కొవిడ్-19 వ్యాక్సిన్

6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయబడిన 2024-2025 COVID-19 వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిఫార్సు చేస్తోంది (ఇంగ్లీష్ మాత్రమే).

వ్యాక్సిన్ వేయించుకోని లేదా CDC సిఫార్సు చేసిన డోసులు పూర్తిగా వేయించుకోనివాళ్లతో పోలిస్తే, వ్యాక్సిన్ల విషయంలో అప్ టు డేట్‌గా ఉన్నవాళ్లకు COVID-19 కారణంగా తీవ్రంగా జబ్బుపడే, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చే, మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. 

అక్టోబర్ 23, 2024 - Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిఫార్సు చేస్తున్న ప్రకారం, 65 ఏళ్లు ఆపైబడినవాళ్లు అలాగే మోస్తరుగా లేదా తీవ్ర స్థాయిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు అప్‌డేట్ చేయబడిన 2024-2025 COVID-19 వాక్సిన్ డోసు అదనంగా వేయించుకోవాలి. వ్యాక్సిన్ ప్రభావం మీద ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటానే కాకుండా, COVID-19 కారణంగా పెద్ద వయసువాళ్లు తీవ్రంగా జబ్బుపడే ప్రమాదం పెరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సిఫార్సు గుర్తించింది.
5 ఏళ్లు ఆపైబడినవారిలో చాలామంది అప్ టూ డేట్‌గా ఉండడం కోసం, అప్డేట్ చేయబడిన 2024-2025 డోసు ఒకటి తీసుకుంటే సరిపోతుంది.

  • 65 ఏళ్లు ఆపైబడినవాళ్లు 2024-2025 COVID-19 వ్యాక్సిన్లలో ఏదైనా ఒకదానిని 6 నెలల వ్యవధిలో 2 డోసులు వేయించుకోవాలి. అవసరమైతే, 2024-2025 COVID-19 వ్యాక్సిన్ 1వ డోసు వేసుకుని 2 నెలలు పూర్తికాగానే 2వ డోసు వేయించుకోవచ్చు. 

మోస్తరుగా లేదా తీవ్ర స్థాయిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న 6 నెలలు ఆపైబడినవాళ్లు 2024-2025 COVID-19 వ్యాక్సిన్‌ని 6 నెలల వ్యవధిలో కనీసం 2 డోసులు వేయించుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి కోసం వ్యాక్సినేషన్ గురించి ఇక్కడ

2 రకాల COVID-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి:

  • mRNA వ్యాక్సిన్లు
    • Moderna 2024-2025 COVID-19 వ్యాక్సిన్ - 6 నెలలు ఆపైబడినవాళ్ల కోసం అందుబాటులో ఉంది
    • Pfizer 2024-2025 COVID-19 వ్యాక్సిన్ - 6 నెలలు ఆపైబడినవాళ్ల కోసం అందుబాటులో ఉంది
  • ప్రోటీన్ సబ్‌యూనిట్ వ్యాక్సిన్లు
    • Novavax 2024-2025 COVID-19 వ్యాక్సిన్ - 12 నెలలు ఆపైబడినవాళ్ల కోసం అందుబాటులో ఉంది

o    Novavax 2024-2025 COVID-19 వ్యాక్సిన్ - 12 నెలలు ఆపైబడినవాళ్ల కోసం అందుబాటులో ఉంది

సిఫార్సు చేయబడిన మరియు వయస్సుకి-తగిన వ్యాక్సిన్లు 1 కంటే ఎక్కువ అందుబాటులో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఒక COVID-19 వ్యాక్సిన్‌నే తీసుకోమని సిఫార్సు చేయడం జరగదు.

