ఈ గోప్యతా పాలసీ వాషింగ్టన్ రాష్ట్రం కొరకు అధికారిక ఎక్స్‌ప్లోజర్ నోటిఫికేషన్ టెక్నాలజీ అయిన WA Notify(డబ్ల్యుఎ నోటిఫై), the official exposure notification technology for Washington State. వాషింగ్టన్ రాష్ట్రం Department of Health (DOH, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) పర్యవేక్షణ మరియు ఎండార్స్‌మెంట్‌తో WA Notify రూపొందించబడింది.
మేము ఏ సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకుంటాము?
WA Notify లో దిగువ సమాచారాన్ని సేకరించవచ్చు:
- WA Notify డౌన్లోడ్ చేయడం లేదా ఎనేబుల్ చేయడం
- ఎక్స్‌ప్లోజర్ నోటిఫికేషన్ అందుకోవడం.
- ధృవీకరణ కోడ్ లేదా ధృవీకరణ లింక్‌ని సబ్మిట్ చేయడం
- ఇతరులకు నోటిఫై చేయడానికి ఎంచుకున్న పాజిటివ్ యూజర్ల కొరకు యాదృచ్ఛిక కోడ్లను అప్లోడ్ చేయడం
WA Notify ఏవిధంగా ఉపయోగించబడుతుందని అర్థం చేసుకోవడానికి వాషింగ్టన్ రాష్ట్రం Department of Health (DOH, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) పై ఈవెంట్ సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ డేటా DOH, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలులేదా అధీకృత వైద్య అధికారులతో పంచుకోవచ్చు. గణాంక లేదా శాస్త్రీయ పరిశోధన అధ్యయనం కొరకు దానిని ఒక సంగ్రహ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. ఈ సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్ సమాచారం ఉండదు లేదా ఎవరైనా WA Notify యూజర్ని గుర్తించడానికి ఉపయోగించబడదు.
Google మరియు Apple యొక్క ఇంటెంట్‌తో అలైన్ చేయడానికి WA Notify యూజర్ గోప్యతకు సంరక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేయబడింది WA Notify ఈ డేటా ఎలిమెంట్లను జనరేట్ చేస్తుంది, దీనిలో మిమ్మల్ని గుర్తించే ఎలాంటి డేటా ఉండదు
గుర్తుతెలియని సంకేతాలు
- WA Notify యొక్క యూజర్లు ఒకరినొకరు దగ్గరగా ఉన్నప్పుడు వారి స్మార్ట్ఫోన్ల మధ్య బ్లూటూత్ ద్వారా యాదృచ్ఛిక కోడ్లు పంచుకోబడతాయి.
- గుర్తుతెలియని సంకేతాలు WA Notify ద్వారాగాక, మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఉత్పన్నమై, అందులోనే నిల్వ చేసి ఉంటాయి.
- WA Notify ని అనుమతించడానికి, మీ కోవిడ్-19కు ఎక్స్పోజర్లకు అవకాశం ఉన్న వారిని తనిఖీ చేయడానికి మాత్రమే వాడటం జరుగుతుంది.
- గుర్తుతెలియని సంకేతాలను గరిష్టంగా 14 రోజుల పాటు నిల్వ చేస్తారు.
ధృవీకరణ కోడ్లు మరియు లింక్‌లు
- మీరు కొవిడ్-19కు పాజిటివ్‌గా టెస్ట్ చేయబడితే, మీ స్థానిక ప్రజారోగ్య అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు WA Notify ఉపయోగిస్తున్నారా అని వారు అడుగుతారు. మీరు ఉన్నట్లయితే, మీరు WA Notify లోనికి ప్రవేశించడానికి వారు ధృవీకరణ కోడ్ లేదా లింక్‌ని అందిస్తారు.
- ఇటీవల కొవిడ్-19కు పాజిటివ్‌గా టెస్ట్ చేయబడ్డ ప్రతి ఒక్కరికి DOH ప్రతి ఒక్కరికి పాప్ అప్ నోటిఫికేషన్ మరియు/లేదా ధృవీకరణ లింక్‌తో టెక్ట్స్ సందేశాన్ని పంపుతుంది, తద్వారా WA Notify యూజర్లు సంభావ్య ఎక్స్‌ప్లోజర్ గురించి ఇతర యూజర్లను వేగంగా మరియు అనామధేయంగా అలర్ట్ చేయవచ్చు.
