6 నెలలు ఆపైబడిన ప్రతిఒక్కరూ అప్డేట్ చేసిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని CDC సిఫార్సు చేస్తోంది (ఇంగ్లీష్ మాత్రమే).
ఫిబ్రవరి 28, 2024 - Centers for Disease Control and Prevention (CDC) సిఫార్సు చేసిన ప్రకారం, (ఇంగ్లీష్ మాత్రమే) 65 ఏళ్లు ఆపైబడిన వయోజనులందరూ అప్డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్ డోసు అదనంగా వేయించుకోవాలి. వ్యాక్సిన్ ప్రభావం మీద ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాతో పాటు, COVID-19 కారణంగా పెద్ద వయసువాళ్లు తీవ్రంగా జబ్బుపడే ప్రమాదాన్ని ఈ సిఫార్సు గుర్తించింది.
వ్యాక్సిన్ వేయించుకోని లేదా Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిఫార్సు చేసిన డోసులు పూర్తిగా వేయించుకోనివాళ్లతో పోలిస్తే, వ్యాక్సిన్ల విషయంలో అప్ టు డేట్‌గా ఉన్నవాళ్లకు COVID-19 కారణంగా తీవ్రంగా జబ్బుపడే, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే, మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
- 5-64 ఏళ్ల మధ్య ఉన్న ప్రతిఒక్కరూ COVID-19 కారణంగా తీవ్రంగా జబ్బుచేసే ప్రమాదం నుండి రక్షణ పొందడానికి అప్డేట్ చేయబడిన COVID-19 వ్యాక్సిన్ 1 డోసు తప్పనిసరిగా వేయించుకోవాలి.
- 6 నెలలు–4 ఏళ్ల వయసు పిల్లలు అప్ టు డేట్‌గా ఉండడం కోసం ఒకటికన్నా ఎక్కువ డోసుల COVID-19 వ్యాక్సిన్లు వేయించుకోవడంతో పాటు కనీసం 1 డోసు అప్డేట్ చేసిన COVID-19 వ్యాక్సిన్‌ని తప్పనిసరిగా వేయించుకోవాలి.
- 65 ఏళ్లు ఆపైబడిన వయోజనులు అప్డేట్ చేసిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్‌ని 4 నెలల విరామంతో 2 డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి.
- మోస్తరుగా లేదా తీవ్రమైన స్థాయిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు అప్డేట్ చేయబడిన COVID-19 వ్యాక్సిన్ అదనపు డోసులు తీసుకోవాల్సి రావచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు
- నేను కొవిడ్-19 వ్యాక్సిన్‌ని ఎందుకు వేయించుకోవాలి?
-
కోవిడ్-19 వ్యాక్సిన్లు మిమ్మల్ని అనేక విధాలుగా రక్షించగలుగుతాయి:
- మీకు కోవిడ్-19 వచ్చినా దాని వలన తీవ్రంగా జబ్బుపడే అవకాశాన్ని బాగా తగ్గిస్తాయి
- పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీరు ఆసుపత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి మరియు కొవిడ్-19 నుంచి మరణించే మీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
- COVID-19 వ్యాక్సిన్ల విషయంలో అప్ టూ డేట్‌గా ఉండడం వల్ల, మీరు దీర్ఘకాలిక COVID (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)కి గురయ్యే అవకాశం తగ్గుతుంది.
- వ్యాక్సినేషన్లు సమాజంలో సంరక్షించే వ్యక్తుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందడాన్ని క్లిష్టతరం చేస్తుంది.
- వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చేయడంలో వ్యాక్సిన్కున్న సామర్థ్యం గురించి నిపుణులు తమ అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.
వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు వైరస్ ఇంకా సోకవచ్చు, అది ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కొంతమంది వ్యక్తులు వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్‌ని పొందలేరు, ఇది వారి కొవిడ్-19కు మరింత దుర్భలమైనవారిగా చేస్తుంది మీరు వ్యాక్సిన్ వేయించుకోనట్లయితే, కొవిడ్-19 వేరియెంట్ వల్ల ఆసుపత్రిలో చేరడం లేదా మరణించేందుకు అధిక ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు మరియు మీ కుటుంబం, పొరుగువారు మరియు కమ్యూనిటీని సంరక్షించడానికి సాయపడుతుంది.
- నాకు వ్యాక్సిన్ ఎక్కడ దొరకుతుంది?
-
వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్ లొకేటర్ లేదా Vaccines.gov (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)ని చూడండి.
- COVID-19 వ్యాక్సిన్లను డబ్బుపెట్టి కొనాలా?
