Care Connect Washington

మీరు లేదా మీ కుటుంబం COVID-19 బారిన పడ్డారా? మీరు 1-833-453-0336కు కాల్ చేసి Care Connect Washington ని సంప్రదించడం ద్వారా, మీ కమ్యూనిటీలోని స్థానిక సంరక్షణ కోఆర్డినేటర్‌ సహాయం పొందవచ్చు. మీ అవసరాలను అర్థం చేసుకోవడానికి కేర్ కోఆర్డినేటర్ సమయం తీసుకుంటారు, ఆ తరువాత, అందుబాటులో ఉన్న ఇంటి వసతి, ఆరోగ్య భీమా, పిల్లల సంరక్షణ, ఆహార సహాయ కార్యక్రమాలు మరియు ఇతర రకాల సేవలు మీకు మరియు మీ మొత్తం కుటుంబానికి అందేలా సహాయపడతారు. అందుబాటులో ఉన్న సేవలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. 

మీరు లేదా మీ కుటుంబం COVID-19 బారిన పడ్డారా? మీరు 1-833-453-0336కు కాల్ చేసి Care Connect Washington ని సంప్రదించడం ద్వారా, మీ కమ్యూనిటీలోని స్థానిక సంరక్షణ కోఆర్డినేటర్‌ సహాయం పొందవచ్చు. మీ అవసరాలను అర్థం చేసుకోవడానికి కేర్ కోఆర్డినేటర్ సమయం తీసుకుంటారు, ఆ తరువాత, అందుబాటులో ఉన్న ఇంటి వసతి, ఆరోగ్య భీమా, పిల్లల సంరక్షణ, ఆహార సహాయ కార్యక్రమాలు మరియు ఇతర రకాల సేవలు మీకు మరియు మీ మొత్తం కుటుంబానికి అందేలా సహాయపడతారు. అందుబాటులో ఉన్న సేవలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. 

Care Connect Washington అనే కార్యక్రమానికి Department of Health (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్)తో, ఎనిమిది ప్రాంతీయ కేంద్రాలతో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాజాల్లోని 100 కంటే ఎక్కువ స్థానిక సంరక్షణ కోఆర్డినేటర్‌లతో భాగస్వామ్యం ఉంది. ప్రజలు స్థిరపడి మెరుగైన ఆరోగ్యం సాధించడానికి సహాయపడడం ద్వారా, కేర్ కనెక్ట్ వ్యవస్థ సమాజాలను బలోపేతం చేస్తుంది. నిరుద్యోగ ప్రయోజనాలు, సబ్సిడీ గృహాలు లేదా పిల్లల సంరక్షణ లాంటి కార్యక్రమాలకు అలాగే, Supplemental Nutritional Assistance Program (SNAP, సప్లిమెంటల్ న్యూట్రీషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్) లేదా Special Supplemental Nutrition Program for Women, Infants and Children  (WIC, స్త్రీలు, శిశువులు మరియు పిల్లల కోసం ప్రత్యేక సప్లిమెంటల్ న్యూట్రీషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్), Apple Health మరియు అలాంటి అనేక వేరే ఆహార సహాయ కార్యక్రమాలకు బాధిత వ్యక్తి దరఖాస్తు వేసుకోవడానికి స్థానిక సంరక్షణ కోఆర్డినేటర్‌లు ఆయనకు సహాయం చేస్తారు. ఆయా వ్యక్తులకు అవసరమైన సమాచారాన్ని వారికి ఇష్టపడే భాషలో Care Connect అందిస్తుంది.

Care Connect regions map with services in these counties: Grays Harbor, Mason, Thurston, Pacific, Wahkiakum, Lewis, Cowlitz, Clark, Skamania, Clickitat, Yakima, Benton, Franklin, Adams, Lincoln, Ferry, Stevens, Pend Oreille, Spokane, King, Pierce, Snohomish, Skagit, Whatcom

కొవిడ్-19 రిలీఫ్ కొరకు ప్రాంతీయ విధానం

స్టేట్ Department of Health, స్థానిక ఆరోగ్య సంస్థలు మరియు వారి భాగస్వాములతో పనిచేస్తుంది, Care Connect Washingtonని రీజియన్​లవారీగా ఆపరేటర్ చేస్తోంది. ఔషధాల డెలివరీ, ఆరోగ్య సంరక్షణ, నిరుద్యోగ భృతి కొరకు దరఖాస్తు చేయడంలో సాయపడటం, స్థానిక హౌసింగ్ ఏజెన్సీలు, ఫుడ్ బ్యాంకులు, చైల్డ్ ప్రొవైడర్​లు మరియు వారు అర్హత కలిగిన మరిన్ని సర్వీస్​లతో వ్యక్తులను అనుసంధానం చేయడానికి ప్రతి రీజియన్ కూడా కమ్యూనిటీ ఆధారిత భాగస్వాములతో పనిచేస్తుంది.

