కొవిడ్-19 వ్యాక్సిన్ ఉచితం, ఇమిగ్రేషన్ స్టేటస్‌తో సంబంధం లేకుండా 6 నెలలు సంవత్సరాలు పైబడిన వారందరికీ లభ్యమవుతుంది.
ఇంటిలోనే ఉన్నట్లయితే కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరమా? దయచేసి ఇక్కడ చూడండి
కంటెంట్ అప్డేట్ చేసిన తేదీ జూలై 22, 2022
Centers for Disease Control and Prevention (CDC, వ్యాధుల నియంత్రణ మరియు నివారణ కేంద్రం) మరియు Western States Scientific Safety Review Workgroup (వెస్టర్న్ స్టేట్స్ శాస్త్రీయ భద్రతా సమీక్ష వర్క్గ్రూప్) యొక్క నవీకరించబడిన బూస్టర్ డోస్ సిఫార్సులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- 5-11 సంవత్సరాల వయసున్న పిల్లలు Pfizer-BioNTech ప్రాధమిక వ్యాక్సిన్లను వేసుకోవడం పూర్తయిన 5 నెలల తరువాత బూస్టర్ డోసును ఖచ్చితంగా వేసుకోవాలి. రోగనిరోధక శక్తి లేని పిల్లలకు 1వ సిరీస్ అయ్యాక కనీసం 3 నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వాలి.
- 12 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్నవారందరూ మొదటి Pfizer లేదా Moderna వ్యాక్సిన్ సిరీస్ తీసుకున్న తర్వాత 5 నెలలకు గానీ Johnson & Johnson (J&J) సింగిల్-షాట్ వ్యాక్సిన్ తీసుకున్న 2 నెలల తర్వాత గానీ బూస్టర్ డోస్ తీసుకోవాలి.
- 50 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్నవారందరూ మొదటి బూస్టర్ డోస్‌ను తీసుకున్న 4 నెలల తర్వాత రెండవ బూస్టర్ డోస్ తీసుకోవాలి.
- రోగనిరోధక శక్తిని ఓ మోస్తరుగా తక్కువగా లేదా చాలా తక్కువగాకలిగి ఉన్న 12 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్నవారందరూ మొదటి బూస్టర్ డోస్ తీసుకున్న 4 నెలల తర్వాత రెండవ బూస్టర్ డోస్ తీసుకోవాలి.
- 4 నెలల క్రితం మొదటి J&J వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తీసుకున్న 18 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్నవారు mRNA కోవిడ్-19 వ్యాక్సిన్ రెండవ బూస్టర్ డోస్ తీసుకోవచ్చు.
మీరు కోరుకునే సమాచారాన్ని మేం అందించాలని కోరుకుంటున్నాం. మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి విషయ పరిజ్ఞానం కలిగి నిర్ణయాలను తీసుకోవడానికి వీలుగా మేము మీకు అప్డేట్లను అందిస్తూ ఉంటాం.
- దయచేసి మా ఫ్యాక్ట్ షీట్ కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ వేయించుకోవడం (PDF)ను చూడండి
- మరింత తెలుసుకోవడానికి మా వ్యాక్సిన్ వాస్తవాల పేజీని సందర్శించండి
- పిల్లల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్లపై సమాచారం కొరకు Vaccinating Youth (యువతకు వ్యాక్సిన్ వేయడం) పేజీ చెక్ చేయండి
నేను కొవిడ్-19 వ్యాక్సిన్ పొందడానికి ఏమి తెలుసుకోవాలి?
- నేను వ్యాక్సిన్ ఎలా పొందగలను?
-
అపాయింట్మెంట్ కొనుగొనడానికి మరియు షెడ్యూల్ చేయడానికి వ్యాక్సిన్ లొకేటర్ని సందర్శించండి.
మీకు దగ్గరల్లోని వ్యాక్సిన్ లొకేషన్ల కొరకు మీ జిప్ కోడ్‌ని 438-829 (GET VAX)కు కూడా టెక్ట్స్ చేయవచ్చు.
కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి మీకు ఏవైనా ప్రశ్నలున్నాయా? మీకు వ్యాక్సిన్ అపాయింట్మెంట్ పొందడంలో సాయం కావాలా? కొవిడ్-19 సమాచారం హాట్‌లైన్ 1-800-525-0127కు కాల్ చేయండి, ఆ తరువాత # ప్రెస్ చేయండి. భాషాపరమైన సహాయం అందుబాటులో ఉంది.
మీరు మీ రెండో మోతాదు వ్యాక్సిన్(Moderna/Spikevax లేదా Pfizer/Comirnaty) కొరకు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తున్నట్లయితే, మీరు మీ మొదటి మోతాదు వలే అదే వ్యాక్సిన్‌ని పొందాల్సి ఉంటుంది.
మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇంటి వద్దనే ఉంటున్నట్లయితే, సురక్షితమైన ఆన్లైన్ ఫారాన్ని నింపండి (ఇంగ్లిష్). అందుబాటులో ఉన్న కౌంటీ మరియు/లేదా స్టేట్ మొబైల్ వ్యాక్సిన్ టీమ్‌లకు చెందిన వ్యక్తులతో అనుసంధానం చేయడానికి మీ సమాధానాలు మాకు అనుమతిస్తాయి.
హౌసింగ్, వస్తువుల సాయం, ఆరోగ్య సమస్య వంటి ఇతర కొవిడ్-19 సంబంధిత సమస్యల కొరకు, 211కు కాల్ చేయండి లేదా wa211.orgని సందర్శించండి
మరింత సమాచారం కొరకు, చూడండి కొవిడ్-19 వ్యాక్సిన్లలు: ఏమి తెలుసుకోవాలి ఫ్యాక్ట్ షీట్.
- వ్యాక్సిన్ వేయించుకోవడానికి నాకు అమెరికా పౌరసత్వం ఉండాలా?
-
లేదు, వ్యాక్సిన్ వేయించుకోవడానికి మీకు అమెరికా పౌరసత్వం ఉండాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ పొందడానికి మీకు సామాజిక భద్రతా నెంబర్, లేదా మీ ఇమ్మిగ్రేషన్ స్థితిని తెలిపే ఇతర డాక్యుమెంట్లు అవసరం లేదు. వ్యాక్సిన్ అందించేవారు కొందరు సామాజిక భద్రతా నెంబర్‌ను అడగవచ్చు, కానీ మీరు దానిని ఇవ్వవలసిన అవసరం లేదు.
వ్యాక్సిన్ పొందడానికి మీ బిడ్డ అమెరికా పౌరుడై ఉండాల్సిన అవసరం లేదు. హెల్త్ కేర్ ప్రొవైడర్లు ఏ ఒక్కరి ఇమిగ్రేషన్ స్థితి గురించి అడగరు. చాలా సందర్భాల్లో, 18 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉండే యువతకు వ్యాక్సిన్ వేయడానికి సమ్మతించేందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అవసరం అవుతారు.
6 నెలలు సంవత్సరాలు మరియు ఆపైన వయస్సు ఉన్న వ్యక్తులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని Washington State Department of Health (వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) సిఫారసు చేస్తోంది.
- నా నుంచి వ్యాక్సిన్ కోసం ఛార్జీని వసూలు చేస్తారా?
-
లేదు. మీరు వ్యాక్సిన్ పొందేటప్పుడు మీ నుంచి ఎలాంటి మొత్తాన్ని ఛార్జ్ చేయరాదు, లేదా మీ ప్రొవైడర్ లేదా వ్యాక్సినేషన్ ఫెసిలిటీ మీకు బిల్లును ఇవ్వరాదు. ప్రైవేట్ బీమా ఉన్నవారికి, Apple Health (Medicaid) ఉన్నవారికి, Medicare ఉన్నవారికి, లేదా బీమా లేని వారికి ఇది వర్తిస్తుంది.
మీరు వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం దానిని అందించేవారి వద్ద ఉన్నప్పుడు ఇతర సేవలను పొందితే, మీకు వారి కార్యాలయ సందర్శనకు బిల్లు చేయవచ్చు. దీనిని నివారించడం కోసం, ముందుగానే మీరు మీకు వ్యాక్సిన్‌ను అందించేవారిని వాటి వ్యయం గురించి అడగవచ్చు.
మీకు ఆరోగ్య బీమా లేకపోతే, వ్యాక్సిన్ అందించేవారు దాని కోసం మీకు చార్జీ చేయలేరు, అలా చేస్తే అది కోవిడ్-19 వ్యాక్సిన్ కార్యక్రమ ఆవశ్యకతలను ఉల్లంఘించడం కావచ్చు. మీకు ఛార్జీని విధిస్తే దయచేసి covid.vaccine@doh.wa.gov కు ఇమెయిల్ చేయండి.
మీకు ఆరోగ్య బీమా ఉండి, ఛార్జ్ చేసినట్లయితే, ముందుగా మీ బీమా ప్లాన్‌ని సంప్రదించండి. ఇది సమస్యను సరిచేయనట్లయితే, మీరు ఆఫీస్ ఆఫ్ ద బీమా కమిషనర్వద్ద ఫిర్యాదు ఫైలు చేయవచ్చు (ఇంగ్లిష్).
- టెలిఫోన్ దుబాసీ సేవ కోసం 800-562-6900కు కాల్ చేయండి (మీకు ఎటువంటి ఖర్చు లేకుండా 100కి పైగా భాషలలో సేవలు లభిస్తాయి)
- TDD/TYY: 360-586-0241
- TDD: 800-833-6384
- నాకు ఆరోగ్య బీమా లేనట్లయితే ఏమిటి?
-
మీకు బీమా కవరేజీ లేనట్లయితే, మీ ప్రొవైడర్‌తో చెప్పండి. మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వ్యాక్సిన్‌ని పొందుతారు.
- వ్యాక్సిన్ కొరకు నా నుంచి ఛార్జ్ చేయనప్పటికీ, నా ఆరోగ్య బీమా సమాచారం ఎందుకు అడుగుతున్నారు?
-
మీరు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు, మీ వ్యాక్సిన్ ప్రొవైడర్ మీ వద్ద బీమా కార్డు ఉన్నదా అని అడగవచ్చు. మీకు వ్యాక్సిన్ వేసినందుకు వారు ఈ విధంగా రీఎంబర్స్మెంట్ (వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు) పొందవచ్చు. మీరు బీమా లేనట్లయితే మీ ప్రొవైడర్‌కు తెలియజేయండి. అయినప్పటికీ, మీరు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వ్యాక్సిన్‌ని పొందుతారు.
- వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు అంటే ఏమిటి, దానిని ఎవరు చెల్లిస్తారు?
-
వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు అనేది వ్యాక్సిన్ మీకు ఇవ్వడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్ ఛార్జ్ చేసే ఫీజు. ఇది వ్యాక్సిన్ ఖర్చు నుంచి విడిగా ఉంటుంది.
వ్యాక్సిన్ పూర్తి ఖర్చును ఫెడరల్ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీకు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆరోగ్య బీమా ఉన్నట్లయితే, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ పొందడానికి మీ వ్యాక్సిన్ ప్రొవైడర్ వారికి బిల్లు చేయవచ్చు.
మీరు పాకెట్ ఖర్చుల నుంచి ఛార్జ్ చేయరాదు లేదా కొవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫీజు కొరకు మీ ప్రొవైడర్ నుంచి బిల్లును అందుకోరాదు. ప్రైవేట్ బీమా ఉన్నవారికి, Apple Health (Medicaid) ఉన్నవారికి, Medicare ఉన్నవారికి, లేదా బీమా లేని వారికి ఇది వర్తిస్తుంది.
- ప్రస్తుతం ఏ కొవిడ్-19 వ్యాక్సిన్లు లభ్యమవుతున్నాయి?
-
U.S. Food and Drug Administration (FDA, పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా అత్యవసర ఉపయోగం లేదా పూర్తిగా మూడు వ్యాక్సిన్లు ఆమోదించబడ్డాయి. ఈ వ్యాక్సిన్లు ప్రస్తుతం Washington స్టేట్‌లో అందించబడుతున్నాయి. Thrombosis with thrombocytopenia syndrome (TTS, థాంబోసైటోపేనియా) తో థాంబోసిస్ మరియు Guillain-Barré syndrome (GBS, గులియన్-బేరే సిండ్రోమ్) అని పిలవబడే అరుదైన ప్రమాదం కారణంగా Johnson & Johnson కంటే Pfizer (Comirnaty) మరియు Moderna (Spikevax) లు సిఫారసు చేస్తున్నారు.
Pfizer-BioNTech కొవిడ్-19 వ్యాక్సిన్ (Comirnaty):
6 నెలల నుండి 4 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు మూడు డోసులు ఇవ్వబడతాయి. మొదటి డోసు వేసుకున్న 21 రోజుల తర్వాత 2వ డోసు వేసుకోవాలి మరియు రెండవ డోసు వేయించుకున్న 8 వారాల తర్వాత మూడవ డోసు వేసుకోవాలి.