మీకు, మీ కుటుంబానికి ఏ COVID-19 వ్యాక్సిన్లు సరిపోతాయనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి క్రింద పేర్కొన్న వనరుల్లో కొన్నిటిని చూడండి:

ఇటీవల CDC విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, వాషింగ్టన్ స్టేట్ Department of Health (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) దాని వెబ్‌పేజీలను, పత్రాలను ఇప్పుడు అప్‌డేట్ చేస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను కొవిడ్-19 వ్యాక్సిన్ని ఎందుకు వేయించుకోవాలి?

కోవిడ్-19 వ్యాక్సిన్లు మిమ్మల్ని అనేక విధాలుగా రక్షించగలుగుతాయి:

  • మీకు కోవిడ్-19 వచ్చినా దాని వలన తీవ్రంగా జబ్బుపడే అవకాశాన్ని బాగా తగ్గిస్తాయి
  • పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీరు ఆసుపత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి మరియు కొవిడ్-19 నుంచి మరణించే మీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
  • COVID-19 వ్యాక్సిన్ల విషయంలో అప్ టూ డేట్‌గా ఉండడం వల్ల, మీరు దీర్ఘకాలిక COVID (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)కి గురయ్యే అవకాశం తగ్గుతుంది.
  • వ్యాక్సినేషన్లు సమాజంలో సంరక్షించే వ్యక్తుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందడాన్ని క్లిష్టతరం చేస్తుంది.
  • వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చేయడంలో వ్యాక్సిన్కున్న సామర్థ్యం గురించి నిపుణులు తమ అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.

వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు వైరస్ ఇంకా సోకవచ్చు, అది ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కొంతమంది వ్యక్తులు వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్ని పొందలేరు, ఇది వారి కొవిడ్-19కు మరింత దుర్భలమైనవారిగా చేస్తుంది మీరు వ్యాక్సిన్ వేయించుకోనట్లయితే, కొవిడ్-19 వేరియెంట్  (ఇంగ్లిష్ మాత్రమే) వల్ల ఆసుపత్రిలో చేరడం లేదా మరణించేందుకు అధిక ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు మరియు మీ కుటుంబం, పొరుగువారు మరియు కమ్యూనిటీని సంరక్షించడానికి సాయపడుతుంది.

నాకు వ్యాక్సిన్ ఎక్కడ దొరకుతుంది? 

వ్యాక్సిన్ కోసం Vaccines.gov (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే)ని చూడండి.

COVID-19 వ్యాక్సిన్‌లను డబ్బుపెట్టి కొనాలా?

ఇతర వ్యాక్సిన్లు లాగే, COVID-19 వ్యాక్సిన్లు కూడా చాలావరకు ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ద్వారా కవర్ చేయబడతాయి. Childhood Vaccine Program (చైల్డ్‌హుడ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్) (ఇంగ్లీషు మాత్రమే) ద్వారా, వాషింగ్టన్ రాష్ట్రంలోని పిల్లలందరికీ వారి 19వ పుట్టినరోజు పూర్తయ్యే వరకు COVID-19 వ్యాక్సిన్లు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. వయోజనులకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే లేదా వారి ప్లాన్‌లో వ్యాక్సిన్‌కు కవరేజీ లేకపోతే, వ్యాక్సిన్లు వేయించుకోవడానికి అయ్యే ఖర్చులను భరించడానికి సహాయపడే కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు 19 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సులో ఉన్న ఇన్సూరెన్స్ లేని లేదా తగినంత ఇన్సూరెన్స్ లేని వయోజనులైతే, Washington State Adult Vaccine Program (AVP, వాషింగ్టన్ స్టేట్ అడల్ట్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్) (ఇంగ్లీషు మాత్రమే)లో పాల్గొనే ప్రొవైడర్ ద్వారా తక్కువ ధరకు 2024-2025 COVID-19 వ్యాక్సిన్ సంపాదించడానికి మీరు అర్హులు. మీకు వ్యాక్సిన్ ఇవ్వడానికి మీ AVP ప్రొవైడర్ మీ నుండి అడ్మినిస్ట్రేటివ్ రుసుము వసూలు చేయవచ్చు. ఒకవేళ మీకు ఆ డబ్బు చెల్లించే స్థోమత లేకపోతే, ఆ మొత్తాన్ని మాఫీ చేయమని కోరవచ్చు. మీరు ఆ మొత్తాన్ని చెల్లించలేకపోతే AVP ప్రొవైడర్ COVID-19 వ్యాక్సిన్ ఇవ్వరని చెప్పి మిమ్మల్ని వెనక్కి పంపించడానికి వీలులేదు. AVP ప్రొవైడర్ మ్యాప్ (ఇంగ్లీషు మాత్రమే) ఉపయోగించి, భాగస్వామ్య ప్రొవైడర్లు ఎవరో తెలుసుకోవచ్చు. ఉత్పత్తి అందుబాటు, అందించే సమయం గురించిన మరింత సమాచారం కోసం మీరు మీ సమీపంలోని AVP ప్రొవైడర్‌కు కాల్ చేయవచ్చు.