-
ఇతర వ్యాక్సిన్లలాగే, COVID-19 వ్యాక్సిన్లు కూడా చాలావరకు ఇన్సూరెన్స్ ప్లాన్ల ద్వారా కవర్ చేయబడతాయి. పిల్లల కోసం వ్యాక్సిన్లు (ఇంగ్లీషులో మాత్రమే) కార్యక్రమం ద్వారా, వాషింగ్టన్ రాష్ట్రంలోని పిల్లలందరికీ వారి 19వ పుట్టినరోజు వరకు COVID-19 వ్యాక్సిన్లను ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. వయోజనులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లేదా వారి ప్లాన్‌లో వ్యాక్సిన్‌కు కవరేజీ లేకపోతే, వ్యాక్సిన్లు వేయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించడానికి సహాయపడే కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు గురించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి, HHS.gov (ఇంగ్లీషు మాత్రమే) చూడండి.
- Bridge access program (బ్రిడ్జ్ యాక్సెస్ ప్రోగ్రామ్) అంటే ఏమిటి? నాకు ఇన్సూరెన్స్ లేకపోయినా COVID-19 వ్యాక్సిన్ ఇస్తారా?
-
Bridge Access Program (ఇంగ్లీష్ మాత్రమే) ద్వారా, హెల్త్ ఇన్సూరెన్స్ లేని లేదా వారి ఇన్సూరెన్స్‌లో అన్ని COVID-19 వ్యాక్సిన్లకు కవర్ లేని 19 ఏళ్లు ఆపైబడిన దాదాపు 25-30 మిలియన్ల మంది వయోజనులకు అప్డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్‌ని డిసెంబర్ 2024 వరకు ఉచితంగా ఇస్తారు.
ఈ కార్యక్రమంలో భాగం వహిస్తున్న ఫార్మసీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి www.Vaccines.gov ని సందర్శించండి.
- COVID-19 వ్యాక్సిన్ అదనపు డోసు ఎవరు వేయించుకోవాలి?
-
6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్‌కు చెందిన కనీసం 1 డోసు తీసుకోవాలని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిపార్సు చేస్తుంది.
- 6 నెలల నుండి 4 ఏళ్ల వయస్సు పిల్లలకి వారు గతంలో తీసుకున్న డోసుల సంఖ్యను బట్టి, బహుళ డోసులు ఇవ్వాల్సి రావచ్చు.
- 65 ఏళ్లు ఆపైబడినవాళ్లు మునుపటి డోసు తీసుకున్న కనీసం 4 నెలల తర్వాత 2023-2024 COVID-19 వ్యాక్సిన్ అదనపు డోసు తప్పక వేయించుకోవాలి.
- వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న కొంతమందికి అదనపు డోసులు తీసుకునే అర్హత ఉంటుంది. దయచేసి, CDC మార్గదర్శకాలు (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే) చూడండి.
- COVID-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి నేను అప్ టూ డేట్‌గా ఉన్నట్లు ఎప్పుడు పరిగణిస్తారు?
-
మీ కోసం CDC సిఫార్సు చేసిన అత్యంత తాజా డోసుని మీరు వేయించుకొనివుంటే, COVID-19 వ్యాక్సినేషన్‌కి సంబంధించి మీరు అప్ టూ డేట్ (ఇంగ్లీష్ మాత్రమే)గా ఉన్నట్లు పరిగణిస్తారు.
- కొవిడ్-19 వ్యాక్సిన్ పొందిన తరువాత నేను అస్వస్థతకు గురైనట్లయితే ఏమి జరుగుతుంది?
-
ఇతర రొటీన్ వ్యాక్సిన్ల వలేనే, కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత చేయి నొప్పి, జ్వరం, తలనొప్పి, లేదా అలసట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇవి వ్యాక్సిన్ పనిచేస్తున్నదని తెలిపే సూచనలు. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత సంభావ్య దుష్ప్రభావాల గురించి మరింత తెలుసుకోండి.
మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత అస్వస్థతకు గురైనట్లయితే, మీరు ప్రతికూల ఘటనను Vaccine Adverse Event Reporting System (VAERS, వ్యాక్సిన్ ప్రతికూల ఘటన రిపోర్టింగ్ సిస్టమ్) (ఇంగ్లిష్ మాత్రమే) కు నివేదించాలి. "ప్రతికూల ఘటన” అనేది వ్యాక్సినేషన్ తరువాత చోటు చేసుకునే ఏదైనా ఆరోగ్య సమస్య లేదా దుష్ప్రభావం. Vaccine Adverse Event Reporting System (VAERS, వ్యాక్సిన్ సంబంధిత ప్రతికూల ఘటనలు నివేదించే వ్యవస్థ) మరియు వ్యాక్సిన్ భద్రత గురించిన మరింత సమాచారం కోసం, Department of Health (DOH, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) వారి వ్యాక్సిన్ భద్రత (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే) వెబ్‌పేజీ సందర్శించండి.