ఇది 21 రోజుల వ్యవధిలో ఇచ్చే రెండు మోతాదుల వ్యాక్సిన్, ప్లస్:
- రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి రెండు డోసుల mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు తప్పనిసరిగా అదనపు ప్రాథమిక డోసు తీసుకోవాలి.
- 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి, రెండో డోస్ తీసుకున్న తరువాత 5 నెలలు గడిచిన వారికి బూస్టర్ డోస్.
- 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, కొంతమంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు, వారి చివరి బూస్టర్ మోతాదు తీసుకున్న తరువాత 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచినట్లయితే mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు బూస్టర్ మోతాదును పొందవచ్చు.
ఒక వ్యక్తి తన ప్రాథమిక శ్రేణిలో సిఫార్సు చేసిన అన్ని డోసులు తీసుకోవడంతో పాటు అర్హత ఉన్నప్పుడు అన్ని బూస్టర్లు కూడా తీసుకున్నట్లయితే, ఆ వ్యక్తి తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ విషయంలో అప్ టూ డేట్‌గా ఉన్నట్లు పరిగణిస్తారు.
వ్యాక్సిన్ Comirnaty పేరుతో 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి పూర్తిగా ఆమోదించబడింది. 6 నెలలు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు యువత కొరకు అత్యవసర ఉపయోగానికి వ్యాక్సిన్ అధికారిక ఆమోదాన్ని పొందింది. ప్రధానమైన ఊహించని దుష్ప్రభావ ఘటనలు ఏవీ లేవు అని వైద్య అధ్యయనాలు తెలిపాయి.
Moderna కొవిడ్-19 వ్యాక్సిన్ (Spikevax):
ఇది 28 రోజుల వ్యవధిలో, ఇచ్చే రెండు మోతాదుల వ్యాక్సిన్ ఇది, ప్లస్:
- రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల కొరకు అదనంగా (మూడో) మోతాదు వ్యాక్సిన్ ఇస్తారు.
- 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి, రెండో డోస్ తీసుకున్న తరువాత 5 నెలలు గడిచిన వారికి బూస్టర్ డోస్.
- 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, కొంతమంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు, వారి చివరి బూస్టర్ మోతాదు తీసుకున్న తరువాత 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచినట్లయితే mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు బూస్టర్ మోతాదును పొందవచ్చు.
ఈ వ్యాక్సిన్‌ను 18 సంవత్సరాలు, ఆపైబడ్డ వ్యక్తుల కొరకు పూర్తిగా ఆమోదించారు. EUA (Emergency Use Authorization, అత్యవసర వినియోగ అనుమతి) కింద Moderna వ్యాక్సిన్ 6 నెలలు - 17 ఏళ్ల వయసు పిల్లల కోసం అందుబాటులో ఉంది.
ఒక వ్యక్తి తన ప్రాథమిక శ్రేణిలో సిఫార్సు చేసిన అన్ని డోసులు తీసుకోవడంతో పాటు అర్హత ఉన్నప్పుడు అన్ని బూస్టర్లు కూడా తీసుకున్నట్లయితే, ఆ వ్యక్తి తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ విషయంలో అప్ టూ డేట్‌గా ఉన్నట్లు పరిగణిస్తారు.
ప్రధానమైన ఊహించని దుష్ప్రభావ ఘటనలు ఏవీ లేవు అని వైద్య అధ్యయనాలు తెలిపాయి.
Johnson & Johnson – Janssen కోవిడ్-19 వ్యాక్సిన్:
ఈ వ్యాక్సిన్ 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్కులకు అత్యవసర పరిస్థితిలో ఉపయోగించడానికి అధికారిక ఆమోదాన్ని పొందింది. ఇది ఒక్క డోస్ (ఒన్ షాట్) వ్యాక్సిన్. మీరు వ్యాక్సిన్‌ను వేయించుకున్న తరువాత ఒకటి నుండి రెండు వారాల వరకు మీరు పూర్తి రక్షణను పొందినట్లుగా పరిగణించరు. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వారి మొదటి మోతాదు తరువాత రెండు అంతకంటే ఎక్కువ నెలలకు బూస్టర్ మోతాదును పొందాలి. ప్రధానమైన ఊహించని దుష్ప్రభావ ఘటనలు ఏవీ లేవు అని వైద్య అధ్యయనాలు తెలిపాయి. Johnson & Johnson వ్యాక్సిన్‌కు బదులుగా Pfizer మరియు Moderna వ్యాక్సిన్లు సిఫారసు చేయబడుతున్నాయి. ప్రాథమిక వ్యాక్సిన్మరియు బూస్టర్ మోతాదును కనీసం 4 నెలల క్రితం పొందిన వయోజనులు mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ ఉపయోగించి రెండో బూస్టర్ మోతాదును పొందడానికి ఇప్పుడు అర్హులు.
Novavax కోవిడ్-19 వ్యాక్సిన్:
- 12 ఏళ్లు, ఆపై వయస్సు ఉన్న వారికి 21 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారు
ఈ వ్యాక్సిన్ 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్కులకు అత్యవసర పరిస్థితిలో ఉపయోగించడానికి అధికారిక ఆమోదాన్ని పొందింది. ఒక వ్యక్తి తన ప్రాథమిక శ్రేణిలో సిఫార్సు చేసిన అన్ని డోసులు తీసుకోవడంతో పాటు అర్హత ఉన్నప్పుడు అన్ని బూస్టర్లు కూడా తీసుకున్నట్లయితే, ఆ వ్యక్తి తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ విషయంలో అప్ టూ డేట్‌గా ఉన్నట్లు పరిగణిస్తారు.
ప్రధానమైన ఊహించని దుష్ప్రభావ ఘటనలు ఏవీ లేవు అని వైద్య అధ్యయనాలు తెలిపాయి.
- నేను రెండవ డోస్ తీసుకోవడం ఆలస్యమైతే, నేను వ్యాక్సిన్ సీరిస్‌ని మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుందా?
-
లేదు, మీరు రెండవ డోస్ తీసుకోవడం ఆలస్యమైతే, మీరు వ్యాక్సిన్ సీరిస్‌ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం లేదు.
మీ మొదటి డోస్ నుంచి సిఫారసు చేసిన రోజులు గడిచిన తరువాత సాధ్యమైనంత త్వరగా రెండో డోస్ పొందండి.
రెండో మోతాదు పొందడానికి మధ్య అంతరం ఎంత ఉన్నప్పటికీ, దానితో సంబంధం లేకుండా రెండు మోతాదులను పొందడం ఎంతో ముఖ్యం.
మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, అదనపు డోస్‌కు అర్హత కలిగి ఉంటే, మీరు మీ రెండో డోస్ తరువాత కనీసం 28 రోజులు వేచి ఉండాలి.
- నేను గర్భవతిని, పాలిస్తున్నాను లేదా గర్భవతి కావాలని ప్లాన్ చేసినట్లయితే, కోవిడ్-19 వ్యాక్సిన్ ని పొందవచ్చా?
-
అవును, గర్భధారణ సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవని డేటా చూపుతోంది. Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) (ఇంగ్లిష్ మాత్రమే), American College of Obstetricians and Gynecologists (ACOG- అమెరిక్ కాలేజీఆఫ్ అబ్స్ట్రెటీషియన్లు మరియు గైనకాలజిస్ట్లు), మరియు Society for Maternal-Fetal Medicine (SMFM- సొసైటీ ఫర్ మెటర్నల్-ఫీటల్ మెడిసిన్) (ఇంగ్లిష్ మాత్రమే)లు గర్భవతులైన, పిల్లలకు పాలిచ్చే లేదా గర్భం ధరించాలని భావించే మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్‌ని సిఫారసు చేస్తున్నారు. మీకు వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే, గర్భధారణ మరియు పాలివ్వడం ద్వారా మీ బిడ్డ కొవిడ్-19కు విరుద్ధంగా యాంటీబాడీలు కూడా పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోని గర్భవతులైన మహిళలకు నెలలు నిండకముందే బిడ్డ పుట్టడం లేదా మృతశిశువులు పుట్టడం వంటి తీవ్రమైన సంక్లిష్టతల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదనంగా, గర్భవతిగా ఉన్నప్పుడు కోవిడ్-19 వచ్చిన మహిళలకు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ మరియు బ్రీతింగ్ ట్యూబ్ అవసరం అయ్యే అవకాశం రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
గర్భం ధరించినప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం గురించి మరిన్ని వనరుల కొరకు, దయచేసి వన్ వ్యాక్స్, టూ లైవ్స్ వెబ్సైట్లో తాజా సమాచారాన్ని చూడండి.
- నేను రొటీన్ వ్యాక్సినేషన్లు పొందేటప్పుడు కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందవచ్చా?
-
అవును. Advisory Committee on Immunization Practices (ACIP- ఇమ్యూనైజేషన్ విధానాలపై సలహా మండలి) మే 12, 2021 నాడు తన సిఫారసులను మార్చింది. మీరు ఇప్పుడు మీ ఇతర వ్యాక్సిన్లను పొందే అదే సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందవచ్చు.
మీరు మీ బిడ్డ కొరకు అవసరమైన స్కూలు వ్యాక్సినేషన్లు (ఇంగ్లిష్ మాత్రమే) లేదా ఇతర సిఫారసు చేయబడ్డ వ్యాక్సిన్లు కొవిడ్-19 వ్యాక్సినేషన్ నుంచి విడిగా షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. కొవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ మీ బిడ్డకు సిఫారసు చేసిన అన్ని వ్యాక్సిన్లను వేయించడానికి మరో అవకాశం.
- వ్యాక్సినేషన్ రికార్డ్ కార్డు అంటే ఏమిటి?
-
మీరు కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న తరువాత మీరు పేపర్ వ్యాక్సినేషన్ కార్డుని పొందుతారు. మీరు ఏ రకం వ్యాక్సిన్ వేయించుకున్నారు (Comirnaty/Pfizer-BioNTech, Spikevax/Moderna, లేదా Johnson & Johnson) మరియు దానిని పొందిన తేదీని తెలియజేస్తుంది.
మీరు Comirnaty/Pfizer-BioNTech లేదా Spikevax/Moderna వ్యాక్సిన్‌ని పొందితే, మీరు మీ మొదటి డోస్ కొరకు ఉన్నప్పుడే మీ ప్రొవైడర్ మీ కొరకు మీ రెండో డోస్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి. ఈ కార్డును మీతో ఉంచుకోండి, తద్వారా మీ వ్యాక్సిన్ ప్రొవైడర్ మీ రెండో మోతాదు తరువాత దానిని పూర్తి చేయగలుగుతారు.
మీరు అదనపు మోతాదు లేదా బూస్టర్ మోతాదు పొందినట్లయితే, మీరు మీ అపాయింట్మెంట్కు మీ వ్యాక్సినేషన్ రికార్డ్ కార్డును కూడా తీసుకెళ్లాలి. మీ వ్యాక్సిన్ ప్రొవైడర్ మోతాదును రికార్డ్ చేస్తాడు.
మీ వ్యాక్సిన్ కార్డ్‌తో వ్యవహరించేటప్పుడు మీరు దృష్టిలో ఉంచుకోవాలసిన కొన్ని ఉపయోగకరమైన సూచనలను ఇక్కడ ఇచ్చాము:
- మోతాదుల మధ్య తరువాత మీ వ్యాక్సినేషన్ కార్డును ఉంచుకోండి
- దాని డిజిటల్ కాపీని అందుబాటులో ఉంచుకోవడం కోసం మీ కార్డ్ ముందు, వెనుక భాగాల ఫోటోలను తీసుకుని ఉంచుకోండి.
- తరువాత సులువుగా దానిని తిరిగి కనుగొనడానికి వీలుగా మీకు మీరే దానిని ఇమెయిల్ చేసుకోవడం, ఆల్బమ్‌ను సృష్టించడం లేదా ఫోటోకు ట్యాగ్‌ను జోడించడం లాంటి వాటిని పరిశీలించండి.
- మీరు మీతోపాటూ దానిని తీసుకెళ్లాలనుకుంటే దాని ఫోటోకాపీని తీసుకువెళ్లండి.
మీ అపాయింట్మెంట్కు మీరు వ్యాక్సినేషన్ కార్డ్‌ని తీసుకొని రాకపోయినా, మీరు ఇంకా మీ రెండో మోతాదును పొందుతారు. మీరు మళ్లీ అదే రకాన్ని పొందేట్లుగా ధృవీకరించడానికి, మీ మొదటి మోతాదు కొరకు మీరు అందుకున్న వ్యాక్సిన్ రకం (బ్రాండ్)ని చూడమని మీ ప్రొవైడర్‌ని అడగండి. మీరు మీ వ్యాక్సినేషన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీ కొవిడ్-19 వ్యాక్సినేషన్ రికార్డ్‌ని చూడటానికి, MyIR (My Immunization Registry)(నా ఇమ్యూనైజేషన్ రిజిస్ట్రీ)కు లాగిన్ అవ్వండి (ఇంగ్లిష్ మాత్రమే), తరువాత సమాచారాన్ని స్క్రీన్‌షాట్ లేదా ఫోటో తీసుకోండి. మీకు అకౌంట్ లేనట్లయితే, మీరు ఏ సమయంలోనైనా MyIR కొరకు సైన్ అప్ చేయవచ్చు.
