కోవిడ్-19 చికిత్సలు

కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు అందుబాటులో ఉన్న కోవిడ్-19 థెరపాటిక్స్ (ఔషధాల) నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ చికిత్సలు తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం మరియు కోవిడ్-19 వల్ల కలిగే మరణాన్ని నివారించడంలో సహాయపడతాయి. పరీక్షలో మీకు పాజిటివ్‌ వచ్చినా, అలాగే ఎక్కువ ప్రమాదం ఉన్నా వెంటనే మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి, ఎందుకంటే చికిత్సలు మంచిగా పని చేయాలంటే వాటిని త్వరగా ప్రారంభించాలి. మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మీకు ఏ కోవిడ్-19 మందుల ఎంపిక ఉత్తమమో నిర్ణయించడంలో సహాయం చేస్తారు.

కోవిడ్-19 చికిత్సలు/మందులు నివారణకు ప్రత్యామ్నాయం కాదు. ఇప్పటికీ కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని మరియు ఇతర చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.

మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు ఏమిటి?

యాంటీబాడీలు అనేవి కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ వంటి వైరస్‌లతో పోరాడటానికి వ్యక్తుల శరీరాలు తయారు చేసే ప్రోటీన్‌లు. ప్రయోగశాలలో తయారు చేయబడిన ప్రతిరోధకాలు మీ శరీరంలో వైరస్ పరిమాణాన్ని పరిమితం చేయడానికి చాలావరకు సహజ ప్రతిదేహాల వలె పని చేస్తాయి. వీటిని మోనోక్లోనల్ యాంటీబాడీలు అంటారు. మీరు తీవ్రమైన కోవిడ్-19 అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నట్లయితే, అలాగే మీరు కోవిడ్-19 పరీక్షకు పాజిటివ్ వచ్చి ఉంటే లేదా పరీక్ష పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నట్లయితే, మీరు మోనోక్లోనల్ యాంటీబాడీ (mAb) చికిత్సను పరిగణించాల్సి ఉండవచ్చు. మీ వయస్సు, ఆరోగ్య చరిత్ర మరియు మీకు ఎంతకాలం లక్షణాలు ఉన్నాయి అనే దాని ఆధారంగా మీరు కోవిడ్-19 చికిత్సగా mAb చికిత్స (bebtelovimab)కి అర్హత పొందవచ్చు.

కోవిడ్-19 కోసం ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటే ఏమిటి?

ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PrEP) అనేది వైరస్‌ జోడించబడకుండా మరియు మానవ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి రూపొందించబడిన ఔషధం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర మోనోక్లోనల్ యాంటీబాడీల మాదిరిగా కాకుండా, Evusheld అనేది దీర్ఘకాలం పనిచేసే యాంటీబాడీ, ఇది ఎవరైనా కోవిడ్-19కి గురయ్యే ముందు దానిని నివారించడానికి లేదా వారికి ముందస్తు సంరక్షణగా ఇవ్వడానికి ఆమోదించబడింది. ఎవుషెల్డ్ అనేది కోవిడ్-19 కారణంగా వచ్చే లక్షణాల చికిత్స కోసం కాదు మరియు కోవిడ్-19 ఉన్నవారికి బహిర్గతం అయిన తర్వాత ఇవ్వబడదు; బహిర్గతమయ్యే ముందు సంక్రమణను నివారించడానికి ఇది ఇవ్వబడుతుంది.

ఓరల్ యాంటీవైరల్స్ అంటే ఏమిటి?

ఓరల్ యాంటీవైరల్ చికిత్స మీ శరీరంలో SARS-CoV-2 వైరస్ (కోవిడ్-19కి కారణమయ్యే వైరస్)ని విస్తరించకుండా ఆపడంలో, మీ శరీరంలోని వైరస్ మొత్తాన్ని తగ్గించడంలో లేదా మీ రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేయడంలో కోవిడ్-19తో పోరాడటానికి మీ శరీరానికి సహాయపడుతుంది. చికిత్స పొందడం ద్వారా, మీరు తీవ్రమైన లక్షణాలను తక్కువగా కలిగి ఉండవచ్చు మరియు మీ అనారోగ్యం మరింత తీవ్రమయ్యే అవకాశాలను మరియు ఆసుపత్రిలో సంరక్షణ పొందాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు. కోవిడ్-19 కోసం యాంటీవైరల్ చికిత్సలు తేలికపాటి నుండి మితమైన లక్షణాలతో ఉన్నవారు, ఆసుపత్రిలో చేరని వారు, ఐదు రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో లక్షణాలను కలిగి ఉన్నవారు మరియు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులకు అందుబాటులో ఉన్నాయి.