COVID-19 వ్యాక్సిన్ అదనపు డోసు ఎవరు వేయించుకోవాలి? 

6 నెలలు ఆపైబడిన ప్రతి ఒక్కరూ అప్డేట్ చేయబడిన 2023-2024 COVID-19 వ్యాక్సిన్‌కు చెందిన కనీసం 1 డోసు తీసుకోవాలని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సిపార్సు చేస్తుంది. 

COVID-19 వ్యాక్సినేషన్‌కు సంబంధించి నేను అప్ టూ డేట్‌గా ఉన్నట్లు ఎప్పుడు పరిగణిస్తారు? 

మీ కోసం CDC సిఫార్సు చేసిన అత్యంత తాజా డోసుని మీరు వేయించుకొనివుంటే, COVID-19 వ్యాక్సినేషన్‌కి సంబంధించి మీరు అప్ టూ డేట్ (ఇంగ్లీష్ మాత్రమే)గా ఉన్నట్లు పరిగణిస్తారు.

కొవిడ్-19 వ్యాక్సిన్ పొందిన తరువాత నేను అస్వస్థతకు గురైనట్లయితే ఏమి జరుగుతుంది?

ఇతర రొటీన్ వ్యాక్సిన్ల వలేనే, కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత చేయి నొప్పి, జ్వరం, తలనొప్పి, లేదా అలసట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇవి వ్యాక్సిన్ పనిచేస్తున్నదని తెలిపే సూచనలు. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత సంభావ్య దుష్ప్రభావాల గురించి మరింత తెలుసుకోండి.

మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత అస్వస్థతకు గురైనట్లయితే, మీరు ప్రతికూల ఘటనను Vaccine Adverse Event Reporting System (VAERS, వ్యాక్సిన్ ప్రతికూల ఘటన రిపోర్టింగ్ సిస్టమ్) (ఇంగ్లిష్ మాత్రమే) కు నివేదించాలి. "ప్రతికూల ఘటన” అనేది వ్యాక్సినేషన్ తరువాత చోటు చేసుకునే ఏదైనా ఆరోగ్య సమస్య లేదా దుష్ప్రభావం. Vaccine Adverse Event Reporting System (VAERS, వ్యాక్సిన్ సంబంధిత ప్రతికూల ఘటనలు నివేదించే వ్యవస్థ) మరియు వ్యాక్సిన్ భద్రత గురించిన మరింత సమాచారం కోసం, Department of Health (DOH, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్) వారి వ్యాక్సిన్ భద్రత (ఇంగ్లీష్ మరియు స్పానిష్ మాత్రమే) వెబ్పేజీ సందర్శించండి.

నేను రొటీన్ వ్యాక్సినేషన్లు పొందేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ని పొందవచ్చా?