MyIR ద్వారా తక్షణం రికార్డుల వెరిఫికేషన్ జరగకపోవచ్చని, యాక్సెస్ ప్రస్తుతం ఇంగ్లిష్ భాషకు మాత్రమే పరిమితం చేసిన విషయాన్ని దయచేసి గుర్తుంచుకోండి. Department of Health COVID-19 (డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కొవిడ్-19) హాట్‌లైన్ 833-VAX-HELP కు కాల్ చేయడం ద్వారా MyIRmobile లేదా వ్యాక్సినేషన్ రికార్డ్ ప్రశ్నలకు సాయం అందించడానికి లైవ్ టెలిఫోన్ సాయం లభ్యమవుతుంది లేదా waiisrecords@doh.wa.gov ద్వారా కూడా సంప్రదించవచ్చు.
భద్రత మరియు సమర్ధత
- నేను కొవిడ్-19 వ్యాక్సిన్‌ని ఎందుకు వేయించుకోవాలి?
-
కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవడం పూర్తిగా మీ ఎంపిక, అయితే ఈ మహమ్మారిని అంతమొందించడానికి సాధ్యమైనంత వరకు ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోవాలి. సమాజంలో చాలామంది-వ్యాక్సినేషన్ లేదా ఇటీవల సంక్రామ్యత ద్వారా రోగనిరోధక శక్తిని పొందితే కొవిడ్-19 వ్యాక్సిన్ వ్యాప్తి చెందడం కష్టం అవుతుంది. మన వ్యాక్సినేషన్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మన సంక్రామ్యత రేటు అంత తక్కువగా ఉంటుంది.
కోవిడ్-19 వ్యాక్సిన్లు మిమ్మల్ని అనేక విధాలుగా రక్షించగలుగుతాయి:
- మీకు కోవిడ్-19 వచ్చినా దాని వలన తీవ్రంగా జబ్బుపడే అవకాశాన్ని బాగా తగ్గిస్తాయి
- పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మీరు ఆసుపత్రిలో చేరే అవకాశాలు తగ్గుతాయి మరియు కొవిడ్-19 నుంచి మరణించే మీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
- వ్యాక్సినేషన్లు సమాజంలో సంరక్షించే వ్యక్తుల సంఖ్యను పెంచుతుంది, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందడాన్ని క్లిష్టతరం చేస్తుంది.
- వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చేయడంలో వ్యాక్సిన్కున్న సామర్థ్యం గురించి నిపుణులు తమ అధ్యయనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.
మీరు పూర్తిగా వ్యాక్సిన్‌ను వేయించుకున్న తరువాత, సైతం మీకు కోవిడ్-19 సోకడం సాధ్యమే.
వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులకు వైరస్ ఇంకా సోకవచ్చు, అది ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కొంతమంది వ్యక్తులు వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్‌ని పొందలేరు, ఇది వారి కొవిడ్-19కు మరింత దుర్భలమైనవారిగా చేస్తుంది మీరు వ్యాక్సిన్ వేయించుకోనట్లయితే, కొవిడ్-19 వేరియెంట్ (ఇంగ్లిష్ మాత్రమే) వల్ల ఆసుపత్రిలో చేరడం లేదా మరణించేందుకు అధిక ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీరు మరియు మీ కుటుంబం, పొరుగువారు మరియు కమ్యూనిటీని సంరక్షించడానికి సాయపడుతుంది.
- వ్యాధి ఉన్న చాలామంది బ్రతుకుతుంటే నేను కొవిడ్-19 వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి?
-
కొవిడ్-19 నుంచి మరణం మాత్రమే ప్రమాదంకాదు. కొవిడ్-19 వచ్చిన చాలామందికి కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. అయితే, వైరస్ అత్యంత అనూహ్యమైనది, కొన్ని కొవిడ్-19 వేరియెంట్లు (ఇంగ్లిష్ మాత్రమే) మీకు నిజంగా అనారోగ్యానికి గురిచేసే అవకాశం ఎక్కువగా ఉందని మాకు తెలుసు. కొంతమంది వ్యక్తులు, ఎలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు లేని యువత సైతం కొవిడ్-19 వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురికావొచ్చు లేదా మరణించవచ్చు. "కోవిడ్ లాంగ్-హాలర్స్" అని పిలిచే ఇతరులు నెలల తరబడి కొనసాగే లక్షణాలను కలిగి ఉండవచ్చు, ఇది వారి జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. ఇది కొత్త వైరస్ కనుక కొవిడ్-19 వల్ల కలిగే అన్ని దీర్ఘకాలిక ప్రభావాలు గురించి మనకు ఇంకా తెలియదు. వ్యాక్సిన్ వేయించుకోవడం వైరస్‌కు విరుద్ధంగా మన అత్యుత్తమ రక్షణ. మీరు యువకులు మరియు ఆరోగ్యవంతులైనప్పటికీ, మీరు కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందాలి.
- కొవిడ్-19 వేరియెంట్ అంటే ఏమిటి?
-
వైరస్లు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందేటప్పుడు పరివర్తన చెందుతాయి(మార్పు). 'వేరియంట్' వైరస్ పరివర్తన చెందిన స్ట్రెయిన్. కొన్ని వేరియెంట్లు కాలక్రమేణా అదృశ్యమవుతాయి, కొన్ని కమ్యూనిటీలలో వ్యాప్తి చెందుతూనే ఉంటాయి.
ఆందోళన కలిగించే వైరస్ వేరియెంట్లను Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) గుర్తిస్తుంది. ప్రస్తుతం, అనేక వేరియెంట్లను ఆందోళనకరంగా ఉన్నాయి, ఎందుకంటే అవి మరింత వేగంగా మరియు తేలికగా వ్యాప్తి చెందుతూ, మరిన్ని కొవిడ్-19 సంక్రామ్యతలను కలిగిస్తున్నాయి.
- కొవిడ్-19 వ్యాక్సిన్ వేరియెంట్ స్ట్రెయిన్లకు విరుద్ధంగా పనిచేస్తుందా?
-
వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి మందగిస్తుంది, వేరియెంట్ స్ట్రెయిన్ల సంక్రమణను తగ్గిస్తుంది. ఇది ఆసుపత్రిలో చేరడం మరియు తెలిసిన అన్ని వైరస్ వేరియెంట్ల వల్ల మరణించడానికి విరుద్ధంగా మీకు బలమైన సంరక్షణను కూడా అందిస్తుంది.
వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది వ్యక్తులకు ఇంకా వేరియెంట్ స్ట్రెయిన్ సంక్రమించవచ్చు, అయితే వారు తేలికపాటి లక్షణాలను ఎదుర్కొంటారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సిఫారసు చేసిన అన్ని మోతాదులను పొందడం ముఖ్యం, తద్వారా వేరియెంట్ల నుంచి మీరు గరిష్ట సంరక్షణను పొందుతారు.
మిమ్మల్ని, మీరు ప్రేమించేవారిని, మరియు మీ కమ్యూనిటీని సంరక్షించడానికి వ్యాక్సినేషన్ అత్యుత్తమ మార్గం. అధిక వ్యాక్సినేషన్ కవరేజీ వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది, కొత్త వైరస్ వేరియెంట్లు ఉద్భవించకుండా నిరోధించడానికి సాయపడుతుంది.
- వ్యాక్సిన్లు సురక్షితమైనవి అని మనకు ఎలా తెలుస్తుంది?
-
సిఫారసు చేసిన అన్ని మోతాదులను పొందడం ముఖ్యం, తద్వారా వేరియెంట్ల నుంచి మీరు గరిష్ట సంరక్షణను పొందుతారు. కొవిడ్-19 వ్యాక్సిన్లు సురక్షితమైనవి అని ధృవీకరించడానికి, వ్యాక్సిన్ భద్రతను మానిటర్ చేసే దేశ సామర్థ్యాన్ని Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) విస్తరించింది మరియు బలోపేతం చేసింది. దీని ఫలితంగా, వ్యాక్సిన్ భద్రతా నిపుణులు కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సమయంలో చూడని సమస్యలను మానిటర్ చేసి, గుర్తించగలరు.
- Johnson & Johnson వ్యాక్సిన్‌తో ఏమి జరుగుతుంది?
-
డిసెంబర్ 2021నాటికి, Washington State Department of Health (DOH, వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) సింగిల్ షాట్ Johnson & Johnson (J&J)కు బదులుగా mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ (Pfizer-BioNTech లేదా Moderna) పొందేందుకు ఎంచుకోవాలని మీకు సిఫారసు చేస్తోంది.
J&J వ్యాక్సినేషన్ తరువాత రెండు అరుదైన పరిస్థితుల గురించి కొత్త డేటా లభ్యమైన తరువాత Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) నుంచి ఈ కొత్త అప్డేట్ వచ్చింది.
ఈ పరిస్థితులు కేవలం J&J కొవిడ్-19 వ్యాక్సిన్‌కు మాత్రమే సంబంధించినది, Pfizer లేదా Moderna వ్యాక్సిన్లతో కాదు. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సినేషన్ కోరుతున్న వ్యక్తుల కొరకు, DOH Moderna మరియు Pfizer వ్యాక్సిన్లను సిఫారసు చేస్తోంది. అయితే, ఈ వ్యాక్సిన్ల్లో దేనినైనా మీరు పొందలేకపోయినట్లయితే లేదా ఇష్టపడనట్లయితే J&J వ్యాక్సిన్ ఇంకా లభ్యం అవుతుంది. మీ ఆప్షన్ల గురించి మాట్లాడటానికి దయచేసి హెల్త్ కేర్ ప్రొవైడర్‌తో మాట్లాడండి.
గడిచిన మూడు వారాల్లో మీరు J&J కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందినా, లేదా J&J కొవిడ్-19 వ్యాక్సిన్ పొందడానికి ప్లాన్ చేస్తుంటే, TTS ద్వారా రక్తం గడ్డ కంటే రకానికి సంబంధించి హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోండి. దీనితో తీవ్రమైన తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, కాళ్ల నొప్పి మరియు/లేదా శ్వాస ఆడకపోవడం సహా ఉంటాయి. మీరు ఈ లక్షణాల్లో వేటినైనా అనుభవిస్తున్నట్లయితే, దయచేసి వెంటనే వైద్య సాయం పొందండి
ఏదైనా కొవిడ్-19 వ్యాక్సిన్ పొందిన తరువాత మొదటి వారంలో జ్వరం, తలనొప్పి, అలసట మరియు కీళ్లు/కండరాలు నొప్పితోసహా తెలికపాటి నుంచి ఒక మాదిరి రోగలక్షణాలు ఉండటం సాధారణం, ఈ సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులలోపుగా మొదలై కేవలం కొద్ది రోజులే ఉంటాయి.
- FDA ఒక వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపినట్లయితే దాని అర్ధం ఏమిటి?
-
పూర్తి ఆమోదం కొరకు, FDA అత్యవసర ఉపయోగానికి అధికారం కొరకు ఎక్కువ కాలం పాటు డేటాను సమీక్షిస్తుంది. ఒక వ్యాక్సిన్‌కు పూర్తి ఆమోదాన్ని ఇవ్వడానికి, డేటా అధిక స్థాయి భద్రత, సమర్థత మరియు వ్యాక్సిన్ తయారీలో నాణ్యతా నియంత్రణ యొక్క అత్యధిక స్థాయిలను ప్రదర్శించాలి.
- అత్యవసర ఉపయోగ ఆథరైజేషన్ (EUA) పూర్తి లైసెన్స్ పొందడానికి ముందు ఒక ప్రొడక్ట్‌ని అత్యవసర పరిస్థితిగా ప్రకటించినప్పుడు అందుబాటులోనికి తీసుకొని రావడానికి FDA అనుమతిస్తుంది. డేటా యొక్క దీర్ఘకాలిక విశ్లేషణకు ముందే ప్రజలు ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లను పొందేలా చూడటమే EUA ఉద్దేశ్యం. అయితే EUA ఇంకా చాలా తక్కువ సమయంలో—క్లినికల్ డేటాను చాలా క్షుణ్నంగా సమీక్షించాల్సి ఉంటుంది. FDA మంజూరు చేయబడ్డ ఏదైనా EUA తదుపరి Western States Pact (వెస్ట్రన్ స్టేట్స్ ప్యాక్ట్) (ఇంగ్లిష్ మాత్రమే)లో భాగంగా, సైంటిఫిక్ రివ్యూ వర్క్ గ్రూపు ద్వారా నిశితంగా మరియు కీలకంగా పరీక్షించబడుతుంది.
