WA Notify (డబ్ల్యూ. ఎ. నోటిఫై) (వాషింగ్టన్ ఎక్స్పోజర్ నోటిఫికేషన్లు అని కూడా పిలుస్తారు) అనేది ఒక ఉచిత ఉపకరణం. COVID-19కి ఎక్సపోజ్ అయ్యే అవకాశం ఉన్న యూజర్లను అప్రమత్తం చేయడానికి దీనిని మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు జోడించవచ్చు. ఇది పూర్తిగా రహస్యంగా ఉంచుతుంది, ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు లేదా పంచుకోదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ట్రాక్ చేయదు.
నేను నా పోన్‌కు WA Notify ని ఎలా జోడించాలి?

iPhoneలోని, సెట్టింగ్లలో ఉన్న ఎక్స్పోజర్ నోటిఫికేషన్స్‌ను అనుమతించండి:
- Settings (సెట్టింగ్లు)కు వెళ్ళండి
- Exposure Notifications వరకు కిందకు స్క్రోల్ చేయండి
- “Exposure Notifications ఆన్ చేయండి” మీద క్లిక్ చేయండి
- United States (యునైటెడ్ స్టేట్స్ను) ఎంచుకోండి
- వాషింగ్టన్‌ను ఎంచుకోండి
Android లేదా iPhone కోసం, QR కోడ్ స్కాన్ చేయండి లేదా మీరు ఒక మొబైల్ పరికరం ఉపయోగిస్తుంటే, WA Notifyని మీ ఫోన్‌కు జోడించండి.

ఇది ఎలా పని చేస్తుంది?
మీరు WA Notifyని అనుమతించినప్పుడు, మీకు సమీపంలో ఉన్న వాళ్లు మీలాగే WA Notifyని అనుమతించివుంటే వాళ్ల ఫోన్లతో మీ ఫోన్ యాదృచ్ఛికమైన, రహస్య కోడ్లు మార్పిడి చేసుకుంటుంది. మీ గురించి ఎలాంటి సమాచారం వెల్లడించకుండానే ఈ కోడ్లు మార్పిడి చేయడానికి ప్రైవసీ-ప్రిజర్వింగ్ లో ఎనర్జీ బ్లూటూత్ టెక్నాలజీని ఈ సిస్టమ్ ఉపయోగిస్తుంది. ఇటీవల మీరు కలిసిన వేరొక WA Notify యూజర్‌కు ఆ తర్వాత COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలిందని అనుకుందాం. ఆయన పేరు ప్రకటించకుండా ఆ విషయాన్ని ఇతరులకు తెలియజేసే చర్యలను తీసుకుంటే, మీరు అలర్ట్ అందుకుంటారు. దీనివల్ల మీకు అవసరమైన చికిత్స వెంటనే అందుతుంది, మీరు మీ చుట్టుపక్కల వాళ్లకి COVID-19ను వ్యాపింపచేయకుండా నిరోధించగలుగుతారు.
సురక్షితమైన దూరంలో లేదా మిమ్మల్ని హెచ్చరించాల్సిన అవసరం లేని స్వల్పకాలిక ఘటన నుంచి కొవిడ్-19 వ్యాప్తి చెందే సంభావ్యత ఉండే ఘటనలు గుర్తించడానికి అల్గారిథమ్ గణనలు చేస్తుంది. WA Notify మీరు ఎక్స్ప్లోజ్ అయ్యే సంభావ్యత ఉన్నప్పుడు మాత్రమే అలర్ట్ చేస్తుంది. అందువల్ల అలర్ట్ అందుకోకపోవడం అనేది ఒక శుభవార్తే.
WA Notify అనేది 30కి పైగా భాషల్లో కూడా లభిస్తుంది.

నా గోప్యతను ఎలా పరిరక్షిస్తారు?
WA Notify అనేది Google Apple ఎక్స్పోజర్ నోటిఫికేషన్ టెక్నాలజీ ఆధారితమైనది, అది మీ గోప్యతను సంరక్షించేందుకు డిజైన్ చేయబడింది. ఇది మీరు ఉన్న స్థలాన్ని గానీ, వ్యక్తిగత డేటాను గానీ సేకరించకుండా లేదా వెల్లడించకుండా వెనక ఉండి పనిచేస్తుంది. WA Notify సమర్థంగా పనిచేయడానికి మీరు ఎవరు లేదా ఎక్కడ పనిచేస్తున్నారు లాంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం దానికి లేదు. ఇది బ్లూటూత్‌ను కేవలం కొద్దిసేపు మాత్రమే ఉపయోగిస్తుంది కాబట్టి, మీ బ్యాటరీ మీద భారం పడదు.
దీనిలో పాల్గొనడం పూర్తిగా స్వచ్చంధం. యూజర్లు ఎప్పుడైనా దీనిని ఎంచుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు. యూజర్ గోప్యత ఎలా పరిరక్షించబడుతుందనే దాని గురించిన మరింత సమాచారం కోసం, WA Notify గోప్యతా పాలసీ చూడండి.
టెక్ట్స్‌లు మరియు నోటిఫికేషన్లు ఎలా కనిపిస్తాయి?
మీరు రెండు రకాలైన నోటిఫికేషన్‌లను అందుకోవచ్చు. పాజిటివ్గా టెస్ట్ చేయబడినవారు ధృవీకరణ లింక్ టెక్ట్స్ సందేశం మరియు/లేదా పాప్-అప్ నోటిఫికేషన్ని అందుకుంటారు. ఎక్స్పోజ్ కాగల WA Notify యూజర్లు ఎక్స్ప్లోజర్ నోటిఫికేషన్ని అందుకుంటారు. ఈ నోటిఫికేషన్ల గురించి మరింత తెలుసుకోండి మరియు అవి ఎలా కనిపిస్తాయనేది చూడండి.
WA Notify ఎలా సహాయపడుతుంది?
ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్‌లను ఎంత ఎక్కువమంది ఉపయోగిస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. WA Notifyని ఉపయోగిస్తున్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నా అంటువ్యాధి సోకడం, మరణాలు తగ్గుతాయని వాషింగ్టన్ రాష్ట్రంలోని మూడు కౌంటీల్లో తీసుకున్న నమూనాలు చూపిస్తున్నాయి. మనం వ్యాక్సిన్ వేయించుకుని మాస్క్ ధరిస్తే, మనం ప్రాణాల్ని కాపాడవచ్చు. కార్యక్రమాలకు మనం వ్యక్తిగతంగా హాజరు కావడం మళ్లీ మొదలుపెట్టినప్పుడు, WA Notify అనేది అదనపు రక్షణ పొరగా ఉంటుంది. మీతోపాటు, మీ చుట్టూ ఉండేవాళ్లను కూడా సురక్షితంగా ఉంచడానికి ఇది మీరు చేయగల మరొక పని.
సొంతగా చేసుకున్న పరీక్షలో COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి
WA Notify యూజర్లు సెల్ఫ్-టెస్ట్ కిట్ (దీనినే ఇంటి వద్ద పరీక్షలు అని కూడా పిలుస్తారు) ఉపయోగించినప్పుడు COVID-19 పాజిటివ్ అని తేలితే, COVID-19కి ఎక్స్‌పోజ్ అయిన అవకాశముందని ఇతర WA Notify యూజర్లకు పేరు ప్రకటించకుండా తెలియజేయడానికి ధృవీకరణ కోడ్ కోసం అభ్యర్థించవచ్చు.

iPhoneలో:
- Settings(సెట్టింగ్లు)కు వెళ్లండి మరియు Exposure Notifications(ఎక్స్ప్లోజర్ నోటిఫికేషన్లు) ఓపెన్ చేయండి
- “Share a COVID-19 Diagnosis(కొవిడ్-19 డయగ్నాసిస్ని పంచుకోండి)” ఎంచుకోండి
- “Continue"ని (కొనసాగండి) ఎంచుకోండి.
- కోడ్ నమోదు చేయడానికి ఎంపిక కనిపిస్తే, “Didn’t get a code? Visit WA State Dept. of Health Website"ని (“కోడ్ అందుకోలేదా? వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ వెబ్సైట్ సందర్శించండి") ఎంచుకోండి మీ కోడ్ నమోదు చేయడానికి మీకు ఎంపిక కనిపించకపోతే, తదుపరి చర్యకు వెళ్లండి.
- WA Notify ఉపయోగించే మీ పరికరం ఫోన్ నెంబరు మరియు మీ పాజిటివ్ కొవిడ్-19 టెస్ట్ తేదీని నమోదు చేయండి.
- “Continue(కొనసాగండి)” ని ఎంచుకోండి

Android ఫోన్లో:
- WA Notify ఓపెన్ చేసి, “Share your test result to help stop the spread of COVID-19(కొవిడ్-19 వ్యాప్తిని ఆపడంలో సాయపడేందుకు మీ టెస్ట్ ఫలితాన్ని పంచుకోండి)” ని ఎంచుకోండి.
- “Continue(కొనసాగండి)” ఎంచుకోండి, తరువాత “I need a code(నాకు ఒక కోడ్ కావాలి)” ఎంచుకోండి
- WA Notify ఉపయోగించే మీ పరికరం ఫోన్ నెంబరు మరియు మీ పాజిటివ్ కొవిడ్-19 టెస్ట్ తేదీని నమోదు చేయండి.
- “Send Code(కోడ్ పంపండి)” ఎంచుకోండి
Android లేదా iPhone కోసం, QR కోడ్ స్కాన్ చేయండి లేదా మీరు ఒక మొబైల్ పరికరం ఉపయోగిస్తుంటే, ధృవీకరణ కోడ్ కోసం అభ్యర్థించండి.

మీ ధృవీకరణ లింక్‌తోపాటు మీరు పాప్ అప్ నోటిఫికేషన్ మరియు టెక్ట్స్ సందేశాన్ని అందుకుంటారు. ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం ఉందని ఇతర యూజర్లను మీ పేరు ప్రకటించకుండా అలర్ట్ చేసేలా WA Notifyలోని చర్యలను పాటించడానికి మీరు కేవలం నోటిఫికేషన్ని ట్యాప్ చేయాలి లేదా టెక్ట్స్ సందేశంలోని లింక్ మీద క్లిక్ చేయాలి.
మీరు WA Notify,లో ధృవీకరణ కోడ్‌ని అభ్యర్ధించలేకపోతే, మీరు స్టేట్ కొవిడ్-19 హాట్‌లైన్, 1-800-525-0127 కు కాల్ చేసి, తరువాత # ప్రెస్ చేయండి, మీరు WA Notify యూజర్ అని హాట్‌లైన్ సిబ్బందికి తెలియజేయండి. బహిర్గతం కాగల ఇతర WA Notify యూజర్లను అలర్ట్ చేయడానికి మీరు ఉపయోగించగల వెరిఫికేషన్ లింక్‌ని హాట్‌లైన్ సిబ్బంది మీకు అందించగలరు.
సొంతగా చేసుకున్న పరీక్షలో COVID-19 పాజిటివ్ అని తేలితే ఎలా నివేదించాలి
సెల్ఫ్-టెస్ట్ కిట్ (దీనినే ఇంటి వద్ద పరీక్షలు అని కూడా పిలుస్తారు) ఉపయోగించిన తర్వాత COVID-19 పాజిటివ్ అని తేలిన వ్యక్తులు వారి పాజిటివ్ ఫలితాలను WA Notify అప్లికేషన్‌కు వెలుపల Department of Health (DOH, ఆరోగ్య విభాగం)కు నివేదించవచ్చు. పాజిటివ్ పరీక్ష ఫలితాన్ని ఎలా నివేదించాలనే దాని గురించిన ప్రస్తుత నిర్దేశం కోసం, COVID-19 కోసం DOH పరీక్ష పేజీ చూడండి.