ఇంట్రావీనస్ (IV) యాంటీవైరల్స్ అంటే ఏమిటి?

Remdesivir (ఇంగ్లీష్ మాత్రమే) అనేది Food and Drug Administration (FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆమోదించిన నిరూపిత యాంటీవైరల్ ఔషధం మరియు ప్రస్తుతం Washington State Department of Health (WADOH, వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) దీనిని సరఫరా చేయడం లేదు. ఇది వైరస్ దాని కాపీలను తయారు చేయకుండా నిరోధించడం ద్వారా పనిచేస్తుంది (ప్రతిరూపాలను తయారు చేయడం). Remdesivir కాలక్రమేణా సిరలో (ఇంట్రావీనస్‌గా) సూది ద్వారా ఇవ్వబడుతుంది, దీనిని IV ఇన్‌ఫ్యూషన్ అంటారు.

తీవ్రమైన కోవిడ్-19 ప్రమాదం ఎక్కువగా ఉన్న పెద్దలు మరియు ఆసుపత్రిలో చేరని పిల్లల చికిత్స కోసం Remdesivir ఆమోదించబడింది. ఏప్రిల్ 25, 2022న, కనీసం 28 రోజుల వయస్సు గల పిల్లలను కనీసం 3 కిలోల (సుమారు 6.6 పౌండ్‌లు) మరియు తీవ్రమైన వ్యాధి బారిన పడే ప్రమాదం ఉన్న పిల్లలను చేర్చడానికి FDA ఈ ఆమోదాన్ని విస్తరించింది, దీని వలన 12 ఏళ్లలోపు పిల్లలకు FDA-ఆమోదించిన మొదటి చికిత్సగా రెమ్‌డెసివిర్ మారింది.

Remdesivir‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలి మరియు లక్షణాలు ప్రారంభమైన ఏడు రోజుల్లోపు ప్రారంభించాలి, కాబట్టి అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు లక్షణాలను కలిగి ఉంటే మరియు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలితే వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించడం చాలా ముఖ్యం. చికిత్స మూడు IV ఇన్‌ఫ్యూషన్ల శ్రేణిగా ఇవ్వబడుతుంది, వరుసగా మూడు రోజులు, రోజుకు ఒకసారి ఇవ్వబడుతుంది.

అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఔట్ పేషెంట్ Remdesivir చికిత్సను అందించలేవు - రోగులు వారి ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడి, ఇది సంభావ్య చికిత్సా ఎంపికగా ఉందో లేదో చూడాలి.

కోవిడ్-19 కారణంగా మరింత తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులకు చికిత్స చేయడానికి కూడా Remdesivir ఉపయోగించబడుతుంది. మీరు కోవిడ్-19 కారణంగా ఆసుపత్రిలో చేరినట్లయితే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు Remdesivir లేదా ఇతర చికిత్సలు అవసరమా అని నిర్ణయిస్తారు.

తరచుగా అడిగే ప్రశ్నలు

కోవిడ్-19 ఉన్న వ్యక్తులకు mAbలు ఎలా సహాయపడతాయి?

అత్యవసర వినియోగం కోసం U.S. Food and Drug Administration (FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా అధికారం పొందిన mAb చికిత్సలు వ్యాధి యొక్క తీవ్రమైన లక్షణాలు వచ్చేఅధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే) సహాయపడవచ్చు:

  • ఆసుపత్రిలో చేరే సంభావ్యతను తగ్గించడానికి
  • కోవిడ్-19 నుండి వేగంగా కోలుకోవడానికి
mAb చికిత్సను ఎవరు పొందవచ్చు?

mAbలు ఈ రకమైన వ్యక్తుల కోసం రూపొందించబడ్డాయి:

  • కోవిడ్-19 పాజిటివ్ అని తేలినవారు
  • తేలికపాటి నుండి ఓ మోస్తరుగా వ్యాధి లక్షణాలను 10 రోజులు లేదా అంతకంటే తక్కువ వరకు కలిగి ఉన్నవారు
  • తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం అధికంగా ఉన్నవారు
నేను మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స పొందిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్‌ని పొందవచ్చా?

