తరచుగా అడిగే ప్రశ్నలు | కొవిడ్-19 కొరకు టెస్టింగ్

టెస్టింగ్ కిట్లను పొందడం

నేను కొవిడ్-19 టెస్ట్ని ఎక్కడ పొందవచ్చు?

దయచేసి దిగువ ఆప్షన్​లను ప్రయత్నించండి:

మీకు దగ్గరల్లో టెస్టింగ్ సైట్​కనుగొనడానికి సాయం అవసరం అయితే, మీ లోకల్ హెల్త్ డిపార్ట్​మెంట్ లేదా డిస్ట్రిక్ట్ ని సంప్రదించండి(ఇంగ్లిష్​లో) మీరు 1-800-525-0127కు కూడా కాల్ చేసి, #ని ప్రెస్ చేయండి. మీరు సమాధానం ఇచ్చేటప్పుడు, ఇంటర్​ప్రెటీటింగ్ సర్వీస్​లను యాక్సెస్ చేసుకోవడానికి మీ భాషను పేర్కొనండి.

నాకు ఇంటర్నెట్ యాక్సెస్ లేదు/నా భాషలో వెబ్సైట్ లభ్యం కావడం లేదు WAలో నేను ఉచిత కిట్కు ఎలా ఆర్డర్ చేయగలను?

దయచేసి 1-800-525-0127కు కాల్ చేసి, తరువాత #ని ప్రెస్ చేయండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది. మీ తరఫున కాల్ సెంటర్ WA మరియు ఫెడరల్ ఆన్​లైన్ పోర్టల్స్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

నా ఉచిత టెస్ట్లను నేను ఎప్పుడు అందుకుంటాను?

ఏదైనా ప్రోగ్రామ్ (Say YES! COVID Test (సే యస్ కొవిడ్ టెస్ట్) లేదా Federal Program(ఫెడరల్ ప్రోగ్రామ్)ల్లో ఒకదాని ద్వారా అభ్యర్ధిస్తే, సాధారణంగా ఆర్డర్ చేసిన 1-2 వారాల్లోపు అవి షిప్పింగ్ చేయబడతాయి.

వెబ్సైట్ టెస్ట్ల స్టాక్ లేదని పేర్కొంటోంది. అవి ఎప్పుడు లభ్యమవుతాయి?

దురదృష్టవశాత్తు, నేషనల్ సప్లై ఛైయిన్ డిమాండ్ కారణంగా ఆలస్యం కావడం వల్ల టెస్ట్​లు ఎప్పుడు తిరిగి వస్తాయనే దానికి సంబంధించిన ఖచ్చితమైన డేటా మా వద్ద లేదు. దయచేసి sayyescovidhometest.org వద్ద రెగ్యులర్​గా చెక్ చేయండి(ఇంగ్లిష్​లో). మీ సహనానికి ధన్యవాదాలు!

మీకు టెస్ట్ మరింత త్వరగా అవసరం అయితే, ‘‘కొవిడ్-19 టెస్ట్​ని నేను ఎక్కడ పొందవచ్చు?'' అనే ప్రశ్న కింద జాబితా చేసిన ఆప్షన్​లను దయచేసి ఉపయోగించండి.

సిఫారసు చేసిన అన్ని టెస్టింగ్ ఆప్షన్లను ఉపయోగించిన తరువాత, నేను ఇంకా ఎలాంటి టెస్ట్ని కనుగొనలేకపోయాను. నాకు కొవిడ్-19 ఉన్నట్లుగా నేను భావిస్తే ఏమి చేయాలి?

కొవిడ్-19 టెస్ట్ లొకేట్ చేయడంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నందుకు క్షమించండి, దేశవాప్తంగా సప్లైలు ఇప్పుడు పరిమితంగా ఉన్నట్లుగా మాకు తెలుసు.

మీకు కొవిడ్-19 రోగలక్షణాలు ఉన్నా లేదా కొవిడ్-19కు ఎక్స్​ప్లోజ్ అయినా మరియు మీకు సోకినట్లుగా ఆందోళన చెందుతున్నట్లయితే, మేం దిగువ పేర్కొన్నవాటిని సిఫారసు చేస్తాం:

సాధారణ టెస్టింగ్

ఎవరు టెస్ట్ చేయించుకోవాలి

కొవిడ్-19 రోగలక్షణాలు స్థిరంగా ఉన్న ఎవరికైనా Department of Health (DOH, డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) టెస్టింగ్​ని సిఫారసు చేస్తుంది.

కేసుల క్లోజ్ కాంటాక్ట్​లు, లేదా ప్రబలే పరిస్థితుల్లో బహిర్గతమైన వారు వంటి ఎక్స్ప్లోజ్ కాగల వ్యక్తుల కొరకు కూడా DOH టెస్టింగ్ సిఫారసు చేస్తోంది.

నాకు టెస్ట్ పాజిటివ్ అయితే ఏమి జరుగుతుంది?

ఇతరుల నుంచి దూరంగా ఉండటానికి Centers for Disease Control (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఇంటి వద్ద ఐసోలేషన్ కొరకు DOH మార్గదర్శకాలను చూడండి. క్లోజ్ కాంటాక్ట్​లందరూ క్వారంటైన్​లో ఉండాలి.

ఇంటి వద్ద కొవిడ్-19 టెస్ట్ ఫలితం పాజిటివ్ అయితే నివేదించడానికి మరియు సంరక్షణ సర్వీస్​లను యాక్సెస్ చేసుకోవడానికి, దయచేసి వాషింగ్టన్ స్టేట్ కొవిడ్ హాట్​లైన్ 1-800-525-0127కు కాల్ చేయండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది.

మీరు ఇప్పటికే WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) డౌన్​లోడ్ చేసుకున్నా లేదా మీ స్మార్ట్​ఫోన్​పైన ప్రారంభించినట్లయితే, పాజిటివ్ టెస్ట్ ఫలితాన్ని నివేదించడానికి కూడా మీరు ఈ టూల్​ని ఉపయోగించవచ్చు.

తదుపరి సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు: మీరు పాజిటివ్​గా టెస్ట్ చేయబడితే ఏమి చేయాలి.