మరియు స్పానిష్ మాత్రమే) గా ఉన్నట్లు పరిగణిస్తారు.

    నేను వ్యాక్సినేషన్కు రుజువును చూపించాలా?

    నిర్ధిష్ట ప్రాంతాలు, బిజినెస్లు లేదా నిర్ధిష్ట ఈవెంట్ల్లో మీరు కొవిడ్-19కు విరుద్ధంగా పూర్తిగా వ్యాక్సిన్లు పొందినట్లుగా రుజువు చేయాల్సి రావొచ్చు.

    అందువల్ల మీ వ్యాక్సినేషన్ పేపర్ కార్డును బర్త్ సర్టిఫికేట్ లేదా ఇతర అధికారిక డాక్యుమెంట్ వలే పరిగణించండి! దాని ఫోటో తీసుకొని, దానిని ఇంటి వద్ద భద్రపరచండి. వ్యాక్సినేషన్ కార్డులు మరియు ఇమ్యూనైజేషన్ రికార్డుల గురించి మరింత చదవండి.

    నా కొవిడ్-19 వ్యాక్సిన్​లు నేను అప్ టూ డేట్​గా లేనట్లయితే ఏమి జరుగుతుంది?

    మీరు మీ కొవిడ్-19 వ్యాక్సిన్​లను అప్ టూ డేట్​గా పొందనట్లయితే:

    • మీకు దగ్గరల్లో ఉన్న ఎలాంటి ఖర్చు లేని కొవిడ్-19 వ్యాక్సిన్​ని కనుగొనండి!
    • పరిగణనలోకి జనసమ్మర్థంగా బహిరంగ ఇండోర్ ప్రదేశాల్లో బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించడాన్ని పరిగణించాలి.
    • మీకు రోగలక్షణాలు కనిపిస్తే, కొవిడ్-19 కొరకు టెస్ట్ చేయించుకోవాలి
    • మీరు ప్రయాణిస్తుంటే, ప్రయాణానికి ముందు మరియు తరువాత కొవిడ్-19 కొరకు టెస్ట్ చేయించుకోండి.
    నేను వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా కొవిడ్-19 వల్ల అస్వస్థతకు గురవుతానా?

    వ్యాక్సిన్​లు చాలా సమర్థవంతమైనవి, అయితే 100% కాదు. మీకు కొవిడ్-19-లాంటి లక్షణాలు (ఇంగ్లిష్ మాత్రమే) ఉన్నట్లయితే,మీరు ఇతరుల నుంచి దూరంగా ఉండాలి మరియు హెల్త్ కేర్ ప్రొవైడర్​ని సంప్రదించాలి. వారికి కొవిడ్-19 టెస్ట్ సిఫారసు చేయవచ్చు.

    కొవిడ్-19 టెస్టింగ్ సమాచారం కొరకు, దయచేసి టెస్టింగ్ సమాచారం.

    నేను వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొవిడ్-19ని వ్యాప్తి చెందిస్తానా?

    పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకొని, వారి బూస్టర్ షాట్ని పొందినవారిలో అతి తక్కువ మందికి సంక్రమించవచ్చు. అయితే, వారి కొవిడ్-19 వ్యాక్సిన్లకు అప్ టూ డేట్గా ఉండి, కొవిడ్-19 సంక్రమించిన వ్యక్తులు వైరస్ని ఇతరులకు వ్యాప్తి చెందించవచ్చు.

    నేను కొవిడ్-19కు ఎక్స్పోజ్ అయితే నేను ఏమి చేయాలి?

    ఐసోలేషన్ మరియు క్వారంటైన్ మార్గదర్శకాల కొరకు దయచేసి మా కొవిడ్-19 కొరకు ఐసోలేషన్ మరియు క్వారంటైన్ పేజీని రిఫర్ చేయండి.

    కొవిడ్-19కు సంబంధించిన ఒత్తిడి లేదా ఆతురతను నేను ఏవిధంగా నిర్వహించగలను?

    ఈ మహమ్మారి మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించగలదు అని మేం అర్ధం చేసుకున్నాం. మీరు ఒంటరిగా లేరు వాషింగ్టన్​లోని చాలామంది వ్యక్తులు ఆర్థిక, ఉద్యోగ విపత్తులు, పాఠశాల మూసివేతలు, సామాజిక ఒ౦టరితన౦, ఆరోగ్య సమస్యలు, దుఃఖ౦, నష్ట౦ వ౦టి వాటి వల్ల ఒత్తిడి, ఆ౦దోళన ఎదుర్కొంటున్నారు. దీనిలో పబ్లిక్ కార్యకాలపాలకు తిరిగి రావడం వల్ల కలిగే ఆతురత జోడించబడి ఉంటుంది.

    మీ ఒత్తిడి మరియు ఆతురతను నిర్వహించడంలో సాయపడగల కొన్ని వనరులు ఇవిగో:

    అదనపు వనరులు మరియు సమాచారం

    నిర్ధిష్ట గ్రూపుల కొరకు కొవిడ్-19 వనరులు

    పిల్లలు మరియు యువత

    తల్లిపాలు ఇవ్వడం మరియు/లేదా గర్భవతులైన మహిళలు

    ఇమిగ్రెంట్​లు మరియు రెఫ్యూజీలు

    ఇంటి వద్దనే ఉండటం

    అదనపు కమ్యూనిటీ నిర్ధిష్ట వనరులను వ్యాక్సిన్ సమానత్వం మరియు నిమగ్నతా పేజీలో కనుగొనవచ్చు (ఇంగ్లిష్ మాత్రమే)

    నా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇవ్వలేదు. నేను మరింత సమాచారాన్ని ఎక్కడ పొందగలను?

    సాధారణ ప్రశ్నలను covid.vaccine@doh.wa.govకు పంపవచ్చు.