ఉచిత సెల్ఫ్-టెస్ట్ కిట్లు ఇక్కడ కూడా అందుబాటులో ఉంటాయి Say Yes! COVID Test (సే యస్! కోవిడ్ టెస్ట్).
అదనపు నిర్దేశాన్ని DOH వారి మీరు COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలితే ఏం చేయాలి లో చూడవచ్చు.
దయచేసి గమనించండి: WA Notify ఒక ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ టూల్. యూజర్లు వారి టెస్ట్ ఫలితాలను DOHకు నివేదించడానికి ఇది రూపొందించబడలేదు. ఫలితాలను DOHకు నివేదించడమనేది WA Notify అప్లికేషన్ సిస్టమ్‌కు వెలుపల చేయాలి.
కాంటాక్ట్‌లను కనిపెట్టడం, WA Notify రెండూ మనకు ఎందుకు అవసరం?
కాంటాక్ట్‌లను కనిపెట్టడం అనేది ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ఎన్నో దశాబ్దాలుగా ఉపయోగిస్తూ వచ్చిన ఒక సమర్థవంతమైన పద్ధతి. WA Notify ఈ పనిని బయటికి కనిపించకుండా మద్దతు ఇస్తుంది. ఒక ఉదాహరణ చూడండి: మీకు COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలితే, ప్రజారోగ్య శాఖ అధికారులు మీకు కాల్ చేసి, ఇటీవల మీతో సన్నిహితంగా ఉన్న వారి సమాచారాన్ని పంచుకోమని మిమ్మల్ని కోరవచ్చు. బస్సులో మీకు దగ్గరగా కూర్చున్న అపరిచిత వ్యక్తి పేరును మీరు చెప్పలేరు. మీరిద్దరూ WA Notify ఉపయోగిస్తున్నట్లయితే, బస్సులో ప్రయాణిస్తున్న ఆ అపరిచితుడిని ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం ఉందని మీ పేరు చెప్పకుండా అలర్ట్ చేసి ఆయన స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు COVID-19 వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, వ్యాక్సిన్లు, మాస్క్ ధరించడం రెండూ COVID-19 వ్యాప్తిని ఆపడానికి సహాయపడతాయి, రెండూ కలిస్తే అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.
WA Notifyని నేను ఉపయోగిస్తూనే ఉండాలా లేదా దానిని నేను ఇప్పుడు ఆఫ్ చేయవచ్చా?
ప్రతిఒక్కరూ వారి ఫోన్‌లో WA Notifyని యాక్టివ్ స్థితిలోనే ఉంచాలని, దానిని ఆఫ్ చేయకూడదని మేము ప్రోత్సహిస్తున్నాం. ఆంక్షలు సడలించబడి, కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పుడు, WA Notify అనేది మీతోపాటు సులువుగా తీసుకెళ్లగల ఒక అదనపు భద్రత ఏర్పాటు.
నేను వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, నాకు WA Notify అవసరమా?
అవును! వాషింగ్టన్ రాష్ట్రం మరికొంత కాలం COVID-19తో పోరాటం చేయాల్సి ఉంది. వ్యాక్సిన్‌లు ఎంతకాలం సమర్థవంతంగా పనిచేస్తాయి, కొత్త COVID-19 వేరియంట్‌ల నుండి వ్యాక్సిన్‌లు ఎంతవరకు రక్షణ అందిస్తాయి లాంటి చాలా విషయాలు మనం వైరస్‌లకు సంబంధించి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాము. వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లకి ప్రమాదం తక్కువే ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లకు కూడా COVID-19 వచ్చే అవకాశం, దాన్ని వ్యాపింపజేసే అవకాశం ఉందని మనకు తెలుసు. అలాగే, ఇప్పటికీ వ్యాక్సిన్ వేసుకోనివాళ్లు ఉన్నారని మనకు తెలుసు. ఈ కారణాలన్నిటిని బట్టి, COVID-19 వ్యాప్తిని అడ్డుకోవడంలో సహాయపడడం కోసం తమ ఫోన్లలో WA Notifyని యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా వాషింగ్టన్ నివాసులందరినీ ప్రోత్సహిస్తున్నాము.
WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) గురించి నోటి ప్రచారం చేయడం ద్వారా సాయపడాలని అనుకుంటున్నారా?
సోషల్ మీడియా మెసేజింగ్, పోస్టర్లు, శాంపుల్ రేడియో, టీవీ ప్రకటనలు మరియు మరికొన్నింటి కోసం మా WA Notify టూల్‌కిట్ చూడండి. అలాగే, మీ స్నేహితులకు, కుటుంబానికి చెప్పండి. ఎంత ఎక్కువమంది WA Notifyని ఉపయోగిస్తే, అంత ఎక్కువగా మిమ్మల్ని, మీ సమాజాన్ని రక్షించడంలో అది సహాయపడుతుంది.
ఇతర తరచుగా అడిగే ప్రశ్నలు
- WA Notifyలో నా ఎక్స్‌పోజర్ తేదీని ఎలా కనుగొనాలి?
