కొవిడ్-19

 

కొవిడ్-19 సమాచారం హాట్​లైన్

మీకు కొవిడ్-19 గురించి ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, 1-800-525-0127 కు కాల్ చేసి, 7 ప్రెస్ చేయండి. వారు సమాధానం ఇచ్చినప్పుడు, ఇంటర్​ప్రెటీషన్ సర్వీస్​లను యాక్సెస్ చేసుకోవడానికి మీ భాషను చెప్పండి హాట్​లైన్ సోమవారం నాడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మరియు మంగళవారం నుంచి శనివారం (మరియు సెలవుదినాల్లో) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది.

ఇంటిలోనే ఉన్నట్లయితే కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరమా?

రిజిస్టర్ చేసుకోవడానికి మూడు మార్గాలున్నాయి (ఇంగ్లిష్) లో లేదా కొవిడ్ హాట్​లైన్​ని 1-800-525-0127 వద్ద కాల్ చేయండి మరియు 7 ప్రెస్ చేయండి.

కరోనావైరస్ (కొవిడ్-19) వ్యాక్సిన్

కొవిడ్-19 వ్యాక్సిన్​లపై ప్రస్తుత మరియు సవిస్తరమైన సమాచారం కొరకు, దయచేసి ఈ వెబ్​పేజీని మీ భాషలో సందర్శించండి: కొవిడ్-19 వ్యాక్సిన్ సమాచారం.

కొవిడ్-19 రోగలక్షణాలు, సూచనలు మరియు నిరోధంచడం

కొవిడ్-19 ప్రధాన లక్షణాలు దిగువ పేర్కొన్నవిధంగా ఉంటాయి:

 • జ్వరం లేదా చలి, దగ్గు, శ్వాస అందకపోవడం లేదా శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, కండరాలు లేదా శరీర నొప్పులు, తలనొప్పి, కొత్తగా రుచి లేదా వాసన కొత్తగా కోల్పోవడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారటం, వికారం లేదా వాంతులు మరియు విరేచనాలు.
 • దిగువ పేర్కొన్న కొవిడ్-19 అత్యవసర హెచ్చరిక సూచనలు గమనించినట్లయితే 911కు కాల్ చేయండి:
  • శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం
  • ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి స్థిరంగా ఉండటం
  • ఆకస్మిక గందరగోళం
  • ఇతరులకు స్పందించలేకపోవడం
  • పెదవులు లేదా ముఖం నీలంగా మారిపోవడం
 • ఏ బృందాలకు అధికంగా ప్రమాదం ఉంటుంది?

నన్ను మరియు నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి?

 • వ్యాక్సినేషన్ పొందండి, మీకు అర్హత ఉన్నప్పుడు మీ బూస్టర్​ని పొందండి.
 • మీకు వంట్లో బాగోనట్లయితే ఇంటిలోనే ఉండండి
 • మీరు జనసమ్మర్థంగా ఉండే బహిరంగ ప్రదేశాలకు  వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి మరియు ఇతరుల నుంచి ఆరు అడుగులు (రెండు మీటర్లు) దూరం పాటించండి.
 • జనసమ్మర్ధంతో ఉండే ప్రదేశాల్లోకి, వెంటిలేషన్ సక్రమంగా లేని ప్రదేశాలకు వెళ్లవద్దు.
 • మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి లేదా హ్యాండ్ శానిటైజర్​​ని ఉపయోగించాలి.
 • మీకు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ చేయి లేదా టిష్యూను అడ్డుగాపెట్టుకోండి.
 • మీ ముఖం, నోరు, కళ్లను తాకవద్దు.
 • మీ ఇంటిలోని ఉపరితలాలను శుభ్రం చేయండి.
 • మీకు కొవిడ్-19 రోగలక్షణాలు ఉన్నట్లయితే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి. మీకు ఆరోగ్య సంరక్షణ ప్రదాత లేకపోతే, మీకు సమీపంలో ఉన్న అత్యవసర సంరక్షణ కేంద్రం లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్​ని సంప్రదించండి. మీకు భీమా లేకపోతే, మీ స్థానిక ఆరోగ్య విభాగాన్ని సంప్రదించండి.
కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవడం

కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవడంపై ప్రస్తుత మరియు సవిస్తరమైన సమాచారం కొరకు, దయచేసి ఈ వెబ్​పేజీని మీ భాషలో సందర్శించండి: కొవిడ్-19 టెస్టింగ్ సమాచారం.