సేవలు ఎక్కడ దొరకుతాయి?

COVID-19 బారిన పడినవారి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి.

తూర్పు రీజియన్

Better Health Together (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Adams, Ferry, Lincoln, Pend Oreille, Spokane మరియు Stevens కౌంటీల కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

King కౌంటీ

HealthierHere (ఇంగ్లీషులో మాత్రమే) అనేది King కౌంటీ కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

నార్త్ సెంట్రల్ రీజియన్

Action Health Partners (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Chelan, Douglas, Grant మరియు Okanogan కౌంటీల కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

నార్త్ రీజియన్

North Sound Accountable Community of Health (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Island, San Juan, Skagit, Snohomish మరియు Whatcom కౌంటీల కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

నార్త్ వెస్ట్ రీజియన్

WithinReach (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Clallam, Jefferson మరియు Kitsap కౌంటీల కోసం సంరక్షణ సమన్వయ సేవలను అందిస్తుంది..

Pierce కౌంటీ

Elevate Health (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Pierce కౌంటీ కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

సౌంత్ సెంట్రల్ రీజియన్

Greater Health Now (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Kittitas, Walla Walla, Whitman, Columbia, Garfield, Asotin, Yakima, Benton మరియు Franklin కౌంటీల కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

సౌత్వెస్ట్ రీజియన్

Southwest Washington Accountable Community of Health (SWACH) (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Clark, Klickitat మరియు Skamania కౌంటీల కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

వెస్ట్ రీజియన్

Cascade Pacific Action Alliance వారి Community CarePort (ఇంగ్లీషులో మాత్రమే) అనేది Cowlitz, Wahkiakum, Pacific, Grays Harbor, Mason, Thurston మరియు Lewis కౌంటీల కోసం Care Connect Washington కేంద్రంగా పనిచేస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

Care Connect Washington సేవలు నాకు అందుతాయా?

గతంలో మీకు COVID-19 వచ్చివుంటే, ఈ సేవలు పొందడానికి మీరు అర్హులవుతారు. ప్రస్తుతం COVID-19తో బాధపడుతున్నవాళ్లకు లేదా గతంలో COVID-19 బారినపడివాళ్లకు ఈ సేవలు అందుతాయి.

1-833-453-0336 కి కాల్ చేయండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది. 

స్థానిక సంరక్షణ కోఆర్డినేటర్‌ మీ అవసరాలు అర్థం చేసుకొని వనరులు మరియు సేవలు మీకు అందేలా సహాయం చేయడానికి మిమ్మల్ని సంప్రదిస్తారు.

నాకు ఎలాంటి సహాయం అందుతుంది?

మీ గురించి తెలుసుకోవడానికి, మీ అవసరాలు అర్థం చేసుకోవడానికి మీ స్థానిక సంరక్షణ కోఆర్డినేటర్‌ సమయం వెచ్చిస్తారు. ఆ తర్వాత, మీకు మద్దతు అందించడానికి స్థానికంగా అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ గృహాలు లేదా పిల్లల సంరక్షణ, నిరుద్యోగ ప్రయోజనాలు, ఆహార సహాయం లాంటి అనేక వనరులను ఆయన గుర్తిస్తారు. ప్రాంతాన్నిబట్టి సేవలు మారతాయి. మీరు ఇష్టపడే భాషలో Care Connect Washington మీకు అవసరమైన సమాచారం అందిస్తుంది. Care Connect సేవలు ఎలాంటి ఖర్చు లేకుండా లభ్యమవుతాయి. 

నాకు సహాయం అందడానికి ఎంత సమయం పడుతుంది?

రీఫరల్ అందుకున్న ఒక్కరోజులోపు సహాయం అందించడానికి మీ ప్రాంత సంరక్షణ కోఆర్డినేటర్‌ అన్నివిధాలుగా ప్రయత్నిస్తారు.

మీరు నా సమాచారాన్ని ఎలా సంరక్షిస్తారు?