-
iPhoneలో:
- Settingsకు (సెట్టింగ్లు) వెళ్ళండి
- Exposure Notifications (ఎక్స్పోజర్ నోటిఫికేషన్లు) ఎంచుకోండి లేదా సెర్చ్ బార్లో Exposure Notifications (ఎక్స్పోజర్ నోటిఫికేషన్లు) అని నమోదు చేయండి
- “You may have been exposed to COVID-19" (మీరు COVID-19కి ఎక్స్‌పోజ్ అయి ఉండవచ్చు) క్రింద మీరు బహుశా ఎక్స్‌పోజర్‌కి గురైన అంచనా తేదీ చూపబడుతుంది
Androidలో:
- WA Notify యాప్ ఓపెన్ చేయండి
- “Possible exposure reported" (బహుశా ఎక్స్‌పోజ్ అయినట్లు నివేదించబడింది) క్రింద See Details (వివరాలు చూడండి) ఎంచుకోండి
- “Possible Exposure Date" (బహుశా ఎక్స్‌పోజ్ అయినట్లు నివేదించబడింది) క్రింద మీరు బహుశా ఎక్స్‌పోజ్ అయిన అంచనా తేదీ చూపబడుతుంది
-
నేనుe Washington State Department of Health (DOH, వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) నుంచి ఒక నోటిఫికేషన్ మరియు/లేదా టెక్ట్స్‌ని అందుకున్నాను. ఎందుకు?
-
DOH కొవిడ్-19 కొరకు ఇటీవల పాజిటివ్గా టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి టెక్ట్స్ సందేశం మరియు/లేదా టాప్ అప్ నోటిఫికేషన్ని పంపుతుంది, తద్వారా WA Notify యూజర్లు సంభావ్య ఎక్స్ప్లోజర్ గురించి ఇతర యూజర్లను వేగంగా, అనామధేయంగా అలర్ట్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ల గురించి మరింత తెలుసుకోండి మరియు అవి ఎలా కనిపిస్తాయనేది చూడండి.
టెక్స్ట్ సందేశం, నోటిఫికేషన్ రెండిటినీ మీరు అందుకున్నట్లయితే, మీరు కేవలం నోటిఫికేషన్‌ను ట్యాప్ చేయాలి లేదా టెక్ట్స్ సందేశంలోని లింక్ మీద క్లిక్ చేసి, ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం ఉన్న ఇతర యూజర్లను మీ పేరు చెప్పకుండా అలర్ట్ చేయడానికి WA Notifyలోని చర్యలను పాటించాలి.
-
నా WA Notify డేటాను ప్రజారోగ్య వ్యవస్థకు అందించడం గురించి నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకు?
-
WA Notify ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవాలని DOH కోరుకుంటోంది. దానివల్ల మేము ఆ టూల్‌కి అవసరమైన మెరుగులు దిద్దగలుగుతాం. మీరు మీ WA Notify డేటాను పంచుకోవడానికి అంగీకరిస్తే, మీ గోప్యత పూర్తి సురక్షితంగానే ఉంటుంది. ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించడం లేదా పంచుకోవడం జరగదు, కాబట్టి మిమ్మల్ని గుర్తించే మార్గమే లేదు. DOH మాత్రమే ఈ డేటాను యాక్సెస్ చేయగలుగుతుంది, అదీ రాష్ట్ర స్థాయిలో మాత్రమే.
-
WA Notify వినియోగదారులు వారి డేటాను షేర్ చేసుకోవడానికి అంగీకరిస్తే, ఏమి సేకరిస్తారు?
-
మీరు మీ డేటాను పంచుకోవడానికి అంగీకరిస్తే, మీ గోప్యత పూర్తి సురక్షితంగానే ఉంటుంది. ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించడం లేదా పంచుకోవడం జరగదు, కాబట్టి మిమ్మల్ని గుర్తించే మార్గమే లేదు. ఈ రాష్ట్ర-స్థాయి డేటాను DOH మాత్రమే చూడగలదు, అందులో ఇవి భాగంగా ఉంటాయి:
- తమ WA Notify డేటాను షేర్ చేసుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల సంఖ్య. మా నమూనా ఎంత వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నదో తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది.
- WA Notify యూజర్ల ద్వారా అందుకున్న Exposure Notifications సంఖ్య కోవిడ్-19వ్యాప్తికి సంబంధించిన ధోరణులను గమనించడానికి ఇది మాకు సహాయపడుతుంది.
- ఎక్స్పోజర్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసే వ్యక్తుల సంఖ్య. ప్రజారోగ్య శాఖ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రజలు ఎంత సుముఖంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది మాకు సహాయపడుతుంది.
- కోవిడ్-19పాజిటివ్ అని పరీక్షలో తేలిన వారికి సన్నిహితంగా ఉన్నా, తగినంత సమయం లేని, ఎక్స్పోజర్ గురించి నోటిఫై చేయదగినంత ఎక్కువ సమయం లేని వ్యక్తుల సంఖ్య. WA Notify లో ఎక్స్పోజర్ను నిర్ణయించే అల్గోరిథంను సర్దుబాటు చేయాల్సి ఉన్నదా అనే విషయాన్ని పరిశీలించడానికి ఇది మాకు సహాయపడుతుంది.
-
నేను నా ఐఫోన్లో WA Notify ని అనుమతించినప్పుడు, “ Availability Alerts (అందుబాటు హెచ్చరికలు)” మీటను నేను ఆన్ చేయడం లేదా ఆఫ్ చేయడం చేయాలా?
-
ఆఫ్ చేసినా ఫర్వాలేదు. అయితే, మీరు ఎంతో సమయం వాషింగ్టన్ స్టేట్కు వెలుపల ప్రయాణిస్తుంటే, మీరు దానిని ఆన్ చేసి ఉంచాలని సిఫారసు చేయబడుతోంది. Availability Alerts (అందుబాటు హెచ్చరికలు) ఆన్లో ఉన్నప్పుడు, WA Notify లాంటి ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ పరికరాన్ని అందించే వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, మీకు ఒక నోటిఫికేషన్ రావచ్చు. మీ వద్ద iPhone ఉంటే, మీరు పలు ప్రాంతాలను జోడించవచ్చు కానీ, ఒక సమయంలో ఒక ప్రాంతాన్ని మాత్రమే మీరు యాక్టివ్గా ఉంచగలరు. కొత్తదాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక ప్రాంతాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. మీ వద్ద Android ఫోన్ ఉంటే, వేర్వేరు రాష్ట్రాల WA Notify లాంటి ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ WA Notifyకి అనుకూలమైన సాంకేతికతను ఉపయోగించే ఒకే ఒక్క యాప్ మాత్రమే ఒక సమయంలో యాక్టివ్‌గా ఉండగలదు.
