మరి కొంతకాలం పాటు COVID-19 ఉంటుందని మనకు ఇప్పుడు తెలుసు. మనం, మన ప్రియమైన వాళ్లు మరియు మన సమాజాన్ని వీలైనంత సురక్షితంగా ఉంచుకుంటూ మనం ఏవిధంగా జీవించాలో అర్థం చేసుకోవడం ముఖ్యం. మనం దాని కోసం ఏమి చేయాలి? మనం ఇప్పటివరకు తెలుసుకున్న అన్ని సాధనాలు ఉపయోగించాలి: COVID-19 వ్యాక్సిన్‌ల విషయంలో అప్ టు డేట్‌గా ఉండండి, జబ్బు చేస్తే లేదా ఎక్స్‌పోజ్ అయితే పరీక్షలు చేయించుకోండి, ఇంట్లోనే ఉండండి, గుంపులో ఉన్నప్పుడు మాస్క్ ధరించండి, ఇతరులకు దూరంగా ఉండండి.
చర్య తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి
మీకు ప్రస్తుతం COVID-19 ఉంటే
అదనపు సమాచారం
- COVID-19 రోగలక్షణాలు, సంకేతాలు మరియు నిరోధం
-
COVID-19 ప్రధాన రోగలక్షణాలు ఇలా ఉంటాయి:
- దగ్గు, శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, చలి, కండరాల నొప్పి, గొంతు నొప్పి, కొత్తగా రుచి లేదా వాసన కోల్పోవడం. చాలా అరుదుగా వికారం, వాంతులు, లేదా విరేచనాలు లాంటి ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి.
- COVID-19కి సంబంధించిన ఈ అత్యవసర హెచ్చరిక సూచనలను మీరు గమనిస్తే, 911కు కాల్ చేయండి:
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- ఏకధాటిగా ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి
- ఆకస్మిక గందరగోళం
- లేవలేకపోవడం లేదా మెలకువగా ఉండలేకపోవడం
- చర్మం రంగును బట్టి చర్మం, పెదాలు, లేదా గోరు కుదుళ్లు, పాలిపోయిన, బూడిదరంగు, నీలం-రంగులో మారడం
- ఏ గ్రూపువాళ్లకు ప్రమాదం అధికంగా ఉంటుంది?
- పెద్దవయసువాళ్లు, శరీరం లోపల ఆరోగ్య సమస్యలు ఉన్న అన్ని వయసుల వారు, మరియు గర్భిణీ స్త్రీలు COVID-19 వల్ల వచ్చే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నన్ను నేను, నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలను?
- వ్యాక్సిన్లు వేయించుకొని అప్ టు డేట్‌గా ఉండండి.
- మాస్క్ వేసుకోవాలేమో ఆలోచించండి.
- జనం ఎక్కువగా ఉండే, వెంటిలేషన్ సరిగ్గా లేని ప్రదేశాలకు దూరంగా ఉండండి.
- సబ్బు మరియు నీళ్లతో మీ చేతులను తరచుగా కడుక్కోండి లేదా హ్యాండ్ శానిటైజర్ వాడండి.
- మీకు దగ్గు వచ్చినప్పుడు లేదా మీరు తుమ్మినప్పుడు మీ మోచేతిని లేదా టిష్యూని అడ్డుగా పెట్టుకోండి.
- చేతులు కడుక్కోకుండా మీ ముఖం, నోరు, ముక్కు లేదా కళ్లని తాకకండి.
- మీకు COVID-19 రోగలక్షణాలు ఉంటే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించండి. మీకు మెడికల్ ప్రొవైడర్ లేదా ఇన్సూరెన్స్ లేకపోతే, Department of Health (DOH, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) ద్వారా మీకు ఉచిత టెలీమెడిసిన్ అపాయింట్‌మెంట్‌లు (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే) అందుబాటులో ఉంటాయి.
- స్టోర్లు మరియు బహిరంగ ప్రదేశాలను మరింత సురక్షిత పద్ధతిలో సందర్శించండి
-
మీరు బయటికి వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత మరియు మీరు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మీరు అలాగే ఇతరులు సురక్షితంగా ఉండాలంటే చాలా విషయాలు మీరు గుర్తుంచుకోవాలి.
బయటికి వెళ్లే ముందు:
- మీకు ఒంట్లో బాగాలేకపోతే, సాధ్యమైనంతవరకు, స్టోర్ లేదా ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లకండి. మీ కోసం ఆ వస్తువులు తీసుకురమ్మని మీ కుటుంబసభ్యులను లేదా స్నేహితులను అడగండి.