క్వారంటైన్ వర్సెస్ ఐసోలేషన్

ఈ పదాల అర్థం ఏమిటి అని తెలుసుకోవడానికి, మరియు ఎంతకాలం క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌లో ఉండాలనేది తెలుసుకోవడానికి,  ఐసోలేషన్ మరియు క్వారంటైన్ కాలిక్యులేటర్ వెబ్‌పేజీని సందర్శించండి.

మాస్క్లు ఉపయోగించడం

కొవిడ్-19 ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు, దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు, గాలిలోనికి వైరస్ కణాలు విడుదల కాకుండా మాస్క్​లు తగ్గిస్తాయి. కోవిడ్-19 ఉండటం మరియు తేలికపాటి లేదా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండే అవకాశం ఉంది. మాస్క్​ని ఉపయోగించడం వల్ల, మీకు తెలియకుండానే ఇతర వ్యక్తులకు కొవిడ్-19ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తుంది. మీకు తేలికపాటిగా ఉండే సంక్రామ్యత, మరెవరికైనా ప్రాణాంతకంగా ఉండవచ్చు.

మాస్క్ ఉపయోగించడంపై దిగువన చిట్కాలు ఇవ్వబడ్డాయి:

 • మాస్క్ మీ నోరు మరియు ముక్కును కవర్ చేయాలి, మీ ముఖానికి ఇరువైపులా సురక్షితంగా ఫిట్ అవ్వాలి.
 • మీ మాస్క్ ధరించండి, ఇయర్ లూప్​లు లేదా టైలను ఉపయోగించడం ద్వారా దానిని తొలగించండి. మాస్క్ లేదా మీ ముఖం ముందు భాగాన్ని తాకవద్దు.
 • మీరు ప్రతిరోజూ ఉపయోగించిన తరువాత మెడికల్ ప్రొసీజర్ మాస్క్​లను పారవేయండి లేదా ఫేస్ కవరింగ్​లను ఉతకండి, మరియు మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి.
 • రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎన్నడూ మాస్క్ ధరించరాదు.  2 నుంచి 4 సంవత్సరాల వయస్సు ఉండే పిల్లలు మాస్క్ ధరించేటప్పుడు పెద్దవారు పర్యవేక్షించాలి..
 • నిర్ధిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు మాస్క్ ఆదేశాలు మినహాయించబడతాయి. మీకు ఆందోళనలు ఉన్నట్లయితే, మీకు అత్యుత్తమైనది ఏది అని తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి.
స్టోర్లు మరియు బహిరంగ ప్రదేశాలను మరింత సురక్షితంగా సందర్శించడం

మీ మరియు ఇతరుల సంరక్షణ కొరకు మీరు ఇంటిని విడిచిపెట్టడానికి ముందు, తరువాత, మరియు ఆ తరువాత మీరు పరిగణించగల అనేక విషయాలు ఉన్నాయి.

ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ముందు:

 • మీరు అస్వస్థతగా ఉన్నట్లయితే, సాధ్యమైతే, స్టోరు లేదా ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దు.  మీ కొరకు ఐటమ్​లను పికప్ చేసుకోమని కుటుంబసభ్యుడు లేదా స్నేహితుడిని అడగండి.
 • మీ ఇంటి వద్ద డెలివరీ చేయడం కొరకు పచారీ సరుకులు, ఔషధాలు, మరియు ఇతర ఐటమ్​లను ఆన్​లైన్​లో కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.
 • ప్రత్యేక షెడ్యూల్స్ చెక్ చేయండి. 65 సంవత్సరాలకంటే ఎక్కువ వయస్సు ఉన్న మరియు నిర్ధిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న వ్యక్తుల కొరకు కొన్ని స్టోర్​లు ప్రత్యేక గంటల్లో పనిచేయవచ్చు. సాధ్యమైతే, బిజీగా లేని సమయాల్లో స్టోరుకు వెళ్లడాన్ని పరిగణించండి.
 • మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ముందు మీ చేతులను శుభ్రం చేసుకోండి.

మీరు బయటకు వెళ్లేటప్పుడు:

 • మాస్క్ ధరించండి తద్వారా అది మీ ముక్కు మరియు నోటిని కవర్ చేస్తుంది.
 • చెల్లింపులు జరపడానికి లైనులో ఉన్నాసరే. మీకు మరియు ఇతరులకు మధ్య కనీసం ఆరు అడుగుల (రెండు మీటర్లు) దూరం ఉండేట్లుగా చూసుకోండి.
 • మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు అడ్డు పెట్టుకోండి.
 • మీ ముఖాన్ని తాకవద్దు.
 • షాపింగ్ చేసేటప్పుడు, కార్ట్ హ్యండిల్ లేదా షాపింగ్ బాస్కెట్​ని శుభ్రం చేయడానికి శానిటైజర్ లేదా యాంటీసెప్టిక్ వైప్​లను ఉపయోగించండి.

మీరు ఇంటికి వచ్చినప్పుడు:

 • మీరు మాస్క్ ధరించినట్లయితే, దానిని బాగా కడిగి, సురక్షితంగా భద్రపరిచినట్లుగా ధృవీకరించండి, లేదా ఒకవేళ ఇది డిస్పోజబుల్ మాస్క్ అయితే దానిని పారవేయండి.
 • శుభ్రం చేసి సురక్షితంగా భద్రపరచడానికి, మీ క్లాత్ మాస్క్ తొలగించండి. మీ డిస్పోజబుల్ మాస్క్​ని పారవేయండి.
 • మీ చేతులను శుభ్రం చేసుకోండి.
 • ఆహార భద్రతా విధానాలను పాటించండి. తినే ఆహార పదార్ధాలను డిస్​ఇన్​ఫెక్ట్ చేయవద్దు. పండ్లు మరియు కూరగాయలను మామూలుగానే కడగండి.
 • కొవిడ్-19 గ్రోసరీ షాపింగ్ చిట్కాలు.
తీవ్రమైన అస్వస్థత సంభవించగల అధిక ప్రమాదం కలిగిన వ్యక్తులు

తీవ్రమైన అస్వస్థత ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఈ అదనపు జాగ్రత్తలు తీసుకోవచ్చు:

 • మీకు సలహా అవసరమైనప్పుడు మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించండి. కొన్ని క్లినిక్​లు కమ్యూనికేట్ చేయడానికి ‘‘పేషెంట్ పోర్టల్స్​​’’ని ఉపయోగించవచ్చు, చాలావాటిలో కాల్స్​కు హాజరు కావడం మరియు సలహా ఇచ్చే వ్యక్తులు ఉంటారు. అయితే, వారు చాలా బిజీగా ఉంటారనే విషయాన్ని మదిలో పెట్టుకోండి.
 • మీకు సాధారణంగా అవసరం అయ్యే ఔషధాల జాబితాను రూపొందించండి, ప్రిస్క్రిప్షన్ ఔషధాల అదనపు సప్లైని వారు అందించగలరా అని తెలుసుకోవడానికి మీ ఫార్మసీ లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాతను చెక్ చేయండి. మీరు తీసుకునే ఇతర ఔషధాలు లేదా సప్లిమెంట్​ల రికార్డును ఉంచండి, ఆదేశించిన విధంగా మీ ప్రస్తుత పరిస్థితులను మానిటర్ చేయండి.
 • సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్​లను ఎప్పటికప్పుడు తీసుకోండి. కొవిడ్-19 వ్యాక్సిన్​ని మరియు అర్హత కలిగినప్పుడు బూస్టర్​ని పొందేలా చూసుకోండి. మీకు దగ్గరల్లో ఉండే వ్యాక్సిన్ ప్రొవైడర్​ని కనుగొనదానికి ఇక్కడ క్లిక్ చేయండి.
 • మీరు ఐసోలేట్ లేదా క్వారంటైన్​లో ఉండాల్సి వస్తే, మీకు తగినంత ఆహారం మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు ఉన్నాయని నిర్ధారించుకోండి.
 • మీకు సహాయపడగల వ్యక్తిని గుర్తించండి, మీరు బాగానే ఉన్నట్లుగా ధృవీకరించుకోవడానికి ఫోన్ కాల్ చేయమని వారిని అడగండి. వారికి ఒంట్లో బాగోలేనట్లుగా అనిపించినట్లయితే, వారు మిమ్మల్ని సందర్శించరాదని, ఈ వ్యక్తి అర్థం చేసుకున్నట్లుగా ధృవీకరించుకోండి.
 • మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి, అవసరమైతే వైద్య సాయం పొందండి.
గర్భధారణ, బిడ్డలు మరియు కొవిడ్-19

మీరు ప్రస్తుతం గర్భవతి అయినట్లుగా తెలిసినట్లయితే ఏమి చేయాలి

 • గర్భవతులు కాని మహిళలతో పోలిస్తే, గర్భవతులైన లేదా ఇటీవల గర్భవతి అయిన మహిళల్లో కొవిడ్-19 నుంచి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 • గర్భధారణ సమయంలో కొవిడ్-19 సోకిన మహిళలకు నెలల నిండకుండానే బిడ్డ పుట్టడం (37 నెలలకంటే ముందుగానే బిడ్డకు డెలివరీ కావడం) మరియు మృత శిశువు జన్మించడం, మరియు ఇతర గర్భధారణ సంక్లిష్టతలు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.
 • గర్భవతులైన లేదా ఇటీవల గర్భవతులైన మహిళలు మరియు వారితో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు కొవిడ్-19 రాకుండా ఉండటానికి తమను తాము సంరక్షించేందుకు సాయపడే ఈ దశలను చేపట్టాలి:
 • వ్యాక్సిన్​ని పొందండి మరియు బూస్టింగ్ పొందండి.
 • మాస్క్ ధరించండి.
 • ఇతరుల నుంచి 6 అడుగుల దూరంలో ఉండండి, జనసమ్మర్ధంతో ఉండే ప్రదేశాల్లోకి, వెంటిలేషన్ సక్రమంగా లేని ప్రదేశాలకు వెళ్లవద్దు.
 • ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టెస్ట్ చేయించుకోండి.
 • మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ చేయి లేదా టిష్యూను అడ్డుగాపెట్టుకోండి.
 • మీ ఇంటిని రెగ్యులర్​గా శుభ్రం చేసి, నిర్జలీకరణ చేయండి.
 • మీ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించండి.
 • మీ గర్భధారణ గురించి ఏవైనా ఆందోళనలు ఉన్నా, మీకు అస్వస్థతగా ఉన్నా, లేదా మీకు కొవిడ్-19 ఉన్నట్లుగా మీరు భావించినట్లయితే, మీ హెల్త్ కేర్ ప్రొవైడర్​కు కాల్ చేయండి.