- నోటిఫికేషన్ మీద తట్టడం లేదా మీ ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ యాదృచ్ఛిక కోడ్లను పంచుకునేందుకు అనుమతించబడుతుంది తద్వారా మీకు దగ్గరగా ఉండే ఇతర WA Notify యూజర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉండవచ్చని అజ్ఞాతంగా హెచ్చరిస్తారు.
- WA Notify ఎవరు ఉపయోగిస్తున్నారనేది మాకు తెలియదు కనుక కొవిడ్-19 కొరకు పాజిటివ్‌గా టెస్ట్ కాబడిన ప్తరి ఒక్కరికి DOH ధృవీకరణ లింక్‌తో టెక్ట్స్ సందేశాన్ని పంపుతుంది. ఒకవేళ మీరు WA Notify ఉపయోగించనట్లయితే, మీరు టెక్ట్స్‌ని విస్మరించవచ్చు.
- ఇతర WA Notify యూజర్లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి మీరు నోటిఫికేషన్ మీద లేదా ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.
ఉపయోగపు లాగ్‌లు
- దాదాపుగా ఏ యాప్లేదా ఇంటర్నెట్ సేవ అయినా చేసే విధంగానే, WA Notify కూడా మీరు ఆ సేవను ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్‌గా లాగ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ లాగ్లలో మీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొంత సమాచారం ఉంటుంది. మేము ఈ సమాచారాన్ని WA Notify కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తాము.
- ఈ లాగ్‌ల్లో యాదృచ్ఛిక కోడ్లు లేదా ధృవీకరణ లింక్‌లు లేదా కోడ్లు చేర్చబడవు మరియు మీకు లేదా మీ స్మార్ట్ ఫోన్‌కు కోడ్ యొక్క ఏ రకాన్ని తిరిగి జతచేయడానికి ఉపయోగించలేం.
- ఈ లాగ్‌లు ఉత్పన్నమైన 14 రోజుల తరువాత వాటికవే తొలగిపోతాయి.
డేటా విశ్లేషణ
- ఎక్స్ట్రా ఎనలిటిక్స్ని ప్రారంభించడానికి మీరు ఎంచుకున్నట్లయితే, యాప్‌ని మెరుగుపరచడానికి సాయపడేందుకు DOH తో పరిమితంగా సమగ్రమైన డేటా పంచుకోబడుతుంది.
- ఈ డేటాలో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించడం జరిగిందనే దానికి సంబంధించిన గణాంకాలు ఉంటాయి. మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగపడగల సమాచారం ఏదీ ఇందులో ఉండదు.
- యాప్‌లోని ఎనలిటిక్స్ షేరింగ్‌ను నిలిపి వేయడం ద్వారా మీరు ఈ డేటాను షేర్ చేయకూడదని ఎంచుకోవచ్చు.
డిజైన్ రీత్యానే, WA Notify మీ స్మార్ట్‌ఫోన్ నుండి లొకేషన్ డేటాను సేకరించదు, గుర్తుతెలియని సంకేతాలు లేదా ధృవీకరణ సంఖ్యలతో మిమ్మల్ని లేదా మీ స్మార్ట్‌ఫోన్‌ను ముడిపెట్టే సమాచారాన్నిదేనినీ సేకరించదు లేదా షేర్ చేయదు.
మీరు ధృవీకరణ కోడ్ అభ్యర్ధించినప్పుడు ఏమి జరుగుతుంది:
కౌంటర్లో కొనుగోలు చేసిన గృహ కొవిడ్-19 టెస్ట్‌లో పాజిటివ్ అయిన WA Notify యూజర్లుసంభావ్య ఎక్స్‌ప్లోజర్ గురించి ఇతర WA Notify యూజర్లను అలర్ట్‌ను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify లో ధృవీకరణ కోడ్‌ని అభ్యర్ధించవచ్చు. ధృవీకరణ కోడ్ అందుకోవడానికి, WA Notify యూజర్లు వారి పాజిటివ్ టెస్ట్ ఫలితం తేదీని మరియు వారి మొబైల్ నెంబరును విధిగా నమోదు చేయాలి. సంభావ్య ఎక్స్‌ప్లోజర్ గురించి ఇతర WA Notify యూజర్లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి ధృవీకరణ కోడ్ నమోదు చేయడానికి లేదా ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయడానికి, కోడ్ అభ్యర్ధించిన అదే పరికరాన్ని ఉపయోగించాలి.