- Western States Pact అంటే ఏమిటి?
-
FDA ద్వారా అధికారం ఇచ్చిన తరువాత కొవిడ్-19 వ్యాక్సిన్ల భద్రత మరియు సమర్థతను సమీక్షించడానికి అక్టోబర్, 2020లో వాషింగ్టన్ వెస్ట్రన్ స్టేట్స్ సైంటిఫిక్ సేఫ్టీ రివ్యూ వర్క్‌షాప్ (వెస్ట్రన్ స్టేట్స్ ప్యాక్)ని ఏర్పాటు చేయడానికి ఒరెగాన్, నెవాడా, కొలరాడో మరియు కాలిఫోర్నియాతో జట్టు కట్టింది. ఈ వర్క్‌షాప్ వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి నిపుణుల మరో అంచె సమీక్షను అందిస్తుంది.
ప్యానెల్లో అన్ని సభ్య దేశాల ద్వారా అపాయింట్ చేసిన నిపుణులు, మరియు ఇమ్యూనైజేషన్ మరియు ప్రజారోగ్యంలో నైపుణ్యతతో దేశవ్యాప్తంగా గుర్తించబడిన శాస్త్రవేత్తలు ఉన్నారు. అత్యవసర ఉపయోగం కొరకు FDA ఒక వ్యాక్సిన్‌కు అధికారం ఇచ్చినప్పుడు, ఫెడరల్ సమీక్షలకు సమాంతరంగా ప్యానెల్ ప్రజా బాహుళ్యంలో లభించే మొత్తం డేటాను సమీక్షించి, ఒక నివేదికను అందిస్తుంది. వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతున్న మూడు వ్యాక్సిన్ల కొరకు ఈ ప్రక్రియ చేపట్టబడింది, మరియు భవిష్యత్తులో Emergency Use Authorization (EUA) ఇవ్వబడే అన్ని కొవిడ్-19 వ్యాక్సిన్ల విషయంలో ఇది జరుగుతుంది. Western States Scientific Safety Review Workgroup (వెస్ట్రన్ సైంటిఫిక్ సేఫ్టీ రివ్యూ వర్క్గ్రూప్) కనుగొన్న విషయాలను చదవండి:
- Pfizer-BioNTech కొవిడ్-19 వ్యాక్సిన్ (PDF) (ఇంగ్లిష్)
- Moderna కొవిడ్D-19 వ్యాక్సిన్ (PDF) (ఇంగ్లిష్)
- Johnson & Johnson-Janssen కొవిడ్-19 వ్యాక్సిన్ (PDF) (ఇంగ్లిష్)
- Novavax కొవిడ్-19 వ్యాక్సిన్ (ఇంగ్లిష్)
- వాషింగ్టన్లో మనం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎప్పుడు పొందుతాం?
-
వ్యాక్సిన్‌లో మీ శరీరంలో ఎలా పనిచేస్తాయనే దానిపై (ఇంగ్లిష్) ఈ వీడియోని చూడండి.
mRNA వ్యాక్సిన్లు (Pfizer మరియు Moderna కొవిడ్-19 వ్యాక్సిన్లు)
అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లను మెసెంజర్ RNA (mRNA) వ్యాక్సిన్లు అని అంటారు.
mRNA వ్యాక్సిన్లు నిరపాయకరమైన కరోనావైరస్ ప్రోటీన్ తునకను ఎలా తయారు చేయాలో మీ కణాలకు నేర్పుతాయి. మీ రోగ నిరోధక వ్యవస్థ ఈ ప్రొటీన్ మీ శరీరానికి సంబంధించినది కాదని గుర్తిస్తుంది, దీంతో మీ శరీరం యాంటీబాడీలను తయారుచేయడం ప్రారంభిస్తుంది. ఈ యాంటీబాడీలు భవిష్యత్తులో మీకు కోవిడ్-19 సోకినట్లయితే దానితో ఎలా పోరాడాలో గుర్తుంచుకుంటాయి. మీరు వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు, మీరు కోవిడ్-19 వలన జబ్బుపడకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ఒకసారి అది తన పనిని పూర్తి చేసిన తరువాత, mRNA త్వరగా విచ్ఛిన్నమవుతుంది, కొన్నిరోజుల తరువాత శరీరం దానిని బయటకు పంపుతుంది.
వైరల్ వెక్టర్ వ్యాక్సిన్లు (Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్)
కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో ఒకదానిని వైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అని అంటారు.
వెక్టర్ వ్యాక్సిన్లను ఒక బలహీనపడిపోయిన రకపు వైరస్‌తో (కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ కంటే భిన్నమైన వైరస్‌తో) తయారుచేస్తారు. ఈ వ్యాక్సిన్ నిరపాయకరమైన కరోనావైరస్ ప్రోటీన్ తునకను ఎలా తయారు చేయాలో మీ కణాలకు నేర్పుతుంది. మీ రోగ నిరోధక వ్యవస్థ ఈ ప్రొటీన్ మీకు చెందినది కాదని గుర్తించి, యాంటీబాడీలను తయారుచేయడం ప్రారంభిస్తుంది. భవిష్యత్తులో మీకు కోవిడ్-19 సోకినట్లయితే, జబ్బుపడకుండా దానితో ఎలా పోరాడాలో మీ శరీరం గుర్తుంచుకుంటుంది.
మన వద్ద ఉన్న వెక్టర్ వ్యాక్సిన్ ఒక్క డోస్ది. ఈ డోస్‌ను వేయించుకున్న తరువాత గరిష్ట రక్షణ లభించడానికి సాధారణంగా దాదాపు రెండు వారాలు పడుతుంది.
ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్లు (Novavax COVID-19 వ్యాక్సిన్)
Food and Drug Administration (FDA, ఆహార, ఔషధ నిర్వహణ) అధికార ఆమోదం ఇచ్చిన COVID -19 వ్యాక్సిన్లలో ఒకటి ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్. ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్లలో COVID-19కు కారణమయ్యే వైరస్ (ప్రోటీన్లు) భాగాలతోపాటు (లైవ్ వైరస్ ఉపయోగించకుండా తయారు చేయబడతాయి) శరీరంలో వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేసేలా సహాయపడడానికి కొన్ని పదార్థాలు కలుపుతారు. ఒక్కసారి స్పైక్ ప్రోటీన్‌కు ఎలా ప్రతిస్పందించాలో మీ రోగనిరోధక వ్యవస్థ తెలుసుకున్నాక, అది వాస్తవ వైరస్‌కు త్వరగా ప్రతిస్పందించి COVID-19 నుండి మిమ్మల్ని రక్షించగలుగుతుంది. సబ్యూనిట్ వ్యాక్సిన్ల వల్ల COVID-19కు కారణమయ్యే వైరస్వల్ల వచ్చే అంటువ్యాధి రాదు మరియు అది మన DNA మీద పనిచేయదు.
అందుబాటులో ఉన్న వైరల్ సబ్యూనిట్ వ్యాక్సిన్ 2 మోతాదుల వ్యాక్సిన్. సాధారణంగా 2వ మోతాదు తీసుకున్న తర్వాత దాదాపు 2 వారాల్లో వ్యాక్సిన్ వల్ల వచ్చే పూర్తి రక్షణ లభిస్తుంది.
వ్యాక్సిన్ వేయించుకోవడం వలన కొన్ని సందర్భాలలో కొద్దిగా జ్వరం లేదా జలుబు వంటి లక్షణాలు కనిపించవచ్చు, అయితే ఇవి హానికరమైవవి కావు.
మరింత సమాచారం కొరకు. ఈ వనరులను చూడండి: కొవిడ్-19 వ్యాక్సిన్ల స్నాప్‌షాట్ మరియు కొవిడ్-19 వ్యాక్సిన్లు: తెలుసుకోవలసినది ఏమిటి.
సంఘంలో తగినంత మంది ప్రజలు కరోనా వైరస్‌తో పోరాడగలిగినప్పుడు, అది ఎక్కడికీ వెళ్ళలేదు. దీని అర్థం మనం వ్యాప్తిని త్వరగా ఆపి, ఈ మహమ్మారిని అంతం చేయడానికి కొంచెం దగ్గరగా ఉండగలము.
- కొవిడ్-19 వ్యాక్సిన్లను ఎలా తయారు చేస్తారు?
-
ఈ చిన్నవీడియో కొవిడ్ వ్యాక్సిన్లు ఎలా తయారు చేయబడతాయనే దానిని (ఇంగ్లిష్) వివరిస్తుంది.
- mRNA వ్యాక్సిన్ అంటే ఏమిటి?
-
మెసెంజర్ RNA, లేదా mRNA వ్యాక్సిన్ అనేది ఒక కొత్తరకం వ్యాక్సిన్. mRNA వ్యాక్సిన్లు ‘‘స్పైక్ ప్రోటీన్'' యొక్క హానికరం కాని బాగాన్ని ఎలా తయారు చేయాలని మీ కణాలను బోధిస్తాయి. స్పైక్ ప్రోటీన్‌నే కరోనావైరస్ యొక్క ఉపరితలంపై మీరు చూస్తారు. ప్రోటీన్ అక్కడకు సంబంధించినది కాదు అని మీ రోగనిరోధక వ్యవస్త చూస్తుంది మరియు మీ శరీరం రోగనిరోధక ప్రతిస్పందన నిర్మించడాన్ని ప్రారంభించి, యాంటీబాడీస్‌ని తయారు చేస్తుంది. ఇది మనకు కొవిడ్-19 సంక్రామ్యత ‘‘సహజం''గా వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో అలానే ఉంటుంది. ఒకసారి అది తన పనిని పూర్తి చేసిన తరువాత, mRNA త్వరగా విచ్ఛిన్నమవుతుంది, కొన్నిరోజుల తరువాత శరీరం దానిని బయటకు పంపుతుంది.
మనం గతంలో ఇతర రకాలైన వైద్య మరియు పశు సంరక్షణ కొరకు mRNAని మనం ఉపయోగించినప్పటికీ, ఈ విధానాన్ని ఉపయోగించి వ్యాక్సిన్లను సృష్టించడం అనేది సైన్స్‌లో భారీ ముందడుగు మరియు భవిష్యత్తు వ్యాక్సిన్లను మరింత సులభంగా సృష్టించడానికి దోహదపడవచ్చు.
mRNA వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయనే దాని గురించి CDC వెబ్సైట్లో (ఇంగ్లిష్) మీరు మరింత చదవవచ్చు.
- వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ అంటే ఏమిటి?
-
ఈ రకమైన వ్యాక్సిన్ మీ కణాలకు సూచనలను ఇచ్చే విభిన్న వైరస్ ("వెక్టర్") బలహీనమైన వెర్షన్‌ను ఉపయోగిస్తుంది. వెక్టర్ కణంలోనికి ప్రవేశిస్తుంది మరియు కొవిడ్-19 స్పైక్ ప్రోటీన్ హానికరం కాని భాగాన్ని సృష్టించడానికి కణ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. కణం దాని ఉపరితలంపై స్పైక్ ప్రోటీన్‌ని ప్రదర్శిస్తుంది, అది ఆ ప్రాంతానికి చెందినది కాదని మీ రోగనిరోధక వ్యవస్థ గమనిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ (ప్రతిరక్షకాలను) తయారు చేయడం ప్రారంభిస్తుంది మరియు అది సంక్రామ్యత అని భావించేవాటిపై పోరాడటం కొరకు ఇతర రోగనిరోధక కణాలను చైతన్యవంతం చేస్తుంది. భవిష్యత్తులో మీకు కోవిడ్-19 సోకినట్లయితే, జబ్బుపడకుండా దానితో ఎలా పోరాడాలో మీ శరీరం గుర్తుంచుకుంటుంది.
- ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ అంటే ఏమిటి?
-
Food and Drug Administration (FDA, ఆహార, ఔషధ నిర్వహణ) అధికార ఆమోదం ఇచ్చిన COVID -19 వ్యాక్సిన్లలో ఒకటి ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్. ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్లలో COVID-19కు కారణమయ్యే వైరస్ (ప్రోటీన్లు) భాగాలతోపాటు (లైవ్ వైరస్ ఉపయోగించకుండా తయారు చేయబడతాయి) శరీరంలో వ్యాక్సిన్ మెరుగ్గా పనిచేసేలా సహాయపడడానికి కొన్ని పదార్థాలు కలుపుతారు. ఒక్కసారి స్పైక్ ప్రోటీన్‌కు ఎలా ప్రతిస్పందించాలో మీ రోగనిరోధక వ్యవస్థ తెలుసుకున్నాక, అది వాస్తవ వైరస్‌కు త్వరగా ప్రతిస్పందించి COVID-19 నుండి మిమ్మల్ని రక్షించగలుగుతుంది. సబ్యూనిట్ వ్యాక్సిన్ల వల్ల COVID-19కు కారణమయ్యే వైరస్వల్ల వచ్చే అంటువ్యాధి రాదు మరియు అది మన DNA మీద పనిచేయదు.