మీ సంరక్షణ కోఆర్డినేటర్‌ కాల్ సెంటర్ నుండి తాను పొందే సమాచారాన్ని నిర్ధారించుకొని మీ అవసరాల గురించి అడుగుతారు. మీ సంరక్షణ కోఆర్డినేటర్‌తో మీరు పంచుకునే ఏ సమాచారమైనా గోప్యంగానే ఉంటుంది. మీకు ఏ ముఖ్యమైన సేవలు అవసరమౌతాయో గుర్తించడం కోసం సంరక్షణ కోఆర్డినేటర్‌ సేవలు అందించే ఉద్యోగులు మరియు Department of Health (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) వారు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు. వ్యక్తిగత లేదా రహస్య ఆరోగ్య సమాచారాన్ని వారు ఎవరితోనూ పంచుకోరు.

Care Connect regions map with services in these counties: Grays Harbor, Mason, Thurston, Pacific, Wahkiakum, Lewis, Cowlitz, Clark, Skamania, Clickitat, Yakima, Benton, Franklin, Adams, Lincoln, Ferry, Stevens, Pend Oreille, Spokane, King, Pierce, Snohomish, Skagit, Whatcom
దీనికి ఎంత ఖర్చు అవుతుంది?

ఈ సర్వీస్ కొరకు మీకు ఛార్జ్ చేయరు. Care Connect Washington వాషింగ్టన్ రాష్ట్రంలో కొవిడ్-19 ప్రతిస్పందనకు మద్దతు ఇవ్వడానికి ఫెడరల్ ఫండ్స్ పొందింది.

నేను సాయం పొందడానికి ముందు దీనికి ఎంత సమయం పడుతుంది?

రీఫరల్ అందుకున్న ఒక్కరోజులోపుగా సాయం అందించడానికి మీ రీజినల్ కేర్ కోఆర్డినేటర్ అన్నివిధాలుగా ప్రయత్నిస్తారు.

నేను సాయం పొందేటప్పుడు ఇంకా ఐసోలేషన్ లేదా క్వారంటైన్లో ఉండాలా?

అవును. మన పొరుగువారికి, స్నేహితులకు, కుటు౦బసభ్యులకు, తోటి కార్మికులకు కోవిడ్-19 వ్యాప్తి చె౦దకు౦డా ఉ౦డే౦దుకు, మన సమాజాలపై దాని విస్తృత ప్రతికూల ప్రభావాలను తగ్గి౦చడానికి ఐసోలేషన్ మరియు క్వారంటైన్లు ముఖ్యమైన టూల్స్. మీ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ పీరియడ్ దాటి మీకు సాయం అవసరం అయితే, మీ రీజనల్ కేర్ కో ఆర్డినేటర్ కొనసాగుతున్న ఆరోగ్య మరియు సామాజిక అవసరాలకు మద్దతు ఇచ్చే దీర్ఘకాలిక సేవలకు మిమ్మల్ని కనెక్ట్ చేయవచ్చు.

ఐసోలేషన్ మరియు క్వారంటైన్ మధ్య తేడా ఏమిటి?

ఐసోలేషన్: మీరు కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా టెస్ట్ చేయబడి, రోగలక్షణాలు ఉన్నట్లయితే (ఇంగ్లిష్​లో మాత్రమే), లేదా ఫలితాల కొరకు ఎదురు చూస్తుంటే, మీ అస్వస్థతను వ్యాప్తి చెందించకుండా పరిహరించడానికి మీరు ఐసోలేషన్​లో ఉండాల్సి ఉంటుంది.

క్వారంటైన్: మీరు కొవిడ్-19కు ఎక్స్​ప్లోజ్ అయి, రోగలక్షణాలు లేనట్లయితే (ఇంగ్లిష్​లో మాత్రమే), మీ వ్యాక్సినేషన్ స్థితిని బట్టి మీరు క్వారంటైన్​లో ఉండాల్సి రావొచ్చు. ఇది మీరు అస్వస్థతకు గురైనట్లుగా మీరు తెలుసుకోవడానికి ముందు వైరస్ వ్యాప్తిని పరిహరిస్తుంది.

మీ క్వారంటైన్ పీరియడ్ ఎంతకాలం ఉండాలనే దానిపై CDC (ఇంగ్లిష్​లో మాత్రమే) మరియు DOH (ఇంగ్లిష్​లో మాత్రమే) నుంచి తాజా మార్గదర్శనం అనుసరించండి (ఇంగ్లిష్ మాత్రమే).

నా కొవిడ్-19 రోగలక్షణాలు క్షీణించినట్లయితే నేను ఏమి చేయాలి?

