Stroke and Heart Attack Signs and Symptoms - Telugu

స్ట్రోక్, గుండెపోటు ఎప్పుడూ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తాయి స్ట్రోక్, గుండెపోటు సంకేతాలు మీకు తెలుసా?

జ్ఞానమే శక్తి. రోగలక్షణాలు, సంకేతాలను అర్థం చేసుకోవడం, అవి జరిగినప్పుడు వాటిని అర్థం చేసుకోవడం, సాయం కొరకు 911కు కాల్ చేయడం ద్వారా ఒక జీవితాన్ని కాపాడండి

స్ట్రోక

  • ముఖం, చేతులు లేదా కాళ్లు, మరిముఖ్యంగా శరీరానికి ఒకవైపున హటాత్తుగా తిమ్మిరి లేదా బలహీనత
  • అకస్మాత్తుగా గందరగోళం లేదా మాట అర్థం చేసుకోవడంలో ఇబ్బంది
  • హటాత్తుగా ఒకటి లేదా రెండు కళల్లో చూడటంలో ఇబ్బంది
  • నడవడంలో హటాత్తుగా సమస్య, మగత, లేదా బ్యాలెన్స్ లేదా కో ఆర్డినేషన్​ని కోల్పోవడం
  • ఎలాంటి తెలిసిన కారణం లేకుండానే హటాత్తుగా తీవ్రమైన తలనొప్పి

గుండెపోటు

  • ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం
  • తల తిరుగుతున్నట్లుగా ఉండటం, వికారం లేదా వాంతులు
  • దవడం, మెడ లేదా వెన్ను నొప్పి
  • చేయి లేదా భుజంలో అసౌకర్యం లేదా నొప్పి
  • శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం

ఎవరికైనా స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చినట్లుగా మీరు భావించినట్లయితే, వేచి ఉండవద్దు. వెంటనే 911కు కాల్ చేయండి స్ట్రోక్ మరియు గుండెపోటును గుర్తించేందుకు మరియు రోగిని వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అత్యవసర వైద్య సర్వీస్​ల సిబ్బంది శిక్షణ పొందారు. ఈ వైద్య అత్యవసర పరిస్థితులకు చికిత్స చేయవచ్చు, రోగికి ఎంత వేగంగా చికిత్స చేస్తే, వారు తిరిగి తమ ఇంటికి వచ్చి, రోజువారీ కార్యకలాపాలను చేపట్టేందుకు అంత అవకాశం ఉంటుంది.