గర్భధారణ మరియు కొవిడ్-19 వ్యాక్సిన్

 • గర్భవతులైన, స్తన్యం/చెస్ట్ ఫీడింగ్ ఇచ్చే, ప్రస్తుతం గర్భవతి కావడానికి ప్రయత్నించే, లేదా భవిష్యత్తులో గర్భవతి కాగల మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ సిఫారసు చేయబడుతోంది.
 • గర్భధారణ సమయంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ భద్రత మరియు సమర్థత గురించి సాక్ష్యాలు పెరుగుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, గర్భధారణ సమయంలో తెలిసిన లేదా సంభావ్య వ్యాక్సినేషన్ ప్రమాదాలకంటే ఎక్కువగా ఉన్నాయని డేటా సూచిస్తోంది.
 • గర్భవతులైన మహిళలు, అర్హత పొందినప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్​ని పొందాలి.
 • కొవిడ్-19 వ్యాక్సిన్​లు గర్భవతులు అయిన మహిళలు లేదా వారి చిన్నారులతో సహా ఎవరికి కొవిడ్-19 సంక్రామ్యతను కలిగించవు.
 • కొవిడ్-19 వ్యాక్సిన్​లతో సహా ఏ వ్యాక్సిన్​లు మహిళలు లేదా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తాయనే దానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు.
 • గర్భవతి కావడం మరియు కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి మరిన్ని ప్రశ్నలు ఉన్నాయా? మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడండి లేదా మదర్​ టూ బేబీని సంప్రదించండి, ఫోన్ లేదా చాట్ ద్వారా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి వారి నిపుణులు లభ్యమవుతారు. ఉచిత గోప్యమైన కాలింగ్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లభ్యమవుతుంది. లైవ్​లో చాట్ చేయడానికి లేదా ఇమెయిల్ పంపడానికి, లేదా కాల్ చేయడానికి MotherToBab (మదర్ టు బేబీ) ని సందర్శించండి 1-866-626-6847 (only available in English and Spanish).

మీకు కొవిడ్-19 ఉన్నట్లయితే నవజాత శిశువు కొరకు సంరక్షణ

 • గర్భధారణ సమయంలో కొవిడ్-19 వచ్చిన చాలా మంది నవజాత శిశువులకు వారు పుట్టినప్పుడు వారికి కొవిడ్-19 ఉండదు.
 • కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా టెస్ట్ చేయబడ్డ చాలామంది నవజాత శిశువులకు తేలికపాటి లేదా ఎలాంటి లక్షణాలు లేవు మరియు కోలుకున్నారు. కొంతమంది నవజాత శిశువులకు తీవ్రమైన కొవిడ్-19 అస్వస్థత సోకినట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి.
 • మీరు కొవిడ్-19 కొరకు ఐసోలేషన్​లో ఉన్నా లేదా నవజాత శిశువు ఉన్నట్లయితే, మీ ఐసోలేషన్ కాలం ముగిసేంత వరకు దయచేసి దిగువ ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి:
  • మీ ఇంటికి వెలుపల ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి ఇంటిలోనే ఉండండి.
  • వ్యాధి సోకని ఇతర కుటుంసభ్యుల నుంచి ఒంటరిగా(విడిగా) ఉండండి మరియు పంచుకునే స్థలాల్లో మాస్క్ ధరించండి.
  • మీ నవజాత శిశువుకు సంరక్షణ అందించడానికి పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న మరియు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యే ప్రమాదం లేని ఆరోగ్యవంతమైన సంరక్షకుడిని ఉండాలి. సాధ్యమైతే, మీ పాలను పంప్ చేయండి, తద్వారా మరో సంరక్షకుడు మీ బిడ్డకు ఫీడ్ వచ్చు. మీరు ఫార్ములాతో ఫీడ్ చేస్తున్నట్లయితే, ఆరోగ్యవంతంగా ఉన్న సంరక్షకుడు తయారు చేసేలా చూడండి.
  • మీ ఐసోలేషన్ కాలం ముగియడానికి ముందు, మీ నవజాత శిశువు సంరక్షణ చేపట్టాల్సి ఉంటే, మీ బిడ్డకు ఫీడింగ్ చేసేటప్పుడు లేదా పట్టుకునేటప్పుడు, దిగువ సిఫారసు చేసిన ముందస్తు జాగ్రత్తలను అనుసరించండి.
  • మీ నవజాత శిశువులో కొవిడ్-19 రోగలక్షణాల కొరకు పర్యవేక్షించండి.
 • బిడ్డకు పాలివ్వడం వల్ల బిడ్డలకు పాల ద్వారా వైరస్ సంక్రమించదు అని ప్రస్తుత సాక్ష్యం సూచిస్తోంది. కొవిడ్-19కు విరుద్ధంగా వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తులు తల్లిపాల ద్వారా వారి బిడ్డకు రక్షణాత్మక యాంటీబాడీస్​ని బదిలీ చేసినట్లుగా ఇటీవల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మీకు కొవిడ్-19 ఉండి, స్తన్యం/చెస్ట్ ఫీడింగ్ చేయాలని ఎంచుకున్నట్లయితే :
  • బిడ్డకు పాలిచ్చేటప్పుడు/చెస్ట్ ఫీడింగ్​కు ముందు మీ చేతులను శుభ్రం చేసుకోండి:
  • మీ స్తన్యం ఇచ్చేటప్పుడు/చెస్ట్ ఫీడింగ్ చేసేప్పుడు మరియు మీ బిడ్డకు 6 అడుగుల దూరంలో ఉన్నప్పుడల్లా మాస్క్ ధరించండి.