మీరు COVID-19 ఇన్‌ఫెక్షన్ తర్వాత పాసివ్ యాంటీబాడీ చికిత్స (మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ లేదా కాన్వాలసెంట్ ప్లాస్మా) పొందినట్లయితే, మీరు చికిత్స పూర్తి చేసిన తర్వాత ఎప్పుడైనా కోవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందవచ్చు. పాసివ్ యాంటీబాడీ చికిత్స ముగిసిన తర్వాత వ్యక్తులు వ్యాక్సీన్ తీసుకోవడానికి ఇకపై 90 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

పాసివ్ యాంటీబాడీ చికిత్సకు అర్హతకు సంబంధించిన ప్రశ్నల కోసం, మీ ప్రదాత‌ను సంప్రదించండి.

నేను మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్స పొందినట్లు నేను ఎలా చూపించగలను?

mAb చికిత్సను అందించిన వైద్య ప్రదాత మీరు చికిత్సను ఎప్పుడు స్వీకరించారో సూచించే డాక్యుమెంటేషన్‌ను మీకు అందించగలరు.

ఓరల్ యాంటీవైరల్స్‌ను అందుకోవడానికి ఎవరు అర్హులు?

Paxlovid: పెద్దలు మరియు పీడియాట్రిక్ రోగులు (12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు కనీసం 88 పౌండ్లు/40 కిలోల బరువు) ఆసుపత్రిలో చేరడం లేదా మరణంతో సహా తీవ్రమైన కోవిడ్-19కి పురోగమించే ప్రమాదం ఎక్కువగా కలిగి ఉన్నవారు.

Molnupiravir: ఆసుపత్రిలో చేరడం లేదా మరణంతో సహా తీవ్రమైన కోవిడ్-19కి పురోగమించే ప్రమాదం ఎక్కువగా ఉన్న పెద్దలు మరియు Food and Drug Administration (FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా అధికారం పొందిన ప్రత్యామ్నాయ కోవిడ్-19 చికిత్స ఎంపికలు అందుబాటులో ఉండని వారు లేదా వైద్యపరంగా తగినవారు కానివారు.

Medicaid/Children's Health Insurance Program (CHIP) ద్వారా ఈ చికిత్స కవర్ చేయబడిందా?

అవును. mAbలు చికిత్సలకు Medicaid/Children’s Health Insurance Program (CHIP, పిల్లల ఆరోగ్య బీమా కార్యక్రమం) అడ్మినిస్ట్రేషన్ ఫీజును (ఇంగ్లీష్ మాత్రమే) కవర్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఫీజు అనేది మీకు చికిత్స అందించడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాత వసూలు చేసే ఫీజు. చాలా mAbలకు, ఉత్పత్తి ధర కూడా ఫెడరల్ ప్రభుత్వంచే కవర్ చేయబడుతుంది.

నేను ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినప్పటికీ, నేను కోవిడ్-19కి చికిత్స పొందవచ్చా?

ఫెడరల్ ప్రభుత్వం కొనుగోలు చేసిన కోవిడ్-19 థెరపాటిక్స్ రోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా అందించబడతాయి. అయితే, ప్రొవైడర్లు అందించేవి, చికిత్స మరియు అడ్మినిస్ట్రేషన్ ఫీజుల ఖర్చును ఇన్సూరెన్స్ ద్వారా, రోగుల నుండి లేదా ఫెడరల్ ప్రోగ్రామ్‌ల నుండి పొందవచ్చు. చికిత్సా విధానాలను కోరుతున్నప్పుడు ఏ రకమైన కవరేజ్ అందుబాటులో ఉందో తెలుసుకోవడానికి, దయచేసి మీ ప్రదాతను సంప్రదించండి.

డాక్యుమెంట్ లేని వ్యక్తులు కోవిడ్-19కి చికిత్స పొందగలరా?

