Telugu

తరచుగా అడిగే ప్రశ్నలు

టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి

టెస్టింగ్ ప్రాణాలను కాపాడుతుంది. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి సకాలంలో క్వారంటైన్​లోనికి వెళ్లడం వంటి జాగ్రత్తలు తీసుకోవడానికి టెస్టింగ్ వ్యక్తులను అనుమతిస్తుంది; రోగలక్షణాలు లేకుండా ఉండే వ్యాధి సోకిన వ్యక్తులు వైరస్​ని వ్యాప్తి చెందించవచ్చు. వ్యాప్తికి ప్రజారోగ్య అధికారులు ప్రతిస్పందించడానికి మరియు వైరస్ యొక్క కొత్త వేరియెంట్​లను ట్రాక్ చేయడానికి కూడా టెస్టింగ్ సాయపడుతుంది. సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించడంలో సాయపడటానికి టెస్టింగ్ ఒక ముఖ్యమైన అంగం.

కొవిడ్-19 కొరకు టెస్ట్ చేయించుకోవడం మరియు WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) ద్వారా ట్రాక్ చేయడం ద్వారా డిసెంబర్ 2020 నుంచి మార్చి 2021 వరకు సుమారు 6,000 కేసుల వరకు నిరోధించినట్లుగా University of Washington మరియు Department of Health (DOH, డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) పరిశోధనల్లో తేలింది.

ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి

మీకు కొవిడ్-19 రోగలక్షణాలున్నా లేదా కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా ఉన్న ఎవరితోనైనా క్లోజ్ కాంటాక్ట్​గా ఉన్నట్లయితే టెస్టింగ్ చేయించుకోండి. రోగ లక్షణాలు ఉన్నట్లయితే, లేదా అనుమానిత ఎక్స్​ప్లోజర్ అయిన 3-5 రోజుల తరువాత, మీకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, చ మీరు వెంటనే టెస్ట్ చేయించుకోవాలి.

ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి

WA స్టేట్ Department of Health వెబ్​సైట్, ప్రతి కౌంటీలో లభ్యమయ్యే టెస్టింగ్ సైట్​ల డైరెక్టరీని (ఇంగ్లిష్​లో), పనిచేసే గంటలు మరియు ఆవశ్యకతలతో నిర్వహిస్తోంది. టెస్టింగ్ సైట్​లపై అదనపు సమాచారం కొరకు, 2-1-1కు కాల్ చేయండి. సౌకర్యవంతంగా, ఇంటి వద్ద టెస్ట్ చేసుకోవడానికి ఆర్డర్ చేయడానికి చిట్టీ లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే టెస్ట్ కిట్​లు కూడా ఫార్మసీల్లో లభ్యమవుతాయి.

నాకు దగ్గరల్లో ఉండే టెస్టింగ్ లొకేషన్ కనుగొనండి (ఇంగ్లిష్లో)

టెస్ట్​ల్లో రకాలు

ప్రస్తుతం రాపిడ్ యాంటీజెన్ టెస్ట్​లు, మాలిక్యులర్ టెస్టులు (ల్యాబ్ ఆధారిత మరియు పాయింట్ ఆఫ్ కేర్), కొన్ని హోమ్ సెల్ఫ్ టెస్ట్​లతో సహా టెస్టులు లభ్యమవుతున్నాయి. ఏదైనా నిర్ధిష్ట టెస్ట్ సప్లై, డిమాండ్ మరియు తయారీదారుడి సామర్ధ్యానికి అనుగుణంగా మారుతుంది.

ఖర్చు

కౌంటీ లేదా స్టేట్-సపోర్టెడ్ టెస్ట్ సైట్​ల వద్ద చేయబడే టెస్ట్​ల కొరకు ఎలాంటి ఖర్చు అవ్వదు. చాలా టెస్ట్లు, మరిముఖ్యంగా రోగలక్షణాలు అనుభూతి చెందే వ్యక్తులు, ఇన్స్యూరెన్స్​కు బిల్లు చేయవచ్చు లేదా Department of Health ద్వారా సబ్సిడీని పొందవచ్చు. సర్వీస్ కొరకు ఫీజును ఛార్జ్ చేసే టెస్టింగ్ సైట్​లు డైరెక్టరీలో సూచించబడ్డాయి. చాలావరకు ట్రావెల్ టెస్టింగ్​లు ఇన్స్యూరెన్స్ లేదా స్టేట్ సపోర్టెడ్ ప్రోగ్రామ్​ల ద్వారా కవర్ చేయబడతాయి.

టెస్టింగ్ ఏవిధంగా పనిచేస్తుంది

చాలావరకు టెస్టింగ్​ని నాసల్ స్వాబ్ ఉపయోగించి చేస్తారు. కొన్ని టెస్ట్​లు ఉమ్మిని సేకరించడం ద్వారా చేస్తారు. మరిన్ని వివరాలను టెస్టింగ్​పై తరచుగా అడిగే ప్రశ్నలు పేజీ లో తెలుసుకోవచ్చు.

ఫాలోప్

మీకు రోగలక్షణాలు ఉన్నట్లయితే, సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండండి. మీకు పాజిటివ్​గా టెస్ట్ చేయబడినా, లేదా క్వారంటైన్​లో ఉన్నట్లయితే (DOH/Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మార్గదర్శకాలు) Care Connect ద్వారా సాయాన్ని పొందండి.