- "సహాయక ఔషధము" అంటే ఏమిటి?
-
Novavaxలోని సహాయక ఔషధాన్ని (అడ్జువెంట్) శరీర రోగనిరోధక ప్రతిస్పందనను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వ్యాక్సిన్‌లో కలుపుతారు.
- వ్యాక్సిన్‌లో ఎటువంటి పదార్దాలుంటాయి?
-
కొవిడ్-19 వ్యాక్సిన్ల్లోని పదార్ధాలు వ్యాక్సిన్ల కొరకు అత్యంత సాధారణమైనవి. వాటిలో mRNA లేదా మాడిఫైడ్ అడెనోవైరస్ క్రియాశీల పదార్థంతోపాటుగా క్రియాత్మక పదార్ధాన్ని సంరక్షించే కొవ్వు, లవణాలు మరియు చక్కెరలు వంటి ఇతర పదార్థాలు ఉంటాయి, శరీరంలో మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి, నిల్వ చేయడం మరియు రవాణా సమయంలో వ్యాక్సిన్‌ని సంరక్షిస్తుంది.
Novavax COVID-19 వ్యాక్సిన్ అనేది ప్రోటీన్ సబ్యూనిట్-ఆధారిత వ్యాక్సిన్, శరీరంలో వ్యాక్సిన్ మరింత మెరుగ్గా పనిచేసేలా దీనిలో ఒక పదార్థంతోపాటు కొవ్వులు, చక్కెరలు కలుపుతారు. ఈ వ్యాక్సిన్ mRNAను ఉపయోగించదు.
Pfizer, Moderna, Novavax మరియు Johnson and Johnson వ్యాక్సిన్ల్లో మానవకణాలు (పిండ కణాలతో సహా), కొవిడ్-19 వైరస్, లేటెక్స్, ప్రిజర్వేటివ్‌లు, లేదా పంది ఉత్పత్తులు లేదా జెలిటిన్తో సహా ఏవైనా జంతు ఉప ఉత్పత్తులు లేవు. వ్యాక్సిన్లు గుడ్లలో పెంచలేదు మరియు ఏవైనా గుడ్ల ఉత్పత్తులు లేవు.
పదార్ధాల గురించి మరింత సమాచారం కొరకు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా నుంచి ఈ Q&A; వెబ్పేజీనిని చూడండి (ఇంగ్లిష్). మీరు పదార్ధాల పూర్తి జాబితాను Pfizer, (ఇంగ్లిష్ మాత్రమే) Moderna, (ఇంగ్లిష్ మాత్రమే) మరియు Johnson & Johnson (ఇంగ్లిష్ మాత్రమే) ఫ్యాక్ట్ షీట్ల్లో చూడవచ్చు.
- Johnson & Johnson వ్యాక్సిన్‌లో పిండకణాలు ఉన్నాయా?
-
Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్‌ని ఇతర అనేక వ్యాక్సిన్ల్లానే అదే టెక్నాలజీ ఉపయోగించి సృష్టించారు. దీనిలో పిండాల భాగాలు లేదా పిండకణాలు లేవు. వ్యాక్సిన్‌లో ఒక భాగం 35 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్టివ్ అబార్షన్ల నుంచి వాస్తవంగా వచ్చిన ప్రయోగశాలలో వృద్ధి చేసిన కణాల కాపీల నుంచి తయారు చేస్తారు. అప్పటి నుంచి, ఈ వ్యాక్సిన్ల సెల్ లైన్లు ప్రయోగశాలలో నిర్వహిస్తున్నారు మరియు ఈ వ్యాక్సిన్లు తయారు చేయడానికి తదుపరి పిండకణాలు వనరులను ఏమాత్రం ఉపయోగించరు. కొంతమంది వ్యక్తులకు ఇది కొత్త సమాచారం కావొచ్చు. అయితే, చికెన్‌పాక్స్ (అమ్మవారు), రుబెల్లా మరియు హెపటైటిస్ A వ్యాక్సిన్లను ఇదేవిధంగా తయారు చేస్తారు.
- కొవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుందా?
-
వ్యాక్సిన్లు ఇన్ఫెర్టిలిటీ లేదా నపుంసకత్వానికి కారణమవుతాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యాక్సిన్ మీ శరీరంలోనికి ప్రవేశించిన తరువాత, ఇది కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రతిరోధకాలను సృష్టించేందుకు మీ రోగనిరోధక వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ ప్రక్రియ మీ పునరుత్పత్తి అవయవాలకు ఎలాంటి అంతరాయాన్ని కలిగించదు.
Centers for Disease Control and Prevention (CDC) (ఇంగ్లిష్ మాత్రమే), American College of Obstetricians and Gynecologists (ACOG), (ఇంగ్లిష్), మరియు Society for Maternal-Fetal Medicine (SMFM) (ఇంగ్లిష్)లు గర్భవతులైన, పిల్లలకు పాలిచ్చే లేదా గర్భం ధరించాలని భావించే మహిళల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్‌ని సిఫారసు చేస్తున్నారు. కొవిడ్-19కు విరుద్ధంగా వ్యాక్సిన్ వేయించుకున్న చాలామంది వ్యక్తులు అప్పటి నుంచి గర్భవతి అయ్యారు లేదా బిడ్డకు జన్మనిచ్చారు.
కొవిడ్-19 వ్యాక్సిన్లతో సహా ఏ వ్యాక్సిన్లు కూడా పురుష సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తాయనే దానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవు. mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ (అంటే., Pfizer-BioNTech లేదా Moderna) పొందిన 45 మంది ఆరోగ్యవంతులైన పురుషుల్లో ఇటీవల జరిపిన చిన్న గ్రూపు అధ్యయనం వ్యాక్సినేషన్‌కు ముందు మరియు తరువాత పరిమాణం మరియు చలనం వంటి వీర్య లక్షణాల కొరకు పరిశీలించింది. వ్యాక్సినేషన్ తరువాత ఈ స్పెర్మ్ లక్షణాల్లో గణనీయమైన మార్పులను పరిశోధకులు కనుగొనలేదు.
ఆరోగ్యవంతులైన పురుషుల్లో స్వల్పకాలానికి వీర్య ఉత్పత్తి తగ్గడం అనేది జ్వరం వల్ల కలిగే అస్వస్థతకు సంబంధించినది. జ్వరం అనేది కొవిడ్-19 వ్యాక్సినేషన్ తాత్కాలిక దుష్ప్రభావం అయినప్పటికీ, కొవిడ్- వ్యాక్సినేషన్ తరువాత వచ్చే జ్వరం వల్ల వీర్య ఉత్పత్తి ప్రభావితం అవుతుందనే దానికి ప్రస్తుతం ఎలాంటి రుజువు లేదు.
మరింత సమాచారం కొరకు, బిడ్డ కావాలని కోరుకునే వ్యక్తుల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్లపై సమాచారాన్ని (ఇంగ్లిష్ మాత్రమే) చూడండి. వ్యాక్సిన్ల గురించిన వాస్తవాల కొరకు మీరు CDC కొవిడ్-19 వ్యాక్సిన్ల వెబ్‌పేజీ (ఇంగ్లిష్ మాత్రమే)ని కూడా చూడవచ్చు.
- వ్యాక్సిన్ పొందిన తరువాత ఎటువంటి రకాలైన లక్షణాలు సాధారణం?
-
ఇతర రొటీన్ వ్యాక్సిన్ల వలేనే చేయి నొప్పి, అలసట, తలనొప్పి మరియు కండరాల నొప్పి వంటి అత్యంత సాధారణ దుష్ప్రభావాలు.
ఈ లక్షణాలు వ్యాక్సిన్ పనిచేస్తుందనే దానికి సంకేతం. Pfizer మరియు Moderna అధ్యయనాల్లో, వ్యాక్సిన్ పొందిన రెండు రోజుల్లోఈ దుష్ప్రభావాలు చాలా తరచుగా సంభవించాయి, ఇవి సుమారు ఒక రోజు కొనసాగాయి. మొదటి మోతాదు కంటే రెండో మోతాదు తరువాత దుష్ప్రభావాలు మరింత సాధారణం. Johnson & Johnson వైద్య అధ్యయనాల్లో, దుష్ప్రభావాలు సగటు ఒకటి నుంచి రెండురోజులపాటు ఉన్నాయి.
ఈ మూడు వ్యాక్సిన్ల కొరకు, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు యువత కంటే దుష్ప్రభావాలను నివేదించే అవకాశం తక్కువగా ఉంది.
మీరు ఆన్లైన్ లేదా సోషల్ మీడియాలో దుష్ప్రభావాలకు సంబంధించిన కొన్ని పుకార్లను చూడవచ్చు. ఏదైనా ఒక దుష్ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఒక క్లెయిం చూసినట్లయితే, ఆ క్లెయిం మూలాన్ని తప్పకుండా ధృవీకరించుకోండి.
- కొవిడ్-19 వ్యాక్సిన్ పొందిన తరువాత నేను అస్వస్థతకు గురైనట్లయితే ఏమి జరుగుతుంది?
-
ఇతర రొటీన్ వ్యాక్సిన్ల వలేనే, కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత చేయి నొప్పి, జ్వరం, తలనొప్పి, లేదా అలసట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇవి వ్యాక్సిన్ పనిచేస్తున్నదని తెలిపే సూచనలు. కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత సంభావ్య దుష్ప్రభావాల గురించి మరింత తెలుసుకోండి.
మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత అస్వస్థతకు గురైనట్లయితే, మీరు ప్రతికూల ఘటనను Vaccine Adverse Event Reporting System (VAERS, వ్యాక్సిన్ ప్రతికూల ఘటన రిపోర్టింగ్ సిస్టమ్) (ఇంగ్లిష్ మాత్రమే) కు నివేదించాలి. "ప్రతికూల ఘటన” అనేది వ్యాక్సినేషన్ తరువాత చోటు చేసుకునే ఏదైనా ఆరోగ్య సమస్య లేదా దుష్ప్రభావం. VAERS గురించి మరింత సమాచారం కొరకు, "VAERS అంటే ఏమిటి?" అనే దాని గురించి కింద చూడండి
- VAERS అంటే ఏమిటి?
-
VAERS అనేది Centers for Disease Control and Prevention (CDC) మరియు Food and Drug Administration (FDA) ద్వారా నడిపించే ముందస్తు హెచ్చరిక సిస్టమ్. వ్యాక్సిన్‌కు సంబంధించి కాగల సమస్యలను గుర్తించడంలో VAERS సాయపడగలవు.
ఎవరైనా (హెల్త్ కేర్ ప్రొవైడర్, రోగి, సంరక్షకుడు) సంభావ్య ప్రతికూల ఘటనల గురించి VAERS (ఇంగ్లిష్ మాత్రమే) కు నివేదించవచ్చు.
సిస్టమ్‌కు పరిమితులున్నాయి. VAERS నివేదించడం అనేది ప్రతిచర్య లేదా ఫలితం వైరస్ వల్ల కలిగిందని అర్ధం కాదు. వ్యాక్సినేషన్ ముందుగా జరిగిందని మాత్రమే దీని అర్థం.
సంభావ్య సమస్యను పరిశోధించడానికి ట్రెండ్లు లేదా కారణాలను గమనించడంలో శాస్త్రవేత్తలకు సహాయపడటానికే VAERS ఏర్పాటు చేయబడింది. ఇది వ్యాక్సినేషన్ ధృవీకరించిన ఫలితాల జాబితా కాదు.
మీరు VAERSకు నివేదించినప్పుడు, సంభావ్య ఆరోగ్య ఆందోళనలను గుర్తించడానికి మరియు వ్యాక్సిన్లు సురక్షితమైనవి అని ధృవీకరించడానికి CDC మరియు FDA లకు మీరు సాయం చేస్తున్నారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనట్లయితే, వారు చర్య తీసుకుంటారు మరియు సంభావ్య సమస్యల గురించి ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్లు వారు సమాచారం అందిస్తారు.
- నాకు కోవిడ్-19 వచ్చి ఉంటే నేను కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయించుకోవచ్చా?
-
అవును, కోవిడ్-19 వ్యాధి సోకినవారు ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవాలని Advisory Committee on Immunization Practices (ACIP, ఇమ్యునైజేషన్ పద్ధతుల సలహా కమిటీ) సూచిస్తున్నది.
మీరు కోవిడ్-19 సోకిన 90 రోజుల్లోగా మళ్లీ తిరిగి సోకడం అసాధారణమని డేటా తెలుపుతున్నది, కాబట్టి మీకు కొంత రక్షణ ఉండవచ్చు (సహజ రోగనిరోధక శక్తి అని అంటారు). అయితే, సహజ రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో మాకు తెలియదు.
ప్రస్తుతం కొవిడ్-19 ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్ పొందడానికి వారు మెరుగ్గా భావించేంత వరకు మరియు వారి ఐసోలేషన్ పీరియడ్ ముగిసేంత వరకు వేచి ఉండాలి.