-
నేను WA Notify ని ఉపయోగించడాన్ని ప్రారంభించాలా?
-
అవును. WA Notify వినియోగం ఉచితము మరియు స్వచ్ఛందము. మీరు ఎప్పుడైనా దానిని నిలిపివేయవచ్చు. అలా చేయడానికి, iPhoneలో ఆ ఫీచర్ ఆపివేస్తే చాలు లేదా Android ఫోన్‌లో ఆ యాప్ను తొలగిస్తే చాలు. మీరు దాని నుండి బయటకు వచ్చేస్తే, దగ్గర్లోని ఇతర యూజర్ల నుండి ఫోన్ నిల్వ చేసుకున్న అన్ని యాదృచ్ఛిక కోడ్‌లు తొలగించబడతాయి, వాటిని తిరిగి పొందడం సాధ్యం కాదు.
-
WA Notify కాంటాక్ట్‌ల జాడను కనిపెట్టే యాపా?
-
లేదు. మీకు దగ్గర్లోని వ్యక్తుల గురించిన సమాచారాన్ని WA Notify కనిపెట్టడం లేదా కనుగొనడం చేయదు కాబట్టి, ఇది "కాంటాక్ట్ ట్రేసింగ్" చేయదు. కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది COVID-19 పరీక్షలో పాజిటివ్గా తేలిన వ్యక్తి ఎవరినైనా ఎక్స్‌పోజ్ చేస్తే గుర్తిస్తుంది. ఈ టూల్ ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు లేదా మార్పిడి చేయదు కాబట్టి, మీరు ఎవరి దగ్గర ఉన్నారో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
-
“ఎక్స్పోజర్” అంటే ఏమిటి?
-
మీరు వేరొక WA Notify యూజర్ వద్ద సమయం గడిపిన తర్వాత, ఆ వ్యక్తికి చేసిన COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలితే, మీరు ఎక్స్పోజర్కు గురైనట్లు. ఎక్స్పోజర్ను నిర్ధారించడానికి WA Notify ఒక అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది; అది ఆ అల్గారిథమ్ సహాయంతో, మిమ్మల్ని హెచ్చరించాల్సిన అవసరం లేని సురక్షితమైన దూరంలో లేదా సమీప దూరంలో ఉన్న ఆయా సంఘటనల నుండి COVID-19 వ్యాప్తి చెందే అవకాశం ఉన్న సంఘటనలను గుర్తిస్తుంది. వేరొక యూజర్ వద్ద ఎక్కువసేపు చాలా దగ్గరగా మీరు ఉన్నారని, అది COVID-19 సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా పెంచే పరిస్థితుల క్రిందికి వస్తుందని DOH నమ్మితేనే WA Notify మీకు ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్‌ను పంపుతుంది. ఈ అల్గారిథమ్ని ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మార్చవచ్చు.
-
నేను ఎక్స్పోజ్ అయి ఉండవచ్చునని WA Notify నాకు తెలిపితే ఏమి జరుగుతుంది?
-
మీరు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చని WA Notify గుర్తిస్తే, మీ ఫోన్లోని ఒక నోటిఫికేషన్ మీరు తదుపరి ఏమి చేయాలి అనే సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌కు దారి చూపుతుంది. దీనిలో ఎలా, ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి అనేది, మీరు, మీకు సన్నిహితంగా ఉండేవారు సురక్షితంగా ఉండటానికి సంబంధించిన సమాచారం, మీ ప్రశ్నలకు సమాధానాలు లభించే వనరులు ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లోని సూచనలను శ్రద్ధగా చదివి, వాటిని పాటించడం ముఖ్యం.
-
నాకు కోవిడ్-19 అని పరీక్షలో తేలితే అది అందరికీ తెలుస్తుందా?
-
లేదు. WA Notify మీ గురించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోదు. బహుశా ఎక్స్పోజర్కు గురయ్యారని ఎవరికైనా నోటిఫికేషన్ వస్తే, ఇటీవల వాళ్లకు సమీపంగా ఉన్న ఎవరికో COVID-19 పరీక్షలో పాజిటివ్ అని తేలిందని మాత్రమే వాళ్లకు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు లేదా ఎక్స్పోజర్ ఎక్కడ జరిగింది అనేది వాళ్లకు తెలియదు.
-
WA Notify కోసం నేను ఏమైనా చెల్లించాలా?
-
లేదు. WA Notify యాప్ ఉచితం.
-
WA Notify వాషింగ్టన్ రాష్ట్రానికి ఎలా సహాయపడుతుంది?
-
ఎక్స్పోజర్ నోటిఫికేషన్ని ఎంత ఎక్కువ మంది ఉపయోగిస్తే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని University of Washington చేసిన అధ్యయనంలో (ఇంగ్లీషులో మాత్రమే) తేలింది. WA Notifyని ఉపయోగించడం ప్రారంభించిన మొదటి నాలుగు నెలల్లో అది సుమారుగా 40 నుంచి 115 ప్రాణాలను కాపాడినట్లు, సుమారు 5,500 COVID-19 కేసులను నిరోధించివుండవచ్చని ఫలితాలు చూపిస్తున్నాయి. WA Notifyని అతి తక్కువ మంది ఉపయోగించినా సరే COVID-19 అంటువ్యాధులు,మరణాలు తగ్గుతాయని డేటా నమూనాలు చూపిస్తున్నాయి, అలా COVID-19 వ్యాప్తిని నిరోధించడానికి WA Notify ఒక అద్భుతమైన పరికరమని రుజువు అయింది.