- నేను రొటీన్ వ్యాక్సినేషన్లు పొందేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందవచ్చా?
-
అవును. Advisory Committee on Immunization Practices (ACIP- ఇమ్యూనైజేషన్ విధానాలపై సలహా మండలి) మే 12, 2021 నాడు తన సిఫారసులను మార్చింది. మీరు ఇప్పుడు మీ ఇతర వ్యాక్సిన్లను పొందే అదే సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందవచ్చు.
మీరు మీ బిడ్డ కొరకు అవసరమైన స్కూలు వ్యాక్సినేషన్లు (ఇంగ్లిష్ మాత్రమే) లేదా ఇతర సిఫారసు చేయబడ్డ వ్యాక్సిన్లు కొవిడ్-19 వ్యాక్సినేషన్ నుంచి విడిగా షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ మీ బిడ్డకు సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్లను వేయించడానికి మరో అవకాశం.
- నేను గర్భవతిని, పాలిస్తున్నాను లేదా గర్భవతి కావాలని ప్లాన్ చేసినట్లయితే, కోవిడ్-19 వ్యాక్సిన్ ని పొందవచ్చా?
-
అవును, గర్భధారణ సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని డేటా చూపుతోంది. Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) (ఇంగ్లిష్ మాత్రమే), American College of Obstetricians and Gynecologists (ACOG- అమెరిక్ కాలేజీఆఫ్ అబ్స్ట్రెటీషియన్లు మరియు గైనకాలజిస్ట్లు), మరియు Society for Maternal-Fetal Medicine (SMFM- సొసైటీ ఫర్ మెటర్నల్-ఫీటల్ మెడిసిన్) (ఇంగ్లిష్ మాత్రమే)లు గర్భవతులైన, పిల్లలకు పాలిచ్చే లేదా గర్భం ధరించాలని భావించే మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్‌ని సిఫారసు చేస్తున్నారు. మీకు వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే, గర్భధారణ మరియు పాలివ్వడం ద్వారా మీ బిడ్డ కొవిడ్-19కు విరుద్ధంగా యాంటీబాడీలు కూడా పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోని గర్భవతులైన మహిళలకు నెలలు నిండకముందే బిడ్డ పుట్టడం లేదా మృతశిశువులు పుట్టడం వంటి తీవ్రమైన సంక్లిష్టతల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదనంగా, గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్-19 వచ్చిన మహిళలకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ మరియు బ్రీతింగ్ ట్యూబ్ అవసరం అయ్యే అవకాశం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి మరిన్ని వనరుల కొరకు, దయచేసి వన్ వ్యాక్స్, టూ లైవ్స్ వెబ్సైట్లో తాజా సమాచారాన్ని చూడండి.
- 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వ్యాక్సిన్ పొందగలరా?
-
ప్రస్తుతానికి, 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వడానికి Pfizer-BioNTech (Pfizer) వ్యాక్సిన్, Moderna COVID-19 వ్యాక్సిన్ బ్రాంఢ్లకు అనుమతి ఉంది. 12 ఏళ్లు ఆపై వయసువాళ్ల కోసం Emergency Use Authorization (EUA, అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడినది) కింద Novavax వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, చట్టబద్ధంగా విముక్తి పొందనట్లయితే పేరెంట్ లేదా గార్డియన్ నుంచి సమ్మతి అవసరం కావొచ్చు (ఇంగ్లిష్ మాత్రమే).తల్లిదండ్రుల సమ్మతి లేదా చట్టపరంగా విముక్తి పొందినట్లుగా రుజువు చూపించడానికి వారి ఆవశ్యకతల గురించి వ్యాక్సిన్ క్లినిక్‌ని చెక్ చేయండి.
- నా బిడ్డకు కొవిడ్-19 వస్తుందనే దాని గురించి నేను ఎందుకు ఆందోళన చెందాలి?
-
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, అమెరికాలో 15 మిలియన్లకు పైగా పిల్లలకు కొవిడ్-19 వచ్చింది. కొత్తగా వచ్చిన COVID-19 వేరియెంట్లు కారణంగానే, ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, చాలామంది హాస్పిటల్లో చేరుతున్నారు.
పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో కొవిడ్-19 చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, పిల్లలు ఇంకా బాగా అస్వస్థతకు గురికావొచ్చు, రోగనిరోధక శక్తి లేని లేదా మరోవిధంగా దుర్భలమైన పరిస్థితుల్లో ఉన్న స్నేహితులు మరియు కుటుంబానికి వ్యాప్తి చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్లో నివేదించబడిన చిన్నపిల్లల COVID-19 మరణాల్లో, దాగివున్న అనారోగ్య సమస్యలేమీ సగం కేసుల్లో కనిపించలేదు.
కొవిడ్-19 సంక్రమించిన పిల్లల్లో ‘‘లాంగ్ కొవిడ్-19’’ అభివృద్ధి చెందవచ్చు లేదా బ్రెయిన్ ఫాగ్, అలసట, తలనొప్పి, మగత మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం వంటి నిరంతర లక్షణాలు ఉంటాయి. వ్యాక్సిన్ పిల్లలను ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంచడానికి అత్యుత్తమ మార్గం.
కొవిడ్-19 సోకిన పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) (ఇంగ్లిష్ మాత్రమే) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. MIS-C గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు లేదా జీర్ణాశయాంతర అవయవాలతో సహా వివిధ శరీర భాగాలు వాపుకు దారితీసే పరిస్థితి. MIS-C దేని వల్ల కలుగుతుందనేది ఇంకా తెలియనప్పటికీ, MIS-Cతో ఉన్న చాలామంది పిల్లలకు కొవిడ్-19 ఉంది, లేదా కొవిడ్-19 ఉన్నవారికి దగ్గరల్లో ఉన్నారు. MIS-C తీవ్రమైన, ఇంకా ప్రాణాంతకం కావొచ్చు, కానీ ఈ పరిస్థితితో రోగనిర్ధారణ చేయబడ్డ చాలామంది పిల్లలు వైద్య సంరక్షణతో మెరుగైంది.
- వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమైనవని మరియు అవి ప్రభావవంతమైనవని మనకు ఎలా తెలుస్తుంది?
-
కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని ధృవీకరించడం కోసం, వ్యాక్సిన్ భద్రతను పర్యవేక్షించే దేశ సామర్థ్యాన్ని CDC (Centers for Disease Control and Prevention, రోగ నిరోధక నివారణా కేంద్రాలు) విస్తరించింది మరియు బలోపేతం చేసింది. దీని ఫలితంగా, కొవిడ్-19 వ్యాక్సిన్ పనీతీరును పరీక్షించిన సమయంలో కనిపించని సమస్యలను వ్యాక్సిన్ భద్రతా నిపుణులు పరిశీలించగలరు మరియు గుర్తించగలరు.
అదనపు వనరులు మరియు సమాచారం
- నిర్ధిష్ట గ్రూపుల కొరకు కొవిడ్-19 వనరులు
-
పిల్లలు మరియు యువత
- పెడ్రియాటిక్ కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి తల్లిదండ్రులు/సంరక్షకులు ఏమి తెలుసుకోవాలి (PDF)
- కొవిడ్-19 వ్యాక్సినేషన్ తరువాత మైకార్డిటిస్: తల్లిదండ్రులు మరియు యువత ఏమి తెలుసుకోవాలి (PDF)
- ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరమైన పిల్లలు మరియు యువత కొరకు వ్యాక్సిన్ సమాచారం (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
తల్లిపాలు ఇవ్వడం మరియు/లేదా గర్భవతులైన మహిళలు
- Fast Facts: The COVID-19 Vaccines and Pregnancy - Telugu (wa.gov)
- COVID-19 Vaccines and Reproductive Health Frequently Asked Questions (wa.gov)
ఇమిగ్రెంట్లు మరియు రెఫ్యూజీలు
- ఇమిగ్రెంట్లు మరియు రెఫ్యూజీల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో ఆత్మవిశ్వాసానం నింపడానికి చర్చా మార్గదర్శిని (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
- సాధారణ ఆందోళనలు మరియు వాస్తవాలు (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
- ఇమిగ్రెంట్ కమ్యూనిటీ సభ్యుల కొరకు కొవిడ్-19 మీ హక్కులను తెలుసుకోండి (WA ఇమిగ్రెంట్ సాలిడారిటీ నెట్వర్క్) (ఇంగ్లిష్ మాత్రమే)
దనపు కమ్యూనిటీ నిర్ధిష్ట వనరులను వ్యాక్సిన్ సమానత్వం మరియు నిమగ్నతా పేజీలో కనుగొనవచ్చు (ఇంగ్లిష్ మాత్రమే)
- నా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇవ్వలేదు. నేను మరింత సమాచారాన్ని ఎక్కడ పొందగలను?
-
సాధారణ ప్రశ్నలను covid.vaccine@doh.wa.govకు పంపవచ్చు.