ఇటీవల కోవిడ్-19కు ఎక్స్పోజ్ అయిన వ్యక్తులను ఇతర వ్యక్తులకు దూరంగా సురక్షితంగా క్వారంటైన్లో ఉంచగలిగితే, వారు తమ క్వారంటైన్ కాలం ముగిసే వరకు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వేచి ఉండాలి. వారి వలన ఇతరులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటే, వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి క్వారంటైన్ కాలంలోనే వారికి వ్యాక్సిన్వేయవచ్చు.
ఐసోలేషన్ మరియు క్వారంటైన్ మార్గదర్శకాల కొరకు దయచేసి మా కొవిడ్-19 కొరకు ఐసోలేషన్ మరియు క్వారంటైన్ పేజీని రిఫర్ చేయండి.
- గతంలో నాకు వ్యాక్పిన్కు అలర్జిక్ ప్రతిచర్య ఉన్నట్లయితే నేను కొవిడ్-19 వ్యాక్సిన్‌ని పొందగలనా?
-
mRNA లేదా వైరల్ వెక్టార్ వ్యాక్సిన్, లేదా Pfizer-BioNTech/Comirnaty, (ఇంగ్లిష్ మాత్రమే) Moderna/Spikevax (ఇంగ్లిష్ మాత్రమే), లేదా Johnson & Johnson–Janssen (ఇంగ్లిష్ మాత్రమే) కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో ఏదైనా పదార్ధానికి అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్యకు తెలిసిన చరిత్ర ఉన్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ని ఇవ్వరాదు.
ఇతర వ్యాక్సిన్లు లేదా ఇంజెక్ట్ చేయగల థెరపీలకు తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్య ఉండే వ్యక్తులు ఇంకా వ్యాక్సిన్‌ని పొందగలుగుతారు. అయితే, ప్రొవైడర్లు రిస్క్ మదింపు చేయాలి మరియు సంభావ్య ప్రమాదాల గురించి వారికి కౌన్సిల్ చేయాలి. ఒకవేళ ఒక రోగి వ్యాక్సిన్ పొందాలని నిర్ణయించుకున్నట్లయితే, ఏవైనా తక్షణ ప్రతిచర్యల కొరకు ప్రొవైడర్ వారిని 30 నిమిషాలపాటు గమనించాలి.
అలర్జీ ప్రతిచర్యలను మానిటర్ చేయడానికి వ్యాక్సిన్ అందుకున్న రోగులందరినీ కనీసం 15 నిమిషాలపాటు ప్రొవైడర్లు గమనించాలని Advisory Committee on Immunization Practices (ACIP) సిఫారసు చేస్తుంది. మరింత సమాచారం కొరకు ACIP యొక్క mRNA వ్యాక్సిన్ల కొరకు మధ్యంతర క్లినికల్ పరిగణనలు (ఇంగ్లిష్) చూడండి.
వ్యాక్సిన్ ఆవశ్యకతలు
- కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరమా?
-
కొవిడ్-19 కొరకు వ్యాక్సిన్ వేయించుకోవాలా లేదా అనేది మీ ఎంపిక, కానీ కొంతమంది యజమానులు, కాలేజీలు మరియు యూనివర్సిటీలకు అది అవసరం.
- స్టేట్ ఏజెన్సీలు, హెల్త్ కేర్ ప్రొవైడర్లు, విద్యా సంస్థలు మరియు చైల్డ్ కేర్ సంస్థల ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్ల కొరకు గవర్రన్ వ్యాక్సిన్ ఆవశ్యకతల గురించి సమాచారం. (ఇంగ్లిష్ మాత్రమే)
వాషింగ్టన్లో ప్రస్తుతం వీరికి కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరం:
- ఆరోగ్య సంరక్షణ వర్కర్లు మరియు దీర్ఘకాలిక సంరక్షణ వర్కర్లు (ఇంగ్లిష్ మాత్రమే)
- క్యాబినెట్ ఏజెన్సీ స్టేట్ ఉద్యోగులు (ఇంగ్లిష్ మాత్రమే)
- వీటితో సహా విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు , (ఇంగ్లిష్ మాత్రమే):
- ప్రైవేట్ K-12 స్కూల్స్, పబ్లిక్ K-12 స్కూలు డిస్ట్రిక్ట్లు, ఛార్టర్ స్కూల్స్, మరియు ఎడ్యుకేషనల్ సర్వీస్ డిస్ట్రిక్ట్‌ల కొరకు పనిచేసే ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లు (ఆదేశాలు స్టేట్-ట్రైబల్ ఎడ్యుకేషన్ కంపాక్ట్ స్కూల్స్ లేదా విద్యార్ధులకు వర్తించదు),
- చైల్డ్‌కేర్ మరియు పూర్తి అభ్యసన అందించేవారు అనేక ఇళ్ల నుంచి సేవలందిస్తారు, మరియు
- ఉన్నత విద్యలో ఉన్న ఉద్యోగులు.
ఈ ఉద్యోగులు అక్టోబర్ 18, 2021 నాటికి కొవిడ్-19కు విరుద్ధంగా పూర్తిగా వ్యాక్సినేషన్ (వ్యాక్సిన్ సీరిస్ పూర్తి చేసిన తరువాత కనీసం రెండు వారాలు) వేయించుకోవాల్సి ఉంటుంది. ఆవశ్యకతలో కాంట్రాక్టర్లు, వాలంటీర్లు, మరియు ఈ సెట్టింగ్‌ల్లో పనిచేసే ఇతరులు ఉంటాయి.
మీరు ఈ గ్రూపుల్లో ఉన్నా లేదా మీ యజమాని లేదా స్కూలుకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ అవసరం అయితే, ఏమి చేయాలనే దాని గురించి తెలుసుకోవడానికి, మీ హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, యజమాని లేదా స్కూలుతో మాట్లాడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ యజమానులు లేదా కాలేజీ/యూనివర్సిటీ పాలసీలో జోక్యం చేసుకోదు.
వ్యాక్సిన్ మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉండేవారికి కొవిడ్-19 రాకుండా కాపాడేందుకు సాయపడుతుంది, ప్రయోజనాల గురించి మీ వైద్యుడు లేదా క్లినిక్‌లో మాట్లాడాలని మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం
- K-12 ఉద్యోగుల కొరకు ఎలాంటి కొవిడ్-19 వ్యాక్సిన్ ఆవశ్యకతలు ఉన్నాయి?
-
అక్టోబర్ 18, 2021 నాటికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ K-12 స్కూలు ఉద్యోగులందరూ కొవిడ్-19కు వ్యతిరేకంగా పూర్తిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని, లేదా మతపరమైన లేదా వైద్య మినహాయింపు పొందాలని ఆగస్టు 18, 2021 నాడు గవర్నర్ Inslee ఒక ఆదేశాన్ని ప్రకటించారు.
వీరితో సహా, విద్యా సంస్థల్లోని ఉద్యోగులందరికి (ఇంగ్లిష్ మాత్రమే) ఆదేశం వర్తిస్తుంది:
- ప్రైవేట్ K-12 స్కూల్స్, పబ్లిక్ K-12 స్కూలు డిస్ట్రిక్ట్లు, ఛార్టర్ స్కూల్స్, మరియు ఎడ్యుకేషనల్ సర్వీస్ డిస్ట్రిక్ట్‌ల కొరకు పనిచేసే ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లు (ఆదేశాలు స్టేట్-ట్రైబల్ ఎడ్యుకేషన్ కంపాక్ట్ స్కూల్స్ లేదా విద్యార్ధులకు వర్తించదు),
- చైల్డ్‌కేర్ మరియు పూర్తి అభ్యసన అందించేవారు అనేక ఇళ్ల నుంచి సేవలందిస్తారు, మరియు
- ఉన్నత విద్యలో ఉన్న ఉద్యోగులు.
మరింత సమాచారం కొరకు, చూడండి K-12 స్కూలు ఉద్యోగుల కొరకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ ఆవశ్యకతలు: తరచుగా అడిగే ప్రశ్నలు (PDF) (ఇంగ్లిష్ మాత్రమే) (ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్).
- వ్యాక్సిన్ ఆవశ్యకతల నుంచి నేను ఏవిధంగా మినహాయింపు పొందగలను?
-
మీ యజమాని లేదా కాలేజీ/యూనివర్సిటీకి కొవిడ్-19 అవసరం అయితే, లేదా మీకు గవర్నర్ Jay Inslee ఆగస్టు 9 బహిరంగ ప్రకటన (ఇంగ్లిష్) లేదా ఆగస్టు 18 బహిరంగ ప్రకటన (ఇంగ్లిష్) ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటే, వ్యాక్సిన్ రుజువును వారు ఏవిధంగా కలెక్ట్ చేస్తున్నారు, వారికి వద్దనుకునే పాలసీ ఉన్నట్లయితే, వద్దని ఎంచుకోవడానికి మీరు ఏమి చేయాల్సి ఉంటుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మీరు మీ యజమాని లేదా కాలేజీ/యూనివర్సిటీని సంప్రదించాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ యజమానులు లేదా కాలేజీ/యూనివర్సిటీ పాలసీలో జోక్యం చేసుకోదు.
కొవిడ్-19 వ్యాక్సిన్ కొరకు Department of Health (DOH- డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) నుంచి మీరు మినహాయింపు ఫారాన్ని పొందాల్సిన అవసరం లేదు. కొవిడ్-19 వ్యాక్సిన్ కొరకు DOHకు ఎలాంటి మినహాయింపులు లేవు. వాషింగ్టన్ స్టేట్ Certificate of Exemption(COE, సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సెంప్షన్) అనేది K-12 స్కూల్స్, ప్రీ స్కూల్స్, లేదా చైల్డ్ కేర్‌లో పిల్లల కొరకు అవసరమైన ఇమ్యూనైజేషన్ల నుంచి వారి పిల్లను మినహాయింపు కోరే తల్లిదండ్రులు/సంరక్షకులకు మాత్రమే. ప్రస్తుతం, వాషింగ్టన్లో స్కూలు లేదా చైల్డ్ కేర్‌కు హాజరు కావడానికి పిల్లల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ అవసరం లేదు, అందువల్ల ఇది COEలో చేర్చబడలేదు.
స్కూలు మరియు శిశు సంరక్షణ
- 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు వ్యాక్సిన్ పొందగలరా?
-
ప్రస్తుతానికి, 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వడానికి Pfizer-BioNTech (Pfizer) వ్యాక్సిన్, Moderna COVID-19 వ్యాక్సిన్ బ్రాంఢ్లకు అనుమతి ఉంది.
17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, చట్టబద్ధంగా విముక్తి పొందనట్లయితే పేరెంట్ లేదా గార్డియన్ నుంచి సమ్మతి అవసరం కావొచ్చు (ఇంగ్లిష్ మాత్రమే). మరింత సమాచారం కొరకు Vaccinating Youth (యువతకు వ్యాక్సిన్ వేయడం) పై మా వెబ్‌పేజీని సందర్శించండి.
తల్లిదండ్రుల సమ్మతి లేదా చట్టపరంగా విముక్తి పొందినట్లుగా రుజువు చూపించడానికి వారి ఆవశ్యకతల గురించి వ్యాక్సిన్ క్లినిక్‌ని చెక్ చేయండి.
- రాష్ట్రంలో K-12 స్కూలు ఎంట్రీ కొరకు కొవిడ్-19 వ్యాక్సినేషన్ అవసరమా?
-
K-12 స్కూల్స్‌లో Revised Code of Washington (RCW, సవరించిన వాషింగ్టన్ కోడ్) 28A.210.140, పిల్లల కొరకు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతలను రూపొందించడానికి Department of Health (డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) కాకుండా, Washington State Board of Health (వాషింగ్టన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్) బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం కొవిడ్-19 కొరకు స్కూలు లేదా చైల్డ్‌కేర్‌కు ఎలాంటి ఆవశ్యకత లేదు.
- నా బిడ్డ తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ని పొందేటప్పుడు ఇతర ఇమ్యూనైజేషన్లను పొందవచ్చా?
-
వ్యక్తులు ఇప్పుడు అదే రోజుతో సహా ఇతర వ్యాక్సిన్లు వేయించుకున్న 14 రోజుల్లోగా కోవిడ్-19 వ్యాక్సిన్ పొందవచ్చు.
- కొవిడ్-19 మహమ్మారి సమయంలో 2021-2022 విద్యా సంవత్సరం కొరకు స్కూలు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతల్లో ఏదైనా సరళత్వం ఉన్నదా?
-
స్కూలు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతల్లో ఏవైనా మార్పులు చేపట్టాలా అని స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం, స్కూలు ఇమ్యూనైజేషన్ ఆవశ్యకతలు అలానే ఉంటాయి. పిల్లలు వారు స్కూల్లో మొదటి రోజు హాజరు కావడానికి ముందు వ్యాక్సినేషన్ ఆవశ్యకతలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత జీవితం
- పూర్తిగా వ్యాక్సినేషన్ పొందడం అంటే ఏమిటి?