-
మీరు రాష్ట్రం బయటకు ప్రయాణించినప్పుడు WA Notify పని చేస్తుందా?
-
అవును. Google/Apple సాంకేతికతనే ఉపయోగించే యాప్ (ఇంగ్లీషులో మాత్రమే) ఉన్న రాష్ట్రానికి మీరు వెళ్తే, ఆ రాష్ట్రంలోని యూజర్లతో మీ ఫోన్ యాదృచ్ఛిక కోడ్లను మార్చుకోవడం కొనసాగిస్తుంది. మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్లలో దేనినీ మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ కాలంపాటు వాషింగ్టన్ నుండి బయటకు వెళ్తే, స్థానిక సహాయం, హెచ్చరికలను పొందడం కోసం మీరు మీ కొత్త రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎంపికలను పరిశీలించాలి.
-
ఇతర యూజర్లకు నోటిఫై చేయడానికి WA Notify కి ఎంత సమయం పడుతుంది?
-
మరో యూజర్ ద్వారా కొవిడ్-19కు ఎక్స్ప్లోజ్ కాగల యూజర్లు కొవిడ్-19 పాజిటివ్ అని టెస్ట్ చేసిన 24 గంటల్లోపు నోటిఫికేషన్ అందుకుంటారు, ఇతర WA Notify యూజర్లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify లోని దశలు అనుసరిస్తాడు.
-
WA Notify నుండి పలు హెచ్చరికలు అందడం సాధ్యమేనా?
-
పాజిటివ్ అని తేలిన యూజర్లు పాప్-అప్ నోటిఫికేషన్, టెక్స్ట్ సందేశం రెండిటినీ అందుకోవచ్చు. బహుశా అనేకసార్లు ఎక్స్పోజ్ అయిన యూజర్లకు ప్రతి కొత్త ఎక్స్పోజర్ గురించి నోటిఫై చేయడం జరుగుతుంది.
-
నాకు కోవిడ్ పాజిటవ్ అని పరీక్షలో తేలిందని నేను WA Notify కి ఎలా చెప్పాలి?
-
పరీక్షలో పాజిటివ్ అని వచ్చి, DOH లేదా మీ స్థానిక ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు WA Notify ఉపయోగిస్తున్నారా అని వాళ్లు మిమ్మల్ని అడుగుతారు. మీరు దానిని ఉపయోగిస్తుంటే, వాళ్లు మీకు ధృవీకరణ లింక్ మరియు/లేదా నోటిఫికేషన్ పంపుతారు, దానిని WA Notifyలో నమోదు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు పాటించేలా మీకు సహాయపడతారు. లింక్ లేదా నోటిఫికేషన్ మీ వ్యక్తిగత సమాచారంతో జతచేయబడదు. ఇటీవల పరీక్షలో COVID-19 పాజిటివ్గా తేలిన వ్యక్తులు ఉపయోగించే ఫోన్ నంబర్లకు కూడా DOH టెక్స్ట్ సందేశం మరియు/లేదా నోటిఫికేషన్ పంపుతుంది.
మీరు చర్యలను పాటించనప్పుడు WA Notify ఎక్స్పోజర్ నోటిఫికేషన్లు ఎవరు అందుకుంటారో DOH తెలుసుకునే అవకాశం లేదు. ఎక్స్పోజర్ నోటిఫికేషన్లో మీ గురించిన ఎలాంటి సమాచారం జోడించబడదు. WA Notifyలో ఎంత ఎక్కువమంది తమ పేరు ప్రకటించకుండా వాళ్ల ఫలితాలను ధృవీకరిస్తారో, మనం COVID-19 వ్యాప్తిని అంత మెరుగ్గా నియంత్రించవచ్చు.
మీకు పరీక్షలో పాజిటివ్ అని తేలి, మీ పేరు ప్రకటించకుండా మీ ఫలితాలను WA Notifyలో ధృవీకరించాల్సి ఉంటే, ఎక్స్పోజర్కు గురైన అవకాశం గురించి ఇతర WA Notify యూజర్లకు మీ పేరు ప్రకటించకుండా తెలియజేసేలా ఒక ధృవీకరణ కోడ్ కోసం ఎలా అభ్యర్థించాలో తెలుసుకోవడానికి ఈ పేజీ పైన ఉన్న “సొంతగా చేసుకున్న పరీక్షలో COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగం చూడండి.
-
WA Notify ని నా ఫోన్‌కు చేర్చిన తర్వాత నేను చేయవలసినది ఏమైనా ఉన్నదా?
-
ఈ సందర్భాల్లో మాత్రమే అదనపు చర్యలు అవసరం అవుతాయి:
-
మీకు కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షలో తేలితే, లేదా
-
మీరు ఎక్స్పోజ్ అయి ఉండవచ్చనే నోటిఫికేషన్‌ను మీరు అందుకున్నారు.
పరీక్షలో మీకు పాజిటివ్ అని తేలి, DOH నుండి ఒక వ్యక్తి లేదా మీ స్థానిక ప్రభుత్వ ఆరోగ్య అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు WA Notify ఉపయోగిస్తున్నారా అని వాళ్లు మిమ్మల్ని అడుగుతారు. మీరు దానిని ఉపయోగిస్తుంటే, వాళ్లు మీకు ధృవీకరణ లింక్ మరియు/లేదా నోటిఫికేషన్ పంపుతారు, దానిని WA Notifyలో నమోదు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు పాటించేలా మీకు సహాయపడతారు. లింక్ లేదా నోటిఫికేషన్ వ్యక్తిగత సమాచారంతో జతచేయబడదు. ఎక్స్పోజర్ గురించి యాప్ ద్వారా ఎవరికి నోటిఫై చేయబడుతోందని DOH తెలుసుకునే అవకాశం లేదు. ఎక్స్పోజర్ నోటిఫికేషన్లో మీ గురించి ఎలాంటి సమాచారం జోడించబడదు. WA Notifyలో ఎంత ఎక్కువమంది తమ పేరు ప్రకటించకుండా వాళ్ల ఫలితాలను ధృవీకరిస్తారో, మనం COVID-19 వ్యాప్తిని అంత మెరుగ్గా నియంత్రించవచ్చు.