అవును. Advisory Committee on Immunization Practices (ACIP- ఇమ్యూనైజేషన్ విధానాలపై సలహా మండలి) మే 12, 2021 నాడు తన సిఫారసులను మార్చింది. మీరు ఇప్పుడు మీ ఇతర వ్యాక్సిన్లను పొందే అదే సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్ని పొందవచ్చు.

మీరు మీ బిడ్డ కొరకు అవసరమైన స్కూలు వ్యాక్సినేషన్లు (ఇంగ్లిష్ మాత్రమే) లేదా ఇతర సిఫారసు చేయబడ్డ వ్యాక్సిన్లు కొవిడ్-19 వ్యాక్సినేషన్ నుంచి విడిగా షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ మీ బిడ్డకు సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్లను వేయించడానికి మరో అవకాశం.

నేను గర్భవతిని, పాలిస్తున్నాను లేదా గర్భవతి కావాలని ప్లాన్ చేసినట్లయితే, కోవిడ్-19 వ్యాక్సిన్ ని పొందవచ్చా?

అవును, గర్భధారణ సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని డేటా చూపుతోంది. Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) (ఇంగ్లిష్ మాత్రమే), American College of Obstetricians and Gynecologists (ACOG- అమెరిక్ కాలేజీఆఫ్ అబ్స్ట్రెటీషియన్లు మరియు గైనకాలజిస్ట్లు), మరియు Society for Maternal-Fetal Medicine (SMFM- సొసైటీ ఫర్ మెటర్నల్-ఫీటల్ మెడిసిన్) (ఇంగ్లిష్ మాత్రమే)లు గర్భవతులైన, పిల్లలకు పాలిచ్చే లేదా గర్భం ధరించాలని భావించే మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ని సిఫారసు చేస్తున్నారు. మీకు వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే, గర్భధారణ మరియు పాలివ్వడం ద్వారా మీ బిడ్డ కొవిడ్-19కు విరుద్ధంగా యాంటీబాడీలు కూడా పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోని గర్భవతులైన మహిళలకు నెలలు నిండకముందే బిడ్డ పుట్టడం లేదా మృతశిశువులు పుట్టడం వంటి తీవ్రమైన సంక్లిష్టతల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదనంగా, గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్-19 వచ్చిన మహిళలకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ మరియు బ్రీతింగ్ ట్యూబ్ అవసరం అయ్యే అవకాశం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి మరిన్ని వనరుల కొరకు, దయచేసి వన్ వ్యాక్స్, టూ లైవ్స్ వెబ్సైట్లో తాజా సమాచారాన్ని చూడండి. 

18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వ్యాక్సిన్ పొందగలరా?

ప్రస్తుతానికి, 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వడానికి Pfizer-BioNTech (Pfizer) వ్యాక్సిన్, Moderna COVID-19 వ్యాక్సిన్ బ్రాంఢ్లకు అనుమతి ఉంది. 12 ఏళ్లు ఆపై వయసువాళ్ల కోసం Emergency Use Authorization (EUA, అత్యవసర వినియోగం కోసం ఆమోదించబడినది) కింద Novavax వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.

17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, చట్టబద్ధంగా విముక్తి పొందనట్లయితే పేరెంట్ లేదా గార్డియన్ నుంచి సమ్మతి అవసరం కావొచ్చు (ఇంగ్లిష్ మాత్రమే). 

తల్లిదండ్రుల సమ్మతి లేదా చట్టపరంగా విముక్తి పొందినట్లుగా రుజువు చూపించడానికి వారి ఆవశ్యకతల గురించి వ్యాక్సిన్ క్లినిక్ని చెక్ చేయండి.

నా బిడ్డకు కొవిడ్-19 వస్తుందనే దాని గురించి నేను ఎందుకు ఆందోళన చెందాలి?

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, అమెరికాలో 15 మిలియన్లకు పైగా పిల్లలకు కొవిడ్-19 వచ్చింది. కొత్తగా వచ్చిన COVID-19 వేరియెంట్లు కారణంగానే, ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో ఎక్కువ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, చాలామంది హాస్పిటల్‌లో చేరుతున్నారు. 

పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో కొవిడ్-19 చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, పిల్లలు ఇంకా బాగా అస్వస్థతకు గురికావొచ్చు, రోగనిరోధక శక్తి లేని లేదా మరోవిధంగా దుర్భలమైన పరిస్థితుల్లో ఉన్న స్నేహితులు మరియు కుటుంబానికి వ్యాప్తి చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్‌లో నివేదించబడిన చిన్నపిల్లల COVID-19 మరణాల్లో, దాగివున్న అనారోగ్య సమస్యలేమీ సగం కేసుల్లో కనిపించలేదు.

కొవిడ్-19 సంక్రమించిన పిల్లల్లో ‘‘లాంగ్ కొవిడ్-19’’ అభివృద్ధి చెందవచ్చు లేదా బ్రెయిన్ ఫాగ్, అలసట, తలనొప్పి, మగత మరియు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం వంటి నిరంతర లక్షణాలు ఉంటాయి. వ్యాక్సిన్ పిల్లలను ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంచడానికి అత్యుత్తమ మార్గం. 

కొవిడ్-19 సోకిన పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (MIS-C) (ఇంగ్లిష్ మాత్రమే) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. MIS-C గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు లేదా జీర్ణాశయాంతర అవయవాలతో సహా వివిధ శరీర భాగాలు వాపుకు దారితీసే పరిస్థితి. MIS-C దేని వల్ల కలుగుతుందనేది ఇంకా తెలియనప్పటికీ, MIS-Cతో ఉన్న చాలామంది పిల్లలకు కొవిడ్-19 ఉంది, లేదా కొవిడ్-19 ఉన్నవారికి దగ్గరల్లో ఉన్నారు. MIS-C తీవ్రమైన, ఇంకా ప్రాణాంతకం కావొచ్చు, కానీ ఈ పరిస్థితితో రోగనిర్ధారణ చేయబడ్డ చాలామంది పిల్లలు వైద్య సంరక్షణతో మెరుగైంది.

వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమైనవని మరియు అవి ప్రభావవంతమైనవని మనకు ఎలా తెలుస్తుంది?

కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని ధృవీకరించడం కోసం, వ్యాక్సిన్ భద్రతను పర్యవేక్షించే దేశ సామర్థ్యాన్ని CDC (Centers for Disease Control and Prevention, రోగ నిరోధక నివారణా కేంద్రాలు) విస్తరించింది మరియు బలోపేతం చేసింది. దీని ఫలితంగా, కొవిడ్-19 వ్యాక్సిన్ పనీతీరును పరీక్షించిన సమయంలో కనిపించని సమస్యలను వ్యాక్సిన్ భద్రతా నిపుణులు పరిశీలించగలరు మరియు గుర్తించగలరు.

ఎలాంటి వైద్యపరమైన సమస్యలు ఉంటే, COVID-19 కారణంగా మీరు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?

క్రింద జాబితాలో ప్రస్తావించిన పరిస్థితులున్న ఏ వయస్సు వారైనా COVID-19 కారణంగా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి, మీరు వృద్ధులైనా లేదా ఈ జాబితాలో పేర్కొన్న వాటితో సహా ఒకటికన్నా ఎక్కువ లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా, COVID-19 నుండి రక్షణ కోసం COVID-19 వ్యాక్సిన్లు (ప్రాథమిక మరియు అదనపు డోసులు) మరియు ఇతర నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. COVID-19 కారణంగా, మిమ్మల్ని తీవ్రమైన అస్వస్థతకు గురిచేయగల అవకాశం ఎక్కువగా ఉన్న అన్ని పరిస్థితులు ఈ జాబితాలో చేర్చబడలేదు. ఇందులో ప్రస్తావించని ఆరోగ్య సమస్య మీకు ఉన్నట్లయితే, మీ పరిస్థితిని మెరుగ్గా అదుపులో ఉంచుకొని మిమ్మల్ని మీరు COVID-19 నుండి ఎలా రక్షించుకోవాలనే దాని గురించి మీ ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్‌తో మాట్లాడండి.