మానసిక ఆరోగ్యం గురించి మద్దతు మరియు సమాచారం అవసరమైన ఎవరైనా గర్భవతులు లేదా అప్పుడే బిడ్డపుట్టిన తల్లిదండ్రులు, లేదా వారి ప్రియమైన వారి కొరకు పేరెంట్ సపోర్ట్ వార్మ్ లైన్ లభ్యమవుతోంది. కాల్ చేయండి 1-888-404-7763, సోమవారం- శుక్రవారం 9 a.m.- 4:30 p.m. (ఇంగ్లిష్ మరియు స్పానిష్ మాత్రమే). మా వార్మ్​లైన్​లో సోషల్ వర్కర్, లైసెన్స్​డ్ థెరపిస్ట్ లేదా ప్రసూతి అనంతర క్రంగుబాటు/ఆతురత విషయంలో అనుభవం కలిగిన తల్లిదండ్రులు సిబ్బందిగా ఉంటారు. పనిగంటల తరువాత చేసే కాల్స్​కు సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వబడుతుంది. కాల్ చేయండి, టెక్ట్స్ పంపండి లేదా warmline@perinatalsupport.org కు ఇమెయిల్ పంపండి.

మీ పట్ల మరియు మీ కుటుంబం పట్ల శ్రద్ధ వహించడం

Washington Listens (వాషింగ్టన్ లిజన్స్): కొవిడ్-19 వల్ల కలిగిన ఒత్తిడి గురించి ఎవరితోనైనా మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే, 1-833-681-0211 ద్వారా Washington Listensకు కాల్ చేయండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు మరియు వారాంతరాల్లో ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు మాట్లాడటానికి ఎల్లప్పుడూ ఎవరైనా ఉంటారు. TTY మరియు లాంగ్వేజ్ యాక్సెస్ సర్వీస్​లు లభ్యమవుతాయి. మీరు మానసిక మరియు భావోద్వేగ స్వస్థత కొరకు అదనపు వనరులను ఇక్కడ మీరు కనుగొనవచ్చు (ఇంగ్లిష్​లో).