-
వారి కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రాథమిక సీరిస్‌లో సిఫారసు చేసిన అన్ని డోస్‌లను పొందిన తరువాత రెండు వారాలకు ఒక వ్యక్తి పూర్తిగా వ్యాక్సినేట్ అయినట్లుగా భావిస్తారు.
ఒక వ్యక్తి తన ప్రాథమిక శ్రేణిలో సిఫార్సు చేసిన అన్ని డోసులు తీసుకోవడంతో పాటు అర్హత ఉన్నప్పుడు అన్ని బూస్టర్లు కూడా తీసుకున్నట్లయితే, ఆ వ్యక్తి తన కొవిడ్-19 వ్యాక్సినేషన్ విషయంలో అప్ టూ డేట్‌గా ఉన్నట్లు పరిగణిస్తారు.
- నేను పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే ఇప్పుడు ఏమి చేయాలి?
-
మీరు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత, మీరు:
- Pfizer లేదా Moderna కొవిడ్-19 వ్యాక్సిన్ మీ రెండవ మోతాదును పొందిన ఐదు నెలల తరువాత లేదా Johnson & Johnson (J&J) కొవిడ్-19 వ్యాక్సిన్ అందుకున్న రెండు నెలల తరువాత మీ బూస్టర్ మోతాదును పొందడానికి మీ క్యాలెండర్లో షెడ్యూల్ చేయండి లేదా రిమైండర్ పెట్టుకోండి. ఇది మిమ్మల్ని కొవిడ్-19 వ్యాక్సినేషన్లపై అప్ టూ డేట్‌గా ఉంచుతుంది, అత్యుత్తమ సంభావ్య సంరక్షణను అందిస్తుంది. మరింత సమాచారం కొరకు, దయచేసి, మా వ్యాక్సిన్ బూస్టర్’’ పేజీని సందర్శించండి.
- మీ వ్యాక్సినేషన్ పేపర్ కార్డును బర్త్ సర్టిఫికేట్ లేదా ఇతర అధికారిక డాక్యుమెంట్ వలే పరిగణించండి! దాని ఫోటో తీసుకొని, దానిని ఇంటి వద్ద భద్రపరచండి. భవిష్యత్తులో, మీరు కొవిడ్-19కు విరుద్ధంగా పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లుగా రుజువు చేయాల్సి రావొచ్చు.
- మీ వద్ద వ్యాక్సినేషన్ అధికారిక రుజువును ఉంచుకోండి. Department of Health (డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్) కొవిడ్-19 వ్యాక్సినేషన్ వెరిఫికేషన్ పేజీ పై ఉదాహరణలను చూడండి.
- మీ స్మార్ట్‌ఫోన్‌కు WA Verify (డబ్ల్యుఎ వెరిఫై) కు జోడించండి.
- నేను కొవిడ్-19 కొరకు పూర్తిగా వ్యాక్సిన్ పొందినట్లయితే, నేను ఇంకా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలా?
-
మీరు, పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, మీరు ఇంకా:
- అత్యుత్తమ సంభావ్య సంరక్షణ పొందడానికి మీ బూస్టర్ డోస్‌ని పొందడం ద్వారా ‘‘అప్ టూ డేట్’’గా ఉండండి.
- అమల్లో ఉన్న నిబంధనలను గౌరవించండి. నగరాలు, కౌంటీలు, వ్యాపారాలు, ఈవెంట్లు మరియు వేదికలకు మాస్క్‌లు లేదా వ్యాక్సినేషన్/నెగిటివ్ పరీక్ష రుజువు అవసరం కావచ్చు.
- మీకు కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్లయితేపరీక్ష చేయించుకోండి.
- మీరు కొవిడ్19కు ఎక్స్ప్లోజ్ కాగలిగితే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, మీరు టెస్ట్‌లో పాజిటివ్ అయితే, అనామధేయంగా అలర్ట్ చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్ మీద WA Notify ని ఇన్స్టాల్ చేసుకోండి. WA Notify పూర్తిగా ప్రవేట్ మరియు మీరు ఎవరు అని తెలియదు లేదా మీరు ఎక్కడకు వెళతారనేది జాడ పసిగట్టలేదు.
- అత్యుత్తమ సంభావ్య సంరక్షణ కొరకు జనసమ్మర్థంగా ఉండే పబ్లిక్ ఇండోర్ సెట్టింగ్‌ల్లో బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించండి.
- Centers for Disease Control and Prevention (CDC- సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారి ప్రయాణ సిఫారసులు అనుసరించాలి.
- సంభావ్య కొవిడ్-19 ఎక్స్ప్లోజ్ తరువాత అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యల తీసుకోండి
- మీరు బూస్టర్‌ని పొందనట్లయితే, మీ ప్రాథమిక వ్యాక్సిన్ శ్రేణిని పూర్తి చేసినప్పటి 5 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం (Moderna/Pfizer) లేదా 2 నెలలు (Johnson & Johnson) ఉంటే, ఎక్స్పోజ్ అయిన తరువాత 5 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి, దాని తరువాత అదనంగా 5 రోజులపాటు ఖచ్చితంగా మాస్క్‌ని ఉపయోగించాలి.
- మీరు మీ బూస్టర్ మోతాదును పొందినట్లయితే, ఎక్స్‌ప్లోజర్ తరువాత మీరు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు, అయితే ఎక్స్‌ప్లోజర్ తరువాత 10 రోజులపాటు మీరు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి.
- వివిధ కుటుంబాలకు చెందిన వ్యాక్సిన్ వేయించుకున్న మరియు వ్యాక్సిన్ వేయించుకోని వ్యక్తులు ఒకరినొకరు సందర్శించ వచ్చా?
-
ఇది వివిధ విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఒక ఇంటిలో తీవ్రమైన కొవిడ్-19 అస్వస్థత అధిక ప్రమాదం (ఇంగ్లిష్ మాత్రమే) ఉండే వ్యక్తులు ఉన్నట్లయితే, అప్పుడు మీరు కిటికీలు తెరిచి, బాగా ఫిట్ అయ్యే మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని పాటించడం (కనీసం 6 అడుగులు/2 మీటర్లు) ద్వారా ఆరుబయట లేదా ఇంటిలోపల సందర్శించాలి.
ఏ ఇంటిలోనైనా అధిక ప్రమాదం ఉండే వ్యక్తులు ఉన్నట్లయితే, అప్పుడు మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో లేదా బహిరంగ ఇండోర్ ప్రదేశాల్లో సందర్శించడం వల్ల కొవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
- నా ఇంటిలో కొంతమంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకొని మరియు కొంత మంది వేయించుకోనట్లయితే ఏమిటి?
-
ఇంటిలో కేవలం కొంతమంది మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకుంటే, మీ ఇంటికి వారికి వ్యాక్సిన్ ఇవ్వనట్లుగా భావించి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు ఇతర పాక్షికంగా లేదా వ్యాక్సినేషన్ వేయించుకోని గృహాలకు చెందిన వ్యక్తులను సందర్శించేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలి మరియు 6 అడుగులు (2 మీటర్లు) సామాజిక దూరం పాటించాలి- మరియు సాధ్యమైతే అటువంటి సమావేశాలను పరిహరించాలి.
మీ ఇంటిలో ఎవరూ తీవ్రమైన కొవిడ్-19 అస్వస్థతకు గురయ్యే ప్రమాదం లేనంత వరకు మీరు పూర్తిగా వ్యాక్సిన్ పొందిన ఇంటిలోని వ్యక్తులను సందర్శించవచ్చు.
- మేం అందరం వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే, పెద్ద గ్రూపుగా సమావేశం కావొచ్చా?
-
పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తులు, అలానే వారి బూస్టర్ షాట్‌తో అప్డేట్గా ఉన్న వ్యక్తులు కొవిడ్-19 నుంచి బాగా సంరక్షించబడతారు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొందిన వ్యక్తుల మధ్య సమావేశాలు సురక్షితమైనవి.
కొంతమంది వ్యక్తులు అతి తక్కువ రిస్క్ సెట్టింగ్‌ల్లో సైతం సౌకర్యవంతంగా భావించకపోవచ్చని దయచేసి గమనించండి. ఆలింగనం చేసుకోవడం మరియు కరచాలనం చేయడానికి ఇతరులు ఇష్టపడకపోవచ్చు. అది ఫర్వాలేదు. ప్రతిఒక్కరూ కొత్త సాధారణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా ఉండాలని మరియు మనకు ప్రియమైన వారిని కాపాడాలని కోరుకుంటున్నారు.
- నేను వ్యాక్సినేషన్‌కు రుజువును చూపించాలా?
-
నిర్ధిష్ట ప్రాంతాలు, బిజినెస్‌లు లేదా నిర్ధిష్ట ఈవెంట్ల్లో మీరు కొవిడ్-19కు విరుద్ధంగా పూర్తిగా వ్యాక్సిన్లు పొందినట్లుగా రుజువు చేయాల్సి రావొచ్చు.
అందువల్ల మీ వ్యాక్సినేషన్ పేపర్ కార్డును బర్త్ సర్టిఫికేట్ లేదా ఇతర అధికారిక డాక్యుమెంట్ వలే పరిగణించండి! దాని ఫోటో తీసుకొని, దానిని ఇంటి వద్ద భద్రపరచండి. వ్యాక్సినేషన్ కార్డులు మరియు ఇమ్యూనైజేషన్ రికార్డుల గురించి మరింత చదవండి.
- నా కొవిడ్-19 వ్యాక్సిన్లు నేను అప్ టూ డేట్‌గా లేనట్లయితే ఏమి జరుగుతుంది?
-
మీరు మీ కొవిడ్-19 వ్యాక్సిన్లను అప్ టూ డేట్‌గా పొందనట్లయితే:
- మీకు దగ్గరల్లో ఉన్న ఎలాంటి ఖర్చు లేని కొవిడ్-19 వ్యాక్సిన్‌ని కనుగొనండి!
- పరిగణనలోకి జనసమ్మర్థంగా బహిరంగ ఇండోర్ ప్రదేశాల్లో బాగా ఫిట్ అయ్యే మాస్క్ ధరించడాన్ని పరిగణించాలి.
- మీకు రోగలక్షణాలు కనిపిస్తే, కొవిడ్-19 కొరకు టెస్ట్ చేయించుకోవాలి
- మీరు కొవిడ్-19కు ఎక్స్ప్లోజ్ అయినట్లయితే, 5 రోజులపాటు క్వారంటైన్లో ఉండండి, దాని తరువాత అదనంగా 5 రోజులపాటు విధిగా మాస్క్‌ని ధరించాలి. ఎక్స్పోజ్ అయిన తరువాత 5వ రోజునాడు పరీక్ష కూడా చేయించుకున్నట్లుగా ధృవీకరించాలి.
- మీరు ప్రయాణిస్తుంటే, ప్రయాణానికి ముందు మరియు తరువాత కొవిడ్-19 కొరకు టెస్ట్ చేయించుకోండి.
- ఒకవేళ మీరు కొవిడ్19కు ఎక్స్ప్లోజ్ కాగలిగితే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి, ఒకవేళ మీరు టెస్ట్‌లో పాజిటివ్ అయితే, అనామధేయంగా అలర్ట్ చేయడానికి మీ స్మార్ట్‌ఫోన్ మీద WA Notifyని ఇన్స్టాల్ చేసుకోండి. WA Notify పూర్తిగా ప్రవేట్ మరియు మీరు ఎవరు అని తెలియదు లేదా మీరు ఎక్కడకు వెళతారనేది జాడ పసిగట్టలేదు.
- నేను వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కూడా కొవిడ్-19 వల్ల అస్వస్థతకు గురవుతానా?
-
ఇది అసంభవం, కానీ ఒక చిన్న అవకాశం ఉంది. వ్యాక్సిన్లు చాలా సమర్థవంతమైనవి, అయితే 100% కాదు. మీకు కొవిడ్-19-లాంటి లక్షణాలు (ఇంగ్లిష్ మాత్రమే) ఉన్నట్లయితే,మీరు ఇతరుల నుంచి దూరంగా ఉండాలి మరియు హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని సంప్రదించాలి. వారికి కొవిడ్-19 టెస్ట్ సిఫారసు చేయవచ్చు.
కొవిడ్-19 టెస్టింగ్ సమాచారం కొరకు, దయచేసి టెస్టింగ్ సమాచారం.
- నేను వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొవిడ్-19ని వ్యాప్తి చెందిస్తానా?
-
పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకొని, వారి బూస్టర్ షాట్‌ని పొందినవారిలో అతి తక్కువ మందికి సంక్రమించవచ్చు. అయితే, వారి కొవిడ్-19 వ్యాక్సిన్లకు అప్ టూ డేట్‌గా ఉండి, కొవిడ్-19 సంక్రమించిన వ్యక్తులు వైరస్‌ని ఇతరులకు వ్యాప్తి చెందించవచ్చు.