- మీ ఇంటి వద్ద డెలివరీ తీసుకోవడం కోసం కిరాణా సరుకులు, ఔషధాలు, మరియు ఇతర వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయగలరేమో ఆలోచించండి.
గది లోపల రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పుడు:
- మీ ముక్కు మరియు నోరు కవర్ చేసేలా మాస్క్ వేసుకోండి.
- చెక్‌ఔట్ లైన్‌తో సహా, వేరే స్థలాల్లో మీకూ ఇతరులకూ మధ్య కనీసం 6 అడుగుల (2 మీటర్ల) దూరం ఉండేలా చూసుకోండి.
- దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకోండి.
- మీ ముఖాన్ని తాకకండి.
- మీరు షాపింగ్‌కి వెళ్లినప్పుడు, మీ కార్ట్ హ్యండిల్ లేదా షాపింగ్ బాస్కెట్‌ని శుభ్రం చేయడానికి హ్యాండ్ శానిటైజర్ లేదా యాంటిసెప్టిక్ వైప్లు ఉపయోగించండి.
- గర్భధారణ, శిశువులు మరియు COVID-19
-
మీరు కడుపుతో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు
- గర్భం ధరించని వారితో పోలిస్తే, గర్భంతో ఉన్నవారు లేదా ఇటీవల గర్భం ధరించిన వారు COVID-19 కారణంగా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- గర్భం ధరించిన సమయంలో COVID-19కి గురైన వారు నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చే (37 నెలల కంటే ముందే శిశువును ప్రసవించడం) మరియు మృత శిశువు జన్మించడం మరియు గర్భం ధరించే సమయంలో ఎదురయ్యే ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.
- గర్భంతో ఉన్నవారు లేదా ఇటీవల గర్భం ధరించిన వారు మరియు వారితో సన్నిహితంగా ఉండేవాళ్లు COVID-19 సోకకుండా తమను తాము రక్షించుకోవడానికి క్రింది చర్యలు తీసుకోవాలి:
- వ్యాక్సిన్లు వేయించుకొని అప్ టు డేట్‌గా ఉండండి.రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించాలేమో ఆలోచించండి.
- రద్దీగా ఉండే, వెంటిలేషన్ సరిగ్గా లేని ప్రదేశాలకు దూరంగా ఉండండి.
- ఇతరులకు COVID-19 వ్యాప్తించకుండా ఉండడానికి పరీక్షలు చేయించుకోండి.
- ఇతరులకు వ్యాధి వ్యాప్తి చేయకుండా ఉండడానికి పరీక్ష చేయించుకోండి.
- మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ మోచేయి లేదా టిష్యూని అడ్డుగా పెట్టుకోండి.
- మీ ఇంటిని తరచుగా శుభ్రం చేసి, క్రిమిసంహారణ చేయండి.
- మీ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ చెక్ చేసుకోండి.
- మీ గర్భధారణకు సంబంధించి ఏవైనా ఆందోళనలు ఉంటే, మీకు జబ్బుచేస్తే లేదా మీకు COVID-19 ఉందని అనుమానం వస్తే, మీ హెల్త్ కేర్ ప్రొవైడర్కు వెంటనే కాల్ చేయండి.
గర్భధారణ మరియు COVID-19 వ్యాక్సిన్
- గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు, గర్భం ధరించడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నవాళ్లకు లేదా భవిష్యత్తులో గర్భం ధరించే అవకాశం ఉన్నవాళ్లకు COVID-19 వ్యాక్సిన్ సిఫారసు చేస్తున్నారు.
- COVID-19 కోసం వేసే వ్యాక్సిన్లు గర్భధారణ సమయంలోనూ సురక్షితమైనవని, సమర్థవంతంగా పనిచేస్తాయని చూపించే ఆధారాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో ఎదురౌతాయని గుర్తించిన లేదా ఎదురయ్యే అవకాశం ఉన్న ప్రమాదాల కంటే, COVID-19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నట్లుగా డేటా సూచిస్తోంది.
- గర్భవతులు అర్హత సంపాదించినప్పుడు, అప్డేట్ చేయబడిన COVID-19 వ్యాక్సిన్ డోసు వేయించుకోవాలి.
- గర్భవతుల్లో లేదా వారి శిశువుల్లో కూడా COVID-19 వ్యాక్సిన్ల కారణంగా COVID-19 ఇన్ఫెక్షన్ సోకదు.
- COVID-19 వ్యాక్సిన్లతో సహా ఏ వ్యాక్సిన్ వల్ల కూడా మహిళల్లో లేదా పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు ఎదురవుతాయనేందుకు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు.