మీకు పాజిటివ్ అని తేలి, మీకు ధృవీకరణ కోడ్ అవసరం ఉంటే, ఎక్స్పోజర్కు గురైన అవకాశం గురించి ఇతర WA Notify యూజర్లకు మీ పేరు ప్రకటించకుండా తెలియజేసేలా ఒక ధృవీకరణ కోడ్ కోసం ఎలా అభ్యర్థించాలో తెలుసుకోవడానికి ఈ పేజీ పైన ఉన్న “సొంతగా చేసుకున్న పరీక్షలో COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగం చూడండి.
-
-
WA Notify ని ఉపయోగించడం వలన నా బ్యాటరీ హరించుకు పోవడం లేదా చాలా డేటాను వాడేయడం జరుగుతుందా?
-
లేదు. Bluetooth Low Energy సాంకేతికతను ఉపయోగించి దీనిని డేటాపైన, బ్యాటరీ జీవితంపైన కనీస ప్రభావాన్ని చూపేలా రూపొందించారు.
- WA Notify బ్యాటరీని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఎందుకు కనిపిస్తుంది?
-
నిజానికి, అది నిజం కాకపోవచ్చు. మీ పరికరంలో ఉండే బ్యాటరీ వాడకం, WA Notify వంటి వాటితోసహా వివిధ యాప్లు రోజూ ఎంత శాంత బ్యాటరీని వాడుతున్నాయో చూపిస్తుంది. చాలా యాప్‌లు, టూల్‌లు రాత్రంతా రన్ అవుతూనే ఉండవు. WA Notify కూడా అలా రన్ అవ్వదు, ఏవైనా ఎక్స్పోజర్ల గురించి మిమ్మల్ని హెచ్చరించేలా పాజిటివ్ యూజర్‌తో సరిపోయే మ్యాచ్‌ల కోసం ఇది కొన్ని గంటలకు ఒకసారి యాదృచ్ఛిక కోడ్లను తనిఖీ చేస్తుంటుంది. ఉదాహరణకు, మీరు నిద్రిస్తున్నప్పుడు ఇతర యాప్లు ఏవీ పని చేయకపోతే, ఆ సమయంలో WA Notify బ్యాటరీని అధిక శాతం ఉపయోగించినట్టు కనిపిస్తుంది. అలా అని WA Notify చాలా బ్యాటరీని ఉపయోగిస్తుందని దాని అర్థం కాదు - బ్యాటరీ వాడకంలోని ఒక చిన్న మొత్తంలో అధిక శాతం మాత్రమే అది ఉపయోగిస్తుంది.
-
WA Notify పని చేయాలంటే నేను బ్లూటూత్‌ను ఆన్ చేసి ఉంచడం అవసరమా?
-
అవును. WA Notify Bluetooth Low Energy ని ఉపయోగిస్తుంది, కాబట్టి ఈ వ్యవస్థ దగ్గరలోని ఇతర యూజర్లను గుర్తించడం కోసం బ్లూటూత్ ఎల్లప్పుడూ పని చేస్తూ ఉండాలి.
-
ఇది పనిచేయడం కోసం నా ఫోన్లో WA Notify ని తెరచి ఉంచాల్సిన అవసరం ఉందా?
-
లేదు. WA Notify నేపథ్యంలో పని చేస్తుంది.
-
పాత స్మార్ట్ఫోన్లకు WA Notify మద్దతు ఇస్తుందా?
-
ఐఫోన్ వినియోగదారులు WA Notify ని ఉపయోగించగలగాలంటే మీకు ఉండాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్:
-
iOS వెర్షన్ 13.7 లేదా తరువాతది (iPhone 6s, 6s Plus, SE లేదా మరింత కొత్త వాటికి)
-
iOS వెర్షన్ 12.5 (iPhone 6, 6 plus, 5s కోసం)
ఆండ్రాయిడ్ యూజర్లు WA Notify ని ఉపయోగించుకోవాలంటే, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ లో ఎనర్జీని సపోర్ట్ చేసేట్లయితే, ఆండ్రాయిడ్ వెర్షన్ 6 (API 23) లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాలి.
-
-
WA Notify ని ఉపయోగించడానికి నాకు 18 ఏళ్లు ఉండాలా?
-
లేదు. WA Notify కి మీ వయస్సు తెలియదు లేదామీ వయస్సును సరిచూడ లేదు.
-
నేను ఎవరితోనైనా ఫోన్‌ను పంచుకుంటే ఈ సాంకేతికత పనిచేస్తుందా?
-
ఎక్స్పోజ్ అయి ఉండే అవకాశం ఉన్న సమయంలో ఫోన్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో WA Notify చెప్పలేదు. మీరు ఫోన్‌ను పంచుకుంటూ ఉంటే, WA Notify కోవిడ్-19 ఎక్స్పోజర్కు అవకాశం ఉందని సూచిస్తే ఆ ఫోన్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ప్రజారోగ్య సూచనలను పాటించాలి.
- పరీక్షించబడిన వ్యక్తి, కుటుంబ లేదా ఇంటి సభ్యుడైతే, నేను నోటిఫికేషన్ మరియు/లేదా టెక్ట్స్ అందుకున్నాను. నేను ఏం చేయాలి?
-
పరీక్షలో పాజిటివ్ అని తేలిన WA Notify యూజర్, తన పేరు ప్రకటించకుండా ఎక్స్‌పోజర్‌కు గురైన అవకాశం ఉన్న ఇతరులను అప్రమత్తం చేసే చర్యలను తీసుకోవాలి కాబట్టి, మీకు ఉద్దేశించబడని ఏవైనా టెక్స్ట్‌లు లేదా నోటిఫికేషన్‌లను మీరు విస్మరించాలి.