మీ రోగలక్షణాలు క్షీణించినట్లయితే వెంటనే వైద్యసాయం పొందండి. ఏదైనా దిగువ లక్షణాలను కనపరిచినట్లయితే, వెంటనే అత్యవసర వైద్యసాయం పొందండి:

  • శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం
  • ఛాతీలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి
  • కొత్త గందరగోళం
  • లేవలేకపోవడం లేదా మెలకువగా ఉండలేకపోవడం
  • పెదవులు లేదా ముఖం నీలంగా మారిపోవడం

*ఇది పూర్తి జాబితా కాదు. తీవ్రమైన లేదా మీకు సంబంధించిన ఏవైనా ఇతర లక్షణాల కొరకు దయచేసి మీ వైద్య ప్రదాతకు కాల్ చేయండి.

మీకు వైద్య అత్యవసర పరిస్థితి ఉండి, 911కు కాల్ చేయాల్సి ఉంటే, మీకు కొవిడ్-19 ఉన్నది లేదా ఉండవచ్చు అని డిశ్పాచర్​కు చెప్పండి. సాధ్యమైతే, అత్యవసర వైద్య సర్వీస్​లు రావడానికి ముందు ఫేస్ కవరింగ్ పెట్టుకోండి.

నేను Care Connect Washington సర్వీస్లను ఎంతకాలం పొందుతాను?

మీ రీజనల్ కేర్ కో ఆర్డినేట్ 21 రోజుల వరకు మీకు సాయాన్ని అందిస్తారు. నిర్ధిష్ట పరిస్థితుల్లో మీ ప్రస్తుత ఆరోగ్య మరియు సామాజిక అవసరాలకు మద్దతు ఇవ్వడానికి దీర్ఘకాలిక సర్వీస్ల కొరకు కేర్ కోఆర్డినేటర్ మిమ్మల్ని సంప్రదించవచ్చు.

Care Connect Washington ఎలా పనిచేస్తుంది?

Care Connect Washington ఇది సమన్వయ సంరక్షణకు ప్రభుత్వ మద్దతు, స్థానికంగా కేంద్రీకృతమైన విధానం.

Washington State Department of Health ప్రాంతీయ సంరక్షణ సమన్వయ ప్రతిస్పందనను నిర్వహిస్తుంది, నియామకం మరియు ట్రైనింగ్​కు మద్దతు ఇస్తుంది, రాష్ట్రవ్యాప్త మరియు స్థానిక వనరుల మధ్య వారధిని ఏర్పరుస్తుంది, ఫండింగ్ మరియు సాంకేతిక మౌలిక సదుపాయాలు వంటి పూల్డ్ వనరులను నిర్వహించడం ద్వారా ఫలితాలను ఆప్టిమైజ్ చేస్తుంది.

వ్యక్తిగత రీజియన్​లు విజయవంతమైన ఐసోలేషన్ మరియు క్వారంటైన్​కు మద్దతు ఇవ్వడానికి స్థానిక వనరులకు వ్యక్తులకు సాయం అందించేందుకు మరియు అనుసంధానం చేసేందుకు కమ్యూనిటీ ఆధారిత వర్క్​ఫోర్స్​ని గుర్తించి, తరలిస్తుంది. రీజియన్​లు అవసరమైన గూడ్స్ మరియు సర్వీస్​లు అందించడానికి, స్థానిక ఎకానమీ రికవరీకి దోహదపడటానికి సాయపడేందుకు స్థానిక వెండర్​లతో పనిచేస్తాయి.

ప్రతి వ్యక్తి ప్రత్యేక ఆరోగ్య మరియు సామాజిక అవసరాలను మదింపు చేయడానికి, మద్దతు ఇవ్వడానికి, ట్రాక్ చేయడానికి, అలానే కొవిడ్ కేర్ యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి కేర్ కో ఆర్డినేటర్​లను కేటాయిస్తారు. ప్రోగ్రామ్ సాధ్యమైనంత వరకు వ్యక్తులు తాము కోరుకునే భాషలో వనరులతో అనుసంధానం చేయడంతోపాటుగా వారికి మద్దతు లభించినట్లుగా ధృవీకరించుకునేందుకు ప్రక్రియ అంతటా ఫాలోప్ చేస్తుంది.

మీరు నా సమాచారాన్ని ఎలా సంరక్షిస్తారు?

