కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించున్నట్టు రుజువు కోసం వాషింగ్టన్ రాష్ట్ర అధికారిక దృశ్యనీయ మార్గదర్శి

చాలా వ్యాపారాలు, ఈవెంట్​లు మరియు యజమానులకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ అవసరం అవుతుంది. వాషింగ్టన్​లో దిగువ పేర్కొన్న రకాల రుజువులను ఆమోదిస్తారు. కొన్ని ప్రాంతాలు దిగువ లిస్ట్ నుంచి ఒకనిర్ధిష్ట రకాన్ని మాత్రమే ఆమోదించవచ్చు.

సంబంధిత ప్రాంతాల్లోని నిబంధనలను గౌరవించండి, అవసరమైన రకం రుజువు చూపించడానికి ముందుగానే సిద్ధం అవ్వండి

CDC కోవిడ్-19 వ్యాక్సినేషన్ రికార్డ్ కార్డ్

  • అసలు పత్రాలు, కాపీలు లేదా మొబైల్ పరికరంలోని ఫొటోలు ఆమోదయోగ్యమైనవి.
  • మోతాదు చివరిగా నమోదు చేసిన తరువాత రెండు వారాలకు పూర్తి వ్యాక్సినేషన్ చెల్లుబాటు అవుతుంది:
    • Johnson & Johnson ఒక డోస్, 18 ఏళ్లు ఆపై వయస్సు ఉన్న వాళ్ళకి అనుమతించబడింది
    • Moderna: 6 నెలలు , ఆపై వయస్సు ఉన్న వారికి 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు
    • Novavax: 12 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు
    • Pfizer: 6 నెలల నుండి 4 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు మూడు డోసులు ఇవ్వబడతాయి. మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత 2వ డోసు వేసుకోవాలి మరియు రెండవ డోసు వేయించుకున్న 8 వారాల తర్వాత మూడవ డోసు వేసుకోవాలి.
    • Pfizer: 5 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు
COVID-19 Vaccination Record Card Sample

మీ వ్యాక్సిన్ కార్డ్తో వ్యవహరించేటప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాలసిన కొన్ని ఉపయోగకరమైన సూచనలను ఇక్కడ ఇచ్చాము:

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా QR కోడ్

Certificate of COVID-19 Vaccination - Sample

నమూనా A
కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. MyIRmobile.com నుంచి లభ్యమవుతుంది.
WA verify SMART Health Card QR code - Sample

నమూనా B
WAverify.org QR కోడ్
QR Code Endorsed Partner App. - Sample

నమూనా C
ఎండార్స్ చేసిన పార్టనర్ మొబైల్ యాప్​పై QR కోడ్ ప్రదర్శించబడుతుంది. (యాప్​లు మారవచ్చు)

వాషింగ్టన్ రాష్ట్ర ఇమ్యూనైజేషన్ సమాచార వ్యవస్థ ప్రింట్​అవుట్

  • Certificate of Immunization Status (సర్టిఫికేట్ ఇమ్యూనైజేషన్ స్టేటస్- CIS) ఫారాలు Washington State Immunization Information System నుంచి ముద్రించబడ్డాయి.
  • వ్యైద్య సేవలు అందించేవారు సంతకం చేయకపోతే చేతి రాతతో నమోదు చేసిన అంశాలు చెల్లుబాటు కావు.
Certificate of Immunization - Sample

కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించున్నట్టు అధికారిక రికార్డుగా చెల్లుబాటు అయ్యేవి ఇంకా ఏమున్నాయి?

  • వైద్య సేవలు అందించేవారు ధృవీకరించిన ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డు ప్రింటౌట్

వ్యాక్సినేషన్ రికార్డుల గురించి ప్రశ్నల కొరకు, 1-800-525-0127 కు కాల్చేయండి, తరువాత # ప్రెస్ చేయండి