మీ కుటుంబ లేదా ఇంటి సభ్యుడు WA Notify యూజర్ అయితే, పరీక్షలో వాళ్లకి పాజిటివ్ అని తేలి, వాళ్ల ఫలితాన్ని WA Notifyలో ఇంకా నిర్ధారించాల్సి ఉంటే, ఈ పేజీలోని, “సొంతగా చేసుకున్న పరీక్షలో COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగంలోని చర్యలను వాళ్లు పాటించవచ్చు.
-
iPadలు లేదా స్మార్ట్ వాచీల వంటి పరికరాల్లో WA Notify పని చేస్తుందా?
-
లేదు. ఎక్స్పోజర్ నోటిఫికేషన్ సిస్టమ్ అనేది ప్రత్యేకించి స్మార్ట్ఫోన్ల కోసం రూపొందించబడినది, iPadలు లేదా టాబ్లెట్లను సపోర్ట్ చేయదు.
-
స్మార్ట్ ఫోన్లు లేని వ్యక్తులకు ఈ సాంకేతికత అందేలా చేయడానికి వాషింగ్టన్ రాష్ట్రం ఏమి చేస్తోంది?
-
WA Notify కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి సహాయపడే ఏకైక సాధనం కాదు. కాంటాక్ట్‌లను కనిపెట్టడం తదితర చర్యలు వాషింగ్టన్ రాష్ట్ర వాసులు అందరికీ, వారికి స్మార్ట్ఫోన్లు లేకపోయినా, మేలు చేస్తాయి. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సిన్లు అత్యుత్తమ మార్గం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం మరియు సమావేశాల పరిమాణాన్ని పరిమితం చేయడం అనేవి కోవిడ్-19 వ్యాప్తిని ఆపడానికి ప్రతి ఒక్కరూ సహాయపడే ఇతర మార్గాలు..
ఫెడరల్ గవర్నమెంట్ Lifeline program (లైఫ్‌లైన్ ప్రోగ్రామ్) అర్హత కలిగినవారికి నెలవారీ ఫోన్ బిల్లు క్రెడిట్‌ని అందిస్తుంది. కొంతమంది పాల్గొనే వైర్లెస్ ప్రొవైడర్లు ఉచిత స్మార్ట్‌ఫోన్‌ని కూడా అందించవచ్చు. ఎవరు అర్హత కలిగి ఉంటారు, ఎలా అప్లై చేయాలి మరియు పాల్గొనే వైర్లెస్ ఆపరేటర్ల గురించి మరింత తెలుసుకోండి (ఇంగ్లిష్ మాత్రమే).
-
వాషింగ్టన్ WA Notify ని 30కు పైగా భాషల్లో విడుదల చేసింది, అయితే Google Play storeలో కేవలం ఇంగ్లిష్ లేదా స్పానిష్ మాత్రమే కనిపిస్తోంది?
-
వినియోగదారు ఫోన్లో డిఫాల్ట్గా సెట్ చేసిన భాష ఆధారంగా WA Notify పనిచేస్తుంది. WA Notifyకు ఒకే ఒక వెర్షన్ మాత్రమే ఉంది, కానీ ఏవైనా పాప్ అప్లు ఉంటే అంటే ఎక్స్‌పోజర్ నోటిఫికేషన్ లాంటివి ఉంటే, అవి 30 కంటే ఎక్కువ భాషలవాళ్లకు యూజర్ ఎంచుకున్న భాషలో కనిపిస్తుంది.
-
నేను ఎంత సమయంలోపు నోటిఫికేషన్ని తట్టాలి లేదా ధృవీకరణ లింక్‌ని యాక్టివేట్ చేయాలి?
-
నోటిఫికేషన్ లేదా టెక్స్ట్ మెసేజ్ అందుకున్న తరువాత, WA Notifyలోని ఇతరులకు తెలియజేసే చర్యలు తీసుకోవడానికి మీకు 24 గంటలు సమయం ఉంటుంది. ఆ సమయం లోపల మీరు నోటిఫికేషన్ ట్యాప్ చేయలేకపోతే లేదా ధృవీకరణ లింక్ క్లిక్ చేయలేకపోతే, ఈ పేజీలో పైన ఉన్న “సొంతగా చేసుకున్న పరీక్షలో COVID-19 పాజిటివ్ అని తేలితే ఇతరులకు ఎలా తెలియజేయాలి” అనే విభాగంలోని చర్యలను తీసుకోవడం ద్వారా WA Notifyలో మీరు ధృవీకరణ కోడ్ కోసం అభ్యర్థించవచ్చు. మీ COVID-19 పరీక్షా ఫలితాల గురించి DOH లేదా మీ స్థానిక వైద్య అధికారి మిమ్మల్ని సంప్రదించినప్పుడు, మీరు వాళ్లను ధృవీకరణ లింక్ కోసం కూడా అభ్యర్ధించవచ్చు.
-
వాషింగ్టన్ రాష్ట్రం ఈ పరిష్కారాన్ని ఎందుకు ఎంచుకుంది?
-
Google/Apple ఎక్స్పోజర్ నోటిఫికేషన్ సిస్టన్‌ను సమీక్షించడానికి భద్రత మరియు పౌర స్వేచ్ఛ నిపుణులు, అనేక సమాజాల సభ్యులతో సహా ఒక రాష్ట్ర స్థాయి పర్యవేక్షక బృందాన్ని వాషింగ్టన్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ నిరూపిత విశ్వసనీయత, దృఢమైన డేటా పరిరక్షణ మరియు ఇతర రాష్ట్రాల ద్వారా వినియోగం ఆధారంగా దీనిని స్వీకరించాలని ఈ బృందం సిఫారసు చేసింది.