- మీరు గర్భంతో ఉన్నారా మరియు COVID-19 వ్యాక్సిన్ గురించి మరిన్ని ప్రశ్నలు ఉన్నాయా? మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి లేదా MotherToBabyని సంప్రదించండి. ఫోన్ లేదా చాట్ ద్వారా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వారి నిపుణులు అందుబాటులో ఉంటారు. గోప్యంగా అందించే ఈ ఉచిత సేవ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉద. 8 నుండి సాయం. 5 గం. వరకు అందుబాటులో ఉంటుంది. ప్రత్యక్షంగా చాట్ చేయడానికి లేదా ఇమెయిల్ పంపడానికి MotherToBaby (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)ని సందర్శించండి లేదా 1-866-626-6847 కి కాల్ చేయండి (ఇంగ్లీష్ మరియు స్పానిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది).
నవజాత శిశువుకు COVID-19 సోకితే, ఎలా చూసుకోవాలి?
- గర్భధారణ సమయంలో COVID-19 వచ్చిన చాలా మంది నవజాత శిశువులకు పుట్టినప్పుడు COVID-19 ఉండదు.
- COVID-19 పరీక్షలో పాజిటివ్‌గా వచ్చిన చాలామంది నవజాత శిశువులకు తేలికపాటి రోగలక్షణాలు కనిపించాయి లేదా ఎలాంటి రోగలక్షణాలు లేవు అలాగే వాళ్లు కోలుకున్నారు. కొందరు నవజాత శిశువులు COVID-19 కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారని నివేదికలు సూచిస్తున్నాయి.
- COVID-19 కారణంగా మీరు ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు మీకు నవజాత శిశువు ఉంటే, మీ ఐసోలేషన్ కాలవ్యవధి ముగిసే వరకు దయచేసి ఈ జాగ్రత్తలు పాటించండి:
- మీతో కలసి ఉండని వారి నుండి వేరుగా ఉండడానికి ఇంట్లోనే ఉండండి.
- వ్యాధి సోకని ఇతర కుటుంసభ్యుల నుంచి వేరుగా (విడిగా) ఉండండి, అందరూ తిరిగే స్థలాల్లో మాస్క్ ధరించండి.
- మీ నవజాత శిశువును చూసుకోవడానికి అప్ టు డేట్‌గా ఉన్న మరియు తీవ్రంగా జబ్బుపడే అవకాశం ఎక్కువగాలేని ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిని నియమించండి. సాధ్యమైతే, వేరే సంరక్షకులు శిశువుకు పాలు పట్టేలా మీ పాలను పిండి ఇవ్వండి. మీరు ఫార్ములా ఇస్తున్నట్లయితే, దాన్ని తయారు చేయమని వేరే సంరక్షకులను కోరండి.
- మీ ఐసోలేషన్ కాలవ్యవధి ముగిసే ముందే మీ నవజాత శిశువును మీరే చూసుకోవాల్సి వస్తే, మీ బిడ్డను ఎత్తుకున్నప్పుడు లేదా పాలు ఇస్తున్నప్పుడు సిఫారసు చేయబడ్డ మాస్కు వేసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించండి.
- మీ నవజాత శిశువులో COVID-19 రోగలక్షణాల ఉన్నాయేమో పరీక్షిస్తూ ఉండండి.
- తల్లి పాలు ద్వారా శిశువుకు వైరస్ సోకే అవకాశం లేదని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయి. COVID-19 వ్యాక్సిన్ వేయించుకున్న వారు తల్లిపాల ద్వారా బిడ్డకు రక్షణాత్మక యాంటీబాడీలు బదిలీ చేస్తున్నారని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తేలింది. మీకు COVID-19 ఉన్నప్పటికీ, తల్లిపాలు లేదా చనుబాలు ఇవ్వాలనుకుంటే:
- పాలిచ్చే ముందు లేదా సిద్ధమయ్యే ముందు మీ చేతులు కడుక్కోండి.
- మీ శిశువుకు చనుపాలు ఇస్తున్నప్పుడు లేదా తల్లి పాలు ఇస్తున్నప్పుడు మరియు మీ శిశువుకి 6 అడుగుల (2 మీటర్ల) కంటే తక్కువ దూరంలో ఉన్నప్పుడల్లా మాస్క్ ధరించండి.
కొత్తగా తల్లితండ్రులైన వారికి మరియు కాబోయేవారికి లేదా వారి ప్రియమైన వారికి అవసరమైనప్పుడల్లా మానసిక ఆరోగ్య సమాచారం మరియు మద్దతు అందించడానికి Perinatal Support Washington వార్మ్ లైన్ అందుబాటులో ఉంది. 1-888-404-7763 ద్వారా Perinatal Support Washington వార్మ్ లైన్‌కు కాల్ చేయండి లేదా Perinatal Support వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఇంగ్లీష్ మాత్రమే). warmline@perinatalsupport.orgకి టెక్స్ట్ లేదా ఇమెయిల్ చేయండి.
సహాయం పొందడం ముఖ్యం. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉద. 9 నుండి సాయం. 4:30 వరకు వార్మ్ లైన్ నుండి ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వబడుతుంది. (ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో మాత్రమే). సాయంత్రాలు మరియు వారాంతాల్లో దయచేసి ఒక మెసేజ్ పంపండి మరియు 1-12 గంటల లోపు ఎవరో ఒకరు మీకు తిరిగి కాల్ చేస్తారు. మా వార్మ్లైన్లో సామాజిక కార్యకర్తలు, లైసెన్స్ పొందిన థెరపిస్టులు లేదా ప్రసూతి అనంతరం క్రుంగుబాటుతో/గాబరాతో బాధపడిన తల్లిదండ్రులు పనిచేస్తారు.
- మిమ్మల్ని మీరు, అలాగే మీ కుటుంబాన్ని చూసుకోండి
-
- విశ్వసనీయ మీడియా అవుట్‌లెట్‌లు, స్థానిక మరియు ప్రభుత్వ ఆరోగ్య ఏజెన్సీలు అందించే సమాచారాన్ని, పబ్లిక్ హెల్త్ వెబ్‌సైట్‌ల నుండి వచ్చే అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చూస్తూ తాజా సిఫారసులు ఏమిటో తెలుసుకోండి.
- విశ్వసనీయ మీడియా అవుట్‌లెట్‌లు, స్థానిక మరియు ప్రభుత్వ ఆరోగ్య ఏజెన్సీలు అందించే సమాచారం మరియు పబ్లిక్ హెల్త్ వెబ్‌సైట్‌ల నుండి వచ్చే అప్‌డేట్‌ల ద్వారా ప్రస్తుతం మహమ్మారి ఎలా ఉందో, అదనపు సిఫార్సులు ఏమిటో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి.
- ఫోన్ నంబర్‌లు, వెబ్‌సైట్‌లు మరియు సోషల్ మీడియా అకౌంట్ల వంటి కమ్యూనిటీ వనరుల జాబితా తయారుచేసుకోండి. పాఠశాలలు, వైద్యులు, ప్రజారోగ్య సంస్థలు, సామాజిక సేవలు, కమ్యూనిటీ మానసిక ఆరోగ్య కేంద్రాలు మరియు హాట్‌లైన్‌లు కూడా మీరు వాటిలో చేర్చవచ్చు.
- ఫోన్ ద్వారా లేదా ఆన్‌లైన్ సేవల ద్వారా కుటుంబం మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండండి.
- ప్రాథమిక ఆరోగ్య సామాగ్రి (సబ్బు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్, టిష్యూలు, థర్మామీటర్, జ్వరం తగ్గించే ఔషధాలు మరియు హోమ్ COVID-19 టెస్టింగ్ కిట్‌లు లాంటివి) అందుబాటులో ఉంచుకోండి.
- మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ వేసుకునే ఔషధాల సరఫరాలు ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
మీ కుటుంబంలోని యువ సభ్యుల కోసం మద్దతు
- మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఫోన్, టెక్ట్స్, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ వారి నుండి నిరంతర మద్దతు పొందండి, బంధాన్ని కాపాడుకోండి.
- వార్తలు మీ పిల్లలను బాధపెట్టేలా ఉంటే, కాస్త విరామం తీసుకోవడం మర్చిపోకండి. ఇంటర్నెట్ లేదా ఇతర మూలాల ద్వారా వారికి అందే ఏదైనా సమాచారం గురించి స్పష్టంగా వివరించడం కోసం వారితో మాట్లాడండి.
- ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం ద్వారా, ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకునేలా వారికి సహాయపడడం ద్వారా పిల్లలకు మద్దతు ఇవ్వడంపై మనసుపెట్టండి.
- మీకున్న భావాల గురించి చెప్పండి, వాటి గురించి ఒప్పుకోండి.
- డ్రాయింగ్లు లేదా ఇతర కార్యకలాపాల ద్వారా వారి భావాలు వ్యక్తం చేసేలా సహాయం చేయండి.
- వారికి ఊరటనివ్వండి, మామూలు కన్నా ఎక్కువ ఓపిక చూపించండి.