  • క్యాన్సర్ 
  • దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి 
  • దీర్ఘకాలిక కాలేయ వ్యాధి 
  • దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు 
  • డిమెన్షియా లేదా ఇతర నాడీ సంబంధిత సమస్యలు 
  • మధుమేహం (టైప్ 1 లేదా 2) 
  • డౌన్ సిండ్రోమ్ 
  • గుండె సమస్యలు 
  • HIV ఇన్ఫెక్షన్ 
  • ఇమ్యునోకాంప్రమైజ్డ్‌ పరిస్థితి (రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడం) 
  • మానసిక ఆరోగ్య పరిస్థితులు 
  • బరువు ఎక్కువగా ఉండడం, ఊబకాయం 
  • గర్భం 
  • సికెల్ సెల్ వ్యాధి లేదా తలసేమియా 
  • ప్రస్తుతం లేదా ఇంతకు ముందు పొగత్రాగే అలవాటు 
  • ఘన అవయవాల లేదా రక్త మూల కణాల మార్పిడి 
  • మెదడుకి రక్త ప్రసరణను ప్రభావితం చేసే స్ట్రోక్ లేదా సెరెబ్రోవ్యాస్కులర్ వ్యాధి 
  • మాదక ద్రవ్యాల వినియోగం సంబంధిత రుగ్మతలు
  • క్షయ
ఒక మోస్తరు లేదా తీవ్రమైన ఇమ్యునోకాంప్రమైజ్డ్ పరిస్థితి ఉన్నవాళ్లు ఈ డోసులు తీసుకోవాలంటే డాక్టర్ నోట్/ప్రిస్క్రిప్షన్ లేదా ఇతర దస్తావేజులు లాంటివి అవసరమా? 

లేదు, వ్యాక్సిన్లు వేసే ఏ ప్రదేశంలోనైనా వారు తమ స్వీయ-గుర్తింపును అందించి అన్ని డోసులు పొందవచ్చు. దీనివల్ల, ఇలాంటివాళ్లు వ్యాక్సిన్లు వేసుకోవడానికి ఎలాంటి అదనపు అడ్డంకులు ఉండవు. ఇమ్యునోకాంప్రమైజ్డ్ వ్యక్తులకు వారికున్న వైద్యపరమైన పరిస్థితి గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, తాము అదనపు డోసు తీసుకోవడం సరైనదో కాదో అనే విషయం గురించి తమ ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్‌తో చర్చించవచ్చు.

నా ప్రశ్నకి ఇక్కడ సమాధానం లేదు. నేను మరింత సమాచారం కోసం ఏమి చేయాలి?

సాధారణ ప్రశ్నలను covid.vaccine@doh.wa.govకి పంపవచ్చు.

అదనపు వనరులు మరియు సమాచారం

నిర్ధిష్ట గ్రూపుల కొరకు కొవిడ్-19 వనరులు

పిల్లలు మరియు యువత

తల్లిపాలు ఇవ్వడం మరియు/లేదా గర్భవతులైన మహిళలు

ఇమిగ్రెంట్​లు మరియు రెఫ్యూజీలు

దనపు కమ్యూనిటీ నిర్ధిష్ట వనరులను వ్యాక్సిన్ సమానత్వం మరియు నిమగ్నతా పేజీలో కనుగొనవచ్చు (ఇంగ్లిష్ మాత్రమే)

నా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇవ్వలేదు. నేను మరింత సమాచారాన్ని ఎక్కడ పొందగలను?

సాధారణ ప్రశ్నలను covid.vaccine@doh.wa.govకు పంపవచ్చు.