- నేను కొవిడ్-19కు ఎక్స్పోజ్ అయితే నేను ఏమి చేయాలి?
-
మీరు పూర్తిగా వ్యాక్సినేట్ అయి, మీ బూస్టర్ (అప్ టూ డేట్) పొందినట్లయితే, మీరు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్ప్లోజ్ తరువాత 10 రోజులపాటు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, ఎక్స్పోజ్ అయిన తరువాత 5వరోజు టెస్ట్ చేయించుకోవాలి. మీ ప్రాథమిక టీకా శ్రేణిని పూర్తి చేసి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ (Moderna/Pfizer) లేదా 2 నెలలు లేదా అంతకంటే ఎక్కువ (Johnson & Johnson) ఉంటే, మరియు మీరు ఇంకా బూస్టర్ మోతాదును పొందకపోతే, మీరు తప్పనిసరిగా 5 రోజులు క్వారంటైన్లు ఉండాలి, తరువాత అదనపు 5 రోజులు ఖచ్చితంగా మాస్క్ వాడాలి. ఎక్స్ప్లోజ్ అయిన తరువాత 5వ రోజునాడు, వ్యాక్సినేషన్ స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ విధిగా టెస్ట్ చేయించుకోవాలి
- కొవిడ్-19కు సంబంధించిన ఒత్తిడి లేదా ఆతురతను నేను ఏవిధంగా నిర్వహించగలను?
-
ఈ మహమ్మారి మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించగలదు అని మేం అర్ధం చేసుకున్నాం. మీరు ఒంటరిగా లేరు వాషింగ్టన్‌లోని చాలామంది వ్యక్తులు ఆర్థిక, ఉద్యోగ విపత్తులు, పాఠశాల మూసివేతలు, సామాజిక ఒ౦టరితన౦, ఆరోగ్య సమస్యలు, దుఃఖ౦, నష్ట౦ వ౦టి వాటి వల్ల ఒత్తిడి, ఆ౦దోళన ఎదుర్కొంటున్నారు. దీనిలో పబ్లిక్ కార్యకాలపాలకు తిరిగి రావడం వల్ల కలిగే ఆతురత జోడించబడి ఉంటుంది.
మీ ఒత్తిడి మరియు ఆతురతను నిర్వహించడంలో సాయపడగల కొన్ని వనరులు ఇవిగో:
- కొవిడ్-కు సంబంధించిన ఒత్తిడి గురించి సపోర్ట్ మరియు వనరుల కొరకు 833-681-0211 వద్ద Washington Listens లైన్‌కు కాల్ చేయవచ్చు
- ఒకవేళ మీరు విపత్తులో ఉన్నట్లయితే:
- ఆత్మహత్యా నిరోధక లైఫ్‌లైన్ (ఇంగ్లిష్ మాత్రమే) : 800-273-8255 (150 భాషల్లో భాషా సాయం)
- హోమ్ పేజీ> సంక్షోభ కనెక్షన్లు (crisisconnections.org) : 866-427-4747
- టీన్ లింక్ (ఇంగ్లిష్ మాత్రమే): 866-833-6546కు కాల్ చేయండి లేదా టెక్ట్స్ చేయండి (భాషా సాయం లభ్యమవుతుంది)
- స్వస్థత మరియు మానసిక ఆరోగ్యం గురించి వినడం, నేర్చుకోవడం, పంచుకోవడం మరియు కనెక్ట్ చేయడం కొరకు అత్యంత వివేచన (ఇంగ్లిష్ మాత్రమే) ఉపయోగించండి.
- మరిన్ని వనరుల కొరకు మా మానసిక ఆరోగ్యం పేజీ ని సందర్శించండి (ఇంగ్లిష్ మాత్రమే).
వ్యాక్సిన్ బూస్టర్లు మరియు అదనపు మోతాదులు
- కొవిడ్-19 అదనపు మోతాదు మరియు బూస్టర్ మధ్య తేడా ఏమిటి?
-
అదనపు మోతాదు (దీనిని మూడో మోతాదు అని కూడా అంటారు) అనేది రోగనిరోధక శక్తి లేనివారి కొరకు ఉద్దేశించబడింది. రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, కొన్నిసార్లు వారిలో తగినంత సంరక్షణ అభివృద్ధి చెందదు. ఇది జరిగినప్పుడు, మరో మోతాదు వ్యాక్సిన్‌ని పొందడం వల్ల వ్యాక్సిన్‌కు విరుద్ధంగా వారికి మరింత రక్షణ కల్పించేందుకు సాయపడగలదు.
బూస్టర్ వ్యాక్సిన్ డోస్‌ని సూచిస్తుంది, ఇది వ్యాక్సినేషన్ తరువాత తగినంత రక్షణ ఏర్పడి, అయితే ఆ సంరక్షణ కాలక్రమేణా తగ్గిన వ్యక్తులకు (దీనిని క్షీణిస్తున్న రోగనిరోధక శక్తి అని అంటారు) ఇవ్వబడుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు టెటనస్ బూస్టర్ వేయించుకోవడానికి కారణం ఇదే, ఎందుకంటే మీ బాల్యం వేసిన టెటనస్ వ్యాక్సిన్ సిరీస్ నుంచి సంరక్షణ కాలక్రమేణా క్షీణిస్తుంది.
దయచేసి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తుల కొరకు Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)మార్గదర్శకాలను సమీక్షించండి లేదా DOH వెబ్‌సైట్‌ని సందర్శించండి
- కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు మోతాదును ఎవరు పొందాలి?
-
మీరు పొందినట్లయితే... ఎవరు బూస్టర్ వేయించుకోవాలి బూస్టర్ ఎప్పుడు వేయించుకోవాలి ఏ బూస్టర్ వేయించుకోవాలి నేను రెండో బూస్టర్ డోస్‌ని పొందవచ్చా? Pfizer-BioNTech 5 సంవత్సరాలు మరియు ఆపైబడిన వ్యక్తులు ప్రైమరీ సీరిస్ పూర్తి చేసిన తరువాత కనీసం 5 నెలలు అవ్వాలి Pfizer లేదా Moderna లు సిఫారసు చేయబడతాయి*
17 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు Pfizer వ్యాక్సిన్‌ని మాత్రమే పొందవచ్చు.
50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, కొంతమంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు, వారి చివరి బూస్టర్ మోతాదు తీసుకున్న తరువాత 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచినట్లయితే mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు బూస్టర్ మోతాదును పొందవచ్చు. Moderna 18 సంవత్సరాలు మరియు ఆపైబడిన వ్యక్తులు ప్రైమరీ సీరిస్ పూర్తి చేసిన తరువాత కనీసం 5 నెలలు అవ్వాలి Pfizer లేదా Moderna లు సిఫారసు చేయబడతాయి* 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, కొంతమంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు, వారి చివరి బూస్టర్ మోతాదు తీసుకున్న తరువాత 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచినట్లయితే mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు బూస్టర్ మోతాదును పొందవచ్చు. Johnson & Johnson 18 సంవత్సరాలు మరియు ఆపైబడిన వ్యక్తులు ప్రైమరీ సీరిస్ పూర్తి చేసిన తరువాత కనీసం 2 నెలలు అవ్వాలి Pfizer లేదా Moderna లు సిఫారసు చేయబడతాయి* 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు, కొంతమంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు, వారి చివరి బూస్టర్ మోతాదు తీసుకున్న తరువాత 4 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిచినట్లయితే mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ అదనపు బూస్టర్ మోతాదును పొందవచ్చు.
Johnson & Johnson’s Janssen కొవిడ్-19 ప్రాథమిక వ్యాక్సిన్మరియు బూస్టర్ మోతాదును కనీసం 4 నెలల క్రితం పొందిన వయోజనులు mRNA కొవిడ్-19 వ్యాక్సిన్ ఉపయోగించి రెండో బూస్టర్ మోతాదును పొందడానికి ఇప్పుడు అర్హులు.
*mRNA వ్యాక్సిన్లు సిఫారసు చేయబడతాయి, కానీ ఇతర వ్యాక్సిన్లు పొందలేకపోయినా లేదా ఇష్టపడకపోయినా Johnson & Johnson కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా లభ్యమవుతుంది.
దయచేసి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తుల కొరకు Centers for Disease Control and Prevention (CDC, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్)మార్గదర్శకాలను సమీక్షించండి లేదా DOH వెబ్‌సైట్‌ని సందర్శించండి
- బూస్టర్ మోతాదులు ఎందుకు ముఖ్యమైనవి?
-
తీవ్రమైన కొవిడ్-19 కొరకు అధిక రిస్క్ ఉండే వ్యక్తుల కొరకు తీవ్రమైన వ్యాధికి విరుద్ధంగా నిరంతర రక్షణ అందించడానికి బూస్టర్ డోస్‌లు సాయపడతాయి. తీవ్రంగా కొవిడ్-19 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గతంలో బూస్టర్ డోసులు సిఫార్సు చేయబడ్డాయి, కానీ COVID-19 అనారోగ్యం నుండి రక్షణ పెంచడంలో సాయపడడం కోసం 5 ఏళ్లు మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన అందరికీ దానిని ఇవ్వాలనే సిఫార్సు చేయడమైనది.
అమెరికాలో మరిన్ని సంక్రామ్యక వేరియెంట్లు వ్యాప్తిచెందడం, కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఇది ప్రత్యేకంగా ఎంతో ముఖ్యమైనది.
అమెరికాలో ఆధికారం ఇచ్చిన లేదా ఆమోదించిన కొవిడ్-19 వ్యాక్సిన్లు తీవ్రమైన వ్యాధి ప్రమాదం, ఆసుపత్రిలో చేరడం, కొవిడ్-19 వల్ల మరణించే ప్రమాదాన్ని తగ్గించడంలో, ఇంకా వేరియెంట్లకు విరుద్ధంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇంకా, ప్రస్తుత వ్యాక్సిన్లకు కొంతకాలం గడిచిన తరువాత రక్షణ తగ్గిపోవచ్చు. బూస్టర్ డోస్‌లు కొవిడ్-19కు విరుద్ధంగా వ్యాక్సిన్ ప్రేరిత సంరక్షణను పెంచుతాయి, రోగనిరోధక శక్తి ఎక్కువకాలం ఉండేందుకు సాయపడుతుంది.
అదనపు వనరులు మరియు సమాచారం
- నిర్ధిష్ట గ్రూపుల కొరకు కొవిడ్-19 వనరులు
-
పిల్లలు మరియు యువత
- పెడ్రియాటిక్ కొవిడ్-19 వ్యాక్సిన్ గురించి తల్లిదండ్రులు/సంరక్షకులు ఏమి తెలుసుకోవాలి (PDF)
- కొవిడ్-19 వ్యాక్సినేషన్ తరువాత మైకార్డిటిస్: తల్లిదండ్రులు మరియు యువత ఏమి తెలుసుకోవాలి (PDF)
- ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరమైన పిల్లలు మరియు యువత కొరకు వ్యాక్సిన్ సమాచారం (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
తల్లిపాలు ఇవ్వడం మరియు/లేదా గర్భవతులైన మహిళలు
- మెడికల్ ప్రొవైడర్ల కొరకు కొవిడ్ 19 వ్యాక్సిన్లు మరియు ప్రత్యుత్పత్తి ఆరోగ్యం గురించి మాట్లాడే పాయింట్లు (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
- వ్యాక్సిన్ వాస్తవాలు – ప్రత్యుత్పత్తి ఆరోగ్యం FAQ
ఇమిగ్రెంట్లు మరియు రెఫ్యూజీలు
- ఇమిగ్రెంట్లు మరియు రెఫ్యూజీల కొరకు కొవిడ్-19 వ్యాక్సిన్ల్లో ఆత్మవిశ్వాసానం నింపడానికి చర్చా మార్గదర్శిని (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
- సాధారణ ఆందోళనలు మరియు వాస్తవాలు (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
- ఇమిగ్రెంట్ కమ్యూనిటీ సభ్యుల కొరకు కొవిడ్-19 మీ హక్కులను తెలుసుకోండి (WA ఇమిగ్రెంట్ సాలిడారిటీ నెట్వర్క్) (ఇంగ్లిష్ మాత్రమే)
- కొవిడ్-19 వ్యాక్సిన్ నిమగ్నత:: వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (ఇంగ్లిష్ మాత్రమే)
ఇంటి వద్దనే ఉండటం
- ఇంటి వద్దనే ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవాలా? (PDF) (ఇంగ్లిష్ మాత్రమే)
అదనపు కమ్యూనిటీ నిర్ధిష్ట వనరులను వ్యాక్సిన్ సమానత్వం మరియు నిమగ్నతా పేజీలో కనుగొనవచ్చు (ఇంగ్లిష్ మాత్రమే)
- నా ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇవ్వలేదు. నేను మరింత సమాచారాన్ని ఎక్కడ పొందగలను?
-
సాధారణ ప్రశ్నలను covid.vaccine@doh.wa.govకు పంపవచ్చు.