కొవిడ్-19కు పాజిటివ్గా టెస్ట్

మీరు కొవిడ్-19కు పాజిటివ్​గా టెస్ట్ చేయబడినట్లయితే, మిమ్మల్ని మరియు ఇతరులను సురక్షితంగా ఉంచడానికి సాయపడేందుకు మీరు తీసుకోగల చర్యలు ఉన్నాయి.

మీరు పాజిటివ్​గా టెస్ట్ చేయబడితే ఏమి చేయాలి

ఇంటిలోనే, ఇతరులకు దూరంగా ఉండండి. Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మరియు Washington State Department of Health (DOH, డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) యొక్క తాజా ఐసోలేషన్ మార్గదర్శనం అనుసరించండి(ఇంగ్లిష్ మాత్రమే) మీరు ఐసోలేషన్​లో ఉన్నప్పుడు సాయం అవసరం అయితే, మీరు Care Connect Washington నుంచి సాయాన్ని పొందవచ్చు.

  • మీ ఇంటికి పైగా ఇతరుల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవడానికి ఇంటిలోనే ఉండండి. ఒకవేళ సాధ్యమైతే, మీరు నివసించే వారి నుంచి దూరంగా వేరే రూమ్​లో ఉండండి మరియు విడి బాత్​రూమ్​ని ఉపయోగించండి.

మీ రోగలక్షణాలను గమనించండి. మీ రోగలక్షణాలు క్షీణించినట్లయితే, లేదా మీరు ఆందోళన చెందే కొత్త రోగలక్షణాలు ఉంటే, మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించండి. దిగువ పేర్కొన్న కొవిడ్-19 అత్యవసర హెచ్చరిక సూచనలు గమనించినట్లయితే 9–1–1 కు కాల్ చేయండి:

  • శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం
  • ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి స్థిరంగా ఉండటం
  • ఆకస్మిక గందరగోళం
  • ప్రతిస్పందించలేకపోవడం
  • పాలిపోయిన, బూడిదరంగు, నీలం-రంగు చర్మం, పెదవులు, లేదా గోళ్లు, చర్మం రంగును బట్టి

మీరు ఇతర వ్యక్తులకు దగ్గరగా ఉండాల్సి వస్తే. ఇంకా ఇంటిలో ఉన్నప్పుడుమీ ముక్కు మరియు నోటిని కవర్ చేయగలమాస్క్ని ధరించండి. మీఇంటిలోని ఇతర వ్యక్తులు కూడా మాస్క్​లు ధరించాలి.

వ్యాప్తి చెందకుండా ఆపడానికి ఇతరులకు తెలియజేయండి. మీ క్లోజ్ కాంటాక్ట్​లను ని సంప్రదించండి (ఇంగ్లిష్​లో) వారికి కొవిడ్-19కు ఎక్స్​ప్లోజ్ కావొచ్చు అని తెలియజేయండి. ఎవరైనా సంక్రమించిన వ్యక్తికి వారి లక్షణాలు కనిపించడానికి ముందు కొవిడ్-19 వ్యాప్తి చెందించవచ్చు. మీరు మీ క్లోజ్ కాంటాక్ట్​లకు నోటిఫై చేసినప్పుడు, వారు ఇతరులకు వైరస్​ని వ్యాప్తి చెందకుండా పరిహరించడానికి అవసరమైతే, టెస్ట్ చేయించుకోవచ్చు మరియు క్వారంటైన్ లేదా ఐసోలేషన్​లో ఉండవచ్చు.

  • మీరు ఇంటి వద్ద టెస్ట్​ని ఉపయోగించినట్లయితే, మీ పాజిటివ్ రిజల్ట్​ని 1–800–525–0127 ద్వారా వాషింగ్టన్ కొవిడ్-19 హాట్​లైన్​కు నివేదించండి. ఇది కాంటాక్ట్ ట్రేసింగ్ చర్యల కు మద్దతు ఇస్తుంది (ఇంగ్లిష్​లో) మరియు మన కమ్యూనిటీల్లో తదుపరి వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఫోన్ లైన్ సోమవారం నాడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మరియు మంగళవారం నుంచి శనివారం (మరియు సెలవుదినాల్లో) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. భాషా సాయం లభ్యమవుతుంది.
  • మీరు ఇంటి వద్ద టెస్ట్​ని ఉపయోగించినట్లయితే, ఎక్స్​ప్లోజ్ కాగల ఇతర WA Notify యూజర్​లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify (డబ్ల్యుఎ నోటిఫై) ద్వారా ధృవీకరణ కోడ్​ని పొందండి.

మీ హెల్త్ కేర్ ప్రొవైడర్​ని — మీ వద్ద ఉన్నట్లయితే — లేదా స్థానిక హెల్త్ క్లినిక్​ని వైద్య సాయం కొరకు సంప్రదించండి. మీరు రికవరీ అయ్యేటప్పుడు సౌకర్యవంతంగా ఎలా ఉండవచ్చు అనేదానిపై వారు మీకు కొన్ని చిట్కాలు ఇవ్వవచ్చు. వారు పరిశీలించాల్సిన తీవ్రమైన అనారోగ్యం లక్షణాల గురించి కూడా మీకు చెబుతారు, కాబట్టి మీకు అవసరమైతే మీరు అదనపు సంరక్షణ పొందవచ్చు.

మీరు ఉండే ప్రాంతంలో సాధ్యమైనంత వరకుగాలి ఉండేలా చూడండి. సాధ్యమైతే, కిటికీలు తెరవండి, మీ థర్మోస్టాట్​పై ఫ్యాన్​ని ఎక్కువ వేగంతో ఉపయోగించండి, మీ HVAC ఫిల్టర్ మార్చండి, లేదా HEPA ఎయిర్ ప్యూరిఫైయర్​ని ఉపయోగించండి.

మీరు కొవిడ్-19 నుంచి రికవరీ అయి, మీ ఐసోలేషన్ పీరియడ్ ముగిసినా, మిమ్మల్ని మరియు ఇతరులను సంరక్షించుకోవడాన్ని కొనసాగించడం ముఖ్యం. మీరు మీ కొవిడ్-19 వ్యాక్సిన్ మరియు బూస్టర్ పొందడం, బహిరంగ ప్రదేశాల్లో మీ మాస్క్ ధరించడం, పెద్ద సమూహాల్లోనికి వెళ్లకుండా ఉండటం, మీ చేతులను శుభ్రం చేసుకోవడం, మరియు మీ స్మార్ట్​ఫోన్ మీద WA Notify ప్రారంభించడం ద్వారా చేయవచ్చు.