డాక్యుమెంట్లు లేని వ్యక్తులు Alien Emergency Medical Program (AEM, ఏలియన్ ఎమర్జెన్సీ మెడికల్ ప్రోగ్రామ్) (ఇంగ్లీష్ మాత్రమే) నుండి కవరేజీని పొందవచ్చా:

  • కోవిడ్-19 యొక్క మదింపు మరియు చికిత్సను చేర్చడానికి అర్హత కలిగిన అత్యవసర పరిస్థితులు. 
  • ఆఫీస్, క్లినిక్ లేదా టెలీహెల్త్‌ను చేర్చడానికి పరీక్ష మరియు చికిత్స ఏర్పాటులు.
  • ఆమోదించబడిన సేవలు. కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు వాడే మందులు మరియు శ్వాసకోశ సేవలకు కవరేజీని కలిగి ఉండవచ్చు. సంభావ్య సానుకూల కోవిడ్-19 ఫలితాలకు, ఫాలో-అప్ సందర్శనలు మరియు మందులకు కవరేజీ ఉండవచ్చు

AEMకి ఎలా దరఖాస్తు చేయాలి

19 నుండి 64 సంవత్సరాల వయస్సు గల పెద్దలు:

65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, అంధులు, వికలాంగులు లేదా దీర్ఘకాలిక సేవలు అవసరమైన వారు:

  • ఆన్​లైన్: Washington Connection (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)
  • ఫోన్: 1-877-501-2233

కోవిడ్-19కు చికిత్స పొందండి

Test to Treat (టెస్ట్ టు ట్రీట్)  (ఇంగ్లీష్ మాత్రమే) ప్రోగ్రామ్ ప్రాణాలను రక్షించే కోవిడ్-19 చికిత్సలకు వేగంగా, సులభంగా యాక్సెస్‌ను అందిస్తుంది. మీరు పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, మీరు ఆరోగ్య సంరక్షణ ప్రదాతని సందర్శించాలి (ప్రత్యక్షంగా వెళ్ళి కలవడం ద్వారా లేదా టెలీహెల్త్ ద్వారా) మరియు అర్హత ఉంటే, నోటి ద్వారా తీసుకునే కోవిడ్-19 చికిత్స కోసం ప్రిస్క్రిప్షన్‌ను పొందండి మరియు ఆ ప్రిస్క్రిప్షన్‌లో రాయించుకోండి—అన్నీ ఒకే దగ్గర.

 Test to Treat లొకేటర్లే దా కాల్ 1-800-232-0233  (TTY 1-888-720-7489) ఇంగ్లీష్, స్పానిష్ మరియు 150 కంటే ఎక్కువ ఇతర భాషల్లో సహాయం పొందండి. కాల్ సెంటర్ వారానికి 7 రోజులు ఉదయం 8 నుండి అర్ధరాత్రి ET వరకు తెరిచి ఉంటుంది మరియు మీకు సమీపంలోని స్థానాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేస్తుంది.

ఇన్సూరెన్స్ లేని వ్యక్తుల కోసం వనరులు

కోవిడ్-19 థెరపాటిక్స్ లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ కవరేజ్ అవసరమయ్యే ఇన్సూరెన్స్ లేని వ్యక్తులు వీటిని యాక్సెస్ చేయవచ్చు:

ఇన్సూరెన్స్ చేసుకోని వ్యక్తులు క్రింది Federally Qualified Health Centers (FQHC, సమాఖ్య అర్హత కలిగిన ఆరోగ్య కేంద్రాలు)లో భాగమైన అనేక క్లినిక్‌లలో కూడా సేవలను పొందవచ్చు: 

మందులు పొందడానికి ప్రాంతాన్ని కనుగొనడంలో సహాయం కావాలా? Test to Treat (ఇంగ్లీష్ మాత్రమే) సైట్‌ను కనుగొనడానికి 1-800-232-0233 (TTY 888-720-7489)కి కాల్ చేయండి.

అదనపు వనరులు

అదనపు ప్రశ్నలకు సమాధానమివ్వడానికి రాష్ట్ర కోవిడ్-19 హాట్‌లైన్ అందుబాటులో ఉంది. హాట్‌లైన్ సమాచారం మమ్మల్ని సంప్రదించండి పేజీలో లభిస్తుంది.

కోవిడ్-19 థెరపాటిక్స్ గురించి మరింత సమాచారం కోసం, Centers for Disease Control and Prevention (వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు) యొక్క COVID-19 థెరపాటిక్స్ పేజీని సందర్శించండి.