 • ప్రస్తుత మహమ్మారి పరిస్థితి గురించి నమ్మకమైన మీడియా, పబ్లిక్ మరియు స్థానిక ఆరోగ్య ఏజెన్సీల సమాచారం మరియు ప్రజారోగ్య వెబ్​సైట్​ల నుంచి అప్​డేట్​లతో అదనపు సిఫార్సుల గురించి బాగా తెలుసుకోండి.
 • ఫోన్ నెంబర్​లు, వెబ్ సైట్​లు మరియు సోషల్ మీడియా అకౌంట్​ల వంటి కమ్యూనిటీ వనరుల జాబితాను రూపొందించండి. మానసిక ఆరోగ్యం మరియు క్రైసిస్ హాట్​లైన్​ల కోసం మీరు స్కూళ్లు, వైద్యులు, ప్రజా ఆరోగ్య సంస్థలు, సామాజిక సేవలు, కమ్యూనిటీ కేంద్రాలను జోడించవచ్చు.
 • ఫోన్ లేదా ఇతర ఆన్​లైన్ సర్వీస్​ల ద్వారా కుటుంబసభ్యులు మరియు స్నేహితులతో టచ్​లో ఉండండి.
 • ఇంటివద్ద ప్రాథమిక హెల్త్ సప్లై ఉండాలి (సబ్బు, ఆల్కహాల్-ఆధారిత హ్యాండ్ శానిటైజర్, టిష్యులు, థర్మోమీటర్, జ్వరాన్ని తగ్గించే ఔషధాలు మరియు ఇంటి వద్ద ఉపయోగించే కొవిడ్-19 టెస్ట్ కిట్​లు).
 • మీరు లేదా మీ కుటుంబసభ్యులు రెగ్యులర్​గా తీసుకునే ఔషధాల సప్లైలు పొందేందుకు ప్రయత్నించండి.

మీ చిన్నారి కుటుంబసభ్యులకు మద్దతు

 • ఫోన్, టెక్ట్స్, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ద్వారా వారితో మాట్లాడటం ద్వారా వారి స్నేహితులు మరియు కుటుంబం మద్దతు పొందండి మరియు అనుసంధానమై ఉండండి.వార్తలు మీకు ఆందోళన కలిగించినట్లయితే, బ్రేక్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇంటర్నెట్ లేదా ఇతర సమాచార వనరుల నుంచి వారు పొందగల సమాచారాన్ని స్పష్టం చేయడానికి మీ బిడ్డతో మాట్లాడండి.
 • ప్రశ్నలను ప్రోత్సహించడం ద్వారా, ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడటం ద్వారా పిల్లలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించండి.
 • వారికి ఉండే భావోద్వేగాల గురించి మాట్లాడండి, వాటిని గౌరవించండి.
 • డ్రాయింగ్​లు లేదా ఇతర కార్యకలాపాల ద్వారా వారి భావాలను వ్యక్తీకరించేందుకు సాయపడండి.
 • తగినంత సౌకర్యాన్ని కల్పించండి, మామూలు కంటే కాస్తంత ఎక్కువ సహనంగా ఉండండి

కుటుంబ కార్యకలాపాలు

మీ కుటుంబం ఐసోలేషన్ లేదా క్వారంటైన్​లో ఉన్నప్పటికీ, అతి తాత్కాలికమే అని మనస్సులో పెట్టుకోండి.

నిద్ర సమయాలు, భోజనం మరియు వ్యాయామం విషయానికి వస్తే మీ కుటుంబ షెడ్యూల్​ను స్థిరంగా ఉంచండి.

మీ బిడ్డ వారి స్కూలు లేదాఇతర సంస్థల ద్వారా అందించే దూరవిద్యలో పాల్గొంటున్నట్లయితే, తోటివారితో సురక్షితంగా సామాజీకరణ చెందడానికి మీ బిడ్డ కొరకు అవకాశాలను చూడండి.

ఒంటరితనం, విసుగు, వ్యాధి సంభవిస్తుందనే భయం, ఆందోళన, దుఃఖించడం మరియు భయం వంటి భావాలు మహమ్మారి వంటి ఒత్తిడితో కూడిన పరిస్థితికి సాధారణ ప్రతిచర్యలు అని గుర్తించండి.

మీ కుటుంబం మరియు సాంస్కృతిక విలువలకు అనుగుణంగా ఆహ్లాదకరమైన, అర్ధవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనేందుకు మీ కుటుంబానికి సహాయం చేయండి.

అదనపు వనరులు