ఒకే టెస్ట్ ఫలితం యొక్క డూప్లికేట్ రిపోర్ట్‌లను నిరోధించడానికి 90 రోజుల వరకు కోడ్‌ని అభ్యర్ధించడానికి ఉపయోగించే ఫోన్ నెంబరు యొక్క క్రిప్టోగ్రాఫికల్‌గా సంరక్షించబడ్డ వెర్షన్‌ని WA Notify తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఈ సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్ సమాచారం చేర్చబడదు లేదా ఎవరైనా WA Notify యూజర్ని గుర్తించడానికి ఉపయోగించబడదు.
మేము మీ సమాచారాన్ని ఎప్పుడు షేర్ చేస్తాము?
మీరు ధృవీకరణ కోడ్ నమోదు చేయడం లేదా ధృవీకరణ లింక్ క్లిక్ చేయాలని ఎంచుకుంటే తప్ప, మేం మీ సమాచారాన్ని స్వచ్ఛందంగా సేకరించం లేదా మరెవరితోనైనా పంచుకోం. మీరు అలా చేస్తే, WA Notify మీ గుర్తుతెలియని సంకేతాలను మీ స్మార్ట్‌ఫోన్‌కు దగ్గరలో ఉన్న ఇతర స్మార్ట్ఫోన్లతో షేర్ చేసుకుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్లేని ఎవరి ద్వారానైనా ధృవీకరణ కోడ్ లేదా లింక్‌ని తిరిగి మీకు లింక్ చేయలేరు. WA Notify లో ఏ సమాచారం సేకరించబడుతుంది మరియు ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఈ పేజీ పైన ఉన్న మేం ఏ సమాచారాన్ని సేకరిస్తాం మరియు ఉపయోగిస్తాం సెక్షన్ సమీక్షించండి
మేము మీ సమాచారాన్ని ఎలా పరిరక్షిస్తాము?
Google మరియు Apple యొక్క ఎక్స్‌ప్లోజర్ నోటిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి WA Notify యాదృచ్ఛిక కోడ్లను సంరక్షిస్తుంది, దీనిలో వాటిని ఎలా ఎన్‌క్రిప్ట్ చేయాలి మరియు బదిలీ చేయాలనే దాని గురించి అత్యంత నిర్ధిష్టమైన ఆవశ్యకతలు చేర్చబడతాయి. WA Notify మీ గుర్తుతెలియని సంకేతాలను నిల్వ చేయదు లేదా ఉత్పత్తి చేయదు – ఆ పని మీ స్మార్ట్‌ఫోన్ చేస్తుంది.
మీ సమాచారంపై హక్కులు మీవే
ధృవీకరణ కోడ్లు మరియు అప్లికేషన్లాగ్లను మీ స్మార్ట్‌ఫోన్‌కు యాక్సెస్ చేయకుండా జతచేయలేం కాబట్టి, DOH ఏవిధంగానూ ఈ సమాచారాన్ని యాక్సెస్ చేసుకోలేదు. దీని కారణంగా, DOH మీరు ఈ సమాచారాన్ని అడిగితే మీకు ఇవ్వలేకపోచ్చు లేదా డిలీట్ చేయలేకపోవచ్చు. WA Notify ఉపయోగాన్నినియంత్రించే వారు మీరే. ఎక్స్పోజర్ నోటిఫికేషన్లను నిలిపివేయడానికి లేదా మీ స్మార్ట్‌ఫోన్‌లో నిల్వ చేసిన ఎక్స్పోజర్ లాగ్లను ఎప్పుడైనా తొలగించడానికి మీ స్మార్ట్‌ఫోన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా, WA Notify ని మీరు ఎప్పుడైనా అన్ఇన్స్టాల్ చేయవచ్చు. మీరు అలా చేస్తే, నిల్వ చేసిన గుర్తుతెలియని సంకేతాలన్నీ తొలగిపోతాయి.