మీ కేర్ కో ఆర్డినేటర్ కొవిడ్-19 సమాచార మాట్లైన్ నుంచి వారు పొందే సమాచారాన్ని ధృవీకరిస్తారు మరియు మీ అవసరాల గురించి అడుగుతారు. మీ కేర్ కో ఆర్డినేటర్తో మీరు పంచుకునే ఏదైనా సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది. మీకు అవసరం కాగల అత్యావశ్యక సర్వీస్లను గుర్తించడానికి కేర్ కో ఆర్డినేషన్ సర్వీస్లు అందించే ఉద్యోగులు మరియు Department of Healthలు సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వారు వ్యక్తిగత లేదా ప్రైవేట్ ఆరోగ్య సమాచారాన్ని పంచుకోరు.

Care Connect Washington కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధిస్తుంది?

అత్యావశ్యక సామాజిక మరియు ఆరోగ్య అవసరాలను తీర్చడానికి సాయాన్ని పొందే వ్యక్తులు హోమ్ ఐసోలేషన్ మరియు క్వారైంటైన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించిన లేదా పాజిటివ్గా పరీక్షించిన వ్యక్తులకు ఎక్స్ప్లోజ్ అయిన వ్యక్తులు ఇంటిలోనే ఐసోలేషన్ లేదా క్వారంటైన్లో ఉండేలా ధృవీకరించడం ద్వారా, Care Connect Washington కొవిడ్-19 వ్యాప్తిని తగ్గించగలదు మరియు ఆర్థిక రికవరీని పెంచుతుంది. కొవిడ్-19కు అత్యంత హాని కలిగించగల ఆరోగ్య మరియు సామాజిక అవసరాలతో ఉండే వ్యక్తులపై సిస్టమ్ దృష్టి కేంద్రీకరించడం వల్ల, ఇది అంతర్లీన ఆరోగ్య అసమానతలను పరిష్కరించడానికి, కోవిడ్-19 ద్వారా అసమానంగా ప్రభావితమైన సమాజాలకు మద్దతు ఇవ్వడానికి సాయపడుతుంది.

ఎవరికైనా Care Connect Washington నుంచి సాయం అవసరం అయితే నేను ఎవరిని సంప్రదించాలి?

మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ప్రస్తుతం ఇంటి వద్ద ఐసోలేషన్ లేదా క్వారంటైన్​లో ఉండి, సాయం అవసరం అయితే, స్టేట్ కొవిడ్-19 సమాచార హాట్​లైన్​ని సంప్రదించండి.

స్టేట్ కొవిడ్-19 సమాచారం హాట్​లైన్: 1-800-525-0127 ను డయల్ చేసి, ఆ తర్వాత #ను నొక్కండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది.

  • సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు,
  • మంగళవారం నుంచి ఆదివారం వరకు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
Care Connect Washingtonలో ప్రవర్తనాత్మక ఆరోగ్య సర్వీస్లు లభ్యమవుతాయా?

అవును! మీ కమ్యూనిటీలో ప్రవర్తనాత్మక ఆరోగ్య సర్వీస్లను మీరు పొందడానికి మీ కేర్ కో ఆర్డినేటర్ సాయపడగలడు.

Tribal Nations(ట్రైబల్ నేషన్స్)సభ్యుల కొరకు కేర్ కో ఆర్డినేషన్ సపోర్ట్ సర్వీస్లు లభ్యమవుతాయా?

అవును. మరింత తెలుసుకోవడానికి, COVID19.CareCoordination@doh.wa.gov కు మెయిల్ చేయండి లేదా 564-999-1565కు కాల్ చేయండి.

ఇంటర్ప్రెటీటింగ్ సర్వీస్లు లభ్యమవుతాయా?

అవును. మీరు స్టేట్ కొవిడ్-19 సమాచార హాట్లైన్ను 1-800-525-0127 వద్ద కాల్ చేసి, #ని ప్రెస్ చేసినప్పుడు, భాషా సాయం లభ్యమవుతుంది.

మీరు కేర్ కో ఆర్డినేటర్తో అనుసంధానమైన తరువాత, Care Connect Washington మీరు కోరుకునే భాషలో సామాచారాన్ని అందిస్తుంది.

వనరులు

వనరులు మరియు సిఫారసుల వెబ్​పేజీ: వస్త్రంతో చేసిన ఫేస్ కవరింగ్​లు, క్వారంటైన్, కుటుంబాలకు సంరక్షణ, కొవిడ్-19కు ఎక్స్​పోజ్ కావడం, లక్షణాలు మరియు మరిన్నింటిపై సమాచారాన్ని కనుగొనండి. మీరు ఇష్టపడే భాషలో మెటీరియల్స్​ని సార్ట